పేరు (ఆంగ్లం) | Kavikonada Venkata Rao |
పేరు (తెలుగు) | కవికొండల వెంకటరావు |
కలం పేరు | కవికొండల |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 7/20/1892 |
మరణం | 7/4/1969 |
పుట్టిన ఊరు | శ్రీరంగపట్టణం, ఆంధ్రప్రదేశ్. |
విద్యార్హతలు | న్యాయశాస్త్రం |
వృత్తి | నర్సాపురం లో ఉపాధ్యాయ వృత్తి లో వుంటూ న్యాయవాది గా ప్రాక్టీసు చేసారు |
తెలిసిన ఇతర భాషలు | సంస్కృతం, ఆంగ్లము |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | 200 కు పైగా కథలు, 2 నవలలు ( విజన సదనము, ఇనుప కోట ), వందలకొలది పాటలు (బృంద నాట్య గీతాలు), మానినీ చిత్తచోరుడు, కవి కొండల వెంకటరావు కథలు , మాతృచిహ్నము, హరివినోదము, మమైక దైవసంప్రార్ధనము, శతథా, కందకుక్షి, ద్విపదలాక్ష |
ఇతర రచనలు | http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=4785 |
ఈ-పుస్తకాల వివరాలు | https://archive.org/details/purshardhamulu022484mbp |
పొందిన బిరుదులు / అవార్డులు | ఆంధ్ర వర్ద్స్ వర్త్ |
ఇతర వివరాలు | కవికొండల వెంకటరావు ప్రముఖ తెలుగు కవి, జానపద మరియు నాటక రచయిత. సమకాలీకులకు ప్రేరణ గా నిలిచారు. శ్రీ శ్రీ కూడా మహాప్రస్థానం రాయడంలో కవికొండల గారిని ఆదర్శం గా తీసుకొన్నారు. ఈయన దేశభక్తి గీతాలు ఎక్కువగా రచించారు. “ఆంధ్రా వర్డ్స్ వర్త్” గా పేరు గడించారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | వివిధ కుసుమావళి |
సంగ్రహ నమూనా రచన | వివిధ కుసుమావళి నిశ్శబ్ద గీతిక ఊడుపుమళ్ళనుండి తడియూటలుబిల్బిల నడ్డుచెక్కులన్ నీడక జాలువార దరిబెంపగుపచ్చిక కప్పిపుచ్చుటన్ వేడుక మైగనుంకొనుచు విశ్రమమందితి; నేమిముచ్చటో యాడెడునద్ది కాపుతెలియన్ వలనీని రహస్యవైఖరిన్ శిశువు ముద్దుమాట శిక్షింప వచ్చుబో పొదలు దాని పలు కబోధితంబు; కన్నె కులుకు నుడులు కామింప జెలగుబో పొదలు దానిపలు కమోహితంబు |
వివిధ కుసుమావళి
నిశ్శబ్ద గీతిక
ఊడుపుమళ్ళనుండి తడియూటలుబిల్బిల నడ్డుచెక్కులన్
నీడక జాలువార దరిబెంపగుపచ్చిక కప్పిపుచ్చుటన్
వేడుక మైగనుంకొనుచు విశ్రమమందితి; నేమిముచ్చటో
యాడెడునద్ది కాపుతెలియన్ వలనీని రహస్యవైఖరిన్
శిశువు ముద్దుమాట శిక్షింప వచ్చుబో
పొదలు దాని పలు కబోధితంబు;
కన్నె కులుకు నుడులు కామింప జెలగుబో
పొదలు దానిపలు కమోహితంబు
ఆసక్తిని వినుకొద్ది నుండియును లేనట్లౌచు నిశ్శబ్ద భా
షాసారస్వతమందు నైక్యమగు చాయావ్యక్తశబ్దంబున
న్నానన్ దవ్వులజూడజేసెనొకచోనాకూడ్చు కేదారమున్
హాసప్రోద్బలులై శ్రమంపడు మతంగ స్త్రీలధమ్మిల్లముల్
ఉన్నట్టుండియు వారలు
సన్నగ దమగొంతు లెత్తి సాగించిరిగా
పున్నెపు బురాణపదమును
వన్నెలవిటకానిపాట వచ్చినవెల్లన్!
కం. కాలము వేగిరపడియెన్;
దేలిక గనిపించె జేయ దీఱనిశ్రమముల్;
లీలగా రోదసి యయ్యెడ
వాలాయము వారిపాట బాడుటెతోచన్
కం. పాటకు గూలీయరు; తమ
పాటున కిచ్చెదరుగాని పాడెదరేమీ?
గాటపు బ్రబోధమిడు చా
బోటులకది యొక్క సహజభూషణమేమో!
కం. సత్యమౌనది! యదియు దజ్జలముభాతి
నిత్యనిశ్శబ్దతనుగూడి నెగడ దొడగె
నేర్తునే యెన్నడేని దన్నిజవిధాన
నాదు గీతిక నిశ్శబ్దమోదిగాక!
***
చిన్న నిదుర పెద్ద నిదుర
నిదుర రాత్రిపూట నే బోవునప్పుడు
ఘడియ యెంతయగుట గణనసేయ
గాలమెల్ల నొక్కలీలగ గడచెడు,
వత్సరంబు లనక వయసు లనక
వెలుతు జేదియంచుదలపోయ నిసుమంత;
కనులుమూయనంత గాఢతమసి
వెలుగు చీకటి యను విభాజనమే లేక
యొక్క కల సుద్రుష్టి నొప్పుచుండు.
మనుజజంతురాశి మఱచియే పోవుదు
గునుకుగనినయంత గూర్చుసఖ్య
మాత డీత డనెడు నంతర మెరుగని
శబ్దరూపరహీతశాంతి యొకడు
చిన్న యిట్టినిదురె నన్నింతదనియించ
బెద్దనిదురయెంత పేర్మికలదొ!
———–