చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి (Chellapilla Venkata Sastry)

Share
పేరు (ఆంగ్లం)Chellapilla Venkata Sastry
పేరు (తెలుగు)చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి
కలం పేరు
తల్లిపేరుచంద్రమ్మ
తండ్రి పేరుకామయ్య
జీవిత భాగస్వామి పేరురామడుగు వేంకటాచలం కుమార్తె (పేరు తెలియదు)
పుట్టినతేదీ8/8/1870
మరణం2/15/1950
పుట్టిన ఊరుతూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామం
విద్యార్హతలుర్క, వ్యాకరణాలూ, సంస్కృత కావ్యాలూ, బ్రహ్మసూత్రాలూ
వృత్తిఉపాధ్యాయుడు
తెలిసిన ఇతర భాషలుతెలుగు, ఆంగ్లం, సంస్కృతం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుపాండవోద్యోగ విజయాలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుచెళ్లపిళ్ల వేంకటశాస్త్రి అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులు లో ఒకరు. తనతోపాటుగా చదువుకున్న దివాకర్ల తిరుపతిశాస్త్రితో కలిసి తిరుపతి వేంకట కవులుగా ఆంధ్రదేశమంతటా ప్రాచుర్యం పొందారు. అష్టావధానాలు, కవిత్వ రచన, ప్రతిపక్షులతో స్పర్థ, రాజాస్థానాల్లో గౌరవాలు వంటివన్నీ కలిసే పొందారు. చెళ్లపిళ్ల తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశారు. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిది ఆకర్షణీయమైన వ్యక్తిత్వం. ఆయన అంటే సమకాలీకులు చాలామందికి ఇష్టం. మాటలలో దొర్లించే చమత్కారానికి, పాడే విధానానికి ఆయనను విడిచిపెట్టలేకపోయేవారు.
వారి శిష్యులలో గొప్ప కవి, రచయితలుగా, మహాపండితులుగా పేరొందిన విశ్వనాథ సత్యనారాయణ, వేటూరి ప్రభాకరశాస్త్రి, వేలూరి, పింగళి-కాటూరి మొదలైనవారు అగ్రగణ్యులు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికచెళ్లపిళ్ల వేంకటశాస్త్రి పద్యాలు
సంగ్రహ నమూనా రచనచెళ్లపిళ్ల వేంకటశాస్త్రి పద్యాలు

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి తొలినాళ్లలో సంస్కృత భూయిష్టమైన సమాసాలతో తెలుగు పద్యాలు లేక నేరుగా సంస్కృత శ్లోకాలు రచించేవారు. ఆయన గురువు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి సాన్నిధ్యానికి వెళ్ళేలోగా విశేషించి చెప్పిన కవిత్వం పద్యకవిత్వమేనని వేం.శా. వ్రాసుకున్నారు.

ఆయన వ్రాసిన పద్యకవితంలో మొట్టమొదటిది ఈ పద్యం:

శ్రీమదఖండవైభవము చే జెలువారెడి వేంకటాద్రిపై

సామజయాన శ్రీరమణి చక్కగ బాదము లొత్త నారదుం

‘డో మహనీయ సేవిత గుణోజ్జ్వల’ యంచు భజింపుచుండ ని

న్నే మది నమ్మినాడ దయ నేలుమి శ్రీకర వేంకటేశ్వరా!

రాజాస్థానాలకు సంబంధించిన కొన్ని పద్యాలు:-

ఆత్మకూరు సంస్థానం నుండి తిరిగి వెళ్లడానికి సెలవిమ్మని కోరుతూ రాజా వారితో చెప్పిన పద్యం ఇది:-

వేసవి దగ్గరాయె, మిము వీడుటకున్ మనసొగ్గదాయె, మా

వాసము దూరమాయె, బరవాసమొనర్చుట భారమాయె, మా

కోసము తల్లిదండ్రు లిదిగో నడిగోనని చూచుటాయె, వి

శ్వాస మొలర్పవే సెలవొసంగిన బోయెదమయ్య భూవరా!మాటలలో దొర్లించే చమత్కారానికి, పాడే విధానానికి ఆయనను విడిచిపెట్టలేకపోయేవారు.
వారి శిష్యులలో గొప్ప కవి, రచయితలుగా, మహాపండితులుగా పేరొందిన విశ్వనాథ సత్యనారాయణ, వేటూరి ప్రభాకరశాస్త్రి, వేలూరి, పింగళి-కాటూరి మొదలైనవారు అగ్రగణ్యులు.

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి పద్యాలు

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి తొలినాళ్లలో సంస్కృత భూయిష్టమైన సమాసాలతో తెలుగు పద్యాలు లేక నేరుగా సంస్కృత శ్లోకాలు రచించేవారు. ఆయన గురువు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి సాన్నిధ్యానికి వెళ్ళేలోగా విశేషించి చెప్పిన కవిత్వం పద్యకవిత్వమేనని వేం.శా. వ్రాసుకున్నారు. ఆయన వ్రాసిన పద్యకవితంలో మొట్టమొదటిది ఈ పద్యం:

శ్రీమదఖండవైభవము చే జెలువారెడి వేంకటాద్రిపై
సామజయాన శ్రీరమణి చక్కగ బాదము లొత్త నారదుం
‘డో మహనీయ సేవిత గుణోజ్జ్వల’ యంచు భజింపుచుండ ని
న్నే మది నమ్మినాడ దయ నేలుమి శ్రీకర వేంకటేశ్వరా!

రాజాస్థానాలకు సంబంధించిన కొన్ని పద్యాలు:-
ఆత్మకూరు సంస్థానం నుండి తిరిగి వెళ్లడానికి సెలవిమ్మని కోరుతూ రాజా వారితో చెప్పిన పద్యం ఇది:-

వేసవి దగ్గరాయె, మిము వీడుటకున్ మనసొగ్గదాయె, మా
వాసము దూరమాయె, బరవాసమొనర్చుట భారమాయె, మా
కోసము తల్లిదండ్రు లిదిగో నడిగోనని చూచుటాయె, వి
శ్వాస మొలర్పవే సెలవొసంగిన బోయెదమయ్య భూవరా!

ఆంధ్రప్రదేశ్ వైశ్యసంస్థానాల్లో పెద్దది పశ్చిమగోదావరి జిల్లా లోని గూటాల. ఈ సంస్థాన సంపాదకులు మన్యం సత్యలింగం. కాలక్రమంలో సత్యలింగం తమ్ముడు వేంకటరత్నం మనవడు చినకనకయ్య జమీందారు అయ్యారు. ఆయన మరణంతో భార్య మహాలక్ష్మమ్మ 1878లో సంస్థానపాలన చేపట్టారు. సత్యలింగం కాలంనాటి నుంచీ ఫ్రెంచివారితో స్నేహం కొద్దీ వారు యానాంలో స్థిరనివాసం కలిగివుండేవారు. మహాలక్ష్మమ్మచే సన్మానింపబడని పండితుడు కానీ, కళాకారుడు కానీ లేరని చెప్పుకునేవారు. వేంకటశాస్త్రి ఆ దానశీలిపై చెప్పిన పద్యం ఇది:-

గోచీ పెట్టినదాది నిన్నేరుగుదున్, గోమట్లనే కాదు నీ
యాచారమ్మును దాతృతాగరిమ సత్యాసక్తి నిర్గర్వతా
ప్రాచుర్యమ్మును దీనపోషణము నెప్పట్లన్ గనంబోలదే
లా చెప్పన్ వలె నిన్ను జెప్పియు మహాలక్ష్మ్యంబ వేఱొక్కరిన్!

విశాఖపట్టణం లోని గోడే గజపతిరావును దర్శించపోయినప్పుడు ఎంతకాలానికీ సముఖానికి రమ్మని సెలవు రాలేదు. అప్పుడు విసుగుతో చెప్పిన పద్యం ఇది:-

సంగరాశక్తి లేదు, వ్యవసాయము సేయుట సున్న, సంతలో
నంగడివేసి యమ్ముటది యంతకుమున్నె హుళక్కి, ముష్టికిన్
బొంగు భుజాన వైచుకుని పోయెద మెక్కడికేని ముష్టిచెం
బుం గొనిపెట్టు యమోఘమిదే కద! దంతిరాణ్నృపా!

విజయనగరం లో కూడా ఆనందగజపతి దర్శనం గగనం అయింది. 4,5 నెలలు వేచి ఉన్నారు. వారి దివాన్ బీజాపురపు కోదండరావును ఉద్దేశించి రాజుగారి దర్శనం ఇప్పించమని కోరుతూ పెట్టుకున్న పద్యమయ అర్జీలోని పద్యాలు ఈ రెండు:-

“రాజతిపండితుడట బరాబరియౌనట మంత్రి రాజుతో
ధీజవ మొప్పునట్టి కవి ధీరులు తిర్పతి వేంకటేశులా
రాజును జూడ బోయిరట రాజును దర్శనమీయ లేదటౌ
రా! జగ” మంచు లోకులును నా యపకీర్తికి దాళజెల్లునో?

అటు గద్వాలిటు చెన్నపట్టణము మధ్యన్ గల్గు దేశమ్మునన్
జటుల స్ఫూర్తి శతావధానములు మెచ్చన్ జేసియున్నట్టి మా
కిట రా జీయకయున్న దర్శనము నింకెవ్వాని కీ రాజొసం
గుట చెప్పం గదవయ్య, పాలితబుధా! కోదండరామాభిధా!

———–

You may also like...