పేరు (ఆంగ్లం) | Divakarala Tirupathi Sastry |
పేరు (తెలుగు) | దివాకర్ల తిరుపతి శాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | శేషమ్మ |
తండ్రి పేరు | వెంకటావధాని |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 3/26/1872 |
మరణం | 11/10/1920 |
పుట్టిన ఊరు | పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వద్ద యండగండి గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | తెలుగు, సంస్కృతం |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | వంద సంస్కృత మరియు తెలుగు గ్రంధాలు, నాటకములు మరియు అనువాదాలు |
ఇతర రచనలు | http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=4677 |
ఈ-పుస్తకాల వివరాలు | https://archive.org/search.php?query=tirupati%20venkata%20kavulu |
పొందిన బిరుదులు / అవార్డులు | ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ |
ఇతర వివరాలు | దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి “తిరుపతి వేంకట కవులు” అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు. వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంథాలు, నాటకాలు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. వీరి నాటకం “పాండవోద్యోగ విజయాలు” లో పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి. తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇద్దరూ కలిసి అసంఖ్యాకంగా అవధానాలు నిర్వహించారు. సన్మానాలు అందుకొన్నారు. ‘ధాతు రత్నాకరం’ రచించారు. అడయారు వెళ్ళినపుడు అనిబిసెంట్ ప్రశంసలు అందుకొన్నారు. వెంకటగిరి, గద్వాల, ఆత్మకూరు, విజయనగరం, పిఠాపురం సంస్థానాలు సందర్శించి తమ ప్రతిభను ప్రదర్శించి సత్కారాలు గ్రహించారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | దివాకర్ల పద్యాలు |
సంగ్రహ నమూనా రచన | దివాకర్ల పద్యాలు పాండవోద్యోగ విజయాలు నాటకం నుంచి కొన్ని పద్యాలు:- చెల్లియొ చెల్లకో తమకు జేసిన యెగ్గులు సైచిరందరున్ తొల్లి గతించె, నేడు నను దూతగ బంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలుం బ్రజలు పెంపు వహింపగ బొందు సేసెదో యెల్లి రణంబు గూర్చెదవొ యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా! అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డజాతశత్రుడే యలిగిననాడు సాగరము లన్నియు నేకము గాకపోవు క ర్ణులు పదివేవురైన నని నొత్తురు చత్తురు రాజ రాజ నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరన్. |
దివాకర్ల తిరుపతి శాస్త్రి పద్యాలు
పాండవోద్యోగ విజయాలు నాటకం నుంచి కొన్ని పద్యాలు:-
చెల్లియొ చెల్లకో తమకు జేసిన యెగ్గులు సైచిరందరున్
తొల్లి గతించె, నేడు నను దూతగ బంపిరి సంధిసేయ నీ
పిల్లలు పాపలుం బ్రజలు పెంపు వహింపగ బొందు సేసెదో
యెల్లి రణంబు గూర్చెదవొ యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా!
అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డజాతశత్రుడే
యలిగిననాడు సాగరము లన్నియు నేకము గాకపోవు క
ర్ణులు పదివేవురైన నని నొత్తురు చత్తురు రాజ రాజ నా
పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరన్.
జెండాపై కపిరాజు ముందు సితవాజిశ్రేణియున్ గూర్చి నే
దండంబుంగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచున్
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకల జెండుచున్నప్పుడొ
క్కండు న్నీమొరనాలకింపడు కురుక్ష్మానాధ సంధింపగన్.
సంతోషంబుల సంధిచేయుదురె వస్త్రంబూడ్చుచో ద్రౌపదీ
కాంతం జూచిననాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ
పొంత న్నీ సహజన్ము రొమ్ము రుధిరమ్మున్ త్రావునాడైన ని
శ్చింతం దద్గదయుం ద్వదూరుయుగమున్ ఛేదించునా డేనియున్.
———–