దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య (Duggirala Gopla Krishnayya)

Share
పేరు (ఆంగ్లం)Duggirala Gopla Krishnayya
పేరు (తెలుగు)దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య
కలం పేరు
తల్లిపేరుసీతమ్మ
తండ్రి పేరుకోదండ రామ స్వామి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ6/2/1889
మరణం6/10/1928
పుట్టిన ఊరుపెనుగంచిప్రోలు గ్రామం, నందిగామ తాలూకా కృష్ణా జిల్లా
విద్యార్హతలుMA Economics (Edinburgh University)
వృత్తికళాశాల అధ్యాపకుడు
తెలిసిన ఇతర భాషలుసంస్కృతం, ఇంగ్లీషు, తెలుగు, హిందీ
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు“The Mirror of Gesture”, A Translation of “Abhinaya darpaNa” of “Nandikeswara” with Ananda Coomaraswamy.
ఇతర రచనలుhttp://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=3910
ఈ-పుస్తకాల వివరాలు https://archive.org/details/purshardhamulu022484mbp
పొందిన బిరుదులు / అవార్డులుఆంధ్ర రత్న
ఇతర వివరాలుదుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్వాతంత్ర్య సమర యోధుల్లో ప్రముఖుడు. గొప్ప నాయకుడు, సాహసి, వక్త, కవి, గాయకుడు. ఆంధ్ర రత్న బిరుదు పొందినవాడు. ఆయన నాయకత్వంలో నడచిన చీరాల పేరాల సమరం సుప్రసిద్ధం. గోపాలకృష్ణయ్య రామార్చనా నియమ తత్పరుడు. ‘శ్రీరామదండు’ అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపురుషార్థములు-మొదటి అధ్యాయము-ప్రస్తావన
సంగ్రహ నమూనా రచన

పురుషార్థములు

మొదటి అధ్యాయము-ప్రస్తావన

విజ్ఞానము సూత్రప్రాయముగా నుండవలెను

సూత్ర మన నేమి? మాలయం దనేకమణులకు దారమేరీతిగా నాధార మగుచున్నదో, అట్లే శాస్త్రము నందును సూత్రము ముఖ్యాంశ గర్భితమై యనేక జ్ఞానమణుల కాధారమై విజ్ఞాన నిర్మాణమున కుపకరించుచున్నది. మాలాలక్షణ మేనగా నది ఆద్యంతములు లేకయుండును. విజ్ఞానమాలయు నట్టిదే. అట్టి ఆద్యంతరహితమైన మాల కాధారము సూత్రమే. కాన శాస్త్రబోధ, శాస్త్రపరిశీలన, శాస్త్రపఠన, సూత్రానుసరణముగనే యుండవలయును. సూత్రరహితముగా బ్రస్తుతకాలమున సర్వశాస్త్రములును వ్యవహరించబడుచున్నవి. కేవల వ్యాఖ్యన రూపములైన శాస్త్రములు భిన్నరూపముల దాల్చును. ఇది లక్షణ విరుద్ధము. జ్ఞానార్ణవము నందు కల్లోలము పర్యవసానము. ఇప్పటి విద్యాపద్ధతి సూత్రరహితము.

సూత్ర మింకను జ్ఞానబీజాతకము. ఆ బీజము సర్వ ప్రపంచాతర్గతమగు ద్రవ్యసంతతిని సంగ్రహించి, యాద్రవ్యమును భుజించి, శాఖోపశాఖాన్వితమై, సంసారార్తిచే బరితపించుచున్న జీవరాసులకు ఫలదాతయై రససిద్ధికి స్థావర మొసంగి గృహదాతయై కాపాడునట్టి ప్రధానదేవతగా బరిణమించును.

పురుషార్థములు

మొదటి అధ్యాయముప్రస్తావన

విజ్ఞానము సూత్రప్రాయముగా నుండవలెను

సూత్ర మన నేమి? మాలయం దనేకమణులకు దారమేరీతిగా నాధార మగుచున్నదో, అట్లే శాస్త్రము నందును సూత్రము ముఖ్యాంశ గర్భితమై యనేక జ్ఞానమణుల కాధారమై విజ్ఞాన నిర్మాణమున కుపకరించుచున్నది. మాలాలక్షణ మేనగా నది ఆద్యంతములు లేకయుండును. విజ్ఞానమాలయు నట్టిదే. అట్టి ఆద్యంతరహితమైన మాల కాధారము సూత్రమే. కాన శాస్త్రబోధ, శాస్త్రపరిశీలన, శాస్త్రపఠన, సూత్రానుసరణముగనే యుండవలయును. సూత్రరహితముగా  బ్రస్తుతకాలమున సర్వశాస్త్రములును వ్యవహరించబడుచున్నవి. కేవల వ్యాఖ్యన రూపములైన శాస్త్రములు భిన్నరూపముల దాల్చును. ఇది లక్షణ విరుద్ధము. జ్ఞానార్ణవము నందు కల్లోలము పర్యవసానము. ఇప్పటి విద్యాపద్ధతి సూత్రరహితము.

సూత్ర మింకను జ్ఞానబీజాతకము. బీజము సర్వ ప్రపంచాతర్గతమగు ద్రవ్యసంతతిని సంగ్రహించి, యాద్రవ్యమును భుజించి, శాఖోపశాఖాన్వితమై, సంసారార్తిచే బరితపించుచున్న జీవరాసులకు ఫలదాతయై రససిద్ధికి స్థావర మొసంగి గృహదాతయై కాపాడునట్టి ప్రధానదేవతగా బరిణమించును

కనుక దేశాకాలపాత్రముల ననుసరించి వ్యాఖ్యన మొనర్చి జ్ఞానబోధ జేయుటకు ముఖ్యాధారముగా నుండునది సూత్రము. ఇది సంక్షిప్త రూపమున నుండుటవలన సర్వజన సామాన్యమునకు దృష్టిపథమునందుంచుకొనుటకు వీలగును. అట్లుంచుకొని జపము సల్పుచో (జపమనగా శ్రద్ధ గలిగి విశ్వాసముతో గ్రహించుట) సూత్ర గర్భితమగు జ్ఞానజ్యోతి విజృంభించి అంధకారములైన మన మనోగోళములను దీపింపజేయును. ముఖస్థముగ నెరుంగుటకు వీలు కలుగజేయును. (The sutra represents the mere profile of all knowledge.)

మనమీ సూత్ర సృష్టిని ఆంధ్రముననే చేయవలెను.

ఎందుచేత? జ్ఞానాన్వేషణమునకు ఆత్మానుభవమే ప్రథమసోపానము. ఆత్మానుభవము స్వభావముగా బరిణమించును. స్వభావవ్యక్తీకరణమే స్వభాష “. (The expression of one’s own ideas assumes the form of one’s own language.)  మన భాష ఆంధ్రభాష. అందువలనను మన స్వాత్మానుభవము ప్రథమసోపాన మగుటను ఆంధ్రభాష యందే సూత్రనిర్మాణము గావింపవలయును. అదియు గాక గీర్వాణ భాష ప్రస్తుతమందు వాడుకలో లేదు.

 

రెండవ అధ్యాయముప్రథమసూత్రము : పురుషార్థములు

ధర్మార్థ కామమోక్షములు పురుషార్థములు. (These constitutes the fundamental motif of Hindu Ethics and Sociology. Yoga represents the subjective interpretation of our Idealism; Purushardhas, the objective.) 

పురుషార్థ చర్చ ప్రథమసూత్రము నందే యేల చేయవలయు? పురుషార్థము లన నేమి?

స్వాత్మానుభవమన జీవత్వము తటస్థించిన తోడనే (భూతజన్మ లభింపగనే) జననాది మరణాంతమువరకు సర్వ భూతములతోను జీవునికి గలుగు సంబంధ బాంధవ్యము వలన గ్రహింపనగు విషయజ్ఞానమే యనుభవమే. అనగా క్రియచే (action) అనుభవము గల్గును. అర్థము (aim)  సంబంధమును సూచించును. అర్థము ననుసరించియే జ్ఞానాన్వేషణ మొనర్పవలెను.

———–

You may also like...