బసవరాజు అప్పారావు (Basavaraju Appa Rao)

Share
పేరు (ఆంగ్లం)Basavaraju Appa Rao
పేరు (తెలుగు)బసవరాజు అప్పారావు
కలం పేరు
తల్లిపేరువెంకమ్మ
తండ్రి పేరుపిచ్చయ్య
జీవిత భాగస్వామి పేరురాజ్యలక్ష్మమ్మ (సౌదామిని కలం పేరు)
పుట్టినతేదీ12/13/1894
మరణం6/10/1933
పుట్టిన ఊరువిజయవాడ సమీపంలోని పటమట గ్రామం
విద్యార్హతలుబి.ఏ. (1916 ); బి. ఎల్ 1926
వృత్తిన్యాయవాది వృత్తి ఆంధ్ర పత్రిక భారతి లలో సంపాదక, సహాయ సంపాదకత్వం
తెలిసిన ఇతర భాషలుతెలుగు, ఇంగ్లీషు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆంధ్రకవిత్వ చరిత్ర
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు“కొల్లాయి గట్టితేనేమి? మా గాంధి మాలడై తిరిగితేనేమి?” జాతీయోద్యమం రోజుల్లో ప్రతి గొంతుకలో మారుమ్రోగింది. “నల్లవాడే గొల్లపిల్లవాడే” చాలా ప్రాచుర్యం పొందిన పాట. “గుత్తొంకాయ్ కూరోయ్ బావా, కూరి వండినానోయ్ బావా” అనే పాటను బందా కనకలింగేశ్వరరావు పాడాడు ఆయన వ్రాసిన లలితగీతాలను టంగుటూరి సూర్యకుమారి, బాల మురళీకృష్ణ, రావు బాలసరస్వతీ దేవి మధురంగా పాడారు
దేవులపల్లి ఇలా అన్నాడు.”సుబ్బారావు పాట నిభృత సుందరం, అప్పారావు పాట నిసర్గ మనోహరం”
http://www.andhrabharati.com/kavitalu/basavarAju/basavarAju_preface1.html A Tribute to Basavaraju Appa Rao by Devulapalli Krishna Sastry
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆంధ్రసారస్వతానికి ‘కీట్సు’
సంగ్రహ నమూనా రచన

బసవరాజు పాటలన్నింటికీ కిరీటం   

 “వేదాద్రి శిఖరాన వెలిగిన్న జోతి
     మినుకు మని కాసేపు కునికిపోయింది!
     దేవలోకమునుంచి దిగినట్టి గంగ
     వచ్చిన్న దారినే పట్టి మళ్ళింది!
     పంజరం దూరిన బంగారుపిట్ట
     తలపు దీ సేవేపొ తర్లిపోయింది!
     కాపుర మొచ్చిన కన్ని పాపాయి
     యిల్లు కాళీచేసి వెళ్ళిపోయాడు!”

***

  “మంచిరోజు కాదోయి చందమామా
     మంచిది కాదోయి చందమామా!”

    “పాడదలచిన పాటలన్నీ నానోట
     పాడించ మనసాయెనయ్యా!”

    “మండిపోతున్న వండోయ్‌, లోకాలు
     మంటలార్పెయ్యంగ రండోయ్‌!”

    “ఎంతటి చపలుండనైతి
     ఎంతటి మందమతినైతి!”

    “కోయిలా కోయిలా కూయబోకే
     గుండెలూ బ్రద్దలూ చేయబోకే!”

    “లోకాని కుత్తుత్త దీపావళీ!
     నాకు మాత్రము దివ్యదీపావళీ!”

    “లేపనైనా లేపలేదే, మోము
     చూపనైనా చూపలేదే!”

You may also like...