విశ్వనాథ సత్యనారాయణ (Viswanatha Satyanarayana)

Share
పేరు (ఆంగ్లం)Viswanatha Satyanarayana
పేరు (తెలుగు)విశ్వనాథ సత్యనారాయణ
కలం పేరు
తల్లిపేరుపార్వతి
తండ్రి పేరుశోభనాద్రి
జీవిత భాగస్వామి పేరువరలక్ష్మి
పుట్టినతేదీ9/10/1895
మరణం10/18/1976
పుట్టిన ఊరునందమూరు, క్రిష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.
విద్యార్హతలుఎమ్.ఏ , డాక్టరేట్.
వృత్తిఉపాధ్యాయులు, ( ప్రిన్సిపాల్ కరీంనగర్ కాలేజ్ )
తెలిసిన ఇతర భాషలుఆంగ్లము, సంస్కృతము.
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురామయణ కల్పవృక్షం, వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, 60 నవలలు, 20 నాటకాలు, 200 ఖండకావ్యాలు, 35 కథలు, 70 వ్యాసాలు, 50 రడియో నాటికలు, 10 సంస్కృత రచనలు, ఆంగ్లంలో 10 వ్యాసాలు, 3 అనువాదాలు, 100 పుస్తకాలకు తొలిపలుకులు, డజనుకు పైగా సాహిత్య వివేచనా గ్రంథాలు . విశ్వనాథగారి ఇతర రచనలు – “విశ్వనాథ అసంకలిత సాహిత్యం-సంపుటం-6”; “విశ్వనాథ అసంకలిత సాహిత్యం – సంపుటం-2”; “విశ్వనాథ అసంకలిత సాహిత్యం – సంపుటం-3”; “శ్రీ విశ్వనాథవారి సంపూర్ణ నాటక సాహిత్య నిధి”; “శ్రీ విశ్వనాథవారి సంపూర్ణ విమర్శగ్రంథ నిధి”; “కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి ఆత్మకథ, లఘుకావ్యాలు”
ఇతర రచనలువారి పలు పద్య కవితలు, నవలలు ఆంగ్లం, హింది, తమిళం, మళయాలం, ఉర్దూ, సంస్కృతం లో అనువదించబడ్డాయి. పి.వి. నరసింహారావు గారు వేయిపడగలలు బృహథ్గ్రంధాన్ని సహస్రఫణి పేర హిందీలోకి అనువదించారు. 2006 లో ‘విష్ణుశర్మ ఇంగ్లిష్ చదువు’ ప్రహసనం రవీంద్రభారతిలో ప్రదర్శింపబడింది; 2008 లో దూరదర్శిణి టెలిఫిల్మ్ గా ప్రసారం చేయబడింది.
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకవి సామ్రాట్, కలాప్రపూర్ణ, పద్మభూషణ్, ఙ్జానపీఠ అవార్డ్, డాక్టరేట్, 1962 కేంద్ర సాహిత్య పురస్కారం, 1970 ఆంధ్రప్రదెశ్ ఆస్థాన కవి హోదా.
ఇతర వివరాలుచెళ్లపిళ్ల వెంకటశాస్త్రి ( తిరుపతి వెంకట కవులు ) శిష్యులు. మనోఙ్జమైన పద్యపఠనం, సంగీత ఙ్జానసంపద కలవారు. కరీంనగర్ హిందుస్తాని సంగీత విద్వాంసులు బ్రహ్మశ్రీ నారాయణరావు గారంటే ఎనలేని ప్రీతి ఉన్నందున అతని ఆత్మకథ ఆధారంగా మ్రోయుతుమ్మెద నవలను రాసారు.జువ్వాడి గౌతమరావు వారి పద్యాలను వేదికలపై శ్రవణమనోహరంగా పఠిస్తుండే వారు. ధూళిపాల శ్రీరామమూర్తి, డా.వెలిచాల కొండల్రావు వారి సన్నిహితులు. 1076 లో, చెంద్రకాంత్ మెహతా , ప్రొ.మహీంద్ర ధావే వేయిపడగలను గుజరాతి లోకి అనువదించారు. 2013-14 లో ఆంగ్లానువాదం ‘న్యూఆవకాయ.కాం’ ఈ-పత్రికలో ‘థౌసండ్ హుడ్స్’ పేరున సీరియల్ గా వచ్చింది.

విశ్వనాథులవారి ఆధ్యాత్మిక భావ ధార విస్తృతమూ సర్వమత సమ్మతసమగ్ర అయినా, వారు ముఖ్యంగా అద్వైత వాదులు.


స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆంధ్ర పౌరుషము
సంగ్రహ నమూనా రచనశ్రీమద్రామాయణ కల్పవృక్షము (తెలుగు కావ్యము)
జ్ఞానపీఠ పురస్కృత గ్రంథము- ఆఱు కాండములు
రామాయణమును ఆధ్యాత్మ లక్షణ గ్రంథముగా పరిగణించు తెలుగు పాఠక పరిశోధకులకు; మన యింట ’కల్పవృక్షము’న్న చాలు సర్వతోభద్రముగ భావించు భక్తజనులకు; నిత్యపారాయణ మూర్తులకు – ”శ్రీమద్రామాయణ కల్పవృక్ష” మహాకావ్య, ముద్రణ అంశములు.
*తెలుగు వారికి ప్రప్రథమ జ్ఞానపీఠాన్ని అందించిపెట్టిన అపురూప అక్షరవృక్షము – ‘కల్పవృక్షము’
*బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ కాండములు కలిపి ఒకే మొత్తముగ
*12855 గద్యపద్యముల – ఆఱుకాండముల మూలపాఠము
*అర్థయుక్తంగా కావ్యము మధ్యలో ఘట్టముల సూచన

You may also like...