దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి (Devulapalli Venkata Krishnasastry)

Share
పేరు (ఆంగ్లం)Devulapalli Venkata Krishnasastry
పేరు (తెలుగు)దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి
కలం పేరు
తల్లిపేరువెంకమాంబ
తండ్రి పేరువేంకటకృష్ణశాస్త్రి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1856
మరణం1/1/1912
పుట్టిన ఊరువీరి స్వగ్రామము కూచిమంచి తిమ్మకవి గ్రామమైన చంద్రమపాలెము.
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుస్వప్నఫలదర్పణము, కవి ప్రభునామ గుంభిత విచిత్ర పద్యగర్భిత కందపద్య సకలేశ్వర శతకము,
కుక్కుటేశ్వరాష్టకము, సత్యనారాయణ శతకము, కమలాదండకము, శ్రీరావు వంశముక్తావళి (దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి సంస్కృతకావ్యానికి తెలుగు అనువాదం), నయనోల్లాసము,
యతిరాజవిజయము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికదేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి
సంగ్రహ నమూనా రచనశ్రీ మహిళాలలామ తన చెన్నగుపెన్ను రమందు బొందుగం
బ్రేముడి మీఱ నిల్వ గను బీఠపురీవరాజ్య లక్ష్మి ను
ద్దామత బ్రోది సేయుచు సతంబు హితం బిడుకుంతిమాధవ
స్వామి యభీష్టసంపద లోసంగుత సూర్యనృపాలమౌళికిన్ .

దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి (నమూనా రచన )

యతి రాజవిజయము

ప్రధమా శ్వాసము

***

శ్రీ మహిళాలలామ తన చెన్నగుపెన్ను రమందు బొందుగం
బ్రేముడి మీఱ నిల్వ గను బీఠపురీవరాజ్య లక్ష్మి ను
ద్దామత బ్రోది సేయుచు సతంబు హితం బిడుకుంతిమాధవ
స్వామి యభీష్టసంపద లోసంగుత సూర్యనృపాలమౌళికిన్ .

ఉ . చారుమణీమయాభరణజాలవిభూషిత చూడి కుడ్తనాం
చారు వ్యపోహితా శ్రితవిచారుడు సూరి జనస్తవార్హసం
చారుడు నైనరామ విభుచంద్రుని సూర్య మహీత లేంద్రుపై
స్ఫారకృపాకటాక్షముల సంతతముం బ్రసరింప జేయుతన్.

చ . అనువుగ దేని బూని వనజాక్షుడు సజ్జన రక్షణంబు దు
ర్జనగణశిక్షణంబును నిరంతరముం బొనరించుచుండు న
య్యనుపమతేజ మౌబుధజ నైక సుదర్శన మైన శ్రీసుధ
ర్శనమొనగూర్చుసూర్యమహిజాకనూనజయోచ్చ్రుయంబులన్

కం . అరిదరకలనాస్పదమై
హరియైదవకరసరోరుహంబువితానం
బరగెడునల కౌమోదకి
నిరతము గృతపతి కొసంగు నిఖిలశుభంబుల్ .

కం . బృందారకబృందావన
సందర్భనిర్భరైకశక్త్యాకర మౌ
నందకము విహితమహితా
నందకము మగు గాత సూర్యనరనాధునాకున్ .

చ . ఇలను భరించు నెవ్వనియహీనఫణాఫలకంబు లేని మే
నలరుల నెజ్జయై యలరు నాహరి కట్టియనంతమూర్తి ని
స్తులతరకీర్తి పూర్తి నిడి తోరపుగూరిమి బ్రోచుగాత ని
ర్మలసుగుణాoకు వేంకటకుమారమహీపతి సూర్యరాడ్విభున్.

కం . ధన్యం బై హరిపూనుట
మాన్యం బై సకలసకలమండలికి నసా
మాన్య మగుపాంచజన్యము
జన్యుములం గెలుపు సూర్యజనపతి కొసగున్ . 7

మ . అరవింద ప్రభావాండనికరం బబ్రంబుగం దుందకం
దరమం దూవి మెలంగుశ్రీరమణు నుద్యల్లీలమై వీపునన్
సరవిం దాల్ప ననల్పశక్తి గలయా ఛందోమయాకారుడౌ
గరుటామంతుడు సూర్యరాయధరణీకాంతా గ్రణిo బ్రోవుతన్ .

చ. ధృతిసెడ నాత్మ చిత్తము జయించినకల్ములవాలుగంటిభ్రూ
లతికలసామ్యముం గవి చెలంగుట గెల్పు ఘటించు నంచు సం
తతమును శౌరి కోరికను దాలుచుశార్జ్గ మురు ప్రతాపదీ
పితుడు గ జేయుగాత సుకవి స్తవనీయుని సూర్యరాయనిన్ .

చ . అమరవిరోధు లెవ్వనికరాంబురుహంబున డంబు గాంచువే
త్రము చలియించుమాత్రమున దల్లడమంది చలించుచుందు రా
సుమహితశక్తిశాలి క్తిశాలి యగుసూత్రవతీశుడు సూర్యరాయభూ
రమణునకుం గడంగి చతురంగబలోన్నతి గూర్చు గావుతన్ .

క . అల కమలాకౌస్తుభముల
కలయిక నలరారి శౌరిగాత్రరుచులతో
దులదూ గెడు శ్రీవత్సము
కలుముల దయచేసి మనుచు గాత గృతిపతిన్ . 11

మ . హరి బహాంతరసీమ దామరసగేహం దాల్చుపీఠాంకృతిం
బరిపూర్ణద్యుతి బొల్చు కౌస్తుభము శుంభల్లీల నెల్లప్పుడున్
సిరు లెల్లన్ సమకూర్చి ప్రోవుత సుధీజేగీయమాన క్రియా
భిరతాత్ముం డగుసూర్యరాయధరణీబృందాకరగ్రామణిన్ .

కం . మురహరునిపేరురంబుం
బరువడి వాసింప జేయువనమాలిక భా
సురగుణముల నలరించుత
సరసుం డగుసూర్యరాయజననాయకునిన్ . 13

శా . శ్రీరామరమణాo ఘ్రిపద్మ యుగళీసేవానుభావైకవి
స్ఫారస్వాంతులు భట్ట నాథముఖు లై భాసిల్లు పన్నిద్ద ఱా
ళ్వారు ల్గూ ర్తురు గాత భూరిసుగుణాలంకారుడై యొప్పుసూ
ర్యారాయా గ్రణికిం బ్రపన్న జనముఖ్యస్తోత్రపాత్రత్వమున్ .

సి . బహుకావ్యకర్త యై పరగిన వేంకటాం
తర్వాణి యెవనిముత్తాతతాత
యఖిలశాస్త్రధురీణు డగు జగన్నాథదీ
మంతు డెవ్వనిపితామహునితాత
సంపూర్ణ వైదుష్యశాలి వేంకటసూరి
యేమహామహు ప్రపితామహుండు
విద్వత్క వీంద్రుడై వెలసినరామవి
ద్వాంసు డేఘనునిపితా మహుండు

పృధుకళాడ్యుండు వెంకట కృష్ణనామ
కార్య జనవర్యు డేసదయాత్ము తండ్రి
యతని నస్మత్పితామహు నభినుతింతు
సద్యశస్కు సీతారామశాస్త్రి వరుని . 15

ఉ .పంకజవాసినీ గరుడ వాహనపాదసేవనా
లంకృత మానసాంబురుహులన్ మహనీయుల శైలకన్యకా
శంకరతుల్యులన్ సకల సద్గుణసాంద్రుల వేంకమాంబికా
వేంకటకృష్ణకోవిదుల వేడెద నాతలిదండ్రులన్ మదిన్ . 16

ఉ . నన్నయసూరనాదికసనాతననూతసత్క వీంద్రులన్
సన్నుతి చేసి వాసిగను జారుకవిత్వ కళా పటుత్వసం
పన్నత గాంచి సూర్యవిభువర్యుకృపం జెలు వొందుచున్నమా
యన్నను సుబ్బరాయ విబుధాగ్రణి నిచ్చలు గొల్పుచుండెదన్ .

కం. అని యిష్టదేవతావం
దనమును గురుకవిజనాభినందనమును నే
నొనరిచి యొకఘనకావ్యము
మనమున రచియించుతలపుమై నుండు నెడన్ . 18


రచన : దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి
సేకరణ :యతి రాజవిజయము

———–

You may also like...