అడివి బాపిరాజు (Adivi Bapiraju)

Share
పేరు (ఆంగ్లం)Adivi Bapiraju
పేరు (తెలుగు)అడివి బాపిరాజు
కలం పేరు
తల్లిపేరుసుబ్బమ్మ
తండ్రి పేరుకృష్ణయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీఅక్టోబరు 8, 1895
మరణంసెప్టెంబరు 22, 1952
పుట్టిన ఊరుపశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం
విద్యార్హతలుభీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్
వృత్తికొంతకాలం న్యాయవాద వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునారాయణరావు (1934) – సాంఘికం, తుఫాను (1945) – సాంఘికం, గోనగన్నారెడ్డి (1945) – చారిత్రకం, కోనంగి (1946)- సాంఘికం,హిమబిందు (నవల) – చారిత్రకం, అడవి శాంతిశ్రీ – చారిత్రకం, అంశుమతి – చారిత్రకం, నరుడు (1946 ) – సాంఘికం, జాజిమల్లి (1951) – సాంఘికం, మధురవాణి (అసంపూర్ణం, పూరణ – దిట్టకవి శ్యామలా దేవి), శిలారథం (అసంపూరణం), కైలాసేశ్వరుడు (అసంపూర్ణం), రేడియో నాటికలు:
దుక్కిటెద్దులు, ఉషాసుందరి, భోగీరలోయ, నారాయణరావు, శైలబాల, పారిజాతం, నవోదయం
ఏరువాక
కథాసంపుటాలు: తరంగిణి[1] – 7 కథల సంపుటి, రాగమాలిక[2] – 9 కథల సంపుటి, అంజలి – 6 కథల సంపుటి, తూలికా నృత్యం – 3 కథల సంపుటి, భోగీర లోయ – 6 కథల సంపుటి, వింధ్యాచలం – 4 కథల సంపుటి, ప్రసిద్ధి చెందిన కథలు, తూలికా నృత్యం, హంపి శిథిలాలు
శైలబాల,వీణ, నాగలి, నేలతల్లి, బొమ్మలరాణి

దర్శకత్వం వహించిన సినిమాలు: మీరాబాయి, అనసూయ, ధ్రువ విజయం, పల్నాటి యుద్ధం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులునారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది.
ఇతర వివరాలు1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాన్ సంపాదకునిగా పని చేశాడు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నాడు. ‘నవ్య సాహిత్య పరిషత్’ స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅడివి బాపిరాజు
సంగ్రహ నమూనా రచనఓ ప్రభూ నువ్వు
ఎన్ని రూపాలుగా
ఎన్ని భావాలుగా
ఎన్ని బ్రతుకులుగా
వస్తావు ?
ఏనాటికానాడు
ఏదో విస్తుపోతుంటాను .

అడివి బాపిరాజు

పచ్చగడ్డి పూల పళ్ళెము

1
ఓ ప్రభూ నువ్వు
ఎన్ని రూపాలుగా
ఎన్ని భావాలుగా
ఎన్ని బ్రతుకులుగా
వస్తావు ?
ఏనాటికానాడు
ఏదో విస్తుపోతుంటాను .
*
2
వీడు కవీ వాడు కవీ
వాడు కవీ
ఎవరో కాదని
మేము తీర్పులు తీరుస్తాం
కవి అంటే ఒక కులము వాడో మతం వాడో
ఒక జాతి వాడో మనుష్యుడో , దేవతో ?
*
3
ఎన్ని ఇజమ్ లూ
ఎన్ని వెఱ్రిలూ ….
…..వెఱ్రి వాడంటాడు
తన కే వెఱ్రి లేదని
*
4
ఓ బీదవాడా !
ఓ కూలివాడా !
ఓ పాలివాడా
నిన్నుద్ధరించడానికి
మిన్ను నుంచి ఊడి పడ్డ
దేవతలము మేము
……మమ్మల్నుద్ధరించుకోలేని
దద్దమ్మలం
*
5
మోదవాకం ఆస్పత్రిలో
మహా కవులున్నారు .
సర్ రియలిజం వాళ్ళు
అక్కడ పాఠాలు నేర్చుకోవాలి
*
6
వెలుగు కొంచెం చీకటి ఎక్కువ
చీకటిలో ఉంటూ
వెలుగు కావాలనడం
అన్నాచురలా , న్యాచురలా ?
*
7.
కవిత్వం అంటే గుండెట
కవిత్వం అంటే ఫీలింగట
పై కవిత్వం ఎందుకు
నాకు ఉందిగా
ఫీలింగ్ ఫీల్ అవు
అదే కవిత్వం అదే రంగుల బొమ్మ
డాన్సూ , సంగీతమూ .
*
8.
అనంత నీలాకాశంలో
ఒక్కటే తెల్లని పెద్ద కొంగ
తెల్లని పెద్ద రెక్కలు చాచి
తేలిపోతూ ఉంది .
ఆ అనంత జీవితంలో
నల్లని కాలంలో
నేనొక్కన్నే అంతదొరకని యాత్ర .
*
9.
మా అమ్మాయిలిద్దరూ
బొమ్మ సామాన్లూ
కమ్మని తాయిలాలూ పెట్టి
జీవిత నాటకం ఆడుతున్నారు .
అసలు జీవిత నాటకమూ
అందులోని బాధలూ
వాళ్లకేం తెలుసు !
జీవితం వెనకాలే
చిద్రూపంగా వచ్చే
ఆనందమే వాళ్ళ
ఆటా పాటానా ?
*
10.
రాత్రిలో పవలు ఏదీ అని !
పవలులో రాత్రి ఏదీ అని
వెలుగు నీడలా పొలిమేరలో
జిలుగు రూపంలో నిలిచిన
అవ్యక్త ప్రసన్న మూర్తి
హాసంతోనే నిలబడి ఉన్నది .
నిలిచి రెండూ చూచే వారేరీ !?
*
11.
కాంక్షలు కాంక్షలే
కలలు కలలే
కఠిన జీవితం మాత్రం
గర్భ నిర్భేద్యం
*
12 .
అఱ్ఱులు చాచి అందుకోని
ఆ అస్పష్ట సౌందర్య మూర్తీ !
ఆవలిస్తూ అధివసించి ఉన్న
ఈ వికృత మూర్తీ
నడుముగా నిలిచిన
తొడిమ విడిపోయిన పూవూలా అనాధ బాలిక
*
రచన :అడివి బాపిరాజు
సేకరణ : అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం నుంచి ……

———–

You may also like...