పేరు (ఆంగ్లం) | Mulugu Papayaradhyulu |
పేరు (తెలుగు) | ములుగు పాపయారాధ్యులు |
కలం పేరు | – |
తల్లిపేరు | భ్రమరాంబ |
తండ్రి పేరు | వీరేశ్వరుడు |
జీవిత భాగస్వామి పేరు | లింగాంబ |
పుట్టినతేదీ | 1/1/1770 |
మరణం | 1/1/1850 |
పుట్టిన ఊరు | లక్ష్మీపురం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శ్రీ దేవీ భాగవతము, అనుపలబ్ధములు, వేమనారాధ్య చరిత్రము, అహల్యాసంక్రందన విలాసము, సరసహృదయానురంజనము, శంతను చరిత్ర ఘూర్జను చరిత్ర, ఇంద్రాత్మజా పరిణయము, కల్యాణ చంపువు, ఏకాదశీవ్రత చంపువు ఆర్యాశతీ శివస్త్రోత్రము. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | పాపయారాధ్యులు అమరావతి రాజధానిగా చేసుకుని పరిపాలించిన వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు జమీందారు గారి సమకాలికులనీ, ఆయన ఆస్థానంలోని కవి రత్నాలలో ఒకరని దేవీ భాగవతంలోని పీఠికా పద్యాలవలన తెలుస్తున్నది. వేంకటాద్రి నాయుడు కాలంలోనే కాకుండా ఆయన దత్తపుత్రుడు జగన్నాథరావు కాలంలో కూడా రచనలు చేశాడు. జగన్నాథరావు అనుమతి మీదనే దేవీభాగవతాన్ని మొట్టమొదటగా తెలుగులోకి అనువాదం చేశాడు. 1942లో ఇది మొట్టమొదటి సారిగా ప్రచురితమైంది. అప్పటి వరకూ ఈయన పేరు మరుగున పడిపోయి ఉన్నది. ఈయన తరువాత త్రిపురాన తమ్మన దొర, తిరుపతి వేంకట కవులు, దాసు శ్రీరామకవి మొదలగు వారు దేవీ భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ములుగు పాపయారాధ్యులు |
సంగ్రహ నమూనా రచన | శ్రీ పరమశివానందుడు దాపయి సుగుణంబు శుభము ధన సంపదయున్ రేపులు మాపులు నొసగెడు నాపక కోటార్యశరభ యార్యుల కెపుడున్ . |
ములుగు పాపయారాధ్యులు
శ్రీ
పరమశివానంద లీలలు
ప్రధమాశ్వాసము
శ్రీ పరమశివానందుడు
దాపయి సుగుణంబు శుభము ధన సంపదయున్
రేపులు మాపులు నొసగెడు
నాపక కోటార్యశరభ యార్యుల కెపుడున్ .
వ. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండును , సమస్త చరాచర జీవలకును శాస్త్రయునై , జగన్నాటక సూత్రధారుండగు శ్రీ పరమ శివానంద లీలా చరితంబు నకుం గధాక్రమం బెట్టిదనిన
ఉ . శ్రీల జెలంగు మా తెలుగు సీమకు గర్భము చంద్ర వంశ భూ
పాలుడు పార్ధు డా నరుడు భక్తితపంబులు పండ వీరుడై
ఫాలవిలోచనుం గెలిచి పాశుపతంబును గొన్న పౌరుషా
స్ఫాలన భూమి యా విజయవాడ వెలుంగు జగద్ధితంబుగాన్ .
ఉ .భక్తిని భారమెల్ల భగవంతునిదే యయినట్లు భూరిదో
శ్శక్తిని బౌరషేయ మన సర్వము దోచగ జేయు భంగి ద
ద్భక్తియు బౌరుషంబు జత బారిన పున్నెపు మేటి భూమిగా
రక్తిని మల్లికార్జునుడు రాజిలు నప్పురి హేమ దుర్గ తోన్ .
ఉ.ఎంతటి భక్త వత్సలుడొ యింద్రతనూజుని పేరా బట్నమున్
సంతత మీ ప్రపంచమున జల్లగ వెల్గెడునట్లు చేసి క
ల్పాంతము బారదు పౌరుషము నాకస మందగ నిల్పెనంత మా
కింత యుదంత మిచ్చె పరమేశుడు లీలల వ్రాయ నిచ్చుచున్ .
క . శ్రీ దుర్గామల్లేశ్వరు , లదరమున నాటనుండి యాంధ్రుల నిధులై
మోదము భక్తుల కొసగెడు , స్వాదువుగను నిద్ర కీల సదనము నందున్ .
ఉ .ఆగిరిపాద సన్నిధి దిగంతములందలి పుణ్య సంపదల్
డాగొని వచ్చి కృష్ణ నిజతత్వ మహత్త్వ ముతోడ నిల్పగాన్
దోగుచు స్వాగతమ్మొసగి ధూర్తులు గూడను సత్త్వ భావులై
యా గిరి కన్య శంకరు న హర్నిశలున్ భజియింతు భక్తి మై .
వ . అంతియ కాక యా కృష్ణా స్రవంతి ,
మ . తన పూతాంబువు లాత్మమండలమున్ దారుల్ గొనం భ్రీతయై
తన పుణ్యంబుల వారి వెం టనుపుచున్ ధాన్యస్వరూపంబున్
మనసా ప్పారగనిచ్చు బిడ్డలకు దా మాన్యంబులన్ వార లీ
శునకుం బ్రాలను నోగిరంబిడ సదా శోభించు సంతృప్తితోన్.
ఉ . భక్తిని సంధ్యలన్ జనులు భావసుమమ్ముల మాలగ్రుచ్చి యా
సక్తి నొసంగ బొంగి శుభ సౌఖ్యము లిచ్చి యకార్య భారముల్
నక్తములందు బట్టణమునన్ దరి జేరగనీక తత్ర్ప్రు జల్
రక్తి జెలంగ జాల నను రక్తినిన్ బ్రోచును దుర్గ సర్వదా !
ఉ . పూత మనస్సు పాత్రలను ఋణ్యజలంబుల బౌ రులా భవున్
స్నాతుని జేయగా బవలు సంతసమంది యతండు బావపున్
భీతి తొలంగి సంపదల వృద్దిని బొంది పరస్పరమ్ము సం
ప్రీతి బ్రజల్ మెలంగగ వివేక మొసంగి సతంబు నో మెడిన్ .
వ . ఇవ్విదంబున శ్రీ దుర్గా మల్లేశ్వరు లవ్విజయవాడ రక్షించుచు శుభంబులొసంగుచుం
శా . ప్రాతస్సంధ్య ధునీజలంబుల వడిన్ బాపంబు వోనాడుచున్
భూ తేశున్ స్వభిషిక్తు జేసికొనుచున్ ఋణ్యాన మధ్యాహ్నమున్
మాతన్ బూజలు సేసి సంపదలతో మర్యాద సాయంతనం
బా తీరస్థులు సంతసిల్లుదురు తా మా స్తిక్య భావంబులన్ .
మ . ద్విజభక్తిన్ గడు నారి తేరి ఘనులై తేజంబు పెంపొందగా
ద్విజధర్మంబున వెల్గు నిష్ఠపరులై ధీరుల్ మహో దారులై
సుజనత్వం బది వృద్ధి నొంద విధి స త్సూక్తుల్ విచారించి య
ద్రిజరూపాంతర గన్యకాంబ నతి భక్తిన్ గొల్తు రవ్వైశ్యులన్ .
ఉ . బొబ్బిలి వారి పౌరుషము బూనుదురో ! యది యేల మాకటం
చిబ్బడి యౌదురో తెలియ నేలొకో ! యాంధ్రుల పూర్వరక్తమే
యుబ్బుచునుండి మాటి కని నోర్చెడి శక్తియు నున్న భక్తితో
నబ్బ ! యనంగ నుందురట నన్న గరింగల తక్కు వారలున్
ఉ . తీరిక లేక వారి పని తీరులనున్నను ధర్మమన్నచో
బేరము లాపియైనను గు బేరులెయైనను వర్తకుల్ సదా
వారక వింద్రు చేతురు , శుభంబగు వారికి దాన నెందు సం
బారము నిండుకుండయగు వచ్చిన బోయిన గర్వు లుండినన్.
వ . ఇట్లాస్తిక్యభావంబుల నలరారు పౌర బృందసంశోభితంబగు నప్పురంబు .
చ . సురపురి మించునో యనిన చోద్యమదేలను చంద్రశేఖరున్
దరిసేనముం బొనర్పజని తద్దయు భక్తిని దేవదానవుల్
వరుసగ వారి సంపదలు భవ్య విధిం గొని తెచ్చి వేగ ద
ద్గిరిని వసింప నెంతు రట దృశ్యము కేవల మబ్ర మైచనన్
ఉ . కాంచన చేలుడున్ జెలియ గాంచగ రాడొకొ వచ్చునప్డు తా
గొంచెపు రీతి వచ్చునొకొ కూరిమి సోదరు జంద్రు జూడగా
నెంచదొ లక్ష్మి తా మనుగ మించరె ధాతయు వాణి యుందుచే
మించదె సర్వ లోకము మేదిని నున్నను నప్పురంబెటుల్ .
వ . అంతియె కాక .
ఉ . “ఆపురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి “ యం
చే పుడమీసురుండొ వచియించెను , నిక్కమో ! కాదొ ! కాని యా
హా ! పస బాయకుంద్రు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి లెం
దీపురి బార్వతీరమణి కిందుధ రేశు ప్రయోజనార్ధమై .
వ . అప్పరమేశ్వరీ పరమేశ్వరు లారిగికందరంబున సంసరణంబున నుండ .
ఉ . ఆ గిరికందరంబున విహంగమరావము కృష్ణతీరమం
దూగెడి కాశ నిస్వనము లోమ్మను రీతి బ్రతిధ్వనింపగా
వాగధినాధుడున్ శ్రుతుల బల్కు చునుండెడి సామగానమై
సాగుచు జంద్ర మౌళి కట సంతసమున్ గడుగూర్చుచుండెడిన్ .
వ. మఱియు
శా . ధ్యేయుండైన మహేశు నాలయమున్ దివ్యంబుగా మ్రోయు ఘం
టాయోగౌంకృతి దుష్ట మానసములన్ టాంటా మ్మనన్ మ్రోగుచున్
గాయమ్మున్ ఘన పాపభీతి వడిగా గావించు విజ్ఞానికిన్
సాయంబిచ్చును నాదరూప ఘనునిన్ సాధించి చేపట్టగన్ .
శా . భాంకారంబులు ఘంటికారవములున్ బాలేందుమౌ ళీశ్వరున్
ఓంకారంబుల స్తోత్రముల్ సలుపగా నోహో నరుండే ధను
ష్టాంకారం బొనరించుచుండె నొక వ్రేటన్ బోడు తధ్య మ్మిదే
ఢంకా కొట్టె దమందు బాలు రట నాడన్ వింత సంధి ల్లెడిన్
వ . ఈ రీతి నున్నయా పట్టణంబున .
రచన :ములుగు పాపయారాధ్యులు
సేకరణ : శ్రీదేవి భాగవతము నుంచి ……
———–