పేరు (ఆంగ్లం) | Rayaprolu Subbarao |
పేరు (తెలుగు) | రాయప్రోలు సుబ్బారావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 3/17/1892 |
మరణం | 6/30/1984 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | శాంతినివాసంలో గురుకుల వాసం చేసారు . |
వృత్తి | ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంద్ర శాఖలో అధ్యక్షులుగా పనిచేసారు . |
తెలిసిన ఇతర భాషలు | తెలుగు, సంస్కృత భాష |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఖండకావ్యాలు, తృణకంకణము, ఆంధ్రావళి, కష్టకమల, రమ్యలోకము, వనమాల, మిశ్రమంజరి, స్నేహలతా దేవి, స్వప్నకుమారము, తెలుగు తోట, మాధురీ దర్శనం, అనువాదాలు, అనుమతి, భజగోవిందము, సౌందర్య లహరి, దూతమత్తేభము, లలిత మధుకలశము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | రాయప్రోలు సుబ్బారావు |
సంగ్రహ నమూనా రచన | ప్రణయార్పణము’ అణువు నజాండము నేక స రణి నిండారిన మనోహరపు వాగర్థ ప్రణయము గీర్తి చెడు మృదు గుణులను భాషాకుమారకుల భావింతున్ శాశ్వత నవ్యస్ఫురణ ల నశ్వర లావణ్యమై పెనగ, కావ్యకళా |
రాయప్రోలు సుబ్బారావు
(నమూనా రచన )
తృణకంకణము
‘ప్రణయార్పణము’
అణువు నజాండము నేక స
రణి నిండారిన మనోహరపు వాగర్థ
ప్రణయము గీర్తి చెడు మృదు
గుణులను భాషాకుమారకుల భావింతున్
శాశ్వత నవ్యస్ఫురణ ల
నశ్వర లావణ్యమై పెనగ, కావ్యకళా
విశ్వమునం దానంద ర
సైశ్వర్యము లేలు కవిత కంజలి నిత్తున్
శశి వికసించిన శ్రావణ
నిశీథమున కానబడిన నీరదసుతకున్
ప్రశమితమతినై యీ వ
ద్యశుభాంజలి నొసగితి ‘ప్రణయార్పణ’ మనుచున్
తృణకంకణము
అడుగులు బొబ్బలెత్త, వదనాంచలమందున చిన్కు చెమ్మటల్
మడుగులుగట్ట, మండు కనుమాలపుటెండ పడంతి యోర్తు జా
ఱెడు జిలుగుంబయంట సవరించుచు, చొక్కిన యింపుతోడ కా
ల్నడకన బోవుచుండె నెడలన్ కనుపించెడి పచ్చతోటకున్.
పసినిమ్మపండ్ల చాయలు
కొసరెడి యా కుసుమగంధి కోమలపు టొడల్,
కనుకందిన కవటా కన
వసివాడె నిదాఘతాప పరిపీడనలన్.
కన్నె గేదగి చెండునా కళుకు లొలయు
ఆ నెలంత యొడల్ నగ లేవి లేక,
జాఱు చెమ్మట ముత్యాలజంపు సరుల
సహజ సౌందర్యమును వెద జల్లుచుండె.
పదియు నారు వసంతముల్ వదలనట్టి
వయసు సొగసుందనం బామె మెయిని మెఱయ,
బాల్య మెడలిన మొలుచు జవ్వనపుమవ్వ
మొడలి యం దండముగ నుట్టిపడుచు నుండె.
నడచుదారి పురోపకంఠంబు నొఱసి
చనుచునుండె, ఆమెకు ముందువెనక నెవరు
వచ్చుచున్న జాడలును గన్పట్ట వయ్యె,
ఎచటి కేగునొ, కారణ మేమి యగునొ?
ఇసుక దిగబడు నడుగుల నీడ్చుకొనుచు,
ఉడుకు టెండకు మండునిట్టూర్పు లదర,
కాలిచల్లారు పెంపుడు కానబడిన
పడుచు జింకపడంతి నా నడుచు నామె.
ఎడ నెడ కుఱంగంటను మా
మిడి చెట్టులు కలవు, కాని మెలతుక తా నా
కడలను నిలువగ నేగదు,
నడచుచు తన నడక బడినె నలగి కలగియున్.
జిలుగుపూల కలంకారి చీర జాఱ
చిందు సందెడు కుచ్చెళ్ళు చెదరనీక,
మాటికిని కాలికడియాలు మలపుకొనుచు,
కూతవే టిటు చని చేరికొనియె వనము.
పడమట జాముప్రొద్దు కనుపట్టుచునుండె, నిదాఘశాంతి య
య్యెడు మలుసందెచిన్నెల నొకింత ప్రసన్నములయ్యె గాడుపుల్,
నడకల చొక్కిసోలిన నెలంతయలంతలు పంచుకో పఱుం
గిడె నన నామె డాయ జనియెన్ తన పెంచినలేడి యయ్యెడన్.
తన యందెల రవళిత గుఱు
తున డాసిన హరిణపుత్రి దోడ్తోగని, చ
ల్లని చెమట లూరు హస్తం
బున దువ్వుచు నిట్లు కొంత ముచ్చట నడిపెన్.
నయనమూలాంచలములు స్విన్నంబు లయిన
వేల? చెల్లెలా! యీ ప్రాలుమాలికలకు
కారణం బెయ్యది? కఠోరకంటకంపు
వనుల దిరుగవు గద చిన్నతనపుచేష్ట!
అని నగవుంబలుకుల కను
గొనలను వాత్సల్యరసము కురియగ, ఆ మో
హనహరిణంబును ముద్దిడు
కొనియెను తృణపరిమళము బుగుల్కొన మొగమున్.
నడచి బడలిన యాయాస మెడల లేదు,
చీరె చెఱగుల తడియైన నాఱ లేదు,
లేడి వరసినయపుడె ముద్దాడికొనియె,
అహహ! యెంతటిప్రేమార్ద్ర మామెమనసు!
వాలుంగన్నుల సొగసుల
లాలింపుచు తన్ను జూచు లలితకురంగిన్
కే లిచ్చి పిలిచికొను చా
నీలాలక యొక్క పోకనీడకు చనియెన్.
క్రిక్కిఱియు కొమ్మ లాశల నెక్కి చలువ
లుట్టిపడు నీడపందిళ్ళు కట్టుచుండ,
కలదు చేరువ వృద్ధవృక్షం బొకండు,
సొన యొకటి పాఱు మొద లానుకొని సతంబు
ఆ తరుచ్ఛాయ లొలసిన యంతవరకు
స్నిగ్ధసికతాతలమ్ముల చెమ్మ తేఱు,
ఎండ కన్నెఱుగక, వాననీడిగిలక
పెరిగిన కలకాపురముల బిడ్డలట్లు.
స్కంధకూలంకషమ్ముగా జాలువాఱు
పొడుపు సొనపయి ప్రాగభిముఖపు సరణి,
పూలరెమ్మల నింపు సొంపులు వహించు
శాఖ యొకటి వంతెనగాగ సాగిపోవు
గెలలు దిగిన మవ్వపు నారికేళతరులు,
పూలగుత్తులు వ్రేలాడు పొన్నచెట్లు,
మృదురవమ్ముల పిలిచెడి వెదురుపొదలు,
కన్నెగందపుమాకులున్ కలవు మఱియు.
సందె ముసలినకొలది ప్రశాంత మగుచు
చలువయును మాంద్యమును తన్ను నలమికొనగ,
త్రోవసోలింపు లెడల ప్రదోషపవన
మల్ల నల్లన వీచె నా యబలమీద.
ముగ్ధ మధురమ్మయిన లేడి ముద్దులాట,
లోల పవనాకుల లతావలోకనంబు,
పొడుపుటేటి మెలపు, జారు ప్రొద్దు వలపు,
ఆయమ నొకానొక వికార మందుత్రోసె.
చేలచెఱంగునన్ మొగముచెమ్మట లొత్తు, చెయిం బెనంచు, నీ
లాలకముల్ మొగమ్ము కవియన్ పయికడ్డము దిద్దు, మోవిపై
వ్రేలిడి యాలకించు, మురిపెంపు కనుంగవనిండ వాలికల్
తేలగ జూచు, నెద్దియు మదిం దలపోయు ననేకరీతులన్.
———–