పేరు (ఆంగ్లం) | Rallapalli Anantakrishna Sharma |
పేరు (తెలుగు) | రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | అలమేలు మంగమ్మ |
తండ్రి పేరు | కర్నమడకల కృష్ణమాచార్యులు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/23/1893 |
మరణం | 3/11/1979 |
పుట్టిన ఊరు | అనంతపురం జిల్లా రాళ్లపల్లె గ్రామం. |
విద్యార్హతలు | , మైసూరు పరకాల మఠంలో ఉన్నత సంస్కృత విద్యను అభ్యసించాడు |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | సంస్కృతాంధ్ర భాషలలో ప్రావీణ్యత సంపాదించాడు |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సామాజిక స్పృహ వాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు తమ వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించాడు. ‘నిగమశర్మ అక్క’, ‘నాచన సోముని నవీన గుణములు’, ‘తిక్కన తీర్చిన సీతమ్మ’, ‘రాయలనాటి రసికత’ అనే ఆయన వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి.కాళిదాసు రచించిన రఘువంశం ఆంధ్రీకరించాడు. ‘పెద్దన పెద్దతనము’ అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశాడు. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | మైసూరులో జరిగిన 4వ సంగీత సమ్మేళనంలో ‘గాన కళాసింధు’ బిరుదుతో సత్కరించారు. బెంగుళూరు గాయక సమాజం ‘ సంగీత కళారత్న’ బిరుదుతో సత్కరించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1970లో పెలోషిప్ నిచ్చి సత్కరించింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డి.లిట్. పట్టంతో గౌరవించింది. |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ |
సంగ్రహ నమూనా రచన | ఒక విధంగా చూస్తే తిక్కనగారి రచనల్లో పాత్ర పోషణమనే కావ్య ధర్మాన్ని విమర్శించడం న్యాయం కాదను పించును . ఎందుకంటె ఆయన రచించిన ఉత్తర రామాయణం , భారతం రెండు ఎరువు సోత్తులే . అందలి పాత్రలన్నీ వాల్మీకి , వ్యాసుల కైవారపు తీర్పులు. ఒకటైన తిక్కన కొత్తగా సృష్టి చేయలేదు . వాటిలోని కథా సందర్భాలు అట్టివే . అందులో అదేశాగమలోపాలేమైనా ఉంటే తిక్కనకు దొరికిన గ్రంధ పాఠ మట్టిదనే మన ముహించు కొవలేను . రామాయణ ఉత్తర కాండములో , ముఖ్యంగా భారతంలో సర్వత్ర పాఠ భేదాలకు మితి మేర లేదన్నది సుప్రసిద్ధ విషయం |
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
సారస్వత లోకము
ఒక విధంగా చూస్తే తిక్కనగారి రచనల్లో పాత్ర పోషణమనే కావ్య ధర్మాన్ని విమర్శించడం న్యాయం కాదను పించును . ఎందుకంటె ఆయన రచించిన ఉత్తర రామాయణం , భారతం రెండు ఎరువు సోత్తులే . అందలి పాత్రలన్నీ వాల్మీకి , వ్యాసుల కైవారపు తీర్పులు. ఒకటైన తిక్కన కొత్తగా సృష్టి చేయలేదు . వాటిలోని కథా సందర్భాలు అట్టివే . అందులో అదేశాగమలోపాలేమైనా ఉంటే తిక్కనకు దొరికిన గ్రంధ పాఠ మట్టిదనే మన ముహించు కొవలేను . రామాయణ ఉత్తర కాండములో , ముఖ్యంగా భారతంలో సర్వత్ర పాఠ భేదాలకు మితి మేర లేదన్నది సుప్రసిద్ధ విషయం .
మఱీ ఆ రెండు గ్రంధాలలో మొదటిది వేద సంహితము., వేదములతో సమానము . రెండవది పంచ వేదమే . అసలు వాటిలోని వ్యక్తులూ , విషయాలు ఇప్పటి చారిత్రక దృష్టికి సత్యము లైనా , కవి కల్పితాలైనా మన చేతికి వచ్చేసరికి పరమ సత్యములై , ప్రామాణికంలై , ఏ యితర వ్యక్తి విషయాలకు లేని స్థిర స్వరూపంతో మన జీవితంతో మేళగింపు చేసుకుని నిలబడినవి .
ఇందు మీద అవన్నీ అమానుషములూ , అతి మానుషములు ఐన వస్తువులు . పుట్టు చావులు , రూపు రేఖలు , మంచి చెడ్డలు మొదలైన అన్నిటి యందూ మనుషులు కొలదిని చాలా మీరినవి . వట్టి వింత కథలూ , ఉద్రేచక ఘట్టాలు కాక , ధర్మ అధర్మాలు , న్యాయ అన్యాయాలు స్వరూపాలను మనుషుల మనసులలో చిక్కగా నాటే ఉద్దేశ్యంతోనే సిద్ధమైనవి .
“ధర్మతత్వ జ్ఞులు ధర్మ శాస్త్రంబని
యధ్యాత్మవిదులు వేదాంతమనియు
నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని
కవి వృషభులు మహాకావ్యమనియు
లాక్షిణుకులు సర్వ లక్ష్య సంగ్రహమని
యైతిహాసికు లితిహాసమనియు,
పరమపౌరాణికుల్ బహు పురాణ సముచ్చ
యంబని మహి గొనియాడుచుండ
వివిధ వేదతత్త్వ వేది వేద వ్యాసు
డాదిముని పరాశరాత్మజుండు
విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై
పరగుచుండ జేసె భారతంబు “
అని చెప్పిన నన్నపార్యుడు “నిత్య సత్య వచను “డనడంలో సందేహమక్కరలేదు . “ ఏ పట్టున బూజ్య మూర్తి యగు భారత సంహిత “ అన్న తిక్కన మాట పైదాని సారసంగ్రహమే . వాల్మీకి రామాయణం కూడా భారతం అంత సార్వజనీనం కాకపోయినా , ప్రామాణ్య గౌరవాదులలో దానితో సమానంగా తూగినది . ముఖ్యంగా శ్రీరామానుజతానుయాయులు దాన్ని శరణాగతి శాస్త్రంగా ప్రత్యక్షర ప్రమాణం గా పరిగ్రహించారు . “రామాది వద్వావర్తితవ్యం న రావణాదివత్ “ “(శ్రీరాముడు మొదలైన వారు వలె నడువ వలెను . రావణాదుల వలె కాదు )అనే ధర్మ సూత్రాన్ని ప్రచారం జేసేదే ఆ గ్రంధాల పరమోద్దేశ్యం .తరతరాలుగా మనం వాటి నట్లే యధా శక్తిగా కొన్నాము . కనుక స్వతంత్ర మిందులో చెల్లదు .
మరి పాత్ర పోషణ మనేది స్వతంత్రమైన కల్పనకు సంబంధించిన శిల్ప ధర్మం . దానిని కొలిచి చూపే మాన దండము మన అనుభవమే . ఈ పాత్రము ఇట్లు వర్తించుట యుక్తం . ఈ సందర్భ మీరీతిగా పరిణమించడం న్యాయం , సహజం , మరొక రీతిగా కాదు . – అని నిర్ణయించటానికి మన సాక్షాదనుభవమో , దాని చేత ఏర్పడిన భావన శక్తియో సాధనం కావలెను కాని వేరులేదు , కాని ఆ రెండు రామాయణ భారతాలు వంటి గ్రంధాల విషయాలను కొలిచి తీర్పు చెప్పటానికి చాల చిన్న తక్కెడలు , ఐనా మనం మనుషులం గనుక , మనకై మనలో వచ్చి చేరిన వస్తువులను మన దృష్టితో చూడక , మన మితి లోపలనే కొల్వక ఉండలేము . పండు నోటికి పెద్దదైతే అనుకూలంగా చిన్న చిన్న ముక్కలుగా తరుగుకుని తినవలెననేది మన నడతను సమర్ధిస్తుంది . పౌరాణిక విషయాలను స్వానుభవంలోకి తెచ్చుకుని నెమరు వేయడానికి ప్రయత్నించిన పెద్దలు , చిన్నలు , అందరు అన్ని కాలాల్లోను కొంచెం గాను , గొప్పగాను ఈ పని చేసిన వారే .
తిక్కన ఎత్తరినైనను ధీరోదాత్తనృపోత్తముడు రామ ధరణీపతి సద్వ్రుత్తము సంభావ్యము (నిర్వ “1-11 )అని నమ్మినవాడు . కాని భారతం మీద ఉన్నంత భక్తి ప్రపత్తు లాయనకు రామాయణ మందుండలేదేమో అని సందేహించే అవకాశముంది . పూర్వ రామ కథను తెలుగులో ఆయన యేల రచింపక వదలెనో నికరంగా కారణం చెప్పలేము . ఉత్తర కథను రచింపబూనిన వాడు తెలుగులో మూల గ్రంధం . తూ .చా తప్పకుండా దించితే అనుభవానికి చాలదనీ , అది రచన కానేరదనీ ఆయన తెలుసుకున్నాడు . ముఖ్య విషయాలు మార్చే అధికారం మనకు లేదు . అవి యెంత అమానుషాలైన అసంభావాలైనా అట్లే ఉండవలసినవే . మూల గ్రంధం లోపం రాకుండా , వాటి సందులలోని చిన్న చిన్న వంకలను చక్క నొత్తడమూ , బంగలను మెత్తడమూ ఐనా చేయకపోతే మనకు రక్తి – అంటే అనుభవానికి నింపు – ఉండదు . మనకు కానవచ్చిన వంకరలు . బంగలు నిజంగా వంకలేనా , బంగాలేనా అన్న ప్రశ్న తెగేది కాదు . అర్జవంగా మన మనస్సుకూ , అనుభవానికి అట్లు గోచరిస్తే చాలును ; ఈ మెట్టు దాటి తత్వాన్ని అందుకొనే భాగ్యం మనకు లేదు . తిక్కన గారి పాత్ర పోషణ శిల్పం ఈ మితిలో ఈ ఉద్దేశంతో నడిచింది . దీనిలో ఆ మహానుభావుడు చూపిన నయగారపు పనితనం వాల్మీకి – వ్యాసుల మూల గ్రందాలతో పోల్చి చూచినప్పుడు ప్రతి పదము నండూ గోచరిస్తుంది . ఉత్తర రామాయణంలో సీతమ్మ విగ్రహానికి ఆయన చేసిన ప్రతి కర్మ మనం గమనిస్తే e విషయం స్పష్టమౌతుంది .
రామాయణాన్ని వాల్మీకి మహర్షియే సీతాయాశ్చరితం మహాత్ ‘ అని వర్ణించినాడు . ఉత్తర రామాయణంలో సీతమ్మ విషయంగా తిక్కన్న్న చూపిన పక్ష పాత గౌరవాలు గమనిస్తే , వాల్మీకి దీనికి ‘సీతాయన ‘ మని యేల పేరు పెట్టలేదని మనస్సులో నొచ్చు కొన్నాడెమో అనిపిస్తుంది . ఉత్తర రామకథలో నిజమైన పట్టుగొమ్మ సీత . గ్రంధంలో ఇంచుమించు సగానికి మించి రావణాదుల పురాణ కథా శ్రవణం ఆక్రమించింది . డానికి తరువాతనే సీతమ్మ పాత్ర ప్రవేశం . సీతా రాముల విహారలీలలు ; వెంటనే గర్భ ధారణం ; జనాపవాదశ్రుతి ; దాని ఫలంగా సీత కోర్కె తీర్చే నెపంతో లక్ష్మణుని ద్వారా ఆమెను గంగాతీరారణ్యంలో వదలుట ; కుశలవుల జననం ; రాముని అశ్వ మేధయజనము ; అక్కడ కుశలవుల రామాయణ గానము ; సీతను పిలిపించి మహాసభలో తన చరిత్రను గూర్చి శపథం చేయించడం ; ఆయమ మాతృ భూమి గర్భంలో లయించుట ; రాముని కోపము ; శాంతి ; పరమ పద ప్రాప్తి – ఇవి ఇందలి సుప్రసిద్ధ కథా వస్తువులు .
ఇందు రసానుభ దృష్టికి , ధర్మ దృష్టికి ప్రధాన మైనది సీతా పరిత్యాగ ఘట్టము . రామకతలో ఇంత హృదయద్రావకము , ఉద్వేజకము ఐన సన్నివేశ మింకొకటి లేదు . మరి లోకాపవాదానికి భయపడి నిర్దోషియైన ప్రియపత్నిని త్యాగం చేయడం ధర్మమూ , అధర్మమూ అనే ప్రశ్న తలంలేని లోతుగలది . మనుష్య జీవితంలోని పెక్కు మహా ధర్మ సంకటాలకు ఇదొక మచ్చు .ఇద మిత్థమని దీనిని నిర్ణయించే పూనిక వ్యర్ధం . ఆ సంకట మేర్పడినప్పుడు సంస్కృత చిత్తుడైన మనిషి తన అంతరాత్మ ఋజు సాక్షికి లోబడి అప్పటి కనుకూలంగా కర్తవ్యం నిర్ణయించి చేయును ; లేదా తన కంటే జ్ఞాన వయో వివేక వృద్ధుల నడిగి వారి యుపదేశ ప్రకారం ఆచరించును . ఏమైనా అది తాత్కాలికమైన తీర్మానమే ; సర్వ కాలాన్వయి కాదు ; కానేరదు . ఏ సంకటమూ లేక గట్టున కూర్చొని చూస్తూ విమర్శించే మన వంటి వారు చేసే నిర్ణయం పుస్తకాలకో , ఉపన్యాస పీఠాలకో మాత్రమే పనికి వస్తుందంతే . ఏక పక్ష దృష్టి ఇందులో తప్పదు . ఏకపత్ని వ్రతం స్త్రీలకు పరమ ధర్మమనీ , పరపురుష స్పర్శమే పరమ పాపమనీ , అట్టి స్త్రీకి త్యాగమే శిక్షయనీ నమ్మిన రాష్ట్రంలో , ప్రజలను ధర్మం దాటకుండా పాలించే భారం గల ప్రభువు , ఇంచుమించు ఒక సంవత్సర కాలం
:స్వ ధర్మో రక్ష సాం భీరు సర్వ దైవ న సంశయః
గమనం వా పరస్త్రీణం హరణం సంప్రమధ్య వా (రా .సుం .స .20 – 5 )
(సీతా ….!పర స్త్రీలను పొందుటగాని , బలవంతంగా హరించుట గాని రాక్షసులకు సర్వదా స్వధర్మము , సీతతో రావణుని మాట )
అని బహిరంగంగా ఘోషించే వానింటిలో చెర జిక్కి యున్న భార్యను జూచినప్పుడు
‘ప్రాప్త చారిత్ర సందేహా మమ ప్రతి ముఖే స్థితా
సీపా నేత్రాతుర స్యేవ ప్రతికూలాసి మే దృఢమ్
(నీ నడతలో సందేహమున్నది . నీవు నా యెదుట నిలబడితే , కండ్ల రోగం కలవాడు దీపం వలె , నేను చూడ లేకున్నాడు .- రాముని మాట సీతతో )
అని తీవ్రంగా భావించి పలకడంలో అస్వభావికతని , అధర్మంగాని కలదనుకోవటం అవిచార రమణీయం , హిందువుల నమ్మకము ప్రకారంగా , ధర్మం మూడు పాళ్ళు నశించిన ద్వాపరాంతం లోనే –
“స్త్రీషు దుష్టాసు వార్ష్ ణేయ జాయతే వర్ణ సంకరః
సంకరో నరకాయైవ కుల ఘ్నానాం కులస్య చ
(స్త్రీలు చెడితే వర్ణ సంకర మేర్పడును . దానిచే కులము చెరిచిన వారికీ , కులానికి అంతా నరకం రక తప్పదు . )
అనే దృడ శ్రద్ధ చదువరులలో గలదు . అట్లుండగా ధర్మం మూడు పాదాలతో నడుస్తూ ఉన్న త్రేతా యుగంలోని వారి మాట చెప్పబని లేదు . ఇంత తీవ్రంగా ఈ యభిప్రాయాలను , నమ్మకాలను నెలకొల్పు కొనవచ్చునా అన్నది ఇప్పుడు మనమే కాదు . అప్పుడు గూడూ ఒక ప్రక్క కోడరైనా తీవ్రంగానే వేసుకొన్న ప్రశ్న. కాని ‘ధర్మా దర్ధశ్చ కామశ్చ ‘(ధర్మము వల్లనే అర్ధ కామాలు రెండూ అనుభవింప వీలు కలదు .) అనే మాట సత్యమైతే , ఆ ధర్మ సూత్రాలు శిథిలంగా చేసుకోనలేమ్ము చేసి జీవింపలేము . వాటిని సంఘంలో వ్యాప్తికి తెచ్చే అధికారమూ , ఉద్యోగమూ కలవారు వ్యక్తులకు దాని వల్ల కలిగే సుఖ దుఖాలను గమనింపరు ; గమనింలేరు . ఇట్లు ధర్మ సూత్రాలను దృడంగా బిగించినప్పుడు నడుమ చిక్కి నలిగిపోయే కోటాను కోటి వ్యక్తులలో సీతమ్మ కూడా ఒకతె . రాముని నడత గూర్చి ఇంత కంటే ఎవరూ చెప్పగలిగింది లేదు . ‘రామో విగ్రహవాన్ ధర్మః (రా .అర .37 .13 )రాముని స్వరూపమే ధర్మము .
రచన :రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ
సేకరణ : సారస్వతా లోకము ..వ్యాస సంపుటి నుంచి …….
———–