పేరు (ఆంగ్లం) | Ayyadevara Kaleswararao |
పేరు (తెలుగు) | అయ్యదేవర కాళేశ్వరరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | వరలక్ష్మమ్మ |
తండ్రి పేరు | లక్ష్మయ్య |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/22/1882 |
మరణం | 2/26/1962 |
పుట్టిన ఊరు | కృష్ణా జిల్లా నందిగామ |
విద్యార్హతలు | బి.ఎ. , బి.ఎల్. |
వృత్తి | న్యాయవాది |
తెలిసిన ఇతర భాషలు | ఆంగ్లము |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | చైనా విప్లవము, ఫ్రెంచి విప్లవ చరిత్ర, అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర, తురుష్క ప్రజాస్వామికం, చీనా జాతీయోద్యమ చరిత్ర మరియు ఈజిప్టు చరిత్ర. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకరు. ఈయన జీవిత చరిత్ర నవ్యాంధ్రము – నా జీవిత కథ అనే పుస్తక రూపంలో వెలువడింది. 1947లో కాళేశ్వరరావు శాసనసభలో బహుభార్యత్వ నిషేధపు బిల్లును ప్రవేశపెట్టాడు.వీరు ఎంతోమందికి విద్యాదానము చేసారు. మహాత్మా గాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అయ్యదేవర కాళేశ్వర రావు చైనా విప్లవము |
సంగ్రహ నమూనా రచన | ప్రపంచములో కెల్ల పెద్దది , మన దేశమునకు అనుకొనియున్నది యగు చైనా దేశపు చరిత్రను ప్రాచీన కాలము నుండియు నేటి వరకును చైనా విప్లవము అను పేరున వ్రాసి ఆంద్ర మహా జనులకు సమర్పించుచున్నాను . చైనా యొక్క జన సంఖ్య అరవై కోట్లు . అరవై అయిదు కోట్లని కూడా కొనదరి చేత అంచనా వేయబడుచున్నది . మన ఇండియా యొక్క జన సంఖ్య నలుబది కోట్లు . వైశాల్యములో చైనా ప్రజల రిపబ్లికు మన దేశమునకు దాదాపు మూడు రెట్లు గలదు . ఈ రెండు దేశములు ప్రాచీన నాగరికత కాలవాలములు . జ్ఞాన సూర్యుడు ప్రధమమున ఈ రెండు దేశములలోనే యుదయించెను . |
అయ్యదేవర కాళేశ్వర రావు
చైనా విప్లవము
ఉపోద్ఘాతము
ప్రపంచములో కెల్ల పెద్దది , మన దేశమునకు అనుకొనియున్నది యగు చైనా దేశపు చరిత్రను ప్రాచీన కాలము నుండియు నేటి వరకును చైనా విప్లవము అను పేరున వ్రాసి ఆంద్ర మహా జనులకు సమర్పించుచున్నాను . చైనా యొక్క జన సంఖ్య అరవై కోట్లు . అరవై అయిదు కోట్లని కూడా కొనదరి చేత అంచనా వేయబడుచున్నది . మన ఇండియా యొక్క జన సంఖ్య నలుబది కోట్లు . వైశాల్యములో చైనా ప్రజల రిపబ్లికు మన దేశమునకు దాదాపు మూడు రెట్లు గలదు . ఈ రెండు దేశములు ప్రాచీన నాగరికత కాలవాలములు . జ్ఞాన సూర్యుడు ప్రధమమున ఈ రెండు దేశములలోనే యుదయించెను . పదునెనిమిదవ శతాబ్దము వరకు ఈ రెండు దేశములలో ధర్మ ప్రధానమైన గ్రామ నాగరికత , గ్రామ స్వరాజ్యము , గ్రామ గృహ పరిశ్రమలు , సమిష్టి కుటుంబము , పితృ దేవతల ఆరాధము . సిరి సంపదలు ప్రబలి యుండెను . ఇండియా నుండి బౌద్ధ మతము చైనాకు పోయి వ్యాపించినందున చైనా ప్రధాన బౌద్ధ దేశ మయ్యెను . 1774 నుండి ఇండియా బ్రిటీషు సామ్రాజ్య వాదుల ఏక పాలనము క్రిందకు వచ్చినది . స్వదేశ సంస్థానములు బ్రిటీషు పాలకులచే నిలిపియుంచబడినవి . జమీందారీ పద్ధతి స్థాపించబడ్డది . కాని అరాజకము పోయి దేశైక్యత , శాంతి ఏర్పడినవి . 1842 నుండి బ్రిటీషు , ఫ్రెంచి , రష్యా , జర్మను , జపాను సామ్రాజ్య వాదుల యాజమాన్యము క్రిందకు చైనా వచ్చినది . చైనా రాజరికము బలహీనమైనది . భూఖామందుల క్రింద రైతాంగము మ్రగ్గినది . అరాజకము పూర్తిగా వ్యాపించినది . రెండు దేశములలోను ఇరువదవ శతాబ్దములో జాతీయ స్వతంత్ర పోరాటములు సాగినవి . సన్ యటు సేను నాయకత్వమున చైనాలో 1911 లో స్వతంత్ర పోరాటము సఫలమై రాజరికము క్రూల ద్రోయబడి రిపబ్లికు ఏర్పడినది . కాని విదేశస్థుల కుట్ర వల్ల యూ యన్షి కాయి రిపబ్లికు అభ్యదుడుగా ఎన్నుకొనబడి ప్రజాస్వామ్యతత్వము నాశనము గావించబడినది . రిపబ్లికు పేర సైనిక నాయకుల అంతః కలహములు , విదేశ సామ్రాజ్యవాదుల పలుకుబడి చెలరేగినవి . నస యటు సేను మరల 1923 లో క్యూ మిస్ టాంగు మహాసభను పునరుద్ధరించి ప్రజా రాజ్యము స్థాపించ యత్నించుచుండగ ఆయన 1925 లో పరమ పరించెను . ఆయన ప్రజా రాజ్య స్థాపన కొరకు సోవియటు రుశ్యా వారి సహాయమును కాక్షించుట వలన కమ్యూనిస్టులు చైనాలో బలపడిరి . ఆయన యొక్క అనుచరులలో ముఖ్యుడగు చ్యాంగు కేషకు చైనా పైన క్యూ మింటాంగు పాలనమును స్థాపించెను గాని , అది నామ మాత్రావశిష్ట మైనది . క్యూమింటాంగు నాయకులు తమ
లో తాము అధికార కొరకు పోట్లాడు కొనివారు . సుస్థిర ప్రభుత్వ మేర్పాటు చేయలేక పోయినారు . ధూసంస్కరణములను ప్రవేశ పెట్టలేదు . ఎన్నికలు జరపలేదు . లంచ గొండితనము ప్రబలినది . ఆ రాజకము నుండి దేశమును కాపాడ లేకపోయినారు . కమ్యూనిస్టు నాయకులు క్యూమింటాంగు పార్టితో ఇరువది సంవత్సరములు ఎడ తెగని పోరాటము సలిపి 1949 అక్టోబరు 1 వ తేదీన చైనా దేశముపైన కమ్యూనిస్టు రాజ్యమును స్థాపించినారు . చైనా పైన సామ్రాజ్యతత్వము నవలంబించిన జపాను యొక్క దండయాత్రలు క్యూమింటాంగు పతనమునకు కమ్యూనిస్టుల జయమునకు హేతువయ్యేను . ద్వితీయ ప్రపంచ సంగ్రాహములో సామ్రాజ్య వాదులైన ఆంగ్లేయులు , అమెరికనులు కమ్యూనిస్టు దేశమైన రుష్యాతో జరిపిన మైత్రి , ఇండియాలోను , చైనాలోను కమ్యూనిస్టు పార్టి యొక్క పరాక్రమం తోడ్పడినది . జపాను వారి దురాశ సఫలీకృతము కాకపోగా చైనాను మాత్రము కమ్యూనిస్టుల యాజమాన్యము కిందకు త్రోసినది . ఇండియాలో మహాత్మ గాంధి యొక్క నాయకత్వము క్రింద స్వతంత్ర పోరాటము జరిగి 1947 లో కాంగ్రేసు పార్టి క్రింద ప్రజారాజ్యము , చైనాలో 1949 లో కమ్యూనిస్టు పార్టి క్రింద నియంతృత్వ పాలనము ఏర్పడి పంచ వర్ష ప్రణాళికల ద్వారా ఆర్ధికాభివృద్ధి కృషి సలుపుచున్నది. నా ‘చైనా విప్లవము ‘ లో రెండవ భాగము కమ్యూనిస్టు విప్లవ చరిత్రయై యున్నది . అందుకొరకు జరిగిన తీవ్ర పోరాటములు , కమ్యూనిస్టు సమాజ స్థాపనలో జరిగిన పరిణామములు వివరించినాను . చైనా కమ్యూనిస్టులు కారలు మార్క్స్ ను ఆదర్శముగా పెట్టుకొని ఆయన సిద్దాంతములను పూర్తిగ అమలు జరుప యత్నించు చున్నారు . ఆ సిద్ధాంతములు ఉద్యోగులలో , విధ్యాధికులలో , విద్యార్ధులలో , రైతులలో , కార్మికులలో వ్యాపింపచేసి వారి కుత్సాహమును కలుగ చేసి కమ్యూనిస్టు సమాజమును అతి త్వరితముగ స్థాపించుచున్నారు . కారలు మార్క్సు సిద్ధాంతముల ప్రకారం మతము , ఆస్తి , కుటుంబము , వ్యక్తి స్వతంత్రము నాశనము గావింపబడి అందరు ప్రజలను ప్రభుత్వము కింద కూలీలుగ మార్చి వివిధ రంగములలో పని చేయించి అందరికి సమానముగ తిండి , బట్ట , పిల్లల పోషణము , నివాసము , విద్య కలుగ చేయు బాధ్యత ప్రభుత్వమే వహించుచున్నది . వర్గ పోరాటము వలన ద్వేష పూరితమైన హింసా విధానము ప్రబలియున్నది . ఇంతకన్న ఇండియా యొక్క ప్రజా రాజ్యము గాంధి తత్వము అనేక విధముల శ్రేష్టమైనవి , గావున ఇండియాలో మహాత్మా గాంధిని ఆదర్శముగ పెట్టుకొని ఆయన సిద్ధాంతములకు పూర్తిగ అమలు జరపవలసియున్నది . రాజకీయవాదులలో , విధ్యాధికులలో , విద్యార్ధులలో , రైతులలో , కార్మికులలో , వర్తకులలో నేగాక ఉద్యోగస్థులలో గూడ ఆ సిద్ధాంతములు బాగుగ నాటి యుత్సాహము కలిగిన గాని ఇండియా స్థాపించ దలచున్న సోషలిస్టు సమాజ స్థాపన త్వరితముగను , బాగుగను జరుగ నేరదు . లంచ గొండి తనము నిర్మూలము గావలెను . ఉపేక్ష , పనిలో ఆలస్యము ఉండగూడదు . ఇంక నెక్కుడుగ క్రమశిక్షణ , ఐక్య మత్యము స్థాపితము కావలెను . చైనాలో లంచ గొండితనమును నిర్మూలించుటకు ఎప్పటికప్పుడు జయప్రదముగ ప్రయత్నములు చేసియున్నారు . నయమునను , భయమునను క్రమశిక్షణ బాగునున్నది . ఇండియా ఇంక నెక్కుదుగ బలపడవలెను . గాంధి సిద్దాంతముల ఆచరణ మూలముననే బలపడగలదు . చైనా పురోగతిలో కమ్యూనిస్టు పార్టి బాగుగ తోడ్పడి నటుల ఇండియా పురోగతిలో కాంగ్రెసు పార్టి తన పాత్రను త్యాగాముతో నిర్వర్తించవలెను . ప్రజా ప్రబోధము గావించవలెను . వ్యవసాయ యుత్పత్తి దార్ల సహకార సంఘములు చైనాలో అత్యధిక యుత్పత్తి కెంతయో తోడ్పడినవి . ఆ పద్ధతి వలన ఇండియాకు కూడా చాల మేలు కలుగ గలదు . ఆహార సమస్య తీరును . ఆ పైన చైనాలో స్థాపించ బడిన సమిష్టి వ్యవసాయమే క్షేత్రములను కంయూనులకు ఇండియా అంగీకరించదు . ఒక్క దృఢమైన ఆదర్శముతో ఒక్క నాయకత్వము క్రింద ఇండియా మంచి శిక్షణతో ముందుకు నడవ వలెను . అపుడే ఇండియా యొక్క ప్రజారాజ్యము శాశ్వతముగ వర్దిల్లగలదు . ఇండియా లోక కళ్యాణమునకు , లోక శాంతికి విశేషముగ తోడ్పడలగదు . కమ్యూనిస్టు చైనా , టిబెటు పైనను , ఇండియా ధూ భాగముల పైనను జరిపిన దురాక్రమణలను గూర్చి రెండు అధ్యాయములకు వ్రాసి నాను . పవిత్రమైన హిమ వత్సర్వతములు ఇంగితాకు కిరీటము . వాటి దక్షిణ భాగమున నొక చదరపు గజము వైనను విదేశస్థులా క్రమించుటకు సహించ నేరము . కమ్యూనిస్టు చైనా యొక్క వై దేశిక నీతిని వివరించినాను . ఒక వైపున కమ్యూనిస్టు ప్రపంచంములోను , రెండవ వైపున ఆశియా ఆఫ్రియా ఖండ జాతులలోను నాయకత్వమును పొందవలేనను ఆశ చైనాకు మొండుగనున్నది . అంతేగాక ఇండియా మొదలైన అగ్నేయాశియా దేశముల నన్నిటిని కమ్యూనిస్టు దేశములగ మార్చి తమ నాయకత్వము క్రిందకు తెచ్చుకునే దురాశ చైనా నాయకుల కున్నతుల కూడా పత్రికలలో చదివినాము . ఇట్టి పరిస్థితులలో ఇండియా యొక్క స్వతంత్రము అచంచలముగను , నిరపాయముగను నున్నదని భారతీయ లెవరును భ్రమలో నుండ గూడదు . ఇండియా యొక్క భూభాగములో చైనావా రాక్రమించిన ప్రాంతములను మరల రాబట్టుకొనుటకే గాక దేశ స్వతంత్రమునకు ఎట్టి విఘాతము ఎప్పుడును కలుగకుండ కాపాడు కొనుటకు భారతీయులెల్లరు గట్టి ఐకమత్యముతో తయారుగ నుండవలెను . ఎట్టి త్యాగములనైనను గావించి దేశ స్వతంత్రమును కాపాడు కొనవలెను .
శాస్త్ర విజ్ఞానము , చరిత్ర తెలుగు , ఉరుదూ అకాడమీ పక్షమున e గ్రంధమును ప్రచురించుచున్నాము . నేను సంప్రదించిన పుస్తకముల , పత్రికల పేర్లు ఇచ్చినాను . అతి త్వరితముగను . మిగుల జాగ్రత్తగను దీనిని ముద్రించిన అజంతా ప్రింటర్సు వారికి నా కృతజ్ఞతను తెలుపుచున్నాను .
నాగార్జున విహార్ ,
హిమాయత్ నగర్ , హైదరాబాద్ ,
26 -7 -1960
రచన : అయ్యదేవర కాళేశ్వర రావు
———–