పేరు (ఆంగ్లం) | Garimella Satyanarayana |
పేరు (తెలుగు) | గరిమెళ్ల సత్యనారాయణ |
కలం పేరు | – |
తల్లిపేరు | సూరమ్మ |
తండ్రి పేరు | వేంకట నరసింహం |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 7/14/1893 |
మరణం | 12/18/1952 |
పుట్టిన ఊరు | శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలుక గోనెపాడు గ్రామం |
విద్యార్హతలు | బి.ఏ. |
వృత్తి | గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తా విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాథ్యాయుడు ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శి ఫ్రీలాన్స్ జర్నలిస్టు ఆనందవాణికి సంపాదకుడు ఆచార్య రంగా, వాహిని పత్రికలో సహాయ సంపాదకుడు. |
తెలిసిన ఇతర భాషలు | తమిళ, కన్నడ, ఆంగ్లం |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | స్వరాజ్య గీతములు, హరిజనుల పాటలు, ఖండకావ్యములు, భక్తిగీతాలు , బాలగీతాలు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | గరిమెళ్ళ కేవలం రచయితే కాదు , గొప్ప గాయకుడు కూడా. అతను వ్రాసిన ‘ మా కొద్దీ తెల్ల దొరతనం …. ” పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. తన కంచు కంఠంతో ఖంగున పాటలు కూడా పాడగలరు. గరెమెళ్ళ పాట విన్న బ్రిటీషు కలెక్టరు తెలుగుభాష నాకు రాకపోయినప్పటికీ, ఈ పాటలో ఎంతట మహత్తర శక్తి ఉందో , సామాన్య ప్రజల్ని సైతం ఎలా చైతన్యపర్చగలదో నేను ఊగించగలనన్నారట. ఆ పాటను వ్రాసినందుకు గరిమెళ్ళకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు. జైలు నుంచి విడుదల కాగానే ప్రజలు ఆయనకు ఎన్నోచోట్ల సన్మానాలు చేశారు.భోగరాజు పట్టాభిసీతారామయ్య ఆంగ్లంలో వ్రాసిన ‘ ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా’ అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. గరిమెళ్ళ జైలులో వుండగా 1923 జనవరిలో ఆయన తండ్రి చనిపోయాడు. క్షమాపణ చెబితే ఒదులుతామని చెప్పారట. కాని గరిమెళ్ళ క్షమాపణ చెప్పకుండా జైలులోనే వున్నాడు. అంతటి దేశ భక్తుడు ఆయన. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | గరిమెళ్ళ సత్యనారాయణ నా – జపాను |
సంగ్రహ నమూనా రచన | చీనా దేశము బహు విశాలమైనది . దాని విస్తీర్ణము 11 ,000 ,000 చదరపు మైళ్లు . వైశాల్యములో దీనికన్న కాస్త పెద్దది ఒక రష్యా మాత్రమే . జన సంఖ్యలో దీనికి ఈడైన దేశమే లేదు . చీనా జనాభా 450 ,000,000 అనగా ఐరోపా దేశాలన్నీ కలిపినా దీనికి సరి కావు . ఇంచుమించుగా బ్రిటిషు సామ్రాజ్యమంతా కలసిన యెంత వైశాల్యము , యెంత జనాభా వుండునో ఒక్క చైనాలోనే అంత వైశాల్యము , అంత జనాభా వున్నారు . |
గరిమెళ్ళ సత్యనారాయణ
నా – జపాను
ఉపోద్ఘాతము
చీనా దేశము బహు విశాలమైనది . దాని విస్తీర్ణము 11 ,000 ,000 చదరపు మైళ్లు . వైశాల్యములో దీనికన్న కాస్త పెద్దది ఒక రష్యా మాత్రమే . జన సంఖ్యలో దీనికి ఈడైన దేశమే లేదు . చీనా జనాభా 450 ,000,000 అనగా ఐరోపా దేశాలన్నీ కలిపినా దీనికి సరి కావు . ఇంచుమించుగా బ్రిటిషు సామ్రాజ్యమంతా కలసిన యెంత వైశాల్యము , యెంత జనాభా వుండునో ఒక్క చైనాలోనే అంత వైశాల్యము , అంత జనాభా వున్నారు .
చీనా సభ్యత , విజ్ఞానము , ఉత్పత్తి , వాణిజ్యము మొదలైనవి నిన్నటివి , నేటివి కావు . 5000 సంవత్సరముల క్రిందటనే ఇది అనన్య సామాన్యఖ్యాతి గాంచినది . గ్రంధములు , పాండిత్యము మాట తరువాత చూతము . తుపాకీ ముందు నావికా దిగ్దర్శ్గని . కాగితములు , ముద్రణము మొదలగు నవ నాగరిక పరికరములు కూడా ఐరోపీయులకు కంటే కొన్ని వేల యేండ్ల ముందర నుండియే చీనా వారికి తెలిసి యుండెనట .
ఎన్ని యుండిననేమి , ప్రాచీన విశాల దేశముల కెల్ల యెట్టి గతి పట్టినదో చీనాకును అట్టి గతియే పట్టినది . నవనాగరికత , యంత్ర పటిమ , సైనిక శిక్షణము ,నౌకా నిర్మాణము , వాణిజ్య కౌశల్యము మొదలగు వలలును పన్ని చీనా ఇండియాల వంటి దేశములను పిండుకొని తినగల శక్తి చిన్న చిన్న చీలిక దేశములకు కలిగినది . ఈ మహా ఖండముల వైశాల్యమే నేడు వీనికి ముప్పు అయినది . వీణి జన బాహుళ్యమే వీణి బలహీనతకు కారణమైనది . ప్రాచీన విజ్ఞాన స్మృతియే నవ నాగరికత యొక్క కుండుటకు హేతువైనది . ఈ దేశములు రెండును వర్దిల్ల వలెనంటే ఇవి చిన్న చిన్న రాష్ట్రములుగ చీలి , జాతులు జాతులుగా తూలి , ప్రాతి పద్ధతులను మరచి , క్రొత్త సంఘటనమును మరగి పశ్చము దృష్టిలో విజ్రుంభించక తప్పునా యనిపించును . ఈ పనికై ఇవి పూనుకోనన్నినాళ్లు వీనిని గ్రహించుచున్న విదేశ దాస్యము వీనికి తప్పదు .
బ్రిటీషు ప్రభుత్వము హిందూ దేశమునకు ఈశ్వర విలాసమనియు vara ప్రసాదమనియు మిత వాడులెల్లరును పొగడుచుందురు . ఒక్క అర్ధములో మాత్రమే ఇది సత్యము కావచ్చును . చీనా దేశము స్వతంత్ర దేశమును వెర బరగుచున్నది గనుక దానిని పిండుకొని పెక్కు దేశములు వర్ధిల్లుచుండగా మనము ఒక్క బ్రిటీషు వారి బారిలో మాత్రమే ఉన్నాము . చీనాను వివిధ దేశములు వాణిజ్యము , వాణిజ్య సౌకర్యములు అను పేరులతో మాత్రమే పీకుచున్నవి కాని , మనము బ్రిటీషు వారికి వలసిన వాణిజ్య సౌకర్యము లన్నియును మాత్రమే కాక మనల నొంచుచున్న ప్రభుత్వ వ్యయమునకగు భారము నెల్ల వహించవలసి వచ్చుచున్నది . చీనాకు ఆర్ధిక దాస్యమే కాని రాజకీయ దాస్యము లేనందు వలన అక్కడ స్వాతంత్ర్యోద్యమ ములేచి , సేనలను తయారు చేసి , విదేశ స్వదేశ శత్రువుల నెదిరించుటకు తగిన అవకాశములు కనిపించుచున్నవి . కాని మన రాజకీయ దాస్యము మనలను నిర్వీర్యులను , నిరాయుధుల , నిరుద్యోగులుగ జేసినదిగనుక సాత్విక నిరోధము , సత్యపధము , సర్వ సహనములే , మనకు శరణ్య ములగుచున్నవి . చీనా తనను పీదిన్చుచున్న విదేశపు శక్తుల నొకదాని మీదికి వేరొక దానిని లేపి ఆడించు దామని ప్రయత్నించుచున్నది కాని పది మంది బలవంతుల ఆమధ్య నిలిచిన ఒక్క బక్క వానినివలె కాని ఆటలు సాగకున్నవి . మనకు బ్రిటీషు వారి సుహృద్భావమో ఈశ్వరుని విలాసమో తప్ప అన్య విధముల స్వరాజ్యము లభించు మార్గము కానరాకున్నది .
అయినను చీనాకును మనకును కొన్ని సామాన్య పోలికలు ఉన్నవి . రెండును విశాల వ్యవసాయక దేశములు . రెండిటి యందును యంత్ర పరిశ్రమ లిప్పుడిప్పుడే తల యెత్తుచున్నవి . రెండును పాశ్చాత్య సంత్పి పాకెరలై శల్యములుగా చేయబడినవి . రెండును తెప్పిరిల్లుటకై తన్నుకొనుచున్నవి. రెండింటికిని పాశ్చాత్య వాసనలు నచ్చినవి . ప్రాత పద్ధతులను కూలదన్ని క్రొత్త విధానములకు పూనకున్నచో ఈ దారిద్ర్యము పోదు .ఈ దాస్యమునశించదు , ఐక్యమత్యముకుదరదు , ఐశ్వరయము లభించదు అని నిశ్చయము చేసుకున్నవి . రెండింటి యందును పట్టణములు యంత్ర పరిశ్రములును తల యెత్తినవి . కొన్ని స్వదేశీ పెట్టు బడుదారులవి , మరికొన్ని విదేశీ కంపెనీల వారివి .
ఫ్యాక్టరీలు యెవ్వరివైనను , కార్మికుల నోళ్ళలో కరక్కాయే , విని యోజకుల నెత్తికి దెబ్బలే , ఒక్క పూంజీదారుల యొడులలో మాత్రమే అనంతమైన లాభములు . ఆధునిక నగరములు , యంత్రములు , ఉత్పత్తి , లాభములు అవతల ప్రారంభించగానే , ఇవతల కార్మిక సంఘములు యొక్క వకూలి తక్కువ గంటలకై డిమాండులు , సమ్మెలు , కార్మిక రాజ్య స్థాపనకై ప్రయత్నములు , సాంఘిక తత్వ బోధనలు వేణు వెంటనే రాకమానవు . కార్మిక ప్రబోధముతో కర్షక ప్రబోధము కూడా వెంటనే కలుగును . బీడు భూములన్నీ సాగు కావలేననీ , మంచి యెరువులు వేయ వలెననీ , భారీమీద యంత్ర పద్ధతులతో వ్యవసాయము చేయవలేననీ , కష్ట పడిన వారికే ఫలమంతా దక్కవలెననీ , సోమరిపోతు భూస్వాములను అణిచి వేయవలెననీ రైతు రాజ్యం స్థాపించ వలెననీ ఆందోళన బయలు దేరుతుంది . కర్షక కార్మికు లేకము కాకుంటే వారికష్టములు తీరవని వారికి నిశ్చయం కలుగుతుంది . రాజకీయంగా ఆర్ధికంగా , సాంఘికంగా , అవసరమైతే సైనికంగా ఇరువురున్నూ ఒక్కటే తరగతియై మరియొక భూమి మీద లేకుండా పోయే వరకూ పోరాడుతారు . రష్యాలో సోవియటు రాజ్య మట్టిది . చీనాలో దినదిన ప్రవర్ధ మానగుచున్న కమ్యూనిష్టు పార్టీ ప్రయత్నము లారీతి గానే పరిణమించుచున్నవి . మన దేశము నందలి సాఘిక తత్వ ప్రచారమును ఈదెసకే పరుగిడు చున్నది . దీని నెదిరించుటకై అనేక ఫ్యాసిష్టు ప్రయత్నములు లేచును ; కాని వానికి అర్దాయున్నే కాని పూర్ణా యుర్దాయము దక్కదు .
రచన : గరిమెళ్ళ సత్యనారాయణ
———–