జిడ్డు కృష్ణమూర్తి (Jiddu Krishnamurthy)

Share
పేరు (ఆంగ్లం)Jiddu Krishnamurthy
పేరు (తెలుగు)జిడ్డు కృష్ణమూర్తి
కలం పేరు
తల్లిపేరుసంజీవమ్మ
తండ్రి పేరుజిడ్డు నారాయణయ్య,
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ5/12/1895
మరణం2/17/1986
పుట్టిన ఊరుఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లె
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకృష్ణమూర్తి తత్వం-పరిచయ సంపుటం.
శ్రీలంక సంభాషణలు.
గతం నుండి విముక్తి
ఈ విషయమై ఆలోచించండి(1991)
ముందున్న జీవితం
ధ్యానం
విద్య, అందు జీవితమునకుగల ప్రాధాన్యత
మన జీవితాలు-జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు
స్వీయజ్ఞానం
స్వేచ్ఛ (ఆది లోనూ-అంతంలోనూ)
నీవే ప్రపంచం-జె.కృష్ణమూర్తి
గరుడయానం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికజిడ్డు కృష్ణ మూర్తి
అనాది స్రోతస్సు (A Timeless Spring )
సంగ్రహ నమూనా రచనసూర్యోదయాన్ని , సూర్యాస్తమయాన్ని విస్మయపరిచే వాటి రంగులను మీరెప్పుడయినా గమనించారా ? నీటిపై ప్రతిబింబించే కాంతులను , పడవలోని బెస్త వారిని , ఆకాశంలో ఎత్తున గుండ్రంగా తిరుగుతున్న రాబందుల్ని , చెట్లలోని చిన్ని పక్షులను , ఒక్క ఆకు పైనే ఎరుస్తున్న ప్రాతః కాల భానుణ్ణి మీరు గమనిస్తారా ? వీటిని మీరు చూస్తారా ?” చూడడం అసాధారణ విషయాలలో ఒకటని తెలుసుకోండి .” చంద్రుడసలు లేనప్పటి ఆకాశాన్ని గాని , కేవలం ఒక వెండితునకలాగా ఆకాశంలో వేలాడుతున్నప్పుడు గాని నిజంగా మీరు చూస్తుంటారా ? మురికినీ , మాలిన్యాన్నీ , పేదల హీనస్థితినీ చూస్తారా ?!

జిడ్డు కృష్ణ మూర్తి
అనాది స్రోతస్సు (A Timeless Spring )

సూర్యోదయాన్ని , సూర్యాస్తమయాన్ని విస్మయపరిచే వాటి రంగులను మీరెప్పుడయినా గమనించారా ? నీటిపై ప్రతిబింబించే కాంతులను , పడవలోని బెస్త వారిని , ఆకాశంలో ఎత్తున గుండ్రంగా తిరుగుతున్న రాబందుల్ని , చెట్లలోని చిన్ని పక్షులను , ఒక్క ఆకు పైనే ఎరుస్తున్న ప్రాతః కాల భానుణ్ణి మీరు గమనిస్తారా ? వీటిని మీరు చూస్తారా ?” చూడడం అసాధారణ విషయాలలో ఒకటని తెలుసుకోండి .” చంద్రుడసలు లేనప్పటి ఆకాశాన్ని గాని , కేవలం ఒక వెండితునకలాగా ఆకాశంలో వేలాడుతున్నప్పుడు గాని నిజంగా మీరు చూస్తుంటారా ? మురికినీ , మాలిన్యాన్నీ , పేదల హీనస్థితినీ చూస్తారా ?! మనుషులేలా మాట్లాడేది , ఎలా నడిచేది , ఎటువంటి బట్టలు వేసుకునేది , వారి మర్యాద మన్ననలు , వారి కాఠిన్యం , మృదు స్వభావం , నిజంగా పట్టించుకుంటున్నారో , ఏదో తెచ్చి పెట్టుకున్న మర్యాదో మనం చూస్తూ తెలుసుకోవచ్చు . ఎలా చూడాలో , ఎలా పరిశీలించాలో , ఎలా వినాలో తెలియనప్పుడు జీవితంలో ఎప్పటికీ దేన్నీ గురించీ నిజమయిన శ్రద్ధ చూపలేము .
శ్రద్ధ చూపడమంటే ఏమిటో మీకు తెలుసా ? ఒక పెంపుడు జంతువును బాగా చూడడంలో , మీ బట్టల్ని సక్రమంగా ఉంచుకోవడంతో , స్నానం చేసి మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో శ్రద్ధ ఉండడం . తోటలో ఓ మొక్కను నాటి ఉంటే అది ఎక్కడ పెరుగుతున్నదో ఆ నేలలో ఎరువు వేయాలి . వర్షం లేనప్పుడు నిత్యం నీళ్లు పోయాలి . కుక్క ఉంటే దాన్ని శుభ్రంగా దువ్వాలి . సరైన ఆహారాన్నివ్వాలి . బయట నడకకు తీసుకు వెళ్లాలి . ఏ జబ్బూ లేకుండా చూడాలి . శ్రద్ధ చూపడం అంటే ఇవన్నీ చేయడానికి అంటే మనషుల పట్ల , జంతువుల పట్ల , మొక్కల పట్ల , వస్తువుల పట్ల స్పందన ఉండడం . శ్రద్ధ అంటే ప్రేమ అంటున్న ఆ లోతైన దానిలో నిజంగా ఒక భాగం . చిన్న చిన్న విషయాల పట్ల శ్రద్ధ చూపడంలో ఇది ఆరంభమవుతుంది .
మీ చుట్టూ ఉన్న ప్రతి దాన్నీ – అంటే పక్షుల్ని , చెట్లను , పేదవారిని , మురికి రోడ్లను , ఆశ్రయం లేని ఆవులను , ఆకలితో జబ్బుతో ఉన్న కుక్కల్ని పరిశీలించకపోతే మీరు ప్రజ్ఞావంతంగా ఉండలేరు . వీటన్నిటినీ మీరు పరిశీలించకపోతే మిగిలిన వాళ్లు ఎలా పెరిగి పెద్దయ్యారో అలాగే హృదయంలో ప్రేమ లేకుండా పెరుగుతారు . చాలా మంది తమకు తాము మాత్రమే కేంద్ర స్థానాలు , వారి చింత అంతా వాళ్ల గురించే . వారి డబ్బు , హోదా , అధికారం , వారి వారి విజయాలలోనే పూర్తిగా మునిగిపోయి ఉంటారు . వాళ్ల ఆశయాలలో , వాళ్ల గురువులలో , వాళ్ల దేవుళ్లలో , వాళ్ల రక్షకులతో మునిగిపోయి ఉంటాడు . అంతకు మించి వారిలో ఏమీ ఉండదు . వాళ్లకు ఆస్తి చాలా ఉండొచ్చు . పెద్ద బిరుడులుండొచ్చు . అంతరంగంలో వాళ్ల కేమీ ఉండదు . ఎందుకంటే ఎలా చూడాలో వాళ్లకు తెలియదు . నేనిది గట్టిగా చెప్తున్న మాట .
అందుకని మీరు చూసి తీరాలి . చూడండి . పరిశీలించండి . విమర్శించ వద్దు . పోల్చ వద్దు . ఇది ‘మంచిది అది చెడ్డది ‘ అని గాని ‘ఇది సరయింది , అది కాదు ‘ అని గాని చెప్పొద్దు . మీరెలా నడుస్తారో , ఎంత సిగ్గుపడతారో , నిరుత్సాహంగా ఉంటారో పరిశీలించండి . చిన్న వాళ్ళతో పెద్ద వాళ్లు , మీతో మీ ఉపాధ్యాయులు ఎలా ప్రవర్తించే వారో , మీరందుకు ఎలా ప్రతి స్పదించేదీ పరిశీలించండి . జీవితంలో ప్రతిదాన్ని ఊరకే గమనించండి . గమనించండి , అసాధారణమైన విషయం . గమనింపు లోనుంచి ప్రజ్ఞ ఉదయిస్తుంది . గమనించడమె లాగో తెలిస్తే తత్వం , మతం వంటి వాటిని గురించి క్లిష్టమైన పుస్తకాలు చదవనక్కరలేదు . ఎలా చూడాలో , ఎలా వినాలో , ఎలా మాట్లాడాలో తెలిస్తే అదంతా మీ కళ్ళలోనే , చెవులలోనే , మీ నాలుక మీదనే ఉన్నాడని అర్ధమవుతుంది .
మనుషులంటే నిజమైన ఆప్యాయత ఉన్నప్పుడు చూడడం , వినడమే గాక వాళ్ల గురించి పట్టించుకోవాలి . మీరసలు ఎవరి గురించైనా పట్టించుకుంటారా ? మీ తల్లి దండ్రులను లక్ష్య పెడుతున్నారా ? మీ తల్లిదండ్రులకు మీ పట్ల శ్రద్ధ ఉన్నదా ? శ్రద్ధగా ఉండడమంటే ఇతరులను బాగా చూసుకోవడం , దయగా ఉండడం , వారి పట్ల క్రూరంగా ప్రవర్తించకుండా చూసుకోవడం . మీరు సారిగా చూడకపోయినా , పరిశీలించకపోయినా ఎవరి పట్లా మీకు లక్ష్యం లేదన్నమాట .
పరిశీలించడమనే ఈ మొత్తం ప్రశ్నలోకి వెళ్ళ నారంభిస్తే మీరు నిజంగా పరిశీలించలేక పోతుండడం తెలుసుకుంటారు . ఒక ప్రమాదం జరిగిందనుకోండి. అక్కడ చాలా మంది సాక్షులున్నారు . చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రకంగా ఆ ప్రమాదాన్ని వర్ణిస్తారు . ఈ సాక్షులు చెప్పిన మాటలు ఒక్కొక్కరివి ఒక్కొక్కరకంగా ఉంటాయి . ఎందుకంటె అక్కడ నిజంగా జరుగుతున్నదేమిటో అసలెవరూ పరిశీలించరు . ఈ ప్రయోగం మీరు చేస్తే ఉన్న వాటిని ఉన్నట్లుగా చూడడం నిజానికి ఎంత కష్టమయిందో తెలుస్తుంది . అవి ఎలా ఉండాలని మీరనుకుంటారో అలా చూడడం గాదు . వికారంగా ఉన్న వాటిని అనడంగా ఉంటె బాగుండును అనుకుంటారు . వీధిలో అసహ్యంగా ఉన్న వాటిని అంటే అడుక్కునే భిక్ష గాండ్రునూ మీరు చూడాలనే అనుకోరు . కళ్ళు మూసుకోరేమో గాని వాళ్లను చూడరు . ఎక్కడో చూస్తారు . పారిపోతారు .
ప్రతి దానిని ఉన్నది ఉన్నట్లుగా చూడడం ఒక కళ . లెక్కలు , చరిత్ర , భూగోళ శాస్త్రం నేర్చుకోవడం ఎంత కష్టమో ఉన్న వాటిని ఉన్నట్లుగా చూడడం అంతే కష్టం . బయట నడుస్తూ వెళ్తున్నప్పుడు పేదల ఆశుభ్రతను , దైన్యాన్ని , రోడ్డు మీది బురదను , జబ్బు చేసిన కుక్కలను చూడరు .
ఇదంతా చూడడం ఆరంభించి ఉంటె ఏదో ఒకటి చేయకుండా ఉండరు . అదే చూడడంలోనే అందం , చూడడమే చేయడం . నిజంగా చూస్తే , పరిశీలిస్తే , వింటే సరయినది ఏదో చేయకుండా ఉండలేరు . అయితే మనలో చాలా మందిమి గుడ్డి వాళ్లం , చెవిటి వాళ్లం గాబట్టి ఏమీ చెయ్యం . ఏమైనా చేసినప్పటికీ అది ఒక ఊహా ప్రకారం చేస్తాం గానిక ఆ ఊహకు , ఆ చర్యకు మధ్య గూడా సంఘర్షణకు ఉంటుంది . చూడడం , వినడం ఆరంభించి ఉంటె ఆ చూడడం నుండే , ఆ వినడం నుండే దానికి తగిన చర్య జరుగుతుంది .
ఒక రోజున , కొన్ని మాసాల కిందట , నేను స్విట్జర్లాండులో ఉన్నప్పుడు ఒక మిత్రునితో పాటు కారులో వెళ్తున్నాను . మా ముందు ఒక అమ్మాయి సైకిలు మీద వెళ్తూ అకస్మాత్తుగా దిగి సైకిలు తోసుకుంటూ నడుస్తున్నది . ఎందుకా అని గమనిస్తున్నాను . రోడ్డు మీద ఉన్న ఒక కాగితం ముక్కను తీసి దగ్గరలో ఉన్న చెత్త కుండీలో వేసి , మళ్లీ సైకిలెక్కి వెళ్లిపోయింది . నేను చెప్తున్న దానిలో ఉన్న ప్రాధాన్యత మీ కర్ధమయిందా ? ఆ చిన్న పాపకు అలా చేయమని ఎవరూ చెప్పలేదు . రోడ్డును శుభ్రంగా ఉంచాలన్న భావంలో రోడ్డు మీద పది ఉన్న కాగితం ముక్కను చూసినప్పుడు దాని ఎత్తి వేసింది . ఆ ప్రాంతాన్ని అందంగా ఉంచాలన్న స్వాభావిక భావమది .
మీరు గనుక చూస్తే , పరిశీలిస్తే , వింటే అప్పుడు తక్షణమే క్రియ జరుగుతుంది. పరిశీలించినప్పుడే విన్నప్పుడే చర్య తీసుకుంటారు . పరిశీలించాడమెలాగో , వినడమెలాగో మీకు తెలిస్తే ఉన్న దాన్నంతటినీ మీరు గ్రహిస్తారు . పరిశీలించడం , వినడం నిజానికి ఒకటేదంతా ఒకే పని , కాబట్టి మీ చుటూ ఉన్న వాటిని గురించి తెలుసుకోండి . అది సహజంగా మిమ్మల్ని సున్నితంగా చేస్తుంది . మీరు (అంటే మీ శరీరం , మీ మొత్తం అస్తిత్వం పూర్తి మెలకువతో – జీవంతో )తొణికిసలాడతారు .
దయచేసి మీరిక్కడి నుండి బయటకు వెళ్లినప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి ఇది ప్రయత్నించండి . పక్షులను , చెట్లను , ఆశుభ్రంగా ఉన్న వీధులను అన్నింటినీ చూడండి . మనుషులవంక చూడండి . మీ తల్లిదండ్రుల వంక , ఉపాధ్యాయుల వంక చూడండి . మీతో వారెలా మాట్లాడేదీ , ఏ మాటలు వాదేడీ చూడండి . వాళ్లను విమర్శించ వద్దు , ఎందుకంటే విమర్శను ఎవరూ ఇష్టపడరు . విమర్శించకుండా , అంచనా వేయకుండా , నిరపేక్షతో ఊరక గమనించండి . మీరిలా చేస్తున్నప్పుడు వాళ్లకు మీరు గమనించడం తెలుస్తుంది . దాని ప్రభావం వాళ్ల మీద చాలా ఎక్కువుగా ఉంటుంది . మరింత జాగ్రత్తగా ఉండడం , ఆశుభ్రతను , అశ్రద్ధను తగ్గించుకుంటూ ఉండడం ఆరంభిస్తారు . దాని ప్రభావం మీ మీద గూడా చాలా ఉంటుంది . రోజంతా మీరు పరిశీలిస్తూ వింటూ ఉంటే మీ శరీరం మీ మనసు ఎంతో సున్నితమవడం చూస్తారు . దానితో సహజమయిన క్రమశిక్షణలో ఉంటారు . క్రమశిక్షణ , సున్నితత్వం కలిసి ఉంటాయి . ఇవి చేయాలి మిగిలినవి చేయగూడదు అనుకుంటూ బలవంతంగా ఉండేవారు – ఉదాహరణకు ఉదయాన్నే త్వరగా లేచి వాళ్ల కిష్టం లేని పనులన్నీ చేస్తూ అదే క్రమశిక్షణనుకునే వారు – చాలా కఠినంగా ఉంటారు . కాని మీరు గమనిస్తూ , పరిశీలిస్తూ వింటూ ఉంటె స్వతస్సిద్ధంగా ఒత్తిడి లేకుండా అక్కడ ఒక క్రమాత , సమన్వయత ఒక క్రమశిక్షణ సంభవమవుతుంది.
ప్రపంచంలో శాంతి ఉండాలంటే మీలో మీరు శాంతిగా ఉండాలి . ఈ పోటీ ప్రపంచంలో ఆనందంగా జీవించడం కోసం ముందు మీరు పోటీపడడం ఆపాలి . పోటీ పడకుండా ఉండడం బహు కష్టమంటారు . చేస్తున్న పనిని ప్రేమించాక పోవడం వల్లనే అలా ఉంటుంది . మీ పనిని మీరు ప్రేమిస్తూంటే మీకంటే ముందుకు ఎవరెళ్ళారో మీ వెనక ఎవరున్నారో పట్టించుకోరు . మీ సామర్ధ్యాన్నంతా – అంటే మీ మనస్సును , హృదయాన్ని , మీ శరీరాన్ని అంతా – వెచ్చించి చేస్తారు .
ఎవరో ఒకరు చెప్పింది వినడం మీకు బాగా అలవాటయిపోయింది . మీ తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు చెప్తుంటారు . గురువులంతా చెప్తారు . ప్రజాభిప్రాయమూ చెప్తుంది . నిరంతరం ఏమి ఆలోచించాలో , ఏమి చేయాలో , వార్తా పత్రికలు , రేడియో , టెలి విజను అన్నీ ఎప్పుడూ చెప్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా ? మీరసలు ఆలోచించరు . ఎవరో ఒకరు అన్నీ ఆలోచించి పెడుతుంటారు . వాళ్ల ఆలోచనలను మాత్రలాగా మీరు మింగేస్తారు . వాటిని అర్ధం చేసుకున్నామని మీరనుకుంటారు . అయితే మీరలా అర్ధం చేసుకోరు .
మీ చిన్నతనంలో ఈ అసాధారణ ఊహా శక్తి ఉంటుంది . దాన్ని మీరు పెరుగుతున్నప్పుడు ఎందుకు పోగొట్టుకుంటారు ? నదిని చూస్తున్నప్పుడు ఆ పడవలో మీరున్నట్లు , భయంకర తుఫాను మధ్య తేలుతూ నది వైపు పోతున్నట్లు మిమ్మల్ని చిత్రించుకుంటారు . మీరేదో చరిత్ర చదువుతారు . దాని గురించి ఆలోచించేటప్పుడు ఎంతో కల్పితమయిన వాటిని ఊహిస్తారు . మేఘాన్ని చూస్తున్నప్పుడు మీకది ఒక మేడ . దాని మధ్యన మీరుంటారు . గాలి శబ్దం వింటే మీకు శ్రవణానందాన్ని కలిగించే సంగీతాన్ని విన్తున్నట్లుంటుంది . పెద్ద పక్షిని చూస్తుంటే దాని వీపు మీద కూర్చుని ప్రపంచమంతా చుట్టి వస్తున్నట్లు ఊహిస్తారు . చాలా డబ్బున్నట్లు , పేరున్నట్లు లేదా అందరూ విని మెచ్చుకునే అద్భుతమయిన వ్యక్తన్నట్లు , మిమ్మల్ని ఊహించుకుంటారు . మీ చిన్నతనంలో అద్భుతమైన ఈ ఊహాశక్తి ఉంటుంది . పెద్ద వారవుతున్న కొద్దీ అది పోతుంది . ఎందువల్ల ?
(ఆలోచించండి ).

రచన :జిడ్డు కృష్ణ మూర్తి
సేకరణ :అనాది స్రోతస్సు నుంచి ……………

———–

You may also like...