నారు నాగనార్య (Naaru Naganarya)

Share
పేరు (ఆంగ్లం)Naaru Naganarya
పేరు (తెలుగు)నారు నాగనార్య
కలం పేరు
తల్లిపేరుసుబ్బమ్మ
తండ్రి పేరునరసింహం
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ7/3/1903
మరణం1/18/1973
పుట్టిన ఊరువైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు సమీపంలో ఉన్న రాఘవరాజుపురం.
విద్యార్హతలు
వృత్తిప్రముఖ కవి, పండితుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువీరపూజ, శ్రీ పృథ్వీరాజవిజయము, తిలోత్తమాసాహసికము, మనువు పుట్టువు, మెచ్చులపచ్చ మ్రుచ్చిలి, శకుంతల, ఊర్వశి, వెన్నెల పెండ్లి, రామకథ,
ఉషారాజ్ఞి, ధ్యానమాలిని, ప్రణయిని, రమణాభ్యుదయము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలునారు నాగనార్య సాహితీవేత్త.ఈయన స్వాతంత్రప్రియుడు. 1921లో సహాయనిరాకరణోద్యములో పాల్గొన్నారు. పర్లపాడు సత్యాగ్రహాశ్రమములో నివసించి ఖద్దరు సేవ చేశారు. 1923,1947లలో సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు. 1949నుండి సాహిత్యంవైపు దృష్టి మరలించారు. ఇతనికి వైద్యవిద్యలో ప్రవేశం ఉంది. రమణమహర్షి పట్ల ఆకర్షితుడైనారు. ఇతనికి సంస్కృతాంధ్ర భాషలంటే అభిమానము. సుమారు 70 గ్రంథాలు రచించారు. ఏకధాటిగా వందలకొద్దీ పద్యాలను అల్లగలిగే శక్తి ఉంది. అచ్చతెలుగు పై ఎక్కువ మమకారము ఉన్నవారు. పెద్దన మనుచరిత్రను మనువుపుట్టువు అనే పేరుతోను, ముక్కు తిమ్మన పారిజాతాపహరణము ను మెచ్చులపచ్చమ్రుచ్చిలి అనే పేరుతోను అచ్చతెలుగులో అనువదించారు. ఇతని రచనలు గడియారం వేంకట శేషశాస్త్రి, జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ మొదలైన పండితుల మెప్పును పొందాయి.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనారు నాగనార్య
సాహిత్యసేవ
సంగ్రహ నమూనా రచనవీరికి సంస్కృతాంధ్రము అభిమాన భాషలు. వీరికి కవితా వేళము మెండు. ఏకధాటిగా వందలకొలది పద్యములనల్లెడి శక్తి. గలదు. వీరికి అచ్చతెనుగుపై అభిమానము మెండు. అందులకేవారి డెబ్బిదికృతులలో ఆ అచ్చతెనుగుకృతులు మేల్బంతులైనవి. భాషా భిరుచిగల వారికవి సరికొత్త విందులు. వీరు పెద్దన్నగారి మను చరితమును —”మనువుపట్టువు’ అను పేరను, ముక్కు తిమ్మనార్యుని పారిజాతాపహరణమును -“మెచ్చులపచ్చమ్రు చ్చిలి’ యను పేర సరి యగు యచ్చ తెనుగున రూపొందించిరి. తరువాత ఈ పోకడలోనే మరికొన్ని అచ్చతెనుగు కబ్బములు-శకుంతల, ఊశ్వశి, వెన్నెల పెండ్లి , రామకథలు వ్రాసిరి.

నారు నాగనార్య

సాహిత్యసేవ

వీరికి సంస్కృతాంధ్రము అభిమాన భాషలు. వీరికి కవితా వేళము మెండు. ఏకధాటిగా వందలకొలది పద్యములనల్లెడి శక్తి. గలదు. వీరికి అచ్చతెనుగుపై అభిమానము మెండు. అందులకేవారి డెబ్బిదికృతులలో ఆ అచ్చతెనుగుకృతులు మేల్బంతులైనవి. భాషా భిరుచిగల వారికవి సరికొత్త విందులు. వీరు పెద్దన్నగారి మను చరితమును —”మనువుపట్టువు’ అను పేరను, ముక్కు తిమ్మనార్యుని పారిజాతాపహరణమును -“మెచ్చులపచ్చమ్రు చ్చిలి’ యను పేర సరి యగు యచ్చ తెనుగున రూపొందించిరి. తరువాత ఈ పోకడలోనే మరికొన్ని అచ్చతెనుగు కబ్బములు-శకుంతల, ఊశ్వశి, వెన్నెల పెండ్లి , రామకథలు వ్రాసిరి.

గీ: నాయెడఁదఁ బొంగువాఱుచున్నది యయారె
తల్లి బాసగు తెనుఁగున కుల్ల మల
مهم నేమికానుకయిత్తుఁ గెం పెడఁదఁజీల్పఁ “
బొడము నెత్తురు పారాణి పూఁతఁదప్ప :
కం: పలువురు జదువని వ్రాఁతల
వలనన్ మేలేమి యంచుఁబలుకుట వినియున్
వలనొప్పఁ దల్లి బాసను
బలుకుట దప్పేమియంచు-వ్రాసితి దీనిన్
యని కవిగారు తమ అభిప్రాయమును ఆచ్చతెనుగు పారి జాతాపహరణమున తెలుపుకొనిరి. ఈ కృతినిగురించి మహాకవి శ్రీ గడియారము వేంకట శేషశాస్త్రిగారిట్ల వ్రాసిరి.


“———శ్రీ నాగనార్యుఁడు పల్లెలయందే నివసించి, అందలిజనులతో విశేష పరిచయము కలవాడైనందున, ప్రాచీన ప్రబంధముల క్షుణ్ణముగా చదివిన వాఁడైనందున, కావ్యజ్ఞ శిక్ష పొందిన వాడైనందున తనరచనకు నలసినంత పదజాలము సంత రింపఁగలిగినాఁడు. తక్కువపడిన దానిని స్పష్టించుకోఁ గలిగినాడు అన్నింటిని పులగడిగి రంగురేకలుదీర్చి మెఱుగులు దిద్ది అందమైన కావ్యశరీరము నిర్మించినాడు. ఈ చేయుటలో చేయివణకుటో, చూపు చెదరుటో, సంధికదలటో, బంధమువదలుటో యేదైన ఏమఱు పాటు జరిగియుండవచ్చును. అదియు గ్రొత్త కాదు. ఇంత కొత్త చేయుచున్నను కవిత సహజముగా సరళముగా కుంటువడక నడచినది. కథాకథనము, భావ చిత్రణము, అలంకార విన్యాసము, మున్నుగా కావ్యసంపద యంతయూ మూలమునకే చెందిన దైననూ తనకూర్పులో వానిని యథావిన్యాసముగా పొదుగుటయే యీతని నేర్పు. ఈ విధముగా ఈ నాటికవులలో నాగనార్యుడొక క్రొత్త దారితొక్కి కృతకృత్యుడైనాడు”

మచ్చునకుగొన్ని పద్యములు చూడుడు
మ: పనిపాటల్ విడియూరు నాడుఁ దిరుగన్ బాల్వద్ద బైరాగి పో
రనుతిండిన్ బ్రదుకంగలాడచటికాహా: వచ్చెనా! వచ్చియే
మనిచెప్పెన్ మనయందగాఁడు బదులేమందించెఁగన్డీటి రు
క్మిణి యేమాడెను డాఁప కంతయును గూర్మింబల్కరాదే:చెలీ!

కం: దాసానిరంగు చీరన్
బాసి, వెలఁది మడుఁగుఁగట్టి-పంచల సౌమ్ముల్
వేసి, కయిదమ్మిఁదునుకలు
సేసి, చెలికా-గొదుకు బ్రదుకు-జిడిముడిపడుచున్

కం : నీరున్న కాఱు మబ్బున
జేరిన రిక్కవలె ‘సత్య-చెలువంబణిపం
చారించి యలుకగీమున
దూరెను సకలలుగఁ జేయుదురుగచ: యిట్టల్
కడప మండలమున జరిగిన యొక ప్రాచీన విషయమునుగై కొని కవిగారు”వీరపూజ”యను పేనొక వీరుసోదంచిత కావ్యమును లిఖించిరి. ఇందు హైందవులకుఁ బ్రాచీనకాలము నుండియు సహజములుగ నుండు వీర్య శౌర్యౌదార్యములు చక్కగా వివరింపబడియున్నది. “శృంగార వీర కరుణాద్భుతాది రసములనెల్లను నలంకార శాస్త్రముగఁ జదివి యుదాహరణముల నెఱు – గుటకంటె నీ గ్రంధమునఁ జదువుట యే చాలును” అని శ్రీ జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మగారు తమ యమూల్యాభి పాయమును నుడిచిరి.
వీరపూజయందలి వీరవిహార మెట్లన్నదోకనుడు

శా: వాగర్ణంబులవోలె నిర్వరొకటై వై_రిత్రకాండింబును
ద్వేగాకంపిత దేహవల్లరులరీతిన్ స్వప్రతాపత్రియా
వేగోదీర్ణ బల ప్రభంజనతఁ గల్పింపకా సముద్దిష్ట దీ
క్షా గర్వంబునలేళ్లపైనుఱుకువ్యాఘ్రంబుల్ వలె-దూఁకినన్.

కం : బలవన్నాగవరంబేన్
జవిచీమల చేతఁజిక్కిచచ్చినయటలీ
బలియుఁడు మాచే సిలుఁగుల
గలఁగఁడె యిప్పడొంటి పాటు గదిసినకతనన్
మ: అనియు ప్పౌంగుతలంపులన్ బెనఁగు మిథ్యాపౌరు షోడేకసం
జలిత కోధ విఘూర్జనో త్థచటలోచ్చాయ క్రియన్ బ్రాజ్మనో
జనితాఖండజయేప్సితార్థ ఫలమిచ్చాస్పూర్తి నర్ధించి,మిం
చిన వేగంబున వీరుపైఁగవిసి నిస్త్రీంళోగ్ర ధారాహతిన్.
యుద్ధమెంత వీరోచితముగా జరిగినదో రచనయంతకుమించిన భావోద్రేకము తోడను, భావపుష్టితోడను, యర్థగాంభీర్యముతోడను పదగుంభనముతోడను సాగినదనుటలో యతిశయోక్తి లేదు. ఈ మండలమున వెలసిన రాణా ప్రతాపసింహ చరిత్రకు, శివభారతము నకే మాత్రము తీసిపోనిదీ వీరపూజ. ఒకే గద్దలో పుట్టిన బిడ్డలలో వీరావేశము అడ్డు లేక విహరించినదని గట్టిగా జెప్పవచ్చును. వీరి మరొక చారిత్రాత్మికమైన వీరరసకావ్యము శ్రీపృథ్వీరాజవిజయము

కం: అదియేమొ? వానికత్తికిఁ
బదునెక్కడనుండి యూడిపడెనో? శిరముల్
బదులును వందల వేలును
జిదగొదమై (తెళ్ళిపడుఁఖచిక్కనులోనన్

గీ: పిడుగు నడునట్లు దండుపైబడియవక్ర
విక్రమాటోపమున వైరి వీరసమితి
జొన్నతఱిగిన జెన్నూన సారిది నఱకి
వీడువడ రణతలమెల్లగాడుఁజేసె.
పై రెండును పృధ్వీరాజవిజయమంద యుద్ధ ఘట్టమున జెప్పబడిన పద్యములు. కవిశేఖరులు నిజముగా వ్యవసాయదారులే. లేకున్న వారికి యుద్దవర్ణన చేయునప్పడుకూడా జొన్న చేనుల కోతపై నున్న ధ్యాస తప్పలేదు. ఇది స్వభావిక మేగదా!
వీర రసమునెంత చక్కగా వీరు పోషించిరో, అంతే చిక్కగా శృంగారమును సహితము మధించిరి. వీరి’తిలోత్తమాసాహసికము” ‘తిలోత్తమ’ఉషారాజ్ఞి -ధాన్యమాలిని-ప్రణయిని-యెన్నదగిన శృంగార కృతులు “మా పండితుడు, ముసలితనములో నప్సరసలతోడి సంబంధము నెందుకు పెట్టుకొన్నాడో ముసలి తనమును రెండవ బాల్యమన్నారు పెద్దలు-” అని ‘పుట్టపర్తి వారన్నమాటలో వింతలేదు. నిజముగా ముసలిప్రాయమున శృంగారముప్పొంగు ననుట తథ్యముదాని నీకవీశ్వరులు దృఢపరచిరి.

ఉ: గుత్తపు పట్టురైకబిగి కుట్లు పటుక్కునఁ బిక్కటిల్లి స్వా
యత్తము దప్పిపోఁబ్రిదిలి యబ్బుర పుబ్బగు గబ్బిగుబ్బలు
వ్వెత్తన నొత్తరించివలపింపఁగవుంగిటనించి పల్లకెం
పొత్తిలి మోవితేనెఁజవులూరఁగొనెన్”విధుఁ “డా“తిలోత్త మన్ ‘

ఇది ప్రాచీన కవుల ప్రబంధములందలి శృంగారమునకే మాత్రము తీసి పోలేదుకదా! ఇంత చక్కటి కవిత నెంతమంది కవి పుంగవులు వ్రాయగలరు? ఒక్కరో యిద్దరో తప్ప. కవియిట్టి వాడగుట చేతనే పలువురు వీరి కవిత్వమును ప్రశంసించిరి. శ్రీ జననుంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మగారు తక్కువ వారేమికాదు గదా! అట్టి మహనీయులీ కవినెట్ల పొగడిలో జూడుడు.

—-ఈ గ్రంథకర్త తెలుంగులోకమునకుఁ జిర పరిచితుఁడు. కడపమండలమున శ్రీ శేషాచల సమీపమునఁగల కోడూరు గామ వాస్తవ్యుడు . కుంజరనదీ సలిలపాన ప్రభావ సంజనిత దివ్యకవితామృతవాగ్విశారదుఁడయ్యు శ్రీవేంకటాచలదివ్య పర్వతసాను విలసిత మహోషధీ పరిపూత మలయమారుతసేవా సంప్రాప్త సారస్వత రస పరిపూర్ణడు నారునాగనార్యాభిధానుఁడు, సహజకవితావిచక్షణుడు. ఆర్య వాణీ రచయిత – దేశ సేవా గ్రగణ్యుఁడు. స్వాతంత్ర్య ప్రియుడు. లోకోప కారని కతుడు. దేశాభిమాని. వైద్యవిద్వరుఁడు. దేవ బ్రాహ్మణ గురుజన భక్తియుక్తుడు. సుకవిత్వలంపటుఁడు. లోకక్లే శాసహిష్ణువు. ఇట్టి సుగుణంబు లెన్నియేనిగలవాడు. ఈ మాటలు స్త్పుతి పాఠములు కావనియు, సహజములనియు, దత్త్వవిదులూహింపక మానరని నా విశ్వా సము.” (వీరపూజ-ఆశంసనమునుండి)
ఇంతకంటెను కావలసినదేమున్నది. కవిధన్యుడైనాడు. అతని జన్మకు సార్ధకతేర్పడినది. కవికావ్యముల కొక గొప్స్ విశిష్టతేర్పడి నది. బిరుదులు, సన్మానముల పై వాక్యముల ముందు దిగదుడుపే.

రాయసీమ రచయితల నుండి…..

———–

You may also like...