పేరు (ఆంగ్లం) | Nedunuri Gangadharam |
పేరు (తెలుగు) | నేదునూరి గంగాధరం |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 7/4/1904 |
మరణం | 3/11/1970 |
పుట్టిన ఊరు | రాజమండ్రి |
విద్యార్హతలు | – |
వృత్తి | ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | కొన్ని పాత పాటలు |
స్వీయ రచనలు | జవహర్ లాల్ నెహ్రూ సమగ్ర చరిత్ర శకునాలు గురించి శకునశాస్త్రము ను శాస్త్రీయ విషయాలతో గ్రంథస్తం చేశారు. |
ఇతర రచనలు | వేమన పద్యములు |
ఈ-పుస్తకాల వివరాలు | తెలుగు జీవనాడి |
పొందిన బిరుదులు / అవార్డులు | కవికోకిల, జానపద వాజ్మయోధ్ధారక |
ఇతర వివరాలు | నేదునూరి గంగాధరం జానపద సాహిత్యాన్ని ఉద్యమంగా నడిపిన ప్రముఖులు.చిన్ననాటి నుండి జానపద వాజ్మయ సేకరణ ఒక మహత్కార్యంగా భావించారు. దానిని ఎంతో ప్రయాసకోర్చి గ్రామగ్రామాలు తిరిగి జానపద గేయాలు, కథా గేయాలు, వీరగాథలు, జమిలి పదాలు, నోముల కథలు, పండుగ పాటలు, ఆటపాటలు, ప్రార్థన గేయాలు, వినోద గేయాలు, ఎక్కిరింత పాటలు, జంటపదాలు, జాతీయాలు, సామెతలు, కిటుకు మాటలు – లక్షల సంఖ్యలో సేకరించారు. వీనిలో కొన్ని 1953లో సంభవించిన గోదావరి వరదలలో కొట్టుకొనిపోయాయి. మిగిలినవాటినుండి మొదటగా సెలయేరు – జానపద గేయ సంకలనాన్ని 1955లొ దేశోద్ధారక గ్రంథమాల వారు ప్రచురించారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | నేదునూరి గంగాధరం సామెతలు – కథలు |
సంగ్రహ నమూనా రచన | కొల్లూరు పట్నంలో ఒక దేవుడు వెలిశాడు. ఆ దేవుడిలో ఒక తమాషా అయిన మహత్తు వుంది. (ఆ వూళ్లోనే కొహినూరు వజ్రం వెలిసింది) ప్రతి మనుజుడు ధాన్యాన్ని తన మూత్రంతో తడిపి, ఆ దేవతా విగ్రహంపై వేస్తే ఆ ధాన్యం గింజలు రత్నాలై, రవ్వలవులవుతూ ఉండేవట. ఊరి వారందరూ ఆ క్రియను చేసూ మేడలు కట్టుకొని, భాగ్యంతో తులతూగు తున్నారట. ఆ వూళ్లో ఒక బీద బాపనయ్య వుండేవాడట. అందరివలె నీవును చేసి, ముఖపడరాదా?’ అని అతని పెళ్ళాం తొందర పెట్టేదట. ఏమైనా కానీ, నేనా తుచ్చపు పనిచేసి దేవునకు అపచారం చేయును’ అని ఆ బ్రాహ్మణుడనేవాడట. |
నేదునూరి గంగాధరం
సామెతలు – కథలు
“కొల్లూరు పట్నమువలె వెలిగిపోయింది’ సామెత
కొల్లూరు పట్నంలో ఒక దేవుడు వెలిశాడు. ఆ దేవుడిలో ఒక తమాషా అయిన మహత్తు వుంది. (ఆ వూళ్లోనే కొహినూరు వజ్రం వెలిసింది) ప్రతి మనుజుడు ధాన్యాన్ని
తన మూత్రంతో తడిపి, ఆ దేవతా విగ్రహంపై వేస్తే ఆ ధాన్యం గింజలు రత్నాలై, రవ్వలవులవుతూ ఉండేవట.
ఊరి వారందరూ ఆ క్రియను చేసూ మేడలు కట్టుకొని, భాగ్యంతో తులతూగు తున్నారట. ఆ వూళ్లో ఒక బీద బాపనయ్య వుండేవాడట. అందరివలె నీవును చేసి, ముఖపడరాదా?’ అని అతని పెళ్ళాం తొందర పెట్టేదట. ఏమైనా కానీ, నేనా తుచ్చపు పనిచేసి దేవునకు అపచారం చేయును’ అని ఆ బ్రాహ్మణుడనేవాడట.
ఒకనాటి మధ్యరాత్రి మరొక ముసలి బ్రాహ్మణుడు ఈ బీద బ్రాహ్మణుని కుటుంబ సహితంగా పట్టణం బయటకు పిలుచుకొని పోయి. ‘భక్తుడా, ఇదిగో కొల్లూరు పట్టణ వైభవం చూడు అని ధగధగా వుండుతూవున్న పట్టణాన్ని చూపించేడుట. బీద బ్రాహ్మణుడు ఆయనకు నమస్కరించగా ఆయన దీవిస్తూ మాయమైపోయాడట.
ఈ కథ నిజముగా వజ్రాల గనికి సంబంధించినట్లు కనబడుతుంది.
పిట్ట కథలు
“ఆయన బ్రతికుంటే మంగలినే పిలుచుకొచ్చును”
ఒక బోడితల వెధవరాలు క్షౌరం చేయించుకొనుటకు మంగలి కొరకై యెంతసేపు చూచినను, అతడా దారిని రాలేదట. పిలుచుకొనివచ్చుటకింట నెవరూ లేకుండుట చేతమిక్కిలి విచారపడుతూ ఆయన బ్రతికుంటే మంగలిని పిలుచుకొని వచ్చును గదా అనుచు కళ్ళనీళ్ళు పెట్టుకుందిట. ఆయన బ్రతికుంటే మంగలెందుకు?
శుద్ధ వెణ్ణిముండా కొడుకు
పరమానందయ్య గారికి కాలిలో ముల్లు విరగగా వారది తీసికొనుటకై ఒక సూదిని తెమ్మని తమ శిష్యులను పంపేరట. అంతట వారందరూ కూడి దుకాణానికిపోయి, ఒక
అందరును మెప్పపొందే ఉద్దేశంతో, దానినొక దూలానికి గ్రుచ్చి, మోసుకొని తెస్తూ వుండగా, ఒక వేశ్య త్రోవలో వారికెదురుపడి, సంగతి అడిగి తెలిసికొని, వారికి దండం పెట్టిందట. ఆ దండం యెవరికి పెట్టినది నిశ్చయించుకోజాలక వారొక రొకరితో తగవులాడుకొని, వెనుకకు తిరిగి వచ్చి వేశ్యను కలిసికొని అమ్మీ నీవు మాలో యెవరికి దండం పెట్టితివి’ అని అడుగగా, ఆమె వారి తెలివికి సంతసించి మీలో యెవరు శుద్ధ వెణ్ణి ముండా కొడుకో
వానికి దండంపెట్టితిని అని జవాబిచ్చిందంట. అంతట ఆ బిరుదునకు తగిన వాడనను నేను నేనని వారు సిగపట్టుకొని, ఆ గడబిడలో సూదిని పారవేసి, వట్టినే గురువుగారి దగ్గరకు వచ్చారు.’
డాక్టరు సలహా
తన పెళ్లాం ఎలుక పిల్లను మ్రింగినదని ఎంతో పరితాపం పడుచూ డాక్టర్ గారి వద్దకు పోయి, మందిమ్మని వెంకయ్య మొరపెట్టుకొనగా పరుగెత్తుకొనిపోయి, ఒకపిల్లికూనను మ్రింగించుమని డాక్టరుగారు సలహా ఇచ్చారట.
టక్కరికి పై టక్కరి
కోటయ్య కుక్కపిల్లను వెంటబెట్టుకొని పోతూ వుండగా, డబ్బిచ్చి తాబేలును కొని, తీసుకుపోతూ వున్న టక్కరి తాతయ్య ఎదురిపడి కోటయ్యూ, కోటయ్యూ, ఈ తాబేటి నోటిలో వేలు పెట్టవోయి, నీకొక తమాషా చూపిస్తాను’ అని పలికాడు. అమ్మయ్యో నేను వేలుపెట్టను, నా కుక్కపిల్ల తోక పెట్టి, తమాషా చూపించు అని కోటయ్య బదులు చెప్పాడు. సరే అంటే సరే అనుకొని వారిద్దరు కుక్క పిల్ల తోకను తాబేటి నోటిలో పెల్హార అంతట ఆ తోకను తాబేలు గట్టిగా కరచి వుండగా, కుక్క పిల్ల ఒకటే పరుగున ఉడాము తీస్తూ పోతూంటే, అయ్యయ్యో! కోటయ్యూ కుక్క పిల్లను పిలవవోయి.. నా తాబేలును ఈడ్చుకుపోతూ వుంది’ అంటూ తాతయ్య బ్రతిమాలకొనగా పోవోయి, తాతయ్య కావలిస్తే నీ తాబేటిని నీవు పిలుచుకో’ అంటూ కోటయ్య జవాబు చెప్పేడు.
తిండిపోతు గురు శిష్యులు
ఒక భూరి సంతర్పణలో ఒక బ్రాహ్మణుడు కడుపునిండా తిని, వంగి వెతుకుకొనలేక శిష్యుని పిలిచి శిష్యా నా పాదరక్షలెక్కడున్నవో చూడరా’ అని చెప్పగా, శిష్యుడు కూడా వంగలేక, పైకి చూస్తూ, నక్షత్రమండలం ఈ మధ్య లేవు’ అని జవాబు చెప్పేడు. అది విని గురువు, ఛీ ఛీ , భ్రష్టా, తలవంచి క్రిందవెదకరా’ అని కోపగించగా తమకంటే తక్కువ తిన్న రండాకొడుకెవ్వడు’ అని శిష్యుడుత్తరమిచ్చాడు.
తిండిపోతు
ఒక తిండిపోతు బ్రాహ్మణుడు పొట్టనిండా తిని వీధి అరుగుపై పరుండి దొర్లుచూ, పొట్ట నొక్కుకొనుచూ, బాధపడుతూ వుంటే . తల్లి వచ్చి ఒరేయ్ నాయునా, రెండు వామ్మ పరకలు తెస్తాను, తింటావా?’ అని అడుగగా దానికాతడు నవ్వుకొని, అమ్మా, వాము పరకకు సందేవుంటే, ఇంకా రెండు బొబ్బట్లే దూర్చక వుండేవాడనా? అన్నాడట.
దౌర్భాగ్యుడు
అబ్బురాన మీసాలు వస్తే, అబ్చిగాడు అరవై గడియల ఎగా దిగా రెండు చేతులా మెలివేయడం ప్రారంభించాడు. అంతట ఆ నాలుగు పరకాలూ రాలిపోగా, వట్టి మూత్రికి
ఒక చెయ్యి చాలునని రెండవ చేత్తో తలగోక్కొన్నాడట.
పరమ నీచుల లక్షణాలు
ఆడది తనవంక చూచినంత మాత్రముననే తనను వలచినదని తలచుట – తనయేండ్లు తక్కువ చెప్పకొని, తాను చిన్నవాడనని తానే నమ్ముట – తనకు రాని విద్య వచ్చినట్లు నటించుట – తన భార్య గుణములను తానే వర్ణించి, ఇతరులు నమ్మిరని సంతోషించుట – తనకు మేలు చేసిన వారిని నిష్కారణముగా చాటున దూషించుట, నూరు గడించక నన్నూరు గడించినట్లు చెప్పకొనుచు తనకు మించిన వేసములు వేయుట – పిలువనిదే పెండ్లి భోజనమునకు పోవుట – బురద గుంటలో స్నానము చేయుచు, పన్నీటను స్నానాలు చేయుచున్నట్లు చెప్పకొనుట – మెడబెట్టి గెంటినను చూరు బట్టుకొని వ్రేలాడుట.
వేదాంతం
వారికి వీరు, వీరికి వారూ తల ఆడించుచూ, వారు చెప్పనది వీరికిగాని, వీరు చెప్పనది
వారికిగాని, తెలియక తెలియునట్లు నటించుచు, ఎవరు చెప్పినది వారికి కూడా తెలియుని పక్షమున – దానికి వేదాంతముని పేరు.
జాణతనము
కొట్టినా తిట్టినా ఊరుకో , విడువకుండా కండ్ల నీరు పెట్టుకొని ఏడుస్తూ ఉండు , నీ మగడెంత గట్టి వాడైనా దుర్మారకైనా-ముక్కోపియైనా – ఎంత పౌరుషవంతుడైనా చిట్టచివరికి తానే వచ్చి నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుకొంటాడు .
ఆడవారి యేడుపు యేడు రాజ్యాలు జయిస్తుంది
కొట్టినా తిట్టినా వూరుకో, ఎంత సేపటికీ కండ్ల నీరు కారుస్తూ యేడుస్తూ వుండ-నీ మగడు యెంత గట్టివాడైనా, ఎంత ముక్కోపి వాడైనా సరే ఎంత దుర్మారుడైనా సరే ఎంత పౌరుషవంతుడైనాసరే, చిట్టచివరకు తానే వచ్చి, నీ కాళ్లు పట్టుకుని బ్రతిమాలు కొంటాడు. ఆడవాళ్లకు ఏడుపువంటి రక్త యేమీలేదు. ఏడుపు ఏడు-రాజ్యాలు జయిస్తుంది- అని జాణయుగు శేషమ్మ చెల్లెలు పుల్లమ్మకు బోధించింది.
మగనితో మాట పడసాని ముందు
ఒక గయ్యాళి గంప అత్తతోటి, ఆడుబిడ్డల తోటి, చివరకు తోడికోడళ్ళ తోటి లేనిపోని జగడాలు ఆడుతూ వుండేది. మగడేమన్నా అంటే వెంటనే పెంకి జవాబు చెప్పేది. అందుమీద పౌరుషవంతుడైన ఆ మగడు ఆమెను కొడుతూ వుండేవాడు. ముకోపంగల అతడు ఇంటికి వసూనే పెళ్ళాన్ని ఏదో విసరపు మాట అనడం, ఆమె పెంకి జవాబు చెప్పడం, అతడు ఆమెను కొట్టడం ప్రతిరోజూ జరుగుతూ వుండేది. ఇట్లు జరుగుతూ వుండగా ఒక తెలివైన యతడు ఏదో రంగునీళ్ల సీసా తీసుకువచ్చి ఇది దివ్యాషధం. నీ మగడు నిన్ను కొట్టకుండా చేస్తుందీ మందు. దీనిని నీ దగ్గరెప్పడూ ఉంచుకో. నీ మగడు కనబడగానే కొంచెం నోటిలో పోసికొని, పుక్కిటి పట్టి వుంచుకో, మింగవదు. ఊయువదు. ఈ మహత్తుగల మందు నీ నోటిలో ఉంటేనే నీ భర్త నిన్ను కొట్టడు. నీవు సుఖంగా వుండవచ్చు అని రంగునీళ్ల సీసా యిచ్చాడు. ఆమె మగడేమన్నను నోట్లో నీళ్ళు పుక్కిటి ఉండడంచేత మాట్లాడ్డానికి వీలుండేది కాదు. అతడేమన్నను యీమె జవాబు చెప్పక పోవడంవల్ల చివరకు యీమె బుద్ధిమంతురాలైందని అతడు కూడా సాధు వర్తనంగు
వాడయ్యాడు. అప్పడు ఆ భార్యాభర్తలు సుఖంగా కాపురం చేసుకొన్నారు.
తెలివితక్కువ బాపడు
యజ్ఞము చేయుటకు ఒక బ్రాహ్మణుడు చక్కని మేకను కొని , దాని మెడను అంగవస్త్రం పోసి తీసుకుపోతూ వుండగా ముగ్గురు టక్కర్లు చూచి, ఆ మేకను ఏ ఉపాయువు చేతనైనా కాజేసి తాము కోసికోవాలని నిశ్చయించి, వేర్వేరుగా చీలిపోయారు. ෆුට්ෂ් ఒకడు బ్రాహ్మణునికెదురువెళ్లి, ‘అయ్యా తాము బ్రాహ్మణోత్తములే, కట్టి కుక్కను @35°3 పోవుచున్నారిదియేమి అని ప్రశ్నించాడు. బ్రాహ్మణుడు వాని మాట లెక్కచేయుక. ఇది కుక్క కాదు, మేక’ అని చెప్పి తన దారిని పోతూ వుండగా, రెండవవాడెదురుపడి బ్రాహ్మణోత్తమా, మీకు కుక్కలతో పనియేమి? మీదుమిక్కిలి ఇది కణ్ణి కుక్క కుక్కను మీరు అంటుకోకూడదు కదా అని చెప్పగా భీభీ ఇది కుక్కగాదు నీవు వెట్టివాడవు అంటూ బ్రాహ్మణుడు ముందుకు సాగిపోతూవుండగా, మూడవవాడు యెదురుపడి అయ్యుయెన్యా, వెల్ష్ బాపడా. పిచ్చికుక్కను వెంటబెట్టుకొని పోతున్నావా. కరవ గలదయ్యా అని పలికేడు. అంతట బ్రాహ్మణునకు మనస్సులో అనుమానం పుట్టింది. ఇదియేుమి. ఇంతవుంది దీనిని కుక్క అంటున్నారు. నా కళ్ళకు వు సకలు
కమ్మినాయేమో?’ అని తలచి ఆ బ్రాహ్మణుడు మేకను వదిలిపెట్టి, తన దారిని పోయాడు. ఒక్కరు ముగురు యేకమై మేకను తీసుకుపోయారు.
భార్యాభర్తలు
చాలాసేపు పోట్లాడుకొని, ఒకరితో నొకరు మాట్లడుకొనక మూతులు బిగించుకొని ఒకచోట కూర్చుండియున్న దంపతుల దగ్గరకు, ఒక అల్లరి పిల్లవాడు తాను తింటూ
వున్న పకోడిలలో రెండు పకోడీలు చేతబట్టుకొని, మీలో ఎవరు ముందు మాట్లాడితే
వారికే పకోడిలిస్తానని చూపించాడు. అప్పడు మగవానికి కోపం వచ్చి ఛీ “అని
కొట్ల బోగా ‘నీవే గెలిచావు’ అని ఆ పకోడీలు మీదికి విసిరేసి ఆ పిల్లవాడు పారిపోయాడు . వీరిద్దరు నవ్వుకొన్నారు. అంతటితో వీరి క్కోపం చల్లారిపోయింది .
———–