పేరు (ఆంగ్లం) | P.Venkata Reddy |
పేరు (తెలుగు) | పి.వెంకటరెడ్డి |
కలం పేరు | – |
తల్లిపేరు | రామాంబ |
తండ్రి పేరు | బాలిరెడ్డి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 7/1/1922 |
మరణం | – |
పుట్టిన ఊరు | పర్ల పాడు గ్రామము ప్రొద్దుటూరు తాI కడప జిల్లా |
విద్యార్హతలు | ఆయన తెలుగు భాషలో విధ్వాన్ పరీక్షలో ఉత్తీర్ణులైనారు. |
వృత్తి | తెలుగు పండితులు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | బకాసుర వథ, గాంధీస్తుతి గీతములు, వీరభద్రస్వామి పద్యరత్నమాల, శ్రీమాన్ నిర్వచన వెంకట రామాయణం, పారిజాతాపహరన నాటకం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | శారదా పుత్ర |
ఇతర వివరాలు | ఆయన స్వగ్రామం లో కవిరత్న బిరుదాంకితులైన కశిరెడ్డి వెంకటరెడ్డి “బాల రామాయణము” రచించిరి. దానిని ఆదర్శంగా తీసుకొని వెంకటరెడ్డి “శ్రీమాన్ నిర్వచన వెంకట రామాయణం” పేరుతో మూడువేల పద్యములతో “రామాయణము” వ్రాసిరి. అది అముద్రితము. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పి . వెంకట రెడ్డి |
సంగ్రహ నమూనా రచన | వీరికి గోవిందరెడ్డి, వెంకటరెడ్డి యను యిరువురన్నగారును, యిరువురక్కగారును కలరు. వీరి కులవృత్తి వ్యవసాయము. వీరు ప్రాథమిక పాఠశాలలో 12ఏండ్ల వయసున ప్రవేశించి, నాలుగైదు తరగతుల వరకు మాత్రమే చదివిరి. |
పి . వెంకట రెడ్డి
వీరికి గోవిందరెడ్డి, వెంకటరెడ్డి యను యిరువురన్నగారును, యిరువురక్కగారును కలరు. వీరి కులవృత్తి వ్యవసాయము.
వీరు ప్రాథమిక పాఠశాలలో 12ఏండ్ల వయసున ప్రవేశించి, నాలుగైదు తరగతుల వరకు మాత్రమే చదివిరి.
వీరి స్వగ్రామస్థులును, గురుతుల్యులునగు శ్రీ విద్వాన్ జీ.రెడ్డి చెన్నారెడ్డి (ఎం. ఏ. బి. ఇ. డి.) గారు వీరి కవితాభ్యాసమునకు మార్గదర్శకులగుటయే కాక కవిగారి నున్నత విద్యాభ్యాసమునకు బ్రోత్సహించి వారి యింటి యందే అన్ని సౌకర్య ములను కలిగించిరి. ‘విద్వాన్” పరీక్ష చదివించి కవిగారి జీవనో పాధికి బునాది వేసిరి. కవిగారి గురువులు తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయమున నాంద్రశాఖలో బని చేసిరి.
సాహిత్య ప్రవేశము:
స్వగ్రామస్థులైన కీ. శే. “కవిరత్న చెమికెల చెన్నారెడ్డి గారు “చెన్న రామాయణమును ” క్రీ శే. ‘ బాలకవి ‘ వేంకట సుబ్బారెడ్డి గారు (బనగానపల్లె సంస్థానాస్థాన కవులు) ‘బాలరామాయణము”ను రచించుట జేసి కవిగారును రామాయణ కావ్య రచన మొనరింప కుతూహలురై “శ్రీమాన్ నిర్వచన వేంకట రామాయణ ” మను పేర రమారమి మూడువేల పద్యములతో రామాయణమును వ్రాసిరి. అది ముద్రణ భాగ్యమును నోచుకొనలేదు.
కవిగారు ప్రొద్దుటూరునందలి ఓరియంటలు హైస్కూలు నందు తెలుగు పండితులుగా పనిచేయుచున్నారు.
వ్రాసిన కృతులు:
1) బకాసుర వధ 2) గాంధీస్తుతి గీతములు. 8) వీరభద్రస్వామి పద్యరత్నమాల 4) శ్రీమాన్ నిర్వచనవేంకటరామాయణము (అముద్రితము) 5) పారిజాతాపహరణ నాటకము (ముద్రణము) ,
పారిజాతాపహరణ నాటక మందలి మధుర ఘట్టములో కొన్ని
నారదుడు:
చం: వినుము! లతాంగి; మాటలిక వేయునునేటికి నెంచిచూడ నీ
పెనిమిటి నీవు నిక్కముగ భీష్మకనందన కాలిగోటికై
నను మఱిసాటిరావని మనంబునఁ దాఁదలపోసియుండు నే
ననుటయకాదు సుమ్మతనియాశయమట్టిద, చేష్టయట్టి దౌ:
సత్య:
[కోపముతో] నారదా ! నేనిఁక వినఁజాలను (అని చెవులుమూనుకొని) కర్ణ శూలములైన యీ పలుకులు ముమ్మాటికి వినఁజాలను.
ఉ: చెప్పకుమయ్య! కృష్ణ చెడుచేఁతలు నాకిఁకఁ దచ్చరిత్ర మా
విప్పకుమయ్య! పేరలుక పెంపకు, ముంపకు దైన్యవార్ధిలో
దప్పిదమెల్ల నాయదియె తామర సేక్షణ నట్లు స్వేచ్చగాఁ
ద్రిప్పుటఁజేసి నాకిటులఁ దిప్పలు కల్గెను సంయమీశ్వరా!
నారదుఁడు : సత్యాదేవీ! యీ విషయము నీకెఱిఁగించి యుపకారము చేయుటకై వచ్చితిని.
సత్య: స్వామీ! నాకుపకారము చేయుటకై వచ్చినవారు పుష్పము నాకొనఁగక యాజనార్దనునకేల మోసికొనిపోయి సమర్పించితిరి?
నారదుఁడు:
అమ్మా! నీ భర్తనీయందు బద్ధానురాగుడనియు నీకేయిచ్చు ననియుఁ దలపోసి పుష్పమాతనికిచ్చితిని. తానొక్కటి దలఁచిన దైవమొక్కటి తలఁచెనన్నట్లు నీకు మేలుచేయు తలపుతో రాగా గీడుగా పరిణమించినది. దానికెవరేమి చేయుదురు? మనంబున నూరడిల్లుము. శాంతము వహింపుము.
సత్య :-
ఆర్యా! నాకియవమానాగ్ని యెట్లు చల్లారును? అగ్నిసాక్షిగా బెండ్లాడిన నా భర్తయే నాకిట్లవమాసము ఘటిల్లఁజేసినాడన్న సహింపచ్చునా? నన్నవమానించుట తన్నవమానించు కొనుటకదా? పోనిమ్ము నన్నిట్లు వంచించుటకు నేనా హరికి నేమి యపరాధము చేసియుంటిని పువ్వొసంగి రుక్మిణినంత గౌరవించుటకామె చేసిన మేలేమిగలదు? నిర్ణేతుకముగా నింత నిర్ధాక్షిణ్యమేల కలుగవల యును?
నారదుఁడు :
సాత్రాజితీదేవీ! యేమి చేయవలును ?రుజులు మారుచున్నవి . వానితోఁబాటు గొప్పవారిబుద్ధులు సైతము మారిపోపు చున్నవి. కలికాలమాసన్నమగుకొలఁదీ ప్రచంచ మే తబ్బిబ్బగును. లేకపోయిన న్ని మొన్న ప్రేమించిన కృష్ణుఁడు నేడేల నిన్ను తేలికగాఁజూచును ;
సత్య:
ఋషీశ్వరా! అదియట్లుందె. నా వెన్నుఁడు నేఁజేసిన యుప కృతులైనను దల పెట్టవలదా?
సీ|| నరకాసురునిఁ జంప నాఁడాజిలో నేను
సలిపిన మేలైనఁ దలపవలదె?
తన యష్ట భార్యలదున మేటివీవంచుఁ
బలికిన పలుకైనఁ దలపవలదె?
వత్యామ్రియం కగు గౌరియటంచాడు
పలువురి మాటైనఁ దలపదలడె?
మచ్చమంతు మణి మహితమౌధనరాసు
లెలమి నిచ్చుఒమైనఁ దలఁపవలదె?
గీ|| తనకు నే మేలు సేయని దినమొకండు
లేదుగద! యిట్టి నన్ను నెల్లి ది మొనర్బి
సాటి స్త్రీలతో నగుఁబాటు చేటుదెచ్చె
నౌర శ్రీ కృష్ణుడిది యోర్వనగునె తగునె?
నారదుఁడు:
తల్లీ ! కృష్ణనంతవానికే కృతజ్ఞత్వము లేదన్న మనమిఁక నేమి చేయఁగలము? కానిమ్మ వగవకుము. కాలమొకేతీరుగా నెవరికి నుండదుకదా! చంద్రునంతవానికి మబ్బులావరించి మఱల విచ్చిపోవుటలేదా నీకుమాత్రము చెడ్డరోజులు పోయి మంచి రోజులు రాఁగూడదా?
మేఘనాధవధ
(కవిగారి యముద్రిత రచనయగు శ్రీ మాన్ నిర్వచన వెంకట రామాయణము నుండి కొన్ని పద్యములు)
ఉ : ఓరి: విభీషణా! తగునె యక్త మయుక్తమటంచు నెంచకీ
దారుణ కృత్యమౌ కుల విదారణము – బొనరింపఁబూనితౌ
శారు. దురాత్మ! యేమనఁగనౌనిను దానవవంశముకా జెడన్
గ్రూరుఁడనీవుపట్టితివి; కూల్పఁగ నర్హుడవెల్ల భంగులన్
ఉ| గౌరవ హైన్యమంచనక, గ్రక్కు నఁబోయి విరోధిపక్షమం
జేరి సమస్త భూప్రజలు చీ:యన మాదగు గుట్ట దంతయున్
వారికిఁ దెల్పుచుం గులము పాడొనరింపఁగ సిద్ధమైత్రివా?
యోరియధర్మచిత్త తగవొల్లక నీవిటు సేయఁ బాడియే:
సీ :ప్రవిమల క్షీర వారాశి లోపల మహా
భీకర విషముద్భవించినట్లు
లలిత చందన వృక్ష విలసిత వనములో
భూరి కంటక శాఖి పుటినట్లు . అ
భినవోజ్వల మనోహ-ర సస్యకాజికిఁ
జీడపురుగు మణి చేరినట్లు.
కమనీయ పృష్ఠ భాగంబునఁ బెనురాచ
పుండక్కజంబుగఁ బొడమినట్లు,
గీ : పావనంబగు దానవ వంశమందు
నీవు చెడఁ బుట్టితివి, పాపి: నీచ హృదయః
నిన్నిదే నిమిషంబులో నిహతుఁజేసి
కులము నిష్కలుషఁబుగ సలుపువాఁడ.
——–
రాయలసీమ రచయితల నుండి…
———–