పేరు (ఆంగ్లం) | Puripanda Appalaswamy |
పేరు (తెలుగు) | పురిపండా అప్పలస్వామి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 11/13/1904 |
మరణం | 11/18/1982 |
పుట్టిన ఊరు | విజయనగరం జిల్లా, సాలూరు గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | ఒరియా, హిందీ, బెంగాలీ, ఆంగ్లము, సంస్కృతం |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | రాట్న పతాకం, మహమ్మద్ చరిత్ర, సౌదామిని, ఒరియా పాటలు, జగద్గురు శంకరాచార్య, ఛెతిమాణ అఠంగుఠ, విశ్వకళావీథి, హంగేరీ విప్లవం, దేవీ భాగవతం, పురిపండా వ్యావహారికాంధ్ర మహాభారతం, శ్రీమద్భాగవతము, వ్యావహారికాంధ్ర వాల్మీకి రామాటణం, అమృత సంతానం (అనువాదం), మట్టిమనుష్యులు (అనువాదం) |
ఇతర రచనలు | పురిపండా రచనలు |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ పురస్కారం ప్రదానం చేసింది. |
ఇతర వివరాలు | పత్రికా రంగంలో వీరు తన ప్రతిభను ప్రదర్శించారు. విశాఖపట్నం నుండి వెలువడిన ‘స్వశక్తి’ అను జాతీయ వారపత్రికకు సహాయ సంపాదకుడుగా కొంతకాలం పనిచేశారు. ‘ఆంధ్రపత్రిక’ కు స్వకీయ విలేఖరిగా పన్నెండేళ్ళు వ్యవహరించారు. ‘సత్యవాణి’ పత్రికను నిర్వహించుచు ఆయన రాసిన సంపాదక వ్యాసాలు పునర్ముద్రణ గౌరవాన్ని పొందాయి. వీరు ప్రచురించిన ‘వైశాఖి’ మాసపత్రిక సారస్వత ప్రియుల మన్ననలను ఆర్జించింది.గ్రంథాలయోద్యమంలో వీరు సాగించిన కృషి గణనీయం. మంతెన ఆదినారాయణ స్వామి స్థాపించిన ఆంధ్రప్రదేశ్ ప్రథమ గ్రంధాలయాన్ని, ‘కవితా సమితి’ గ్రంథాలయాన్ని ఆయన చక్కగా అభివృద్ధి పరచారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పురిపండ అప్పలస్వామి పురిపండా భాగవతం |
సంగ్రహ నమూనా రచన | రాముడి కథ రామాయణం, కృష్ణుడి కథ భాగవతం, యాదవులు మాథుర, శూరసేన దేశాలు యాదవులు ఏలుతూ వుండేవారు. వీరి రాజధాని మధుర. యయాతి మహారాజు రాజు కొడుకులలో పెద్దవాడు యదుడు. అతడి వంశం యాదవ వంశo. యాదవులలో మాధవుడూ ,, చేదీ, మహాభోజుడూ, వృష్ఠి, అంధకుడూ సంశకర్తలు. వీరి పేర వీర వరసగా మాధవ వంశమూ, చేదీ వంశము”, భోజవంశమూ, వృష్టివంశమూ, అంధక వంశమూ ఏర్పడ్డాయి. |
పురిపండ అప్పలస్వామి
పురిపండా భాగవతం
రాముడి కథ రామాయణం, కృష్ణుడి కథ భాగవతం, యాదవులు
మాథుర, శూరసేన దేశాలు యాదవులు ఏలుతూ వుండేవారు. వీరి రాజధాని మధుర.
యయాతి మహారాజు రాజు కొడుకులలో పెద్దవాడు యదుడు. అతడి వంశం యాదవ వంశo.
యాదవులలో మాధవుడూ ,, చేదీ, మహాభోజుడూ, వృష్ఠి, అంధకుడూ సంశకర్తలు. వీరి పేర వీర వరసగా మాధవ వంశమూ, చేదీ వంశము”, భోజవంశమూ, వృష్టివంశమూ, అంధక వంశమూ ఏర్పడ్డాయి.
అంతేకాదు. అక్రూరుడూ , సత్రాజిత్తూ, బభ్రుడూ, కృత నర్మా , సాత్యకీ, ఉగ్రసేనుడూ, శూరసేనుడూ- ఇలా ఎంతోమది పేరుపడ్డ యాదవులు పుట్టారు. వీరందరి సంతతితో యదువంశం తామర తంపరగా పెరిగింది.
శూరసేనుడి కొడుకు వసుదేవుడు. ఇతడు రోహిణి , సౌరనీ , భద్రా, మదిరా, రోచనా, ఇళా అని ఆరుగురినీ, ఉగ్రసేనుడి అన్ని దేవకుడి కూతుళ్ళని ధృవ దేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ అని ఆరుగురిని “పెళ్ళి చేసుకున్నాడు.
రోహిణి కడుపున బలరాముడూ, గదుడూ, దేవకి కడుపున కృష్ణడూ , సుభద్రా మొదలైనవారూ పుట్టారు.
శూరసేనుడికి వసుదేవుడే కాక, “దేవభాగుడూ “మొద లైన మరి తొమ్మండుగురు కుమాళ్ళ, పృథా, శ్రుతదేవీ, శ్రుతకీర్తి , శ్రుత శ్రవా, ‘రాజాధి దేవీ అని అయిదుగురు కూతుళ్ళూ కలిగారు .
పృథని కుంతిభోజుడు కూతురుగా పెంచుకున్నాడు. అందుకని ఆమెని కుంతి అన్నారు. స్వయంవరంలో పాండు “రాజుని వరించిందీమె.
శ్రుతదేవి కరూశ దేశం రాజుని పెళ్ళాడి , దంత క్త్రుణ్ణి కంది .
శ్రుతకీర్తి కేకయ జేశం రాజని పెళ్ళాడింది; అయిదుగురు కేకయల్ని కంది . వీరు భారతయుద్దంలో పాండవుల వేపున్నారు.
రాజాధిదేవి జయసేనుణ్ణి పెళ్ళాడింది; విందుణ్ణి, అను విందుణ్ణింది. ఈ విందానువిందులు భారతంలో దుర్యోధనుడి పక్షం పోరాడారు.
శుతశ్రవ చేది దను ఘోషుణ్ణి పెళ్ళాడింది. శిశుపాలు ణ్ణి కంది . కృష్ణుడంటే పడేదికాదు శిశుపాలుడికి. దంతవక్ర్తుడు బుజాలు కలిపేవాడు.
ఉగ్రసేనుడు భోజవంశం యాదవుడు. మధుర, శూకసేన దేశాల రాజు. అతడికి కంసుడు, న్యగ్రోధువూ, సునాముడు, కంకుడు, శంకుడు, సుహుడు, రాష్ట్రపాలూడూ , సృష్టి తుష్టిమంతుడు అని కొడుకులూ; కంస , కంసనతి, కంక, శూరభు, రాష్ట్రపాలిక ఆని కూతుళ్ళ కలిగారు,
కంసా మొదలైన కన్యల్ని వసుదేవుడి సోదరులు పెళ్ళి చేసుకున్నారు.
కంసుడు ఉగ్రసేనుడి భార్యకి ద్రవిళుడి వల్ల కలిగిన త్రజుడు నల్లమాలిన బలవంతుడు. కనికరం లేని కరుకు మనిషి.
మగధ జరాసంధుడు కంసుడుకి పిల్లనిచ్చిన మామ. అందుకని ఇతడీ పాగరు ఇంకా అంతా కాదు. పైగా, ప్రలంబుడూ, బకుడూ, బాణుడూ , తృణానర్తుడూ , అఘుండూ, ముష్టికుడూ, అరిష్టుడూ “, ద్వివిదుడూ , ధేనుకుడూ కేళీ మొదలైన రాక్షసుల స్నేహమూ, సహాయమూ వుండేవి. పూతన వంటి రాకాసులు చెప్పు చేతలలో వుండేవారు.
ఉగ్రసేనుణ్ణి ఖైదు చేసి తానే రాజ్యమేలుతూ వచ్చాడు కంసుడు. దేవకీ వసుదేవుల్ని ఖైదులో పెట్టాడు. వాళ్ళకి పుట్టిన బిడ్డల్ని ఎప్పటికప్పుడు చంపిపారేశాడు. అతడికి భయపడి యాదవులు చెట్టోపిట్టయి పారిపోయారు. కొందరు కురు, పాంచాల దేశాలకి కొందరు కేకయ, సాల్వ దేశాలకి , కొందరు విదర్భ నిషద దేశాలకీ ; కొందరు విదేహ, కోసల దేశాలకీ వలస పోయారు.
అదిగో అలాటి అల్లకల్లోలమైన కాలంలో అవతరించాడు కృష్ణుడు .
మబ్బులేని పిడుగు
కూతుళ్ళందరిలోకీ దేవకి అంటే ప్రాణం దేవకుడికి. ఆమె పెళ్ళి కళ్ళ వేడుకగా జరిపించాడతడు. బంగారం హారాలు వేసిన నాలుగు వందల మదపు టేనుగులూ, పది “వేలు ఎంపిక చేసిన గుర్రాలూ, వెయ్యీ ఎనిమిది వందల బంగారం రధాలూ, వయసులో వున్నా చక్కని చుక్కల్లాంటి రెండు వందల మంది న్పని కత్తెలూ కూతురికి సారెగా పంపాడు .
మగడి వెంట అత్తవారింటికి బయలుదేరింది దేవకి. శంఖాలూ , తూర్యాలూ – మంగళవాద్వాలు మోగాయి. దేవకీ వసుదేవులు రధం మీద కూర్చున్నారు. ముస్తాబు చేసిన రధం ముచ్చటగా వుంది.
దేవకి అంటే కంసుడికీ ఎంతో న్నేహం. అందుకని చెల్లెల్ని తానే దిగబెట్టాలని పయనమయాడు, రధ మెక్కి తానే స్వయంగా సారధ్యం చేశాడు .
రధం నడుస్తూవుంది. అంతా సవ్యంగానేవుంది. ఇంతలో వున్నట్టండి : కంసా !” అని బయలులో ఒక కేక విన పడింది. “ దేవకి ఎనిమిదో కానుపు నిన్ను చంపుతుంది.”
గతుక్కు-మన్నాడు కంసుడు. అతడి మతిపోయిది. చేతి పగ్గాలు జారిపోయాయి. గుండె బేజారయిది. ఏం చెయ్యాలి? క్రూరమైన తలంపు తన తలలో మెరిసింది. “మొదలు నరికేస్తే కానుపే వుండదు.”
కత్తి దూశాడు కంసుడు. దేవకి జుత్తు పట్టుకున్నాడు. “అన్నా!” అని అరిచింది దేవకి. కొత్త పెళ్ళికూతురామె. రెప్పపాటులో ఆమెతల తెగిపోతుంది .
“బావా !” మెరుపులా వురికి అడ్డుకున్నాడు వసు దేవుడు. “ఆగు. రవంత ఆలోచించు బయలు మాటే నిజమయితే నీ చెల్లెలు వల్ల నీకు అపాయం లేదు. ఏదైనా వుంటే ఈమె కానుపు వల్ల కదా ! అదీ ఎనిమిదో కానుపువల్ల. అయినా ఆమె కన్న ప్రతిబిడ్డనీ పురిటినించే తెచ్చి నీకు అప్పగిస్తాను : చంపు. ఏ పాపమూ ఎరగని బేల దేవకి, ఇన్నాళ్ళూ నిన్ను నమ్మకున్న నీ చెల్లెలు పెళ్ళి ముస్తాబుతో వుంది కనికరించు” అంటూ కాళ్ళా వేళ్ళా పడ్డాడు.
ఆలోచించాడు కంసుడు. “నిజమే పుట్టినవాళ్ళని పుట్ట గానే చంపేస్తేసరి. చచ్చినవాళ్లు చేసేదేమిటి ?
దేవకి మొహం చూస్తే తన మనస్సులో ఏ మూలో జాలి కూడా కదులుతున్నట్టుంది. వసుదేవుడు అన్నమాట తప్పడని కంసుడికి తెలుసు. దేవకికి పుట్టిన బిడ్డల్ని తప్పక తనకి అప్పగిస్తాడనడంలో అనుమానం లేదు. అందుకని వను దేవుడి మాట ప్రకారం “దేవకిని వొదిలిపెట్టాడు.
గండం గడిచి ఇల్లాలితో ఇల్లు చేరుకున్నాడు వసు దేవుడు.
కొన్నాళ్ళకి నీళ్ళాడింది దేవకి, తొలికాన్పు మగబిడ్డని కంది .
కన్నకొడుకుని చంపుమని కంసుడి చేతిలో పెట్టాలి. దేవకీ, వసుదేవుడూ వలవలా ఏడ్చారు. అయినా తప్పదు. కంసుడు కసాయి.
మాట ఇచ్చినప్రకారం కొడుకుని – నెత్తురు కండని తెచ్చి కంసుడి ముందు పెట్టాడు వసు దేవుడు.
అతడి నిజాయితీకి తలవూపాడు కంసుడు.
“బావా ! ఈ మేనల్లుణ్ణి నువ్వే తీసుకుపో, పెంచుకో. దేవకి ఎనిమిదో కానపున పుట్టినవాడు కదా ఏదో చేస్తాడంది బయట !”
“వాణ్ణి మాత్రం తప్పకుండా పట్టుకురా. ముక్కలు ముక్కలు చేసి నరికేస్తాను” అన్నాడు.
అప్పటికి ఆ గండం గట్టెక్కిందనుకుంటూ కొడుకుని తెచ్చి దేవకి వొడిలో పెట్టాడు వసుదేవుడు. అయితే కంసుడు కటికి కసాయి. అతడి మతి ఎప్పడు ఎలా వుంటుందో తెలియదు. అందుకని దిగులు పడుతూనే వుండేవారు దేవకీ వసుదేవులు.
కుమారుడికి ముచ్చటగా కీర్తిమంతుడు అని పేరు పెట్టుకున్నారు.
ఖైదు
అవాళ ఆకాశవాణి అన్నమాట ఆందోళన కలిగిస్తూనే వుంది కంసుడికి. ఇలా వుండగా వోనాడు నారదుడు అతడి దగ్గరికి వచ్చాడు.
“కంసా! నీ కులంవాళ్ళంతా నీ చావు కోరుతున్నారు. ఎవళ్ళనీ నమ్మకు ’ అని చెప్పాడు.
దాంతో పిచ్చెత్తినట్టయిపోయాడు కంసుడు. ఎవడు తనవాడో ఎవడు పైవాడో తెలియకండాపోయింది. దేవకినీ, వసుదేవుణ్ణి అరదండాలు వేయించి పట్టించుకువచ్చాడు.
ఖైదులో పడేశాడు . వాళ్ళ కొడుకుని కీర్తిమంతుణ్ణి చంపే శాడు. ఖైదు చుట్టూ కాపలా పెట్టించాడు. కావలివాళ్ళని కన్ను కప్పి గాలి కూడా కదలకండా కట్టుదిట్టం చేశాడు.
తండ్రి ఉగ్రనేనుణ్ణి ఖైదులో కట్టి పడేశాడు . తానే రాజయి. కూచున్నాడు. తనకి తగిన దుష్టుల్ని మంత్రులుగా పెట్టుకున్నాడు. తన చావు కోరిన కులం వారిని తుడిచెయ్యడానికి పూనుకుని, వాళ్ళని అష్టకష్టాలు పెట్టాడు. చిత్ర హింసలూ- చేశాడు. అతడి పేరంటే పిట్టలు నీళ్లు తాగేవి కావు. చూడి ఆవులు తప్పకునేవి. యాదవులు ఆపదల పాల యారు, ఏ అర్ధరాత్రి ఎవర్ని ఖైదుచేస్తాడో, వ కణంలో ఎవరి ఇల్లు కొల్లగొడతాడో, ఏ కుటుంబం మీద ఏ కుట్ర పన్నుతాడో అంటూ అడిలిపోయారు వారు. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని ఆడా మగా దేశదేశాలు పట్టిపోయారు.
———–