పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి (Pendyala venkata Subrahmanyasastry)

Share
పేరు (ఆంగ్లం)Pendyala venkata Subrahmanyasastry
పేరు (తెలుగు)పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి
కలం పేరు
తల్లిపేరులక్ష్మీతాయారు
తండ్రి పేరుసముద్రాల వేంకట శేషాచార్యులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ11/5/1877
మరణం1/7/1950
పుట్టిన ఊరుతూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకాలోని చోడవరం గ్రామం
విద్యార్హతలు
వృత్తిఆంధ్రోపన్యాసకులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువేదకాలపు వ్యవసాయ చరిత్ర, పరీక్షిత్తు, మాంసభుక్తి, రామోపాఖ్యానము-తద్విమర్శనము, ఉత్తర భారతము, చిత్రరత్న పేటి, సూక్తి సుధాలహరి
ఇతర రచనలు
 
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రిని ప్రాచీనాంధ్ర గ్రంథ సంపాదనకై నియమించారు. ఆ పనిమీద మైసూరు, మద్రాసు, తంజావూరు వంటి ప్రాంతాలతో పాటుగా పలు తెలుగు ప్రాంతాల్లో తిరిగి విలువైన గ్రంథాలనెన్నిటినో సంపాదించారు. ఆ తర్వాత బందరు నేషనల్ కళాశాలలోను, రాజోలు బోర్డు హైస్కూలులోను కూడా ఆంధ్రోపన్యాసకులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపెండ్యాల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
సంగ్రహ నమూనా రచనశ్రీ మహా విష్ణునాజ్ఞ చే బ్రవర్తించు నిప్పటి చతుర్ముఖుని ద్వితీయ పరార్ధమున , శ్వేత వరాహకల్పమునం దగు వైవస్వత మన్వంతరంబునందైన నీకలియుగమున బదునారువందల యిరు నదారు సంవత్సరములు గడచి పిమ్మట *శ్రీమంతంబగు నీ భరత ఖండంబున నొక మహా సమరము ప్రవర్తిల్లెను . అది కురు క్షేత్రము కేంద్ర స్థానముగా గలది యగుట చె గురు క్షేత్ర సంగ్రామమనియు గౌరవులకు బాండవులకునైన యుద్ధమగుట చె గురు పాండవ యుద్ధమనియు భరత వంశస్థులే యందు బ్రధాననాయకు లగుటచే భారత యుద్ధమనియు బేరువడసెను.

పెండ్యాల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి

పరిక్షిత్తు

ప్రధమప్రపాఠకము

ప్రధమానువాకము

పూర్వ గాధ

శ్రీ మహా విష్ణునాజ్ఞ చే బ్రవర్తించు నిప్పటి చతుర్ముఖుని ద్వితీయ పరార్ధమున , శ్వేత వరాహకల్పమునం దగు వైవస్వత మన్వంతరంబునందైన నీకలియుగమున బదునారువందల యిరు నదారు సంవత్సరములు గడచి పిమ్మట *శ్రీమంతంబగు నీ భరత ఖండంబున నొక మహా సమరము ప్రవర్తిల్లెను . అది కురు క్షేత్రము కేంద్ర స్థానముగా గలది యగుట చె గురు క్షేత్ర సంగ్రామమనియు గౌరవులకు బాండవులకునైన యుద్ధమగుట చె గురు పాండవ యుద్ధమనియు భరత వంశస్థులే యందు బ్రధాననాయకు లగుటచే భారత యుద్ధమనియు బేరువడసెను.
అమ్మహాజన్యమున బెక్కు వేలుగజములు , ననేక లక్షల హయములు , మఱియుటఏ కాక , డెబ్బది రెండు లక్షలకు మించిన దృడాంగులగు మనుష్యులును మృతి నొందిరి . ఆ వీరులలో శతాధిక వయస్కులు మొదలు పదునారేండ్ల ప్రాయము వరకు గలవారుండిరి. భరత ఖండ మిప్పటి వలె నప్పుడు ముప్పది మూడు కోట్ల జన సంఖ్య గలది కాక , స్వల్ప జన సంఖ్యా కలిత మగుటచే నంతటి జన నష్టమును సహింప లేక నతితమముగా సంక్షోభించెను . దేశమునం దేమూల జూచినను , తండ్రులు సోదరులు సుతులు భర్తలు బంధువులు గతించుతచే నవయుననాధలగు సతీ మణుల కన్నీటిచే భారత భూమి పంకిలమై వారి రోదనములచే దిశలు ప్రతి రోదనము జేయు చుండెను . కురుక్షేత్రము యుద్ధమున కెటులు కేంద్ర స్థాన మయ్యెనో ,స్త్రీలరోదనమునకును నటులచే కేంద్ర స్థాన మయ్యెను . అందు హస్తిపురి మఱియు నడిమి బొట్టయ్యెను . ఆ పట్టణమునం దేవక జూచినను , భార్త్రు బంధుసుతాదుల మరణము లచే శోకించువనితల రోదనములే – ఏ వైపు జూచినను బంధు మరణ కారకులగు బాండవుల శపించు వాక్యము లే – ఏ దెస జూచినను యుద్ధములోని భయంకర వార్తా ప్రసంగములే – ఏ ప్రక్క గను గొనినను భర్త్రాది మరణములచేనగు వృత్తి భంగము వలన నైన దరిద్రతకు గాతరులగు స్త్రీల యొక్కయు , బాల బాలికల యొక్కయు , వృద్ధుల యొక్కయు విలాపములే – ఏ డిశం గనినను క్షత గాత్రుల హాహాకారములే ప్రవర్తిల్లెను . హాహాకారములతో గూడిన యుద్ధములోని సైనికుల విషాద మరణముల జూచియు , బురిలోని రోదనముల వినియు బంధుమిత్రపుత్రాదుల మరణములచే విచారనాగరమగ్నుండయ్యు ధర్మరాజు కృపణ తానంతప్త హృదయుండయి విరక్తిచే రాజ్య ము నొల్లననగా , సోదరులు దౌప్రది మొదలగునా రాతని బ్రవృత్తి మార్గమునకు ద్రిప్ప నెంతగా బ్రయత్నించినను నాథ నిమనస్సు తేరుకొనదయ్యెను . పిమ్మట శ్రీకృష్ణ భగవానుడును గర్మ యోగంబునకు ద్రిప్ప నెంతయో యత్నించె . యుద్ధారంభమున అర్జునునిమొహముం బోలె నేడు ధర్మజుని కార్పణ్యదోషోపహిత స్వభావమును శ్రీకృష్ణుడు బో గొట్ట లేడయ్యే . పిమ్మట శ్రీ వ్యాస భగవానుడు తన వాన్నై పుణ్యముచే నాతని కుపదేశించిన ప్రవృత్తి మార్గమే నివృత్తి మార్గము నుండి పెడ మొగము పెట్టించి రాజ్యాభిషేకమునకును , పిమ్మట ద్రోణాదుల హత్యలచే నాగు పాపపరిహారమునకై మూడ శ్వమేధాయాగముల జేయుటకును హేతు వయ్యేను . వ్యాసునానతిని “అహీన “ మనునశ్వమేధము జేయునెంచెను . పాండవులు సంతాననాశానముచే సంతప్తులగుచు , నభిమన్యుకళత్రమగు నుత్తర గర్భవతి గాన తద్గర్భస్థ శిశువు నందే తమ సకల మనో రధముల నాధారము జేసికొని ఊరడిల్లుచుండిరి . అశ్వ మేధయుగమునకు ద్రవ్యమును సంపాదించుటకు బోక తప్పనందున , ధర్మజుడు , ససైన్యుడగుయ యత్సనిబుర రక్షణమునకు నియోగించి , సోదరులను సైన్యమును దోడ్కొని వ్యాసోపదేశముచే , నుత్తరాప్రసవమునకు బూర్వమే హిమాలయోత్తర భాగమునకు బోయెను . ధర్మ రాజాదులు పురము వెలువడిన మరునాడే యశ్వ మేధాయాగ నిర్వహణమునకు ధర్మజునిచే నంతకుమున్నె యాహ్వానితుడగు శ్రీ కృష్ణ భగవానుడు తద్యాగ నిర్వహణ కుతూహలా యత్త చిత్తుండయి ససోదర మిత్ర పరివారముగ హస్తి పురి కేతెంచెను .

ద్వితీయానువాకము

పరిక్షిజ్జజనము

శ్రీ కృష్ణుడు హస్తిపురి బ్రవేశించిన నాడే యుత్తరరకు బ్రస వావేదన మారంభ మయ్యెను . ఆమె సూతి కాగృహ మరి ష్టోచిత పరికర సహిత మయ్యును , అరిష్ట శూన్యమై ననిష్టహై న్యముతో , గదా ధర పరిరక్షితమై యగదంకారసన్నిహితమై , ధవళ కుసుమ యుక్తములు , సిత సర్షప సహితములు , లాజపూర్ణములు నగు కుంభములచే శుభ ప్రదంబై విరాజిల్లుచు , బ్రజ్వ లితాగ్ని చేతను , బ్రదీప్త శస్తా స్త్రముల చేతను , పిచు మంద పల్లవాదుల చేతను , బాల గ్రహాదిభూత పరిహారభూతమై , చికిత్సికలు దక్షలు చతురలు వృద్ధులు హీతలు నగు పుణ్య వనితల చె బరి బరి విధముల బరి శోధింప బడుచు నిర్మలమై యుండెను .

———–

You may also like...