బందా కనకలింగేశ్వరరావు (Banda Kanakalingeswararao)

Share
పేరు (ఆంగ్లం)Banda Kanakalingeswararao
పేరు (తెలుగు)బందా కనకలింగేశ్వరరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/20/1907
మరణం12/3/1968
పుట్టిన ఊరుకృష్ణా జిల్లాలోని ఆటపాక గ్రామం
విద్యార్హతలుమద్రాసు లా కళాశాల నుండి 1932 లో బి.ఎల్. పట్టా పుచ్చుకున్నారు.
వృత్తిమొదట న్యాయవాదిగా పనిచేసి, తరువాత కాలంలో నాటక ప్రదర్శనమే వృత్తిగా చేసుకున్నారు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెఅలనాటి మహత్తర రేడియో నాటిక “అనార్కలి”
స్వీయ రచనలుగృక్కెడు నీళ్ళు,
వీరు కూచిపూడి నాట్యకళకు ఎనలేని సేవచేశారు. ప్రభుత్వ సాయంతో కూచిపూడి గ్రామంలో సిద్ధేంద్ర కళాక్షేత్రం నెలకొల్పి నిర్వహించారు. ఈ కళను గురించి ప్రముఖ పత్రికలలో వ్యాసాలు రాసి దాని ప్రాధాన్యాన్ని అందరికీ తెలియజేశారు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఈయన 1964 లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును గెలుపొందారు.
వీరి ఉత్తమ నటనకు రాష్ట్రపతి అవార్డు లభించింది.
ఇతర వివరాలుబందా కనకలింగేశ్వరరావు సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. ఈయన నాటకాలలో అనేక పాత్రలు పోషించాడు. వాటిలో బాహుకుడు, బిల్వమంగళుడు ఈయనకు స్వయంగా ఇష్టమైనవి. ఈయన తెలుగు సినిమా ప్రపంచంలో మొదటి తరం సినిమాలైన బాల నాగమ్మ, ద్రౌపదీ మానసంరక్షణం, పాదుకా పట్టాభిషేకం (1945 సినిమా), సారంగధర (1937 సినిమా) సినిమాలలో నటించాడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబందా కనకలింగేశ్వరరావు
గ్రుక్కెడు నీళ్లు
సంగ్రహ నమూనా రచనదూరంగా ఉండరా , కళ్ళు కనపడట ల్లేదు ?’ ‘ . –
. నిన్నే; మాట వినిపించుకోవేమిరా , మాయ స్వరాజ్యం వచ్చిందని మండిపడిపోతున్నా వేం ?’
‘—————————-‘
‘దూరంగా పోరా ‘ అని మునసబు వెంకట స్వామి మందలించగానే వెంకటప్ప తప్పుకున్నాడు . మహాలక్ష్మమ్మ గారు మడి నీళ్లు పట్టుకుని వెళ్లింది .
ఇల్లు చేరగానే మహలక్మమ్మ, మడి నీళ్ల బింద దింపి , అరుగు మీద పెద్ద మనుష్యులతో మాట్లాడే భర్తను ‘ ఒకమాటిలా రండి ‘ అని లోపలికి పిలిచింది .
కూర సంగతి కనుక్కోటానికి గావును లోపలికి రమ్మన్న దనుకొని లోపలి వెళ్లాడు బ్రహ్మయ్య

బందా కనకలింగేశ్వరరావు
గ్రుక్కెడు నీళ్లు

దూరంగా ఉండరా , కళ్ళు కనపడట ల్లేదు ?’ ‘ . –
. నిన్నే; మాట వినిపించుకోవేమిరా , మాయ స్వరాజ్యం వచ్చిందని మండిపడిపోతున్నా వేం ?’
‘—————————-‘
‘దూరంగా పోరా ‘ అని మునసబు వెంకట స్వామి మందలించగానే వెంకటప్ప తప్పుకున్నాడు . మహాలక్ష్మమ్మ గారు మడి నీళ్లు పట్టుకుని వెళ్లింది .
ఇల్లు చేరగానే మహలక్మమ్మ, మడి నీళ్ల బింద దింపి , అరుగు మీద పెద్ద మనుష్యులతో మాట్లాడే భర్తను ‘ ఒకమాటిలా రండి ‘ అని లోపలికి పిలిచింది .
కూర సంగతి కనుక్కోటానికి గావును లోపలికి రమ్మన్న దనుకొని లోపలి వెళ్లాడు బ్రహ్మయ్య .
‘చూడండి ! వెంకటప్ప కంత పొయ్యే కాలం వచ్చిం దేం , దారి తప్పుకోరా అంటే తలతిక్క తనంగా వినిపించుకోడు , కాస్త కనుక్కోకపోతే ఆడవాళ్లం మడి నీళ్లు తేలేం ‘ అని కసిరింది మహాలక్ష్మమ్మ .
‘కసుక్కుంటా లే ‘ అంటూ కారణం బ్రహ్మయ్య వాకిట్లోకి వచ్చి కబురం పేడు వెంకటప్పకు .
వెంకటప్ప ఊరు వెట్టి .ఆ ఊళ్లో వాడొక్కడే మాల . తల్లిదండ్రులు చిన్నతనంలో పోవటం చేత గాలికి పెరిగి ధూళికి ఎదిగి కన్నం గట్టు మీద చుట్టు గుడిసె వేసుకుని కాపురం ఉంటున్నాడు వెంకటప్ప . పుట్టుక తక్కువైనా బుద్ధిమంతుడు . అందువల్ల ఊళ్లో వాళ్లు బట్టలు పాతలు ఇస్తూ అంత పచ్చడి రవ్వ , ఇంత పప్పు చారు పెడుతూ ఆదరంగా చూస్తుండేవారు .
కరణంగారి కోపానికి కాకినా అదురుతుంది . అలాంటప్పుడు వెట్టి పని చేసే వెంకటప్పకు చెప్పాలా ! వెంటనే కరణం బ్రహ్మయ్య గారింటికి కెళ్లి దణ్ణం పెట్టేడు .
బ్రహ్మయ్య గారు వెంకటప్పను చూడగానే మనుష్యునకు రావలసినంత కోపం తెప్పించుకొని ఎడమ కాలి పాత చెప్పు తీసి వెంకటప్ప మొగాన కొట్టేడు . అది చాలక బండబూతులు తిట్టి బొంద కొయ్య వేయించాడు . ఏం చేస్తాడు వెంకటప్ప ? తల వంచుకొని దండన భరించాడు . ఇంతకు వెంకటప్ప చేసిన తప్పేమిటో !
బ్రహ్మయ్య గారు బ్రాహ్మణులు . ఊరి కరణం . రామవరంలో వారంటే మంచి పలుకుబడి ఉంది . వ్యాజ్యాలలో మధ్యవర్తిత్వం చేయాలన్నా , అన్నదమ్ముల పాలు పంపుళ్ళు పెట్టాలన్నా , కవులు కత్తులు వీళ్లు గాని వ్రాయాలన్నా , లక్షాధికారి లక్ష్మణ స్వామైనా ఆయనకే కబురంపాలి . ఏభై వేళా రూపాయల నగదు , పాతిక ఎకరాముల భూమి , పురాతనపు ఇల్లు , ఆయన కున్న ఆస్తి , కాని ఎన్నుంటే ఏం , బిడ్డలు లేరు . ఎలాగైనా నా ఒక్క కాయ కాస్తుందేమో యని తాయత్తుల మీద తాయత్తులూ , జపాల మీద జపాలు , తాపాలు మీద తాపాలు , ఇక ఏమిటి !సూర్య నమస్కారాలే కాదు సుందర కాండ పారాయణాలే కాదు , పుత్ర కామేష్టి వ్రతాలే కాదు , పుణ్య తీర్దాల మును గటయే కాదు , గోపాయీల వేరు ముక్కలే కాదు , గోకుల బృందా వన దర్శనాలే కాదు , ఎన్ని చేసినా ఒక్క పిల్లడు గాని , పోని , పిల్లయినా కలుగలేదు . భోగేశ్వరం దేవుడికి మ్రొక్కేరు . మ్రొక్కటమే కాదు , స్నానం చేసి తడి గుడ్డతో తెల్ల వారలు సాగిల పడ్డది మహాలక్ష్మమ్మ గుడి వెనుక ; అబ్బే ! మాట వరసకైనా నెల తప్పలేదు .
కాలం ఒక్క మాదిరిగా ఉండదు . రామవరంలో కొంచెం కలరా తటస్థించింది . కొంచెం గా ఉన్నదల్లా కొద్ది రోజుల్లో గొప్పదైనది . రోజూ నాలుగైదు పీనుగులు వెడుతున్నాయి .ల్ ప్రొద్దు క్రుంకితే తలుపు తీయటం లేదు . వీధులలో సంచారం కనపడుట లేదు . మునసబు వెంకట స్వామి ముడుపు గట్టించాడు . మ్రొక్కే దేవతలకు మ్రొక్కుతున్నారు .
చేసే పూజలు చేస్తున్నారు . గణా చార్లు మీద గణాచార్లు . మంగలి తిర్పతి గాని భార్యకు మారెమ్మ పూనింది . గవళ్ళ గంగులు చెల్లెలుకు గంగానమ్మ పూనింది . చాకలి పేరాయ మరదలకు చల్లలమ్మ , పోలి సాని ఆడబడుచుకు పోలేరమ్మ పూనింది . ‘ అయ్యో మా అక్కయ్య , నే వస్తున్నా నే ‘ అంటూ వచ్చాడు గాలి వీరయ్య . “ ఎవరు ను ‘ వ్వన్నాడు వెంకటస్వామి . సమయం దొరికినప్పుడే తిట్టాలనుకొని వీరయ్య ‘ ఎవ్వరో ఎరుగవట్రా గాడిద ! నేపోత రాజునురా అన్నాడు .’ ఈ ప్రకారంగా వారి వెనుక వీరు , వీరి వెనుక వారు , చల్లాలమ్మ , గొడ్డల్లమ్మ , మారెమ్మ , మహాలక్ష్మమ్మ , పోలేరమ్మ , పెద్దింటమ్మ , కామాక్ష్మమ్మ , గంగానమ్మ , కనక దుర్గమ్మ, గావుశ క్తెమ్మ , దిబ్బమ్మ తీర్ధమమ్మ —‘ఓ ‘ స్నానాలు చేసి బండెడు వేప మండలు చేత బట్టుకొని గెంతి తాండవ మాడుతున్నారు వీధుల వెంబడి , దప్పులు తడవతడవకూ కాచి మరీ కొడుతున్నారు . వీరయ్య సిస్తు ఇవ్వలేదనే కోపం చేత కరణం బ్రహ్మయ్య కేకలు వేతా మానుకొని వచ్చేటప్పటికి వీరయ్య పోత రాజు రూపాన కరణం గారి పీక పట్టుకున్నాడు . పది మంది గుమిగూడి విడిపించారు . పెద్ద కాపు రాఘవయ్య విడదీసి వీరయ్యను మందలించాను . బ్రహ్మయ్య గారి ఒళ్లు ఝల్లుమన్నది . పది మంది ఇంటికి చేర్చారు . దేవతలంతా ఈ దెబ్బలాటలో బాగుండదని ఊరుకున్నాడు . ఏం గవాలో చెప్పి చేయించు కోవాలి గాని మనుష్యులను చంపితే ఎలా గన్నాడు రాఘవయ్య దేవతల్తోటి , దేవతలకు మన భాష బాగా తెలుసుట !
‘ఓ ‘ ! నరుడు నరుడ నరుడ నరుడో ! నాకు పదివే లెత్తి గుడి కట్టించరో ! లేకపోతే నెత్తురు తాగేస్తారో ‘ అంది గంగానమ్మ .
‘నాకు కొత్తది తోపు రంగు పెదన నేత జరీ చీరె పెడితే గాని మింగుతా ; నంది పోలేరమ్మ .

———–

You may also like...