భాస్కరాచార్య రామచంద్రస్వామి (Baskaracharya Ramachandra Swamy)

Share
పేరు (ఆంగ్లం)Baskaracharya Ramachandra Swamy
పేరు (తెలుగు)భాస్కరాచార్య రామచంద్రస్వామి
కలం పేరు
తల్లిపేరునాగలక్ష్మాంబ
తండ్రి పేరుభాస్కరాచార్య పట్టాభిరామస్వామి
జీవిత భాగస్వామి పేరుఅంబమ్మ
పుట్టినతేదీ1/1/1905
మరణం6/25/1965
పుట్టిన ఊరు
విద్యార్హతలుఇతడు బళ్ళారిలో సంస్కృతాంధ్రములు అధ్యయనం చేశారు. తరువాత విజయనగరంలోని సంస్కృత కళాశాలలో చేరి కావ్యనాటక సాహిత్యములు చదువుకున్నారు.
వృత్తి
తెలిసిన ఇతర భాషలుకన్నడ, మళయాల, హిందీ, తమిళ,బెంగాలీ,సంస్కృతం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅభిజ్ఞాన శాకుంతలము ఆంధ్రీకరణము, బాటసారి, మా హంపి, యాత్రికుడు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుభాస్కరాచార్య పరంపరా పీఠానికి అధ్యక్షుడైన పట్టాభిరామస్వామికి ఇతడు దత్తపుత్రుడు. జ్యోతిషశాస్త్రము, తంత్రశాస్త్రములలో నిష్ణాతుడైనారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికభాస్కరా చార్య రామచంద్ర స్వామి
సంగ్రహ నమూనా రచనవీరి తల్లిదండ్రులకు, ఈ కవిగారొక్కరే కుమారులు బళ్ళారికి చెందిన, భాస్కరాచార్య పరంపరా పీఠమునకు, అధ్యక్షు లైన శ్రీ పట్టాభిరామస్వామి గారికి, వీరు దత్త పుత్రులు. కవి గారి భార్య అంబమ్మ. ఈమె అన్నపూర్ణాదేవి వంటిది. వీరికి ఇద్దరుకుమార్తెలు, ఒక కొడుకు గలరు. కుమారుడు శ్రీ టి. బి. రామమూర్తి. బి.ఏ ఆనర్సు-ఆంగ్లభాషోపన్యాసకుల గా, నెల్లూరు వెంకటగిరి రాజా కళాశాలయందు, పనిచేయుచున్నారు. మొదటి కుమార్తె కమలమ్మ, రెండవ కుమారై స్వర్ణమ్మ

 భాస్కరా చార్య రామచంద్ర స్వామి

కుటుంబ చరిత్ర

వీరి తల్లిదండ్రులకు, ఈ కవిగారొక్కరే కుమారులు బళ్ళారికి చెందిన, భాస్కరాచార్య పరంపరా పీఠమునకు, అధ్యక్షు లైన శ్రీ పట్టాభిరామస్వామి గారికి, వీరు దత్త పుత్రులు. కవి గారి భార్య అంబమ్మ. ఈమె అన్నపూర్ణాదేవి వంటిది. వీరికి ఇద్దరుకుమార్తెలు, ఒక కొడుకు గలరు. కుమారుడు శ్రీ టి. బి. రామమూర్తి. బి.ఏ ఆనర్సు-ఆంగ్లభాషోపన్యాసకుల గా, నెల్లూరు వెంకటగిరి రాజా కళాశాలయందు, పనిచేయుచున్నారు. మొదటి కుమార్తె కమలమ్మ, రెండవ కుమారై స్వర్ణమ్మ

సాహిత్య సేవ:
వీరు సంస్కృత శాకుంతల నాటకమును, యథాతథముగ ఆంద్రమున కనువదించి యున్నారు. కాని యిది యింకనూ అముద్రితము. తర్వాత వీరి సర్వాంగ సుందర మగురచన ‘యాత్రికుడు’ అను ముద్రిత ఖండకావ్యము. యాత్రికుడను పద్యకావ్యము, కన్నడము, ఇంగ్లీషు, మొదలగు భాషల * అనువదింపబడినది. ఒకానొకరు నీ యాత్రికుడను.పద్యకావ్యముపై ఇంగ్లీషునందు, అరువది పేజీల విమర్శను వ్రాసినారనియు, విమర్శనా గ్రంథము కూడా, ముద్రితమై యున్నదనియు వినికిడి.

అభిజ్ఞాన, శాకంత లాంద్రీకరణము భాషాంతరీకరణము గుటచే రస, పాక. శయ్యాలంకారాదులు, వెలుగు నోజస్సు బ్రతిబింబింప జేయుటకు దారబ్ధసంచితములను గలిగి, ఈ జనన మందు, అధికతరాభ్వాసముండవలెనని, శ్రీ వారే ఒకచోట పలికినారు. ఈ క్లిష్టతరకార్యమును కొనసాగించి, యశస్సు సంపాదించినారు మన రామచంద్రస్వామి గారు.
గుణగణములు:
శ్రీవారు తమ యౌవనముగ సిరిసంపదలతో గూడి యుండు తమ గృహమును, నయనానందికరంబై, అనిందితమై, నానా సద్విజ శ్రేణి కాశ్రయమై, ధర్మసత్రముగజేసి యుండిరనియు, కవి, గాయక, యాచక బృంధముల కనేక విధముల తోడ్పడి, యుండిరనియు వారి మిత్రులు, ఆశ్రితులు వీరి నిప్పటికినీ బొగడు చుందురు. వీరి వార్ధక్యమున పూర్వపు టౌన్నత్యముగాని, సంపత్తు గాని యుండలేదు. కాని వారు నిరుత్సాపడలేదు. మిత్రులయెడ, నీతనికి గల మమత , యపారము. సరస సత్కవి కావ్యసరణి వినోదించు వారీతని నాశ్రయించి యుండిరి.
ఇతడు ఖండితవాది. రసికుడు. సుజన ప్రాణుడు. కవితా నిధానుడు. ఇతనిచే రచింపబడ్డ నీ క్రింది పద్యమును పఠించిన, ఈత డెట్టివాడో నిరూపించుకో వచ్చును.
ఉ: “లావును తావుగానని, గులాములకొగ్లి, సలాముఁజేసి,సం
భావన నొందు కాంక్షమతిఁబట్టక, జీవన రీతులొత్తు,ని
త్యావసరాల నేకొలది యైనను దీర్చుకొనఁగఁగాకనే
దోవగ గాలమన్ వెడలఁ దోయుచునుంటి విధివ్యధావధిస్”
శ్రీ భాస్కరాచార్య రామచంద్ర స్వామి సంస్కృతాంద్రము లలో గొప్ప పండితులు. కన్నడ, మళయాల, తమిళ, హిందీ, బెంగాలీ భాషల పరిచయము కలవారు. విశాల హృదయులు. కులమత, వర్గ, వైషమ్యములు లేనివారు,

రచించిన కృతులు:
1) శాకుంతల యాంద్రీకరణము 2) బాటసారి 3) మా హంపి 4) యాత్రికుడు.

శాకుంతలలో శకుంతల సౌందర్య వర్ణనము.

చంli పరిమళ మాననట్టి ప్రసవంబు: నఖమ్మలు సోకనట్టి సుం
దరమగు పల్లవమ్ము; రతనమ్మున విద్దము, కోల్పు లేని క్రొ
వ్విరినును దేనె; పుణ్యపదవీ పరిపూర్ణ ఫలమ్మున్పై, యఘం
బెరుగని దామెరూపు, విధి, యెవ్వని భోక్త నొనర్చునే మొకో :
యాత్రికుఁడు
ఇది కవిగారి స్వతంత కృతి. అనుభూతికందిన విషయాలను పాడుకొన్న కమ్మని గీతములే యాత్రికుడు. ఇందలి నలుబది గీతములను కన్నడ భాషలోనికి శ్రీ కె. జోళదరాసి డొడ్డనగాడు గారు అనువదించిరి.

గీ. ఎన్నడీ యాత్రకు మొదలొ. ఎపుడు తుదియొ?
బ్రతుకు నాల్గ దినమ్ముల-పాంధశాల
రస మిగిరి పోవ, శక్తి నీరసత నొందుఁ
బాత్ర మున్నంత నింపుము ప్రాత మధుపు.

గీ. విందు వలదు – కపూరంపు – విడెము వలదు
వలదు. కనకాభిషేక సంభావనలును
అంద అనుభవమునకు, నానందమొకఁడె
పంచిపెట్టుము – త్రావుము – ప్రాత మధువు.

గీ . జ్యోతి నెగ ద్రోయు మోయీ ; విశుద్ధ హృదయ ;
స్నేహ మున్నంతవరకె – నీచేతిలెల్ల
ఆరి పోవకమునుపె – నీవరయు టెల్ల
ఆత్మ జ్యోతి రగుల్చు – స్నేహమయుఁడీవు!

ఆ .వె . ఆఁట వెలఁది ముద్దు – తేటగీతాలలో
నాత్మవాణి – నాగృహాంగణమున
గొదమ వయసు మిసిమి-కొసర, సుమించిన
కొమ్మనీడఁ బాడు – కొందుఁగాక !

గీ . మధువునను – మోజవరచెడు – మదము కలదు
మదమునకు, సోలగుణము – తుమ్మెదరు గలదు
మధుపమునను రస గ్రాహ – మహిమ కలదు
సాజ మిది, రసోపాసకాచార్యులకును.

ఆ .వె . బ్రతుకు నీఁటిబుగ – పగిలు పోవక పోదు
పగిలెనేని, నాద్య భావమొందు;
నాద్యభావ మంద – నంత విశ్వమనంత
విశ్వ మంద నంత విభుఁడు పడఁతి.

కవిగారు బళ్ళారిలో, గీర్వాణాంధ్రములనధ్యయన చేసిన తరువాత, విజయనగర మందలి సంస్కృత కళాశాలలో చేరి, అయిదేళ్లపాటు కావ్య నాటక సాహిత్యములను, అధ్యయనము చేసిరి. స్వయం కృషితో, వారు పెక్కు భాషలతో పరిచయము సంపాదించుకొనిరి. ఇరువదేండ్ల ప్రాయముననే, గీర్వా ణాంధ్రములందు పాండిత్యముతో పాటు, జ్యోతిష వైద్య శాస్త్రము లందు నిష్ణాతులైరి.


రాయలసీమ రచయితల నుండి…..

———–

You may also like...