పేరు (ఆంగ్లం) | Maddulapalli Venkata Subrahmanyasharma |
పేరు (తెలుగు) | మద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్యశర్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | వేంకటసుబ్బమ్మ |
తండ్రి పేరు | నృసింహ సిద్ధాంతి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 8/23/1900 |
మరణం | 10/2/1974 |
పుట్టిన ఊరు | నెల్లూరు జిల్లా (ప్రస్తుతం ప్రకాశంజిల్లా) కు చెందిన పట్టాభిరామపురం అగ్రహారం |
విద్యార్హతలు | 1937లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పట్టా పొందారు. |
వృత్తి | తెలుగు పండితుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సత్యనారాయణ మాహాత్మ్యము – 5 ఆశ్వాసముల పద్యకావ్యం, అమృతసందేశము – వ్యంగ్యకావ్యము, దైవప్రార్ధన – 400 శ్లోకాలు, పద్యాలు, సుభాషితాలు, కవితావినోదము, పెండ్లిరాయబారము – సీతారాముల కళ్యాణము, సత్యనారాయణ సుప్రభాతము, నిరపరాధ నిందలురావు – నాటకము, త్యాగరాజు – 5 అంకముల నాటకము, భక్తపోతరాజీయము – 5 అంకముల నాటకము – పోతన జీవితచరిత్ర, మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి గారి చరిత్ర, కుక్కలమొఱ – పద్యములు, దానకర్ణ బుడ్డా వెంగళరెడ్డి గారి చరిత్ర – వచనము, బ్రహ్మస్వామి జీవితము – వచనము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | కవితాసామ్రాజ్యము అనే పేరుతో ఒక సాహిత్యసంస్థను నంద్యాలలో నెలకొల్పి సాహిత్యసేవ చేశారు. సంస్కృతాంధ్ర కవితాసామ్రాజ్యాన్ని ఏకఛత్రంగా ఏలిన కవిసార్వభౌముడు మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ గారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | మద్దుల పల్లి వేంకట సుబ్రహ్మణ్య శర్మ కవితా సామ్రాజ్యము |
సంగ్రహ నమూనా రచన | కృష్ణయజుర్వేద సంహితతో కొంత. నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకా సింగరబొట్ల పాలెమగృహారములో వేదపారశాలలో .. కావ్యపరిశ్రమ- ఈ మనిలో (గుంటూరు జిల్లా తెనాలి తాలూకా) నాటకాలంకార సాహిత్యపరిశ్రమ- కడపలో శ్రీకళాప్రపూజనమంచి శేషాద్రి శర్మ గారి సన్నిధిలో సంస్కృతాంధ్ర ) కవితావ్యాసంగము , స్వయం కృషి ره కావ్యాఖ్యానమునుండి. |
మద్దుల పల్లి వేంకట సుబ్రహ్మణ్య శర్మ
కవితా సామ్రాజ్యము
విద్యాభ్యాసము
కృష్ణయజుర్వేద సంహితతో కొంత. నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకా సింగరబొట్ల పాలెమగృహారములో వేదపారశాలలో ..
కావ్యపరిశ్రమ- ఈ మనిలో (గుంటూరు జిల్లా తెనాలి తాలూకా)
నాటకాలంకార సాహిత్యపరిశ్రమ- కడపలో శ్రీకళాప్రపూజనమంచి శేషాద్రి శర్మ గారి సన్నిధిలో సంస్కృతాంధ్ర )
కవితావ్యాసంగము , స్వయం కృషి ره కావ్యాఖ్యానమునుండి.
కుటుంబ చరిత్ర
శ్రీశాస్త్రిగారి ముత్తాత వేదాధ్యాపకుడు; తాత జ్యోతిష్పం డితుడు, తండ్రి జ్యోతిష్పండితుడు. పినతండ్రి వ్యాకరణ పండితుడు. వీరిది పండితవంశము కవిగారికి నలుగురు తమ్ములు కలరు. వీరు పెద్ద వారు. వీరికిసంతానములేదు. తమ్ములకు సంతానముకలదు.
సాహిత్య సేవ
నంద్యాలయందు వీరు ‘కవితా సామ్రాజ్యము”ను నెలకొల్పి గొప్పసాహిత్య సేవనొనర్చిరి. ఆ సంస్థ ద్వారా ఈ క్రింది రచనలను ప్రచు రించిరి.
1) సత్యనారాయణ మాహాత్మ్యము-5 ఆ, పద్యకావ్యము 2) అమృతసందేశము-వ్యంగ్యకావ్యము, ప్రతిపద్యము రమణీయము. 8) దైవప్రార్థన – సుభాషితములు, అనుక్షణ పఠనీయములైన పద్యములు, శ్లోకములు 400. 4) కవితావినోదము – పథమ సంపుటము-వినోదకరములైన విషయములు 40, వివరణములతో, 5) పెండ్లి రాయబారము-సీతారాముల కల్యాణము, విపులమైన వివరణముతో. 8) సత్యనారాయణ సుప్రభాతము-టీకాతాత్పర్య ములతో, సత్యనారాయణ సుప్రభాతము – మూలము మాత్రము. 7) నిరపరాధ నిందలురావు – నాటకము. గజానన జననము,
చంద్రునకు శాపము. 8) త్యాగరాజు-5 ఆం, నాటకము. 9) భక్త పోతరాజీయము – 5 అం. నాటకము బమ్మెర పోతనామాత్యుని చరిత్ర. 10) మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రిగారి చరిత్ర
11) కుక్కల మొఱ-కటి క హృదయ ము ల నే ని కరగించు పద్యములు. 12) దానకర్ణ బడ్డా వెంగలరెడ్డిగారి చరిత్ర- వచనము , 13) బ్రహ్మ స్వామి జీవితము-వచనము.
అయ్యలరాజు నారాయణా మాత్యకవి ప్రణీతమైన “హంస వింశతి” అను శృంగార పుబంధమునకు టీకా తాత్పర్య వివరణమును,యెనుబది పుటల పీఠికను వ్రాసియున్నారు. వాంఛేశ్వర కవి రచితమగు “మహిషశతకము” నకు తెలుగులో వివరముగా తాత్ప ర్యము వ్రాసినారు. దక్షిణామూర్తిస్తోత్రమును ఆంద్రీకరించినారు.
పై మూడు పౌత్తములు శ్రీవావిళ్ల వారిచే ప్రచురింపబడినవి. వీరాంధ్ర వచన భారతమును వ్రాసిరి. దానిని ఆర్. వెంకటేశ్వర అండ్ కో, వారు ప్రచురించిరి. వీరాంధ్రీకరించిన ‘ప్రియదర్శికా నాటిక ఆంధ విశ్వ విద్యాలయమువారి పట్ట పరీక్షకు పఠనీయముగ నున్నది. గాడేపల్లి వీరరాఘవ శాస్త్రిగారి చమత్కార కవితాఘట్ట ములను ‘ చమత్కార కవిత్వ మనుపేర ప్రచురించిరి.
ఉభయభాషల పాండిత్యము వీరిది. పోతనవలె ధారాళుద్ధి గల కవితనల్ల గలవారు.
సంస్కృతాంధ్ర కవితాసామ్రాజ్యము నేకచ్చత్రముగా నేలిన కవిసార్వభౌములు వీరు. వీరి కవితా సామ్రాజ్యము (స్వగృ హము) న సాహితీ బంధువులు పాంథులట్లు కొంతతడపు సేద తీర్చు కొని సాహిత్యామృతమును గ్రోలి వెళ్లేడివారు.
కావ్యపరిచయము
అమృత సందేశము-ప్రచురణ 1954.
ఇది యొక్క ఆభిత్తి చిత్రకర్మ. దీని కొక యితివృత్తము లేదు, ఊహా గానము తప్ప.
విభావ సామగ్రిలో కాలచక్రమున ఘటిల్లుచున్న కరువులు, కాటకములే ఆలంబనము. ఆఁకటి చావులు, అల్లాడిపోయిన యార్త జీవుల కంకాళదృశ్యములే ఉద్దీపనములు.
1941 వ సంవత్సరపు టుత్తరార్ధమున ఆంధ్రదేశములోఁ గొన్ని పాంతములను ముంచియెత్తిన వీరక్షామ పరిస్థితులను, 1943 లో పత్రికాముఖమున వినవచ్చిన బెంగాల్ రాష్ట్రములోని యాఁకటి చావు వార్తలను, ప్రకటించిన ఆ బిక్కజీవుల మృత కళేబర దృశ్యములు కవిగారి కావ్యావతరణకు దోహదములు. కరవు కాటకములను దీర్చు మేఘనిట్లు కవిగారు సంబోధించిరి
ఉ. ఏ మనుకొంటివో జలదః యిచ్చకు వచ్చినయట్లు చేసి క
ద్రామఁదలంచితే మొ? యది పారుడు ; దాధ్చ యన్నఁగత్తి పై
సాము సుమీ! సమీహితము చక్కఁగఁదీర్చవలెన్ ; నియుక్తిలో గోములుగీములున్ దగవు; గ్రుడ్డి ప్రభుత్వము గూద దేమియున్.
మ . గమనింపందగు ; నీదురాక యెపుదో గానుండకముందే ప్రజ ల్పముహూర్తంబని గౌరవార్ధమయి డాళ్ళున్ , రిచ్పలున్ “.గడ్డిగా
దము లేరించియు,నిండ్లు వాకిళులు క్రొత్తర్ లేపియు -గాచియు
న్న, మనస్పూర్తిగ నాదరించినది యేనా డయ్చ? నీడభ్రగా :
సీ. నిల్కడగా నిల్చి , నిముసమే- గురియ వే !
సీయబ్బసౌమ్మేమి – పోయెనయ్య ;
ఆ రీతిఁ గురిసిన , నంతటఁ గురియ వే !
నీతాతగంటేమి నీల్లెనయ్య ?
అంతటఁ గురిసిన , నదను దప్పింతుచే !
నీవారిస్సౌత్తేమి ! నిలిచెనయ్య?
అదను దప్పించిన నావలఁ గనరావె !
నీ ముల్లె ముడుపేమి ! నీఁగెనయ్య ?
తే. కానవచ్చిన. యట్టలే ! కానవత్తు
కురియవచ్చిన యట్టులే ! యురిమి మెఱతు
చిట్టచిను కుండఁటోవ ది , క్క-టులందు
ఏమి చిత్రవిచితాల • స్వామివయ్య?
కుక్కల మొఱ ‘ కావ్యమందు తమ భూతదయను అమితముగా ప్రకటించిరి. కవిగారి హృదయము వెన్నవంటిది. ఆ పద్యములను చదువు పాఠకుల, హృదయములెంత బండతామైనను కఱగకమానదు. ” కుక్కనుజంపిన పాపము గుడిగట్టినాపోద”ను నానుడిని వీరు ప్రబోధపఱచిరి. కుక్కలు తమ మొఱనిట్లు మానవ కాతికి విన్పించినవి.
ఉ : భూత దయాళులార ; పరిపూత గుణా కారులార ; తండ్రులా
రా ! తమ తోడిబిడ్డల దు ; రంతపుఁజావును జి త్తగింపరే: భూతదయాపరత్వమెటు; వోయెనొ; మానపు లయ్యు మమ్ముఁ జే
సేతులఁబట్టి చంపుదురె; చెల్లరె; యింతటి ఘోర మున్నదే!
ఉ : ఇప్పటికింత పుట్టినది ! యింతటితో నిది యూటిపోవ;దీ
ముప్పనఁ గుక్క లన్ని పరి పూర్తిగ నాశన మైనమీఁదవా
తప్పను జేసినట్టి యొక ద్రాబను బట్టి జగాన మీరునుం
దప్పకొనంగఁ జాలుదురె? | దాని నెఱుంగక సంతసింతురే?
మ. ఒక దుష్టాత్ముడు చేసినట్టి పని క య్యో! వానిదోషాన వా
నికులంటే హత మార్చు ధర్మ మెప్పడే నిన్గల్లెనే నేఁడు గా
కకటా! నేఁటికి మాకు మూడినది రే ; పన్నన్ మతెవ్వారికెం
తకుఁగానున్నదొ; యిట్టి శాసనమునే ; తప్పింపఁగాఁ జూడరా !
ఉ. కుక్కలఁ జంపునంతటన I కుల్కఁగ నేటికి? రేపుమాపటన్
నక్కలు వచ్చి యూరఁబడి ! నన్ దెలియంగల దప్పడైనమా
యొక్క మహోపకార;మయiయో:తమరందఱు కన్నులారనొ
క్కొక్కటి చూచికూడ దయయుంపక పోయితి,రేమికాలమో!
చ. ఎనిమిదణాల చిల్లర కె; యించుక త్యాగము సేయఁగల్గుచో
ఘనముగ నొక్క ప్రాణమునుగాచినపుణ్యము మీకు దక్కు మీ
రొనరుచు నిట్టి సాయముననూపిరి దక్కిన మేము మీ ఋణం
బును బయినుంచుకొందుమె?గు ముల్ గుములై తమ సేవ సేయమే.
క. ఇప్పటి కీగండంబును, దప్పింవుడు ; ముందుమాట ! తలపోయుద; మొు
క్కప్పడు ప్రభువురె దీనిన్, దప్పింపరె; నాఁటి కొక్క; దై_వములేఁడే,
రాయలసీమ రచయితల నుండి…..
———–