రూపనగుడి నారాయణరావు (Rupanagudi Narayanarao)

Share
పేరు (ఆంగ్లం)Rupanagudi Narayanarao
పేరు (తెలుగు)రూపనగుడి నారాయణరావు
కలం పేరు
తల్లిపేరుసీతమ్మ
తండ్రి పేరునరసింగరావు
జీవిత భాగస్వామి పేరుగౌరమ్మ
పుట్టినతేదీ7/1/1885
మరణం8/8/1963
పుట్టిన ఊరుబళ్ళారి
విద్యార్హతలుF.A.
వృత్తిఉపాధ్యాయులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునాటకములు : విప్రనారాయణ , గౌతమ బుద్ధుడు , సౌందర నందన ,ఉన్మత్త రాఘవము
అనువాదములు: అరవిందుని జీవిత చరిత్ర, ప్రార్ధనలు-ధ్యానములు, అరవిందుల వారి ‘కాళిదాసు’నకు తెలుగు అనువాదము.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుశ్రీ శారదా పీఠం – హిందూపురం వారు “సాహితీ శిల్పి” అని బిరుదు ప్రసాదించి గౌరవించిరి.
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికరూపనగుడి నారాయణరావు
సంఘాత మరణ వర్ణన
సంగ్రహ నమూనా రచననారాయణరావు గారు పెక్కు గ్రంథములు రచించినారు. కొన్ని ముద్రితములు. ఎక్కువ భాగము అముద్రితములు. విశ్వద్కవి వరేణ్యులు శ్రీ రూపనగుడి నారాయణరావు గారు పెక్కు రచనలు రచించియు వానిలో కొన్నింటి నయినా ప్రకాశ పరచుకొన జాలినవారుకారు.
శ్రీ రూపనగుడి నారాయణరావు రాయలసీమ యందు వన్నెగన్న విద్వన్మణులలో నొక్కరు. ఆ బాలవృద్ధులకు బ్రయోజనకరము లగు కావ్య, నాటక, విమర్శనాదులు వీరు రచించినవి పెక్కులు. వానిలో బాలావబోధకములైన గ్రంధములు రమారమి పది.

రూపనగుడి నారాయణరావు
సంఘాత మరణ వర్ణన

నారాయణరావు గారు పెక్కు గ్రంథములు రచించినారు. కొన్ని ముద్రితములు. ఎక్కువ భాగము అముద్రితములు. విశ్వద్కవి వరేణ్యులు శ్రీ రూపనగుడి నారాయణరావు గారు పెక్కు రచనలు రచించియు వానిలో కొన్నింటి నయినా ప్రకాశ పరచుకొన జాలినవారుకారు.
శ్రీ రూపనగుడి నారాయణరావు రాయలసీమ యందు వన్నెగన్న విద్వన్మణులలో నొక్కరు. ఆ బాలవృద్ధులకు బ్రయోజనకరము లగు కావ్య, నాటక, విమర్శనాదులు వీరు రచించినవి పెక్కులు. వానిలో బాలావబోధకములైన గ్రంధములు రమారమి పది. అనువాద సాహిత్యమున ఈ పండితవర్యుని చేయి అందె వేసినది. నారాయణరావు గారి వచన కృతులలో బెక్కులనువాదములు. శ్రీ వారాం గ్ల భాష నుండి యధామాతృకగా విషయము నాం ధ్రీకరించుట యందు సిద్ధహస్తులు. వీరు పాండుచ్చేరి అరవిందాశ్రమమున బ్రచురింపబడిన కాళిదాసు, భారతీయమేధ, యోగభుమికలు ,జాతీయ విద్యా విధానము ,జీవిత సమస్యలు, మొదలగు చిన్న ఆంగ్ల గ్రంథములను పండ్రెడింటిని దెనిగించినారు. భాషాంతర రచనల వలన నారాయణరావు గారి యందంతర్నిహితమై యున్న కళోపాసనాశీలము, కావ్య పఠనాసక్తి, పారమార్థిక బుద్ధి, లోకసేవాపరత యతిశయించినవి తత్ఫలితముగా దదుపరి భగవద్గీత ‘Life Devine’ మున్నగువానిని నధ్యయనము చేసి ‘ఆధ్యాత్మికోపాసన’ లను గ్రంధములను వచనరూపమున రచించగల్గిరి. వివిధ కవుల కావ్యముల గూర్చి కడుజక్కగా బరామర్శించు ఉద్గ్రంధము ‘కావ్యనిదానము’ విద్యార్థులకే కాక ఉపాధ్యాయులకును, పండితులకు కూడా మిక్కిలి ఉపకరించు గ్రంథరాజమిది.

శ్రీ నారాయణరావుగారి కబ్బములు దృశ్య-శ్రవణ రచన కృతులను మొత్తెరుగులు. అందు వీరు రచించిన దృశ్య కావ్యములు పదునుకొండు వీరిలో స్వకల్పితములు ఆరు. ఆంగ్ల, గీర్వాణ భాషల నుండి ఆంధ్రీకరింపబడినవి తక్కినవి. ఇందు మొదటి ఆరింటిలో విప్రనారాయణ నాటకము 19191-20లో రచింపబడి శృంగార, శాంత, కరుణ, హాస్యాదిరసములెల్ల విరియించుచున్నది. ఇయ్యది హిందూపురం శ్రీ కృష్ణ దేవరాయ గ్రంధమాల వారిచే 1932 నందు బ్రకటింపబడినది. అందలి ప్రకృతి వర్ణనలు మనోహరములను, గంభీరములను,సందర్భోచితములను కవితా నీరాజన మను ఖండకావ్య సంపుటి 36 శీర్షికలు కలది. భర్తృహరి సుభాషిత రత్నావళి బోలిన నీటి ప్రదమగు ‘ఆర్య సుభాషితము’ ఒక పద్యకృతి మహాకావ్యసారములనదగిన 460 పద్యములందు బ్రకాశితములు. వీరి కృతులలో వేలకొలది చరణముల (22739) నొప్పిన యనువాద గ్రంధము ‘కుమారభారతము’. కవిగారు దీనిని వ్యార్థకమున వ్రాసిరి. కేవలము సులభచ్ఛందముగల సీసము, కందము, తేటగీతి, ఆటవెలది , ద్విపద, రగడ ఈ జాతీయ పద్యముల తోడనే ఇది రచయింపబడినది. సుప్రసిద్ధులగు శ్రీ చక్రవర్తి రాజగోపాలాచార్యుల వారు ఆంగ్లమున రచించిన కుమారభారతము దీనికి మూలము. ఇది అనువాదము అయినను స్వకల్పిత విషయ విశేషములు పెక్కులుండి రసధావ బంధురముగా విరాజిల్లుచున్నది.

కావ్య పరిచయము
1936 వ సంవత్సరమున క్వెట్టా భూకంపము పుట్టి , దానిచే నుప్పతిల్లిన వినాశనమును గూర్చి యదార్ద్ర హ్రుదయుడైన శ్రీ రూపనగుడి నారాయణరావు గారు గేయ రూపమున ఇట్లాలపించి ఆశ్రుతర్పణ మొనరించినారు.
రెండునొకటవ జామునంగోళ్ళు-నిలుచుండి
చట్టపలు పటపట జాడించి -మెడసాచి
పయిజూచి ‘కొక్కొఱొకో’ యంచుగూపెట్టి
తమతావు లందట్టె – ముడిగికొని కనుమూసి
యుండంగా జాయాతుల్ పొదవియొండొరుల
కౌగిళ్ళ నాచలిని నిద్రించు చుండగా
బిడ్డలును, తల్లులును నొత్తిగిల్లి పన్నుండి
యుండంగ నాకటను బెల్లేడ్చు శిశువులకు
దల్లులుగడు వత్సలత మెయిం జనుగుడిపి
నిదుర కంటను, వారిజో కొట్టు చుండగ
పురమొక్క పెట్టున మొదలంటగానూగె;
….. పృథ్వీయుం దన కరాళాస్యముం
దెరచి యిసుమును గ్రక్కె ; బలువెలుంగుల సుమిసె
తమయిండ్లె తమపై – సమాధులై ఏర్పడగా
నోట నుడవగా రాని భాదలంబొందుచును
సుఖశయ్యలందున్న వారున్నటులే,నిజ
ప్రాణముల్ గోల్పోయి నారేమని వచియింతు-


శ్రీ నారాయణరావు గారి కుమారభారతము లో ఇంద్రప్రస్థ పురమునందు ధర్మజుని పట్టాభిషేక శుభసమయమున మన్మథ పూజనొనర్చు కన్య పడుచులలో విజయుని మనసు నాకర్షించిన సుభద్రనిట్లు కవిగారు వర్ణించిరి.

సీ. అప్పుడప్పుడె ఫుల్లమౌ, పుష్పమునుదాల్చు
లలిత, మంజుల, దేహ, లతిక దాని,
కుఱుచ–మట్టముగాక–మఱిచాల​ పొడువునుం
గాక–సమమగు విగ్రహముదాని;
కుసుమ సాయకు కేల నెసగు పుష్పేతరం
బగు–నాఱవశరమై–యడరుదాని;
ఉదయ స౦ధ్యసమయోజ్ఝి తారుణ రుచి
రాబ్రము౦బలె-రమ్యమైన​దాని;

గీ. చంపక సదృశ చారునాసగలదాని;
కపట భాపశూన్యాభివీక్షణముదాని
జెలుల యన్యోన్య భాషణంబులను గృష్ణ,
సోదరియగు, సుభాద్రగా- నూహజేసె.

(ఆది పర్వము 87…..98చ – రూపన్నకుమార భారతము)
ఇమ్మహాకావ్యము కర్తకబుట్టువు నొసంగిన రూపనగుడి గ్రామము నందలి రూపన్న దేవునకు అంకిత మొసగిబడినది.

రచన: రూపనగుడి నారాయణరావు

———–

You may also like...