సోంపల్లి సంపత్ కృష్ణ మూర్తి (Sompally Sampath Krishnamurthy)

Share
పేరు (ఆంగ్లం)Sompally Sampath Krishnamurthy
పేరు (తెలుగు)సోంపల్లి సంపత్ కృష్ణ మూర్తి
కలం పేరు
తల్లిపేరుమంగాంబ
తండ్రి పేరునంజపార్యుడు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1913
మరణం1/1/1969
పుట్టిన ఊరుకొక్కంటి-కదిరి తాలూకా-అనంతపురం జిల్లా
విద్యార్హతలు
వృత్తిప్రధానాంధ్రపండితులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుభక్త రక్షామణి (పద్యశతము) , ఆపదుద్ధారక స్తోత్రము, వాసవీ విలాసాభి రూపకము (నాటకము) , మల్లి కార్డనదైవవినుతి, రామాస్త్రము, పుష్ప విలాసము, కవితానంద వాల్మీకి రామాయణము 2 సంపుటములు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులువిద్వాన్ కవితానంద, శతావధాని, అష్టావధానదక్ష.
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికసోంపల్లి సంపత్ కృష్ణ మూర్తి
సంగ్రహ నమూనా రచనగురువులు- విద్వాన్ కవిసార్వభౌమ, అభినవ బాణకవి, ఆశుకవి చక్రవర్తి. శతావధాని శ్రీ గౌరావజల రామకృష్ణ సీతారామ సోదరకవులు. అనంతవర. ఆగ్రహారం. (నెల్లారు జి)
కుటుంబ చరిత్ర :
శ్రీ కవిగారి ఇంటిపేరు సోంపల్లివారు. వీరు శ్రీ రామ చంద్ర, చాలా తిపురసుందరీ పాదసరోజ సేవా పరాయణులు. మంగాంబా, నంజపార్యతనూభవులు.”ఉల్చకమ్మ’ యను తెగకు జేరిన విపులు. విశ్వకళాశాలవారి, విద్వత్పరీక్ష యందారితేరి, సంస్కృ తాcధములయందుఁ బాండిత్యమును, సంపాదించిరి.

సోంపల్లి సంపత్ కృష్ణ మూర్తి

గురువులు- విద్వాన్ కవిసార్వభౌమ, అభినవ బాణకవి, ఆశుకవి చక్రవర్తి. శతావధాని శ్రీ గౌరావజల రామకృష్ణ సీతారామ సోదరకవులు. అనంతవర. ఆగ్రహారం. (నెల్లారు జి)
కుటుంబ చరిత్ర :
శ్రీ కవిగారి ఇంటిపేరు సోంపల్లివారు. వీరు శ్రీ రామ చంద్ర, చాలా తిపురసుందరీ పాదసరోజ సేవా పరాయణులు. మంగాంబా, నంజపార్యతనూభవులు.”ఉల్చకమ్మ’ యను తెగకు జేరిన విపులు. విశ్వకళాశాలవారి, విద్వత్పరీక్ష యందారితేరి, సంస్కృ తాcధములయందుఁ బాండిత్యమును, సంపాదించిరి.
ముద్రితకృతులు:
(1) భక్త రక్షామణి (పద్యశతము) (2) ఆపదుద్ధారక స్తోత్రము (3 ) వాసవీ విలాసాభి రూపకము (నాటకము) (4 ) మల్లి కార్డనదైవవినుతి (5) రామాస్త్రము (6 ) పుష్ప విలాసము (7 ) కవితానంద వాల్మీకి రామాయణము 2 సంపుటములు
అముద్రితము :۔
(1) సతీతిలక (నవల) (2) ఆంధ్ర వ్యాకరణ వివరణము (3) శంకర విజయము (హరికథ ముద్రణము (4) ఆంద్ర సూర్య శతక టీక. (5) దైవజ్ఞ భూషణము (8) సత్యనారాయణ వాచకములు ఐదు. (7) కాక్కంటిపాళెగారి చరిత్ర
కావ్యపరిచయము
ముద్రిత గ్రంథము కవితానంద వాల్మీకి రామాయణము (సాకాండము) నుండి కొన్ని పద్యములు. ఈ గ్రంధము 1940 నందు ముదింపబడినది.

దశరధుఁడు రోమపాదునకు దన కూఁతురకు శాంత నొసంగుట.

తే. ఆ మహీపతి, హితుడైన-రోమపాదు
నకునొసంగెను దనదు శాం-తా కుమారిఁ
దనయఁగా, రోమపాదుండుఁ-దత్కృతమున
కాత్మసంతసమందుచు-నరిగెఁబురికి
మ: ప్రవినీతుండగు రోమపాదునిజరా-స్త్రం బందనావృష్టిసం
భవమయ్యెకాముని ఋష్యశృంగుఁబిలిపిం-పంబూనియా తండు మేల్
జవరాండన్ వెలయాండనాశ్రమము పజ్జంజేరఁగా బం పె వా
రవునౌనంచు నుతింపఁగాఁదగిన నొ-య్యారంబుదీపింపఁగన్ .
కీ . అమలవిభాండక మున్యా
శ్రమమును జేరంగ నరిగి-చయ్యన వేశ్యా
రమణులు సంకీతవిలా
సములును మణినృత్యవాద్య-సంగతులలరన్
తే : శ్రీ విభాంకక సుతుఋష్య-శృంగుజూచి
కౌఁగిలించుచు నగవు-గవ్రువాక్య
ములను సత్కారములఁగడు-మోహ వళునిఁ
జేసియాతనిఁదమవెంట-జేరఁవిలిచి.

తే : రోమపాదున కర్పింప-నామునీంద్రు
డడుగుపెట్టిన మాత్రనా-పుడమియందు
మంచివానలు కురిసెస-మంచితముగఁ
బాడి పంటలు పొలుపొందె-భవ్యమహిమ.
కవితానంద వాల్మీకి రామాయణము
(యాత్రా కాండాదికము-ప్రచురణ–1986–87)
-: సీతను లక్ష్మణుడు వనభూముల విడుచుట:

ఉII అన్నకు గ్రామెుక్కిసీత నిలయంబునకుంజని తేరువచ్చె:రా
మన్నయు నీదుకోర్కి కయా-యమ్మునిపల్లె యు వాల్మికాశ్రమం
బున్నపౌలాన నిన్విడిచి-యూరికి రమ్మని చెప్పెలెమ్ము; నీ
పన్నెపు పంటయెట్టిదియొ? పూనుమిదే: వదినే:రథంబుపై.

కం : ఆ క్షితిజాతకు నదరెను
దక్షిణ నేత్రంబు వఱడు-దరిఁబొరి యరచెన్
బక్షులవి, యక్రమముగ, న
నుక్షణమును నరదమును గనుంగ్”నుచరి గెన్ .
ఉ : హేతువెఱుంగరామిఁదన హృత్కమలంబు చలింప, మేదినీ
జాత, యిదేమి?లక్ష్మణ:విచారముగల్లెడు నీ ప్రయాణమే
భీతిగఁదోచుచుండె; నడవికా శకునంబులు చెఫ్లవయ్యె; భూ
నేతకు రామచంద్రునకు నిత్యశుభంబునుక్షేమమౌ గదా!
కం : అనియుడుగ, నతనిక్షేమం
బున, కేమి కొఱంతలేదు-పుణ్యాంగసలా
మునిపత్నులె-నిన్చుటోతురు
మనమున నిబ్బరము గలిగి—మనుమ నెనతడున్ “

ప్రాత -కొత్త.
సి : రాజులరాణుల-రాజ్యసంపదప్రాఁత
సర్వంబునకు, నరాజకత క్రొత్త
హరిహరపూజాదు- లాచరించుట ప్రాఁత
హరిజనోద్ధారకులగుట క్రొత్త
అన్న సత్రములలో-నాదరించుట ప్రాఁత
అన్నమే యిదనట్టి-యరవు క్రొత్త
వలసిన ధాన్యంబు-గలిగియుండుట ప్రాఁత
తిండిగింజలులేని-స్థితియెక్రొత్త

గీ : కులమతాచారములు విల్పు కొనుటప్రాఁత
కులమతాచారములుకూల్చు-కొనుట క్రొత్త
తారతమ్యము తెలియు వర్తనము ప్రాత
తారతమ్యములేని, వర్తనమ్చుకొత్త

సీ : పరపురుషునిఁగాంచి-తరుణిజకుటప్రాఁత
పరితృప్తికై వెంటఁబడుటక్రొత్త
ఇల్లాలుతనయింటనీలవ-దుటప్రాఁత.
రచ్చలఁదిరుగాడు మెచ్చుక్రొత్త
బూటకాలకు లొంగి పోవకుండుట ప్రాఁత
వానికైయలవాటుపడుటక్రొత్త
అలముఖస్తుతిగమాటాడకుండుటప్రాఁత
ముఖనుతివెన్క-దుర్బుద్ధి క్రొత్త.
గీ : కావ్యమునఁద్యాగశీలముల్ గనుట ప్రాత
అవి, యుపన్యాసములయందెయగుట క్రొత్త
చెడ్డచెడ్డదె-మంచి మంచిదియె ప్రాఁత
చెడుగు మంచిది-మంచిది చెడుగుకొత్త.

———–

You may also like...