కొత్త సత్యనారాయణ చౌదరి (Kotta Satyanarayana Chowdary)

Share
పేరు (ఆంగ్లం)Kotta Satyanarayana Chowdary
పేరు (తెలుగు)కొత్త సత్యనారాయణ చౌదరి
కలం పేరు
తల్లిపేరురాజరత్నమ్మ
తండ్రి పేరుబుచ్చయ్య చౌదరి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ12/31/1907
మరణం12/15/1974
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా తెనాలి తాలూకా అమృతలూరు గ్రామం
విద్యార్హతలుఉభయ భాషా ప్రవీణ పట్టా ప్రథమ శ్రేణిలో పొందినారు.
వృత్తిపాములపాటి బుచ్చినాయుడు కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా ఉద్యోగం చేస్తూ రచనా వ్యాసంగం కొనసాగించారు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెకళాప్రపూర్ణ-పండిత కొత్త సత్యనారాయణ చౌదరి
స్వీయ రచనలువైదిక వాఙ్మయ చరిత్ర, సతీసప్తతి (పద్య), కథా వింశతి, చంద్రా పీడచరిత్ర, కామ శాస్త్రము (వాత్స్యాయన మహర్షి ), కావ్యమాల 1వభాగము, కావ్యమాల 2వభాగము, సుభాషితము, ధర్మశాస్త్రము (మనుస్మృతి ), కవుల కథలు, వరరుచి, ఈశ్వర సేవకులు, విక్రమ కథలు, మ్రొక్కుబడి (పద్య), నవనాధము (గద్య), బృహత్కథలు,వత్సరాజు, విక్రమాదిత్యము, సాలభంజికలు, బాపూజీ (పద్య), చారుదత్తము, నీతిచంద్రిక (సవ్యాఖ్య), చిన్నయ్య సూరి చరిత్ర), నైషధము, కలిపురాణము (పద్య)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఆంధ్ర విశ్వకళా పరిషత్తు ఇతడిని 1974లో కళా ప్రపూర్ణ పురస్కారంతో సన్మానించింది. పొన్నూరు, నిడుబ్రోలు పట్టణ ప్రజలు గజారోహణ సత్కారం చేశారు.
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకొత్త సత్యనారాయణ చౌదరి
ప్రస్తావన
సంగ్రహ నమూనా రచనఝరీ వేగమును బోలి కొంగ్రొత్తరీతులుగ దృశ్యమానమగు నేటి రాజకీయ రంగమున విశేషముగ మన్నింప దగిన వారిలో “ఖాను సోదరులోకరు . వీరిలో డాక్టరు ఖాన్ సాహెబు వయసున పెద్ద యను విషయము కొందరికి కొంగ్రొత్త అమూల్య ములగు నీ నాయక రత్నములను పుస్తక రూపకముగ ప్రకాశింప జేసిన శ్రీ మహా దేవ దేశాయి యెంతయు ధన్యుడు .

కొత్త సత్యనారాయణ చౌదరి

ప్రస్తావన

ఝరీ వేగమును బోలి కొంగ్రొత్తరీతులుగ దృశ్యమానమగు నేటి రాజకీయ రంగమున విశేషముగ మన్నింప దగిన వారిలో “ఖాను సోదరులోకరు . వీరిలో డాక్టరు ఖాన్ సాహెబు వయసున పెద్ద యను విషయము కొందరికి కొంగ్రొత్త అమూల్య ములగు నీ నాయక రత్నములను పుస్తక రూపకముగ ప్రకాశింప జేసిన శ్రీ మహా దేవ దేశాయి యెంతయు ధన్యుడు .

ఆంగ్లములోను-హిందీయందును శ్రీ మహా దేవ దేశాయి వెల యించిన ఈ చరిత్రమును ఎన్నఁడో పరికించితిని, నాయదృష్టమునఁ గాఁబోలు –ఇంత దనుక నియ్యది తెలుగు రాలేదని తెలిసికొని మిక్కిలి ఆనందము నొంది తోడ్తో అనువాదమునకుఁ గడంగితిని. అనువాదము జరుగు తరిని ఖాన్ సోదరుల జీవితమున కొన్ని మార్పులు వెలువడినవి. చదువరు లీ చరిత్రమును సాకల్యముగఁ జదివిన పిదప ప్రధానముగ బరికింపఁ దగ్గ అంశములు కొన్ని అను సంధించితిని .
గాంధిమహాశయుని రాజకీయ వ్యూహమునఁజేసి యావత్ర్ప ప్రంచ మబ్బుక మందునటులు ‘కాంగ్రెసు’ నాయకులు ప్రభుత్వ పీఠముల కెక్కిరి. మన దేశమం దిట్టి సుకృత విశేషము కేవలము ఆ ఆరు రాష్ట్రములకు మాత్రమే తొలుత చిక్కినది. అట్టి తరి ఆయాచితముగనే రాజప్రతినిధి ఒక్కనాడు మహాత్ముని రావించుకొని మంతనము సలిపెను. అద్దాన అప్పుడపుడే అబ్దుల్ గఫూర్ ఖాన్ సాహేబునకు స్వరాష్ట్రమగు సరిహద్దు నకు బోవ స్వాతంత్ర్యము కలిగినది . అదే యదనున సరిహద్దు రాష్ట్రములో అప్పటి మంత్రివర్గము కాంగ్రెసు తాకిడికి ఉర్రూతలూగి చావు బ్రదుకులలో దేలి పోవ సా గెను. గఫూరు, జన్మభూమినిఁ గాలు పెట్టిన తోడనె ఆ అమాత్య మండలి అదృశ్యమాయెను. నేడు సరిహద్దు రాష్ట్రమునకు ప్రధాన సచివుఁడు డాక్టరు ఖాన్ సాహేబు . తక్కిన ఆరు రాష్ట్రములతోపాటు – ఈ రాష్ట్రముకూడ త్యాగము మూర్తుల అధ్వర్యమునకు తేబడినదను భాగ్యము ఈ ఖాన్ సోదరులకు దక్కినది .
తేఁబడినదను భాగ్యము ఈ ఖాన్ సోదరులకుఁ దక్కినది.

నేఁడు – ఈ సోదరుల సాంసారిక విషయములలో పెక్కుమార్పులు పొడమినవి . గఫూర్ ఖాన్ తనయుఁడు చదువు ముగియక మున్నె అమెరికా నుండి అరుదెంచెను. ఖాన్ సాహేబు పుత్రునకు, సోఫియాసోమ్జీ ” ( వీరవనిత) ధర్మపత్ని ఆయెను. పై పరామరిక చాలమి ఈ అన్నదమ్ముల పంట చేలు బొత్తిగా పాడుపడెను. తొంటి భాగ్యభోగ్యము లన్నియా సన్నగిల్లినవి.

ఇంతకుమున్ను ఖాన్ సాహేబు రెండువత్సరములకు హెచ్చుగ భారత శాసనసభలో సభ్యుఁడుగనుండి రాజకీయములలో రాణింపఁ జొచ్చెను. అపుడు భారత శాసనసభలో కర్షక పక్షమున కీతడధ్యక్షుడు . తెలుఁగు నేలకు దీప్తి తెచ్చిన ‘ఆచార్య రంగ” మున్నగు నాయకులతోఁ గలసి మెలసి కర్షకులకుఁ గావలయు ప్రధానాంశముల నేమక మిక్కిలి పాటపడినాడు. ప్రధానామాత్యుఁడయి ప్రధమోపన్యాసమందే ‘‘రైతు జనసేవయే నా విధి’ యని ముచ్చటించినాడు .

1936- నుండి ఖాన్ సాహేబు ; 1986 డిసెంబురు నుండి అబ్దల్ గఫూరు’ను ‘కాంగ్రెస్-వర్కింగ్ కమిటీ సభ్యులయిరి. ఒక తూరి పెక్కుమంది కావలయునని పెట్టు పట్టినను, “కాంగ్రెసు- ప్రెసిడెంటు” పదవి తనకు వలదని గఫూర్ నిరాకరించినాఁడు.

వీరి సర్వతోముఖమగు ప్రతిభ – అద్భుతమగు నిర్మాణ కార్యక్రమము –అనుస్యూతమగు దేశ సేవ- అనుపమానమగు దైవచింత అకుంఠితమగు సత్ప్రవర్తన-అమేయమగు క్రమశిక్ష మున్నగు విశిష్ట గుణములు పెక్కులు ఇందు సవిశేషముగచిత్రింపబడ్డవి. నేషనల్ కాంగ్రెసు వృత్తాంతములతోపాటు త్యాగమూర్తుల
ఉదంతమును గుర్తింప వలెనని ఉవ్విళులూరు నా తెలుగు సోదరులకు ఎరుక పడుట కయి యిది అనువదించితిని . మూల గ్రంధములు రెండింటను ఒండొండ అలంతి మార్పులు కొన్ని కొన్ని కానిపించినవి . అట్టి పట్టుల నాకు ఉచితమని తోచినట్టులే అనువాదమునకు గడంగితిని .
ఇది అనువదించి ఈ తీరు తెచ్చుటలో నా శ్రమము వ్యయము మాట యెటులున్నాను, అనువాదమున యియ్యేడ నాకు చాలగా సాయపడిన నా మిత్రుడు శ్రీ మల్లంపాటి మధు సూడాన ప్రసాదునకు విశేషించి ముమ్మెదట కృతజ్ఞత చూపనిండు . అడిగినదే తడవుగ అనువాదమునకు అనుమతి యొసగి ఈ కృషి కి తోడుపడిన హిందూ స్తాన్ టైమ్సు – డిల్లీ “ వారి ఉపకృతి మరువరానిది .
కొత్త సత్య నారాయణ చౌదరి .

———–

You may also like...