పేరు (ఆంగ్లం) | Garladinna Subbarao |
పేరు (తెలుగు) | గార్ల దిన్న సుబ్బారావు |
కలం పేరు | – |
తల్లిపేరు | నరసమ్మ |
తండ్రి పేరు | పెద్ద నారాయణప్ప |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1893 |
మరణం | 1/1/1966 |
పుట్టిన ఊరు | సోదనపల్లె అనంతపురం జిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఉత్తర హరిశ్చంద్రీయము, కృష్ణ శతకము, రామకుమారాభ్యుదయము, అనసూయా మహిమ ,దుర్గాదాసీయమ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | గార్ల దిన్న సుబ్బారావు |
సంగ్రహ నమూనా రచన | ఈ కవిగారి వంశవృక్ష మిట్టున్నది. తండి శ్రీ పెద్దనారాయణప్పగారు,తాత శ్రీ సుబ్బరావుగారు, ముత్తాత శ్రీ . ఆశ్వత్త ప్ప, ముత్తాత తండి శ్రీ పెద్ద నారాయణప్ప (వంశకర్త ) కవిగారు తమ విద్యను గూర్చి ఉత్తర హరిశ్చంద్రీయములో నిటట్లు వ్రాసుకొనిరి. |
గార్ల దిన్న సుబ్బారావు
ఈ కవిగారి వంశవృక్ష మిట్టున్నది.
తండి శ్రీ పెద్దనారాయణప్పగారు,తాత శ్రీ సుబ్బరావుగారు, ముత్తాత శ్రీ . ఆశ్వత్త ప్ప, ముత్తాత తండి శ్రీ పెద్ద నారాయణప్ప (వంశకర్త )
కవిగారు తమ విద్యను గూర్చి ఉత్తర హరిశ్చంద్రీయములో నిటట్లు వ్రాసుకొనిరి.
ద్వి : దేశభాషా పయోధిని వ్రేలునద్ది
సేవించి సంతృప్తిఁజెందితిఁగొంత
త్రైలింగ భాషా తరంగణిస్ మున్గి
తేలుచు, మణి మున్గి తెలితి గొంత
గణిత శాస్త్రంబను – ఘన కూపమందు
మునిగి లోతరయక పొదలితిఁగోంత
ఆవని నిబ్బంగి, విద్యామహత్వముల
తపణిల్లి యున్నవా డను, గురూత్తముల
సేవించి, తత్ర్సియాశీర్వాద పూత
జీవిత సౌఖ్యంబు జెంది యున్నాండ;
ఏపని కెంటేని నేవేళ నైన
శ్రీపతి పదములే చేపట్ట నాఁడ
సుబ్బరాయాఖ్యత (చొప్పడి నాడ
గబ్బంబు వ్రాయగా గడగితి నిట్లు
సుబ్బరావుగారు గౌరనచే పూర్వము వ్రాయబడిన హరిశ్చంద కావ్యములోని యంశము లెల్లను గ్రహించి, కథా రుచి కొరకు కొంత కల్పించి ద్విపదలో వ్రాసిరి. ఈ కార్యమునకు బ్ర: విద్వాన్ తొగర్చేటి భాస్కర సిద్ధాంతుల వారు ప్రోత్సహించిరి. గౌరన గారి కావ్యమునకిది తరువాత దగుటచే దీనికి ‘ఉత్తర హరిశ్చంద్రీయ” మని పేరిడిరి. ఈ కావ్యమును 1935వ సం|| జూన్ నెలలో శ్రీయుత రాచోటి రామయ్యగారికి (ఆదోని) అంకిత మొసంగిరి.
ఈ ఉత్తర హరిశ్చంద్రీయము ఆరు ఆశ్వాసముల ద్విపద కావ్యము. ఇందలి తృతీయాశ్వాసములో చంద్రమతి నిట్ల కవిగారు వర్ణించిరి .
(హరిశ్చంద్రుడు తన మనంబున నిట్లు తలచుచున్నాడు )
“ ఈ రామతోఁజెల్మియేపారి సౌఖ్య
వారాశించేలని వాని యందంపు
కన్నులు సున్నలు; కళలొప్పు మొుగము
చెన్నలు సున్నలు; చెలువొందు కేలు
దమ్ములు వమ్ములు; తగవాని కారి
యమ్ములు దిమ్మలు; నాయత బాహు
దండముల్ ఖండముల్; తద్దయు వాని
పండుగల్ దండుగల్; పడసిన పెన్ని
ధానంబు న్యూసంబు; ధరణిలో వాని
ప్రాణంబు క్షీణంబు; పల్కు లింకేల ?
………. …….. ……….
“కలకంధర” యేకుల వడకుటను కవిగారిట్ల వర్ణించిరి.
ద్వి: తోడి చేడెలఁజూచి దొడ్డరాటంబు
వేడుకc దాసును బెట్టికొనుచు, న
నేకుల కుపయోగ మేకుల వృత్తి
కే కాలగలదని యోగుల వడుకు
రాటము ముందట రతనంప జిన్న
పీటపైఁగూర్చుండి విసరుహపాణి
కుడికాల రాట్నపు కొనవీటద్రోక్కి
యెడమ హజ్జనిలుపు నిలజిక్క బట్టి
కడియముల్ గాజులు కట్లు తోడాలు
బడి బడి ఘల్లని ధ్వనిసేయు చుండ
గుడి చేతితో బిడిగొని త్రిప్పి తిప్పి
ఎడమ కేలుననేకు నెగయిూడ్చి యివాడ్చి,
తన చూడ్కి యేకుతో చారంబుతోడ
ననుగమింపఁగ దార మప్పుడునపుడు
కదురుకుఁ జుట్టిన క్షణమాత్రమందు
బెదరు జింక తెరంగు వీక్షణల్ ద్రిప్పి
చెయెత్తి నప్పుడు చెరగు దొలంగు
నాయెడ వామ కుచార్థభాగంబు
పొడసూపి ముచ్చటల్ మంచి వైవంగ
వెడదనెన్నుదుటి పై స్వేదబిందువులు
బొడముచు నమసితాంభోజంబు మీద
బెడగారు ప్రాలేయ బిందువు లట్లు
తొప, నీరీతి నా తొయ్యలి రాట
మాపక త్రిప్ప చున్నట్టి కాలమున
………. ………… …………….
కవిగారి హృదయములో గాంధీగారి జాతీయ భావములు, దేశీయ వస్త్ర పరిశ్రమ, రాట్న సంగీతములు, మెదలుచుండె ననుటకీ “ఏకులవడకు” వర్ణనమే నిదర్శనము.
వీరు హరికథలను కూడా వ్రాసిరి. అవి వ్రాతప్రతులుగానే నిలిచిపోయినవి. రుక్మిణీ కల్యాణ హరికథలో రుక్మిణీదేవి గౌరీ పూజ కరుగు వర్ణన ఎట్లున్నదో చూతము.
సీ. భీష్మకాలయ సుధాబ్దిని వెలువడి కళల్
దేరెడు నిందిరాదేవి యనగ;
తన జనంబులకు, దర్శన మీయ రూపొంది
యరుదెంచు నవ్వీటి సిరి యనంగ
చైద్యాది దానవ సమితి మోసము సేయ
జనుచున్నయట్టి, మోహిని యనంగ
భక్తా వ సుండగు పద్మదళాక్షుని
కవియు బోయెడు కీర్తి కాంతయునగ
గీ : నిజగృహమునకుఁ జను, ‘భవానియె’యనంగ
నృప సమూహము దిగనాడి కృష్ణు నుండె
లక్ష్మి ముంచుచు జను, జయలక్ష్మి యునఁగ
గ్రాలె రుక్మిణి రాజమార్గంబు నందు,
వీరు వ్రాసిన ‘దుర్గాదాసీయమ’న బడు నాటకము గూడ వ్రాత ప్రతి గానే నిలిచిపోయినది. ఆ నాటకమునందు దుర్గాదాసు గావించిన వీర విహారము నిట్లభివర్ణించిరి.
సీ|| తొలెనా గుజ్ఞమున్ దుముకుచు రణమున
నెదిరి గుజ్జంబులు ఔదరి పారు;
త్రిప్పెనా ఖడ్గముస్ దెసలు దీపింప; న
రాతి నేత్రంబులు మూత పడును;
విసరెనా యసిలతన వెనువెన పగర , త
లాలూ డుల్లు తాళ ఫలంబు లట్లు ;
విడిచెనా బాణముల్ వీకవైరుల తనుల్
గుదులుగా గుదులుగా-గ్రుచ్చి పోవు;
గీ : మూలబలము పై శ్రీరామపోల్కి కదన
రంగ మందెల్ల యెడలఁ గనుంగొనంగ
చక్రభంగి దుర్గాదాను విక్రమించి
యుండె నే మందు నతని శార్యోజ్వలంబు.
1) కృష్ణ శతకము 2) రామకుమారాభ్యుదయము (నాటకము) 3) అనసూయా మహిమ (నాటకము) అనబడు గ్రంథములు వ్రాసినట్లు ఉత్తరహరిశ్చంద్రీయములోని ఉపోద్ఘాతము ద్వారా తెలియుచున్నది. వీటిని కీ|| శే బదినేహాళు తమ్మిరెడ్డిగారు ముద్రించిరి.
ఇట్టి యజ్ఞాత కవుల వివరములు తెలుసుకొనుటకు భగీరథ ప్రయత్నమే చేయవలసి యుండును. కవి వంశీకు లీవిషయము లందు సహకరింప నుత్సహింపనిచో వారు కృతులలో వ్రాసుకొన్న విషయములు తప్ప హెచ్చు విషయములు తెలుసుకొనుట కవకాశ ముండదు.
ఈ ఇరువదవ శతాబ్దకపుల విషయములే మన కగమ్యగోచ రములైనప్పడు, పూర్వ కవుల విషయములిక జెప్పపనిలేదు. కాన కవివంశస్థు లట్టి వారి చరిత్రలను వ్రాసి వుంచుకొని, వెలుగు లోనికి దెచ్చి, వంశకీర్తి నినుమడింపజేసి ధన్యులగుదురని మా విశ్వాసము.
రాయలసీమ రచయితల నుండి….
———–