పేరు (ఆంగ్లం) | Gudipaati Venkata Chalam |
పేరు (తెలుగు) | గుడిపాటి వెంకటచలం |
కలం పేరు | చలం |
తల్లిపేరు | కొమ్మూరి వెంకటసుబ్బమ్మ |
తండ్రి పేరు | కొమ్మూరి సాంబశివరావు |
జీవిత భాగస్వామి పేరు | చిట్టి రంగనాయకమ్మ |
పుట్టినతేదీ | 5/19/1894 |
మరణం | 5/4/1979 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | 1911లో పిఠాపురం మహారాజా కళాశాలలో చేరాడు.బి.ఎ.చదువు కోసం మద్రాసు వెళ్ళాడు. |
వృత్తి | ఉపాధ్యాయుడు, రచయిత |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మైదానం దైవమిచ్చిన భార్య ప్రేమ లేఖలు స్త్రీ మ్యూజింగ్స్ హరిశ్చంద్ర నాటిక |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | చలం జానకి |
సంగ్రహ నమూనా రచన | రామారావు ని చూడగానే ఆ కొత్త వూళ్ళో వెంటనే తనకి బాలయ స్నేహితుడు దొరికాడు కదా అని సూర్య నారాయణకి చాలా సంతోష మయింది . తక్కిన మనుష్యులెవ్వరూ క్లబ్బుల్లో లేనట్లే అనుకుని ఇద్దరూ బిలియర్ద్సు గదిలో మూల కూర్చుని కాలేజి స్నేహితమంతా పునశ్చరణ చేసుకున్నారు . ఇద్దరూ ఒక గదిలో వుండి ఒకరి గబ్బు యింకొకరిదిగా వాడుకుని , రెండోవారికి తెలియని రహస్యాలు లేకుండా నాలుగేళ్ళు గడిపి , నాలుగేళ్లే అయింది . వాళ్ల మాటలు వింటే యిన్నాళ్లు వోకర్ని విడిచి వొకరు యెట్లా విడిగా బతకగలిగారో అనుకుని వుంటారు , మర్నాడు రామారావు సూర్య నారాయణని కలుసుకోగానే . “మీ నాన్నగారు రామచంద్రపురంలో డాక్టరుగా ఉన్నారుట కదూ కొంతకాలం “ అని అడిగాడు . |
చలం
జానకి
రామారావు ని చూడగానే ఆ కొత్త వూళ్ళో వెంటనే తనకి బాలయ స్నేహితుడు దొరికాడు కదా అని సూర్య నారాయణకి చాలా సంతోష మయింది . తక్కిన మనుష్యులెవ్వరూ క్లబ్బుల్లో లేనట్లే అనుకుని ఇద్దరూ బిలియర్ద్సు గదిలో మూల కూర్చుని కాలేజి స్నేహితమంతా పునశ్చరణ చేసుకున్నారు . ఇద్దరూ ఒక గదిలో వుండి ఒకరి గబ్బు యింకొకరిదిగా వాడుకుని , రెండోవారికి తెలియని రహస్యాలు లేకుండా నాలుగేళ్ళు గడిపి , నాలుగేళ్లే అయింది . వాళ్ల మాటలు వింటే యిన్నాళ్లు వోకర్ని విడిచి వొకరు యెట్లా విడిగా బతకగలిగారో అనుకుని వుంటారు , మర్నాడు రామారావు సూర్య నారాయణని కలుసుకోగానే .
“మీ నాన్నగారు రామచంద్రపురంలో డాక్టరుగా ఉన్నారుట కదూ కొంతకాలం “ అని అడిగాడు .
ఆ సంగతి సూర్యనారాయణ వొప్పునకున్న తరవాత .
“ అతని పేరు రామస్వామి నాయుడు గారు . అవునా ?”
“అవును “
“అయితే జానకి నిన్ను బాగా యెరుగునుట కదూ ?”
జానకి ! జానకి ! అర్ధం తెలీకండానే ఆ మాటలు వినేటప్పటికి సూర్యనారాయణ మనసు ఝల్లుమన్నది . జానకి !
“జానకి ? ఏ జానకి ?”అంటూ ఉండగానే తనకే నిశ్చయంగా తెలిపి పోయింది . జానకి వొక్కతే తన ప్రపంచంలో .
“సబ్ జడ్జి పని చెయ్యలా . రామచంద్ర …”
తెలిసిందిలే . జ్ఞాపక మొచ్చింది . అయితే జానకి నీకెట్లా తెలుసు ?”
జానికి తను గోషాలో దాచుకున్న తురక భార్య లాగూ , జానకి పేరైనా యితరులు వుచ్చరించడం నేరమైనట్లూ అన్నాడామాట సూర్య నారాయణ .
“యెట్లా తెలుసా ? ఎట్లాగో కొంచెం తెలుసుననుకుంటాం . జానకి నా భార్య గనక ?”
“నీ భార్యా ! జానకి నీ భార్యా !”
ఎవరి భార్య కావడమూ ఘోరమైన విపత్తని జానకి ఎప్పుడూ అటువంటి నీచమైన కార్యము చేస్తుందని తను అనుకోనట్టు వినపడ్డాయి అతని మాటలు . నాలుగుము హూర్తాలలో బయస్కోపులో మల్లే సూర్యనారాయణ కళ్ళ ముందు బాల్య నాటకంలో ముఖ్యమైన ప్రకరణాలు గిర గిర తిరిగిపోయినాయి . చిన్నప్పటి సంగతులన్నీ చాలా వరకు మరచిపోయినాడు గాని జానకితో సంబంధించిన నిమిషాలు మాత్రం మెరుగు పెట్టినట్లు మరపు చీకట్టోంచి తళ తళ లాడుతో కనపడ్డాయి .
చిన్నప్పుడు సూర్యనారాయణ చెల్లెలికీ , జానకికీ స్నేహం మొదట వీళ్లు నాయిళ్ళూ , వాళ్లు బ్రహ్మలూ , బలి చెడుగుడు ఆది , అలసి , చంద్ర వంక తెలుపూ , రాత్రి నలుపూ మబ్బుల మీద నించి ఇంటికి పరుగెత్తుకుని వస్తున్నాడు . దొడ్డి తడిక దగ్గిర వొకత్తా నుంచుని , తగ్గిపోతున్న కాంతి కోసం దుఃఖించే వనకన్యలాగు , జానకి కనపడ్డది . కళ్ళని కప్పిన గుప్పెట్లు కన్నీళ్ళతో తడిశాయి .
“ఎందుకూ జానకీ యేడుస్తున్నావు ?”
“ నా వుంగరం పడిపోయింది ఇక్కడ . సీతమ్మ ఆటలో వెలు పట్టుకుని లాగింది “
“ మరి వాళ్ళందరు యేరీ ?”
“వెతికాను . కనపడలేదు . వల్ల మీది కోస్తుందని పారిపోయారు …….అమ్మ కొడుతుంది “
సూర్య నారాయణా , జానకీ మళ్లీ వెతికారు . అతను లాంతరు తీసుకొస్తానంటే వొద్దంటుంది . కాని వుంగరం దొరకంది ఇంటికి వెళ్లనంటుంది . పడమట ఒక్క మెరుపు మెరిసింది . తల మీది అంగారకుడు పొడిచాడు . చలి రోడ్డు మీది దీపాలు వణికాయి . వాళ్ల కుక్క ‘జాకీ ‘ వచ్చి చెయ్యి నాకింది . ఎదురుగా నుంచుని ఉంది ఆ బాలిక దీనంగా . వీలినున్న వుంగరం తీసి జానకి వేలికి తనే పెట్టాడు .
“ఈ రాత్రికి దీనితో సరిపుచ్చు . తెల్ల వారకట్టే వెతికి నీ వుంగరం నీకు తెచ్చి పెడతాను “ అన్నాడు .
“నిజంగా తెప్తావు కదూ సూరయ్యా “
“ఎక్కడ పోయిందో ! ఈ దుమ్ములో కనబడుతుందా ? అనే తన సందేహాన్ని దిగమింగుతో .
“ఇక్కడే వుంటుంది , ఎక్కడ పోతుంది ? రాత్రంతా వెతి కన్నా , నేను కనుక్కుంటాగా !” అన్నాడు .
జానకి వెళ్ళగానే లాంతరు పట్టుకు వొచ్చి వెతికితే అక్కడే కనపడ్డది , వెంబనే వెదదామనుకుంటే భోజనమూ , ఇంటి దగ్గిర పాఠాలు చెప్పే అన్నా . నిద్రా , ఆటంక పడ్డాయి . తెల్లార కట్టె , లేవాలనే నిశ్చయం ప్రకారం లేచాడు . చలిలో జానకి గారి ఇంటికి చేతులు ముడుచుకుని పరుగెత్తాడు . వాళ్ల పెద్దమ్మ ఇంటి ముందు ముగ్గు వేస్తోంది .
“జానకి లేచిందా ?”
“అర్దరాత్రి జానకెందుకు కావలసి వొచ్చింది నాయనా !”
“పనుంది “
జానకి పెద్దమ్మ కి పిల్లలులేరు . చిన్నతనమూ , అసలు తను చిన్న దానిగా ఉంది వుండవచ్చుననే విషయమూ మరిచిపోయింది . ఎవరన్నా ఆమె చిన్నదిగా ఉండేదని జ్ఞాపకం చేసినా సృష్టిని పరిశీలించి , చిన్న కాకండా పెద్దది కావడానికి వీలులేదని ఆలోచించి వొప్పు కోవచ్చు . అప్పటికి కూడా సైజులోను , రూపంలోనే గాని , గుణంలోను , పెద్ద మనిషి తనంలోను మార్పు వుందని ఒప్పుకోదు .
“పని; పనులు యీ చిన్న వాళ్లకి , జానకి ఇప్పుడప్పుడే లేవదు . ఐనా మొగపిల్ల వాడికి నీకు జానకి ఎందుకు ? ఈడా , జోడా , సహవాసమా ,బడా , పాఠాలా ? ణీ పనుంటే మళ్లీ రా ! పొద్దెక్కిం తరవాత .”
ఆ ఇల్లు భూగోళం అతనికి బాగా తెలీదు . అందులో జానకి ఎక్కడ పడుకుంటుందో ! ఆలోచిస్తూ నుంచున్నాడు . చలి గాలి చంపని చరుస్తోంది . తూర్పున వేగు చుక్క ఆశలన్నీ వదులు కొనక్కర లేదంటోంది . తన ముందు కాయితం మీద మంచు దేవుడు వేసిన ముగ్గుని పెద్దమ్మ సున్నపు ముగ్గుతో పోలుస్తోనుంచున్నాడు . తెల్లని శాలువ ముసుగు పెట్టుకుని , జాగ్రత్తగా జానకి బైటికి వొచ్చింది .
“ఎక్కడికే యీ అర్ధ రాత్రి ? వెళ్లు చెపుతా , నాన్న లేవనీ “ అనే మాటలు వినిపించుకోక సూర్య నారాయణతో రోడ్డు మీదికి వెళ్లింది . ఆమె వుంగరం ఆమె వెలికి పెట్టి తనది తీసుకున్నప్పుడు జానకి తన వంక తిప్పిన చూపు యీనాడు మళ్లీ జ్ఞాపకం వొచ్చింది . అప్పన్నించి ఒక యేన్నర్ధం జానక్కీ , అతనికీ స్నేహం , ఆడ పిల్లబ్బాయి అని బళ్ళో అతన్ని వెక్కిరించేవారు . ఆటలకి రాకపోతే , నిష్కారణంగా , అవ్యాజంగా ఒక రోజున జానకిని ముద్దు పెట్టుకోవాలనే కోర్కె ప్రారంభమై , ఇంక ఆ అమ్మాయిని చూసిన కొద్ది అధిక మైపోయింది . ఇంకెవ్వరు లేకుండా వొంటరిగా ఉందాలని ప్రయత్నించినా సాగలేదు . ఆ ప్రయత్నమంతా అతని ఒక్కడిదే కావడం చేత , యోచించి ఒక సాయంత్రం ఒక ఆట కల్పించాడు . తాను దొంగ . నిద్ర పోయే పిల్లల్ని ఒక్కొక్కళ్లనే ఎత్తుకుపోయి గుహలో దాచేస్తాడు . గుహ గన్నేరు చెట్టు గుబురు , జానకిని దాస్‌తో , నిద్రలో కళ్ళు మూసుకుని వున్నా జానకిని గుహలో ముద్దు పెట్టుకోపోతే , సగం కళ్ళు తెరిచి చూస్తోందో యేమో , మొహం తిప్పేసింది . ఆ అమ్మాయి పెదిమెలు తన బుగ్గకి రాసుకుని యెంగిలై అతని కసహ్య మేసింది .
ఒక రోజు అతని చెల్లెలు “ జానక్కి పెళ్లి “ అంది
“నీకెట్లా తెలుసు ?”అన్నాడు అమాంతం చెల్లెల్ని తినేసేటట్టు .
“ఈవాళ సాయంత్రం మామగారు పిల్లని చూసుకోవడానికి వొస్తున్నారు !”
పక్కన వున్న కుక్కని నిష్కారణంగా వొక్క తనను తన్నాడు . సూర్య నారాయణ ఆ కోపంలోనే వెళ్లి చేతులో కర్రతో బొమ్మ జెముడు అత్తలు ఐదారూ , జువ్వి మొక్క కొమ్మలు రెండు విరక్కొట్టి వెళ్లిపోయి మధ్యాహ్నం దాకా తిరిగాడు , బడి మానేసి ఎక్కడో , మూడింటికి జానకి వాళ్ల యింటికి చేరుకొని చూసేప్పటికి , ఆ అమ్మాయి మూల చాపమీద కూచుని ఉంది . మొహమలు కోటు , పట్టంచు పావడా , కోటు మీద కాసుల పేరూ , వడ్డాణం , చెవులకి జూకాలతో ముస్తాబై ముందున్న హార మొనియం లోంచి తనకి రాణి పాటని లాగాలని తంటాలు పడుతోంది . ఎదురుగా కుర్చీల మీద పెద్ద తలపాగా , పొడుగాటి కొటూ , వెండి పొన్ను కర్రా పట్టుకుని వొకాయన కళ్ళ జోడులోంచి ఆ పాటని పరీక్షించి వింటున్నాడు .
పక్కనే శాస్త్రులు జాతకాలు తిరగేస్తున్నాడు . వొక వితంతువు యింకోమూల కూచుని తననట్లా చోడ్డానికి వొచ్చిన రోజులు గావును జ్ఞాపకం చేసుకుని ,యీర్ష్య మొహం పెట్టి చూస్తోంది . జానకితో పాటు ఎంత డబ్బిస్తే తీసుకోవచ్చు యీ పిల్లని అని పరీక్షిస్తున్నట్లు కనపడ్డారు వాళ్లు . సూర్యనారాయణకి . జానకి మీద అపరిమితమైన కోపంతో పరిగెత్తుతో వెళ్లాడు .
మర్నాడు రాత్రి సూర్య నారాయణ వాళ్ల ఇంట్లో వరండాలో వెళ్లాడుతున్న లాంతరు కింద జానకి కనబడి మామూలు ప్రకారం అతని చెయ్యి పట్టుకుంది . ఇంకా ముస్తాబు అట్లానే ఉంది . కళ్ళు కాతికతో అందంగా కనపడుతున్నాయి .
“నీ కోసమే చూస్తున్నా “ నంది .
అతను చెయ్యి విదుల్చుకుని ,
“ఎందుకొచ్చావు మళ్లీ ?” అన్నాడు .
“అదేమిటి అట్లా అంటావు ? నేనేం చేశాను ?”
“నిన్న సాయంత్రం నేను చూడలా ? నీకు పెళ్లి కదూ ?”
సిగ్గుతో తల వొంచుకుంది .
“అయితే ?” అంది నెమ్మదిగా .
“నా కిష్టం లేదు .”అన్నాడు దూకుడుగా .
“మా వాళ్లు చేస్తున్నారు మరి !”
“చెయ్యకూడదు .”
“నీ కెందుకు కోపం ?”
డానికి ప్రత్యుత్తరం చెప్పా గల జ్ఞాన శక్తి అతని కప్పుడే ఉదయించ లేదు . ఏం చెప్పాలో తెలీక ఊరుకున్నాడు .
రచన : గుడిపాటి వెంకట చలం
సేకరణ : జానకి కథ నుంచి ….
———–