పేరు (ఆంగ్లం) | Medavaramu Subrahmanya Sastry |
పేరు (తెలుగు) | మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | అన్నపూర్ణమ్మ |
తండ్రి పేరు | కోటయ్య |
జీవిత భాగస్వామి పేరు | చిన్నమ్మ |
పుట్టినతేదీ | 10/1/1885 |
మరణం | 5/22/1960 |
పుట్టిన ఊరు | ప్రకాశం జిల్లా, దొనకొండ మండలం,పోలేపల్లి గ్రామం |
విద్యార్హతలు | గోదావరి జిల్లా కాకరపఱ్ఱు గ్రామంలో ఉన్న వేదుల సత్యనారాయణశాస్త్రి వద్ద కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు చదువుకున్నారు. మంత్రశాస్త్రము, జ్యోతిష్యశాస్త్రాలలో పాండిత్యం సంపాదించారు. |
వృత్తి | ఉపాధ్యాయుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | యథార్థ విచారము, విచారదర్పణము, అద్వైతాధ్యాత్మిక తత్త్వము, శ్రీరామస్తవన క్షేత్రమాల, సీతాస్తోత్రము, విభీషణ శరణాగరి, విశ్వామిత్రచరిత్ర, జీవితచరిత్ర (అసంపూర్ణము. 1947 వరకు మాత్రమే వ్రాశాడు. దీనిని అతని శిష్యుడు మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ పూర్తి చేశాడు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితుడిగా పేరుగాంచిన వ్యక్తి. తన జీవితకాలంలో ఎక్కువభాగము కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోను, అనంతపురం, కడప జిల్లాలలోనూ నివసించినందువల్ల ఇతడిని రాయలసీమవాసిగా గుర్తిస్తున్నారు. ఇతడు మూడువందలకు పైగా శిష్యులకు ఆధ్యాత్మిక విద్యను నేర్పారు. నిరతాన్నదానము చేసెడివారు. ఈయన గద్యాలకు వెళ్లి అక్కడి మహారాజాతో చండీయాగము చేయించారు. దైవోపాసనతో సంతానము లేనివారికి సంతానము కలిగేటట్లు చేశారు. తన మంత్ర శక్తులతో గ్రామాలలో మశూచి మొదలైన బాధలనుండి విముక్తి గావించారు. శీతలాయంత్ర ప్రతిష్టాపన, అష్టదిగ్బంధనాలు చేసి గ్రామాలను కాపాడుతూ, అకాల మరణాలు సంభవించకుండా, శిశువృద్ధి కలిగేటట్లు, పాడిపంటలతో తులతూగేట్లు చేశారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | మేడవరము సుబ్రహ్మణ్య శాస్త్రి |
సంగ్రహ నమూనా రచన | శ్రీ శాస్త్రి గారు గొప్ప పండిత కుటుంబమునకు జెందిన వారు . రుగ్వేదులు , ఆశ్వలాయన సూత్రము కామకాయన విశ్వా మిత్రస గోత్రులు , వైదిక బ్రాహ్మణ శాఖాకు జెందిన వారు . |
మేడవరము సుబ్రహ్మణ్య శాస్త్రి
శ్రీ శాస్త్రి గారు గొప్ప పండిత కుటుంబమునకు జెందిన వారు . రుగ్వేదులు , ఆశ్వలాయన సూత్రము కామకాయన విశ్వా మిత్రస గోత్రులు , వైదిక బ్రాహ్మణ శాఖాకు జెందిన వారు .
వీరు ఋగ్వేదములో కొంత సంహితా భాగమును వల్లించిరి . తిరుపతి , గుంటూరు జిల్లా కొల్లూరు మొదలైన చోట్ల ఆరంభములో కావ్య వ్యాసంగము చేసి , తరవాత గోదావరి జిల్లా కాకర పర్రు గ్రామములో బ్రహ్మ శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రిగారి దగ్గర కావ్య నాటకాలంకార సాహిత్య గ్రంధములను పూర్తి చేసిరి . జ్యోతిష్యము , మంత్ర శాస్త్రము , శంకరా ద్వైతము వీరి సాధించిన విద్యలు . వీరు సంస్కృతాంధ్రము రెండింటిలోను కవిత్వము చెప్ప నేర్చిరి .
వీరి భార్య శ్రీమతి చిన్నమ్మగారు. వీరిరువురు సోదరులు, పెద సుబ్బరాయ శాస్త్రి గారు వీరి అన్నగారు. శాస్త్రి గారు మూడు వందలమంది శిష్యులకు ఆధ్యాత్మిక విద్య నుపదేశించిరి. నిరతాన్నదానము సలిపిరి.
శతావధాని శ్రీగాడేపల్లి వీరరాఘవ శాస్త్రిగారు వీరి ముఖ్య శిష్యులు . ఒకసారి వీర రాఘన శాస్త్రిగారు జబ్బునపడియున్న తమ గురుదేవులను దర్శించు నిమిత్తము దొనకొండకు వచ్చిరి. అచ్చట వారు డాక్టరు శ్రీ శంకమలం పిళ్ళై గారి దగ్గర ఔషదము సేవించు చుండిరి. శిష్యునిరాకకు , అతడవధాన క్రియలో దెచ్చు కొన్న పేరు ప్రతిష్టలకు కడు సంతసిల్లి గురువుగారు, అవధాని మేమో, చేయుచున్నావట : నా సమక్షములో జేయవలసినది ” అని కోరిరి. అప్పడు డాక్టరు శంకమలం పిళ్ళె తదితర యుద్యోగస్టు లేర్పాటు చేసిన సభకు శ్రీ మేకవరము సుబ్రహ్మణ్య శాస్త్రుల వారే అధ్యక్షత వహించిరి . శిష్యుని అవధానమునకు మెచ్చి వారిట్లు ఆశీర్వదించిరి.
ఉ : ఎన్నడు వచ్చు రాఘవుడి కెన్నడు తా నవధాన కార్య మ
భ్యున్నతి గల్గర బండితు ‘ల హు ‘ యనఁబేసి ముదంబుఁ గూర్పు నిం
కెన్నఁడి(కెన్నడంచు. మదినెంచుచ. నుండగ నీ సభాస్థలిన్
నన్నుత రీతి నల్పితివి; చాలముదంబు జనించె రాఘవా!
చం : మా || ……………. ………………. ………………. …………………. ………………………వహ్వరె ; నీకవితాశుధార, వి
స్ఫుర దరవింద జాల, మధుపూర రనంబులద్రోచి, మేటి భూ
ధరముల ధిక్కరించు , వనితా కుచమండలి నొత్తు బుచ్చి య
ద్దిరయనిపించె , మిక్కిలి సుధీజన మోదము గూర్చె; నింక భూ
వరుల, సభాస్థలంబులను వర్ధిలు వోయి! సుగౌరవంబులస్
బరపగ దోయి కీర్తి, సుధ, భవ్యవచ కుసుమంబులస్ బరా
త్పరుని, యజింప వోయి! గుణవంతులఁ బుత్రుల గాంచవోలు యా
దరమున నిన్నుబ్రోచు నతతంబును నాపరదేవి రాఘవా !
ఇట్లాశువుగా శ్రీమేడవరపు వారు పలికిరి.
శ్రీమేడవరపు వారు రచించిన గ్రంథములన్నియూ ఆద్వైత వేదాంత గ్రంథములే. 1) యథార్థ విచారము 2) విచారదర్పణము 3) అద్వైతాధ్యాత్మిక తత్త్వము (సుభోధక వచన గ్రంథము) అన్నియు ముద్రితములే.
శ్రీ శాస్త్రులవారు గద్వాలకు వెళ్లి, మహరాజుగారిచే చండీ యాగము చేయించిరి. సంతానములేని వారికి దైవో పాసనతో సంతానము ననుగ్రహించిరి. తమ మంత్ర శక్తులవలన గ్రామమందలి మశూచికాది బాధలను మాన్పిరి. శీతలా యంత్ర ప్రతిష్టాపనలు అష్ట దిగ్బంధన లొనర్చి, భగవతీ కటాక్షములో గ్రామములను కాపాడుచు, అకాలమరణాదులు లేక, శిశు వృద్ధిగల్లి, పాడిపంటలతో తులతూగు నట్లో నర్చిరి.
వీరు తమ జీవితి కాలమంతయు, నర్థ శతాబ్దమునకు మించి రాయల సిమ లొ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ యుండును, కడప, అనంత పురము జిల్లాల యందును గడపినారు. వీరు రాయలసీమ వాసులుగా ఎన్నికైరి.
శ్రీ మేడవరపువారు తమ 62 యేండ్ల వరకు అనగా 1947 సం! వరకు గడిపిన జీవితచరిత్రను సమగ్రముగా వ్రాసిపెట్టిరి . దానిని వారి శిష్యులై న శ్రీమద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి గారు పూర్తి చేసి ముదించి యున్నారు. గురువు గారు 1960 లో బ్రహ్మైక్యమైన సందర్భములో శిష్యులు శ్రీమద్దులపల్లివారు వ్రాసిన ఈ చరమ శ్లోక మొక్కటి విద్వదత్నము యొక్క విలువను వెలువరిం జాలును.
విద్యాన్ ప్రవక్తా వివిధాగ మజ్ఞః
గురుః ప్రసన్నోస్త మితోధు నేతి
బ్రహ్మైవ నన్నుకి తోథ వేతి
కిం శోచనీయం ? కిమ శోచనీయం .
విద్వాంసుడు, మంచివక్త , వివిధాగమజ్ఞుడు, సుప్ర సన్నుండు ఇట్టి గురు దేవుఁడు మనసు లేకపోయెనే ? యని కింశోచనీయం దుఃఖింపదగునా? బ్రహ్మవిద్బహ్మైవ భవతి యను న్యాయముని బ్రహ్మ విద్వరిష్టుడై, బ్రహ్మమే తానై పోయె గనుక. కిమ శోచ నీయం.- ఆనందింపదగునా?
రాయలసీమ రచయితల నుండి….
———–