రాప్తాటి సుబ్బదాసు (Raptati Subbadaasu)

Share
పేరు (ఆంగ్లం)Raptati Subbadaasu
పేరు (తెలుగు)రాప్తాటి సుబ్బదాసు
కలం పేరు
తల్లిపేరులక్ష్మమ్మ
తండ్రి పేరునారప్ప
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1885
మరణం5/19/1961
పుట్టిన ఊరుధర్మవరం , అనంతపురం జిల్లా
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅభిజ్ఞాన జయదేవ, ఆత్మారామ గేయము, మానస గీతావళి , సుప్ర కాశ శతకము, పరమేశ్వర శతకము, విష్ణ నామావళి, హితబోధిని
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికరాప్తాటి సుబ్బదాసు
సంగ్రహ నమూనా రచనశ్రీ రాప్తాటి సుబ్బదాసుగారు కవులే కాగ యోగి పుంగవులు కూడాను. చిన్ననాటి నుండియు తమ జీవితమును పరోపకార కార్యములయందే వినియోగించిన వారు. సంఘ సంస్కరణ పరాయణులు. ధర్మోద్ధరణ చికీర్షకులు. కళారాధకులు. దేశ సేవా నిర్వహణ దీక్షా పరతంత్రులై తమ మన ధనముల సమర్పించిన త్యాగపురుషులు. హరికథలను స్వయముగా రచించి, ప్రతి పట్టణమునకు సంచరించి హరికథా గానములను, పురాణ శ్రవణములను, ఉపన్యానములను గావించుచు లోకమునకు ధర్మోపదేశము, సంఘసేవ చేయుచుంచెడి వారు

రాప్తాటి సుబ్బదాసు


శ్రీ రాప్తాటి సుబ్బదాసుగారు కవులే కాగ యోగి పుంగవులు కూడాను. చిన్ననాటి నుండియు తమ జీవితమును పరోపకార కార్యములయందే వినియోగించిన వారు. సంఘ సంస్కరణ పరాయణులు. ధర్మోద్ధరణ చికీర్షకులు. కళారాధకులు. దేశ సేవా నిర్వహణ దీక్షా పరతంత్రులై తమ మన ధనముల సమర్పించిన త్యాగపురుషులు. హరికథలను స్వయముగా రచించి, ప్రతి పట్టణమునకు సంచరించి హరికథా గానములను, పురాణ శ్రవణములను, ఉపన్యానములను గావించుచు లోకమునకు ధర్మోపదేశము, సంఘసేవ చేయుచుంచెడి వారు. వీరికి నాటకానుభవము కూడా కలదు. నాటకములందు ప్రధాన నాయక పాత్రలను ధరించి అభినయించి ప్రజల మెప్పులుని పొందినారు . అప్పటిలో ప్రఖ్యాతి వహించిన సురభి కంపెనీవారి నావిక విధానములన సుసరించి, సుబ్బదాసుగారు 1910-11 3 సం || ప్రాంతమలందే “అభిజ్ఞాన జయదేవ” ను రచించిరి. దానిని వారు తమ స్వగ్రామమైన ధర్మవరమున (అనంతపురం జిల్లా) ” వాణీ మనో వినోదిని ” యను నాటక సభను స్థాపించి దాని ద్వారా ప్రదర్శించిరి. అందలి ప్రధాన పాత్ర జయదేవుని భూమికను సుబ్బదాసుగారే నిర్వహించిరి. తరువాతి వారు ఇహపర సాధనములకు మూలము హరికథా కాలక్షేపమును చేబట్టి నాంద్ర దేశమునంచం కటిని తిరిగి, ధనము క్రోడీకరించి, ధర్మవరమున హఠయోగా శ్రమమును స్థాపించిరి. వీరి శిష్యురాలు శ్రీమతి బొజ్ఞమ్మగారు పన్నెండేండ్లుగా సుబ్బదాసుగారికి అండదండగానుండి అహోరాత్రులు నెడతెగని దీక్షతో పరిశ్రమించి హఠయోగాశ్రమాభివృద్దికి తోడ్పడినది. ఆట్టి శిష్యురాలి వేడుకోలు వలనను పట్టుదల వలనను ఆభిజ్ఞాన జయదేవ నాటకమును(1941లో) నిగమార్ధ చంద్రోదయ మను గ్రంథమాలను స్థాపించి తద్వార మదరించి , ఆ నాటకమును ముద్రించుటలోగల తమ యుద్దేశ్యమును కవిగారిట్ల తెలిపిరి.

“……………… కవిసార్వభౌము రెండో నాటక రాకము లను వెలయించి కీర్తి గడించుచుండిన యీ కాలమున, నేనీ కావ్యము బ్రచురించుటకుగల ముఖ్యకారణము, ఏతద్దృశ్యకావ్య మూలమున మహాత్ముని యహింసా సత్యముల రుచిని ప్రజలకు జూపి, దారిలో దేశభక్తిని పురిగొల్పవలయు ననుటయే! అహింసా సత్యవ్రతములకు నాకర మనం దగిన పురుషుడు జయదేవుడు. అమ్మహనీయుని జీవిత చరిత్రమున కాదర్శమువంటి యీ నాటక మీనాటికి నాంధ్ర లోకమున కల్పింప జాలినందులకు మిగుల సంతసించుచున్నాను.”
శ్రీ మహాత్మాగాంధీ గారి ఆదేశాను సారము దేశ దాస్య ముకి కై “వ్యష్టి సత్యాగ్రహము”న పాల్గొని కృష్ణ జన్మస్థానముటకు మూడు దినములముందు సుబ్బదాసుగారు 8-1-413 లో తమ శిష్యురాలు శ్రీమతి బొజ్జమ్మ గారి కోరికపై ఆత్మారామ
గేయము ‘లను పేరుంచి స్త్రీలు పాడుకొనుటకు సులభముగా యుండు నట్లు రచించిరి . తరువాతి మూడు దినములకే పోలీసులు నిర్భధించి నాలుగు మాసములు మాత్రము ఆలీపూర్ జైలులో సుబ్బదాసు గారి నుంచిరి . ఆ అజ్ఞాత వాసము ముగించుకొ వచ్చిన
తరవాత ఆ గేయములను 1948లో ముద్రించిరి. ఆ గేయముల గాంధి తత్వము నిట్లు పాడిరి .

పల్లవి: భరతమాత దాస్య బంధము తొలగ నరులెల్ల శ్రీ గాంధీ తత్వము .
అ . ప: నెరిగి సత్యాహింస పరిపూర్ణ సిద్దులై చెరసాలలకు వెళ్ళు రామ తత్వంబు
చ. మరు గొకించుకలేక సద్గురు కరుణ స్వాత్మా
ను భవమును నెరుగ జేసితి ధరశసు నా చంద్రార్క
మై కృతి నలరుగా కని ||శ్రీ ||
అహింసా సిద్ధాంతమును సుబ్బదాసు గారు తమ పశు యజ్ఞ ఖండము నందు ప్రబోధించిరి . దీనిని 1939 లో ముద్రించిరి .

తే|| గీ. గ్రాన మడుగదు గర్జింప రోస పడదు
భార మెత్తిన యజమాని దూర లేదు
ఇట్టి సోదర పశువులన్పట్టి మనుజ
పశువ దిననౌనె న్యాయమే బయిసి మూలి.

తే : గి: నీటి క్రిములను భక్షించి నిర్మలంపు
జల మొసగెండు చేపల జంపు టేల
తళుకు దేహము సొంపుల గులుకు కనులు
జూచి యానంద పడరాదె చూట్కిలేదె.
తే: గీ. పరమ నీచులు పతితులు బాలిశులును
పుణ్య భీరులు కటికలు పణ్యజనులు
దైవతా ప్రీతి యని మేక తలలు గొట్టి
శవములను వ్రేల్చి భక్షింత్రు శాపతస్త,
బ్రహ్మరాక్షసుల విధానబయిసిమాలి.

తే : గీ. జంతు నంతతిని నిజాత్మ నమతజూచు
మతమె సుజ్ఞాన ధనుల నంమ్మతముకాని
కఠిన దుర్భర క్రోధ నంఘటిత వృత్తి
లాతిప్రాణులజంపు , టేలాటిమతము.
అభిజ్ఞాన జయదేవ నాటకమునకు శ్రీ మహాభక్త విజయ మందలి కథ మూలము అందలి ఒక పద్యమును మచ్చునకు చూతము
చం: నిను నెడబాసినే నిలువ నేరునె యిపుడమింగురుప్రభూ !
యనలము బాసి యర్చియును, నభ్రముబాసి తటిల్ల తాంగి యుం ,
మనుజుని బాసి ఛాయ, రవిమండలమున్ ” బెడబాసి యొుండయుం
గసబడునే ? నిజంబుగ జగంబుస నాగతి యింతయే యికన్ “.

ఇందలి రచనా విధానము, పాత్రాలపోషణ, సంభాషణములు మనోజ్ఞము, ప్రేక్షకులకు విసుగు పుట్టింపకుడునట్లు రచించుట కవిగారి నేర్పు. కవితాధార అనర్గళము. సులభశైలి. వీరు మరి కొన్ని గ్రంధములను కూడా వ్రాసిరి. 1) మానస గీతావళి 2) సుప్ర కాశ శతకము. 3) పరమేశ్వర శతకము 4) విష్ణ నామావళి 5) హితబోధిని. వీరి శిష్యులు ధర్మవర పట్టణమున పెక్కుమదు న్నారు. ఇప్పటికి నీ హఠయోగాశ్రమము కలదు. 19 -5-81యేట సుబ్బదాసుగారు తమ భౌతిక దేహమును చాలించిరి.

రాయలసీమ రచయితల నుండి….

———–

You may also like...