పేరు (ఆంగ్లం) | Rawada Venkata Ramasastry |
పేరు (తెలుగు) | రావాడ వేంకట రామశాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | శ్రీ రావాడ రామాశాస్త్రి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1892 |
మరణం | 1/1/1970 |
పుట్టిన ఊరు | కణేకల్లు, రాయదుర్గము తాII అనంతపురం జిల్లా |
విద్యార్హతలు | శ్రీ వెంకటేశ్వర సంస్కృత కళాశాలలో జేరి, తర్క, వ్యాకరణ, కౌముదీ గ్రంథములతో బాటు కావ్య నాటకాలంకారాదులను పది సంవత్సరములలో అభ్యసించిరి. |
వృత్తి | సంస్కృత పండితులు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | వేమభూపాల విజయము, ఆంధ్ర మెఘ ప్రతి సందేశము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | కావ్యతీర్ణ, విద్వాన్ |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | రావాడ వేంకట రామాశాస్త్రి |
సంగ్రహ నమూనా రచన | వీరు తమ తండి వద్దను, బళ్లారి యందలి శ్రీమాన్ కుంటి మద్ది శ్రీనివాసాచార్యుల చెంతను, కావ్యములను జదువుకొసిరి. తరువాత, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంస్కృత కళాశాలలో జేరి, తర్క, వ్యాకరణ, కౌముదీ గ్రంథములతో బాటు కావ్య నాటకాలంకారాదులను పది సంవత్సరములలో అభ్యసించిరి. |
రావాడ వేంకట రామాశాస్త్రి
వీరు తమ తండి వద్దను, బళ్లారి యందలి శ్రీమాన్ కుంటి మద్ది
శ్రీనివాసాచార్యుల చెంతను, కావ్యములను జదువుకొసిరి. తరువాత, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంస్కృత కళాశాలలో జేరి, తర్క, వ్యాకరణ, కౌముదీ గ్రంథములతో బాటు కావ్య నాటకాలంకారాదులను పది సంవత్సరములలో అభ్యసించిరి.
బళ్ళారి మునిసిపలు హైస్కూలులో సంస్కృత పండితులుగను, 35 సంవత్సరములు పనిచేసిరి. కలకత్తా గవర్నమెంటు వారు ‘కావ్యతీర్ణ’ బిరుదమిచ్చిరి, మదరాసు విశ్వ విద్యాలయవారు “విద్వాన్” బిరుద మొసంగి, సత్కరించిరి.
ఈ శాస్త్రిగారు !) వేమభూపాల విజయము 2) ఆంధ్ర మెఘ ప్రతి సందేశము అను రెండు పద్య కావ్యములు వ్రాసిరి. వేమభూపాల విజయమును, శ్రీ కృష్ణదేవరాయ గ్రంథమాల వారు 1992లో ముద్రించిరి. ఆంధ్ర విశ్వ విద్యాలయము వారీ పుస్తకమును “విద్వాన్ సి ‘ ఇంటరు మీడియటు తరగతులకు పాఠ్య గ్రంధముగా నిర్ణయించిరి . ఇందలి కథ :-
‘అద్దంకి”ని రాజధానిగా జేసుకొని కొండవీడు దుర్గమును ప్రోలయ వేమభూపాలుడు’ పరిపాలించెను. ఇతని మనుమడైన పెదకోమటి వేమభూపాలునికి జన్మించినవాడు మన కథానాయకు డై న వేమభూపాలుడు. ఇతడు క్రీ. శ. 1400 నుండి 1440 వరకు కొండవీడు దుర్గమను పరిపాలించెను.
ఈ వేమభూపాలుడు శృంగార రసాభిరుచి కలవారు. సంస్కృత విద్వాంసుడు. “అమరుకవి’ వ్రాసిన శృంగార సంస్కృత కావ్యమునకు “శృంగార దీపిక” యను సంస్కృత వ్యాఖ్యానము వ్రాసెను.
ఇతని ఆస్థానములో, ఆస్థాన కవిగా పండితునిగా నున్న వాడు, వామన ఛట్ట బాణుడు. ఇతడు సంస్కృతములో “వేమ భూపాల చరితము” అను వచన కావ్యమును వ్రాసినారు. ‘అభినవ భట్టబాణ’ బిరుదు గల శ్రీ మాన్ ఆర్. వి. కృష్ణమా చార్యులుగారు మూల గ్రంథమును సంగ్రహించి వ్రాసిరి. దీనిని మాతృకగా గొని మన శాస్త్రిగారు ఆంధ్రములో “వేమభూపాల విజయము”ను వ్రాసిరి.
వేమభూపాలుడు, ఎంత శృంగార రసాను భూతుడో, అంతకంటే ఎక్కువగా దైవభక్తి కలవాడు. అతడు దేవీ భక్తుడు, దాక్షారామాది క్షేత్రమల దర్శించెను. అచ్చటి చండికాలయమును, దేవిని శ్రీ శాస్త్రిగారిట్ల వర్ణించిరి.
సీ|| ఒక చాయ వైష్ణవీ – ప్రకటయాన ఖగేంద్ర
ఒక చక్కన్య గ్రోధ-వికట శాఖాంతర
డోలాధిరూఢ-భేతాళమిథున
మొుక యొక్క దారుకాదిక, దైత్యరుండ, నం
గ్రథనోగ్ర శూల కరంబితంబు
ఒక పక్క నాకట-నకనక లాడుచుఁ
దిరుగాడు బూచుల – దెప్పరంబు
గీ : నగుచు, నొప్పారు శ్రీచండికాల యంబు
నచట దిలకించి తరువాత- నవని విభుఁడు
భక్తి, మధురన పూర్ణ, హృత్పంక జాతు
డగుచుఁ జొత్తాంచె-నాలయాభ్యంతరంబు,
సీ : ఏ దేవి మాయచే-నీ జగమంతయు
వివిధ రూపంబుల-విస్తరిలునొ ?
ఏ బాలికామణి- కేడు లోకములును
నింపు నింపెడు, బొమ్మరిండులగునొ ?
ఏ దివ్య చారిత్ర-కెల్ల వేదంబులు
మహిత నిజస్తోత్ర – మాల యగునొ ?
ఏ శక్తి నిదురింప-నీ విశ్వము లయించి
మేలు కాంచిన, నిది మేలుకొనునొ ?
గీ : ఆ మహాదేవి శర్వాణి- నఖిల దేవ
మకుటు మణిరాజ సుప్రభామండి తాంప్రిు
గామితానల్ప, కల్పనా-కల్పలతిక
నెంతు నని యిట్ట సన్నుతియించె నృపఁడు.
“ఆంధ్ర మేఘ ప్రతి సందేశము”ను, మైసూరు మహారాజా స్థాన విద్వత్కవి రత్నమైన బ్రహ్మశ్రీ మండికల్ రామాశాస్త్రి గారు సంస్కృతములో రచించిరి. మన శాస్త్రిగారు దానిని తెలి
గించిరి.
యక్షుడు, యక్షి దంపతులు. యక్షుడు యక్షిని వీడి ఎనిమిది మాసములాయెను, దూరదేశమేగినాడు. ఏ కారణముచేత నో యక్షుడు యక్షిని గూడలేదు. విరహతాప సంతృప్రయైన యక్షి ఆకాశమున సంచరించుచున్న మేఘుని గాంచి ఇట్లు ప్రార్దించుచున్నది . ఈ మాటలను శాస్త్రి గారిట్లు వర్ణించిరి .
వాసపుటింట గోడకడఁ బాణఁగపోలమునూఁది యర్థ ప
ద్మాసనమంది వాకిటను సాశ్రు దృగంచలముంచి, యెంచి నిన్
” గాసిలి, గడ్డియన్ గదలగా- నరుదెంచితి వీవ, యంచెటో
మానము లెస్మెడిన్ గడపి -మంటి నినున్ మణిఁజూచు వేడుకన్
కమ్మని తావులన్ బొలుచు- కందర భూమి విహార వేళ బ్రే
మమ్ము-భయమ్ము మన్ననయు-మల్లడిగా-ననుగూడి సాను దే
శములఁ బ్రౌడ రీతిగను- నల్పిన నీదురహః ప్రవృత్తి – నే
నిచ్చలున్ • నిమ్మగ, సంస్మరించునటు లీకృతకాద్రి యొనర్చు
ఒక కయిఁ గన్నుమూసి-మరియొక్క ట నాభుజ మూల మంటుచున్
మొకము మరల్ప ద్రిప్పుకొని – ముద్ది డుచున్ బౌల యల్క నూనగా
వికృతిని జెంది మ్రొక్కులిడి వేదేడు నీదురహః ప్రవృత్తి – నే
నకట-స్మరించునట్లు— కృతకాచలమిద్ధి-యొనర్చునోప్రియా!
శృంగార రసమును బోషించుటలో శాస్త్రిగారు దిట్టలు ,
వీరికి పుత్ర సంతానము లేదు. ఇద్దరాడుబిడ్డలు మాత్రమున్నారు. వీరి అముద్రిత రచనములు చాల కలవు. అవి ఎచ్చటున్నవో తెలియదు. రాయలసీమలో ఉన్న బళ్ళారి పట్టణము మన దురదృష్టముచేత కర్ణాటకములో కలసిపోయినది. ఇప్పుడు కూడా ఆ పట్టణమున ఆంధ్ర కవిపుంగవులున్నారు, ఆదిభాగ్యమే .
రాయలసీమ రచయితల నుండి….
———–