పేరు (ఆంగ్లం) | Vankayalapati Subrahmanya Kavi |
పేరు (తెలుగు) | వంకాయలపాటి సుబ్రహ్మణ్య కవి |
కలం పేరు | – |
తల్లిపేరు | అదెమ్మ |
తండ్రి పేరు | వీరయ్య |
జీవిత భాగస్వామి పేరు | సుబ్బమ్మ |
పుట్టినతేదీ | 1/1/1738 |
మరణం | – |
పుట్టిన ఊరు | కార్వెటి నగరం , చిత్తూరు జిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | వీరు కీర్తనలే కాకుండా కన్నడ బాషసుండి శ్రీ కనకదాసు చరిత్రమును తెనుగు లోనికి అనువదించిరి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | వంకాయలపాటి సుబ్రహ్మణ్య కవి |
సంగ్రహ నమూనా రచన | క్రీ .శ 19వ శతాబ్దమున రాయలసీమయందలి కడప జిల్లా, ఓడ గుంటలో వంకాయలపాటి సుబ్రహ్మణ్యకవి వాగ్గేయకారుడుగా వెలసిరి వీరు యాద వేంద్రోపాసకులు. వీరి పూర్వీకులు చిత్తూరు జిల్లాకు చెందిన కార్వేటి నగరమువారు . కార్వేటినగరము నందు స్నప్పుడే కవిగారు శ్రీ యలమంతి పిచ్చావార్యుల వారివద్ద సంస్కృతాంధ్రముల నభ్యసించి, శ్రీ యాదవేంద్రోపానన, మహామంత్రమునుపదేశము పొందిరి అప్పటి నుండి సుబ్రహ్మణ్యకవి శ్రీ యాదవేంద్రుని (శ్రీ వేణుగొపాలస్వామి) తమ ఉపాస్య దైవముగా ఎంచుకొనిరి . |
వంకాయలపాటి సుబ్రహ్మణ్య కవి
క్రీ .శ 19వ శతాబ్దమున రాయలసీమయందలి కడప జిల్లా, ఓడ గుంటలో వంకాయలపాటి సుబ్రహ్మణ్యకవి వాగ్గేయకారుడుగా వెలసిరి వీరు యాద వేంద్రోపాసకులు. వీరి పూర్వీకులు చిత్తూరు జిల్లాకు చెందిన కార్వేటి నగరమువారు . కార్వేటినగరము నందు స్నప్పుడే కవిగారు శ్రీ యలమంతి పిచ్చావార్యుల వారివద్ద సంస్కృతాంధ్రముల నభ్యసించి, శ్రీ యాదవేంద్రోపానన, మహామంత్రమునుపదేశము పొందిరి అప్పటి నుండి సుబ్రహ్మణ్యకవి శ్రీ యాదవేంద్రుని (శ్రీ వేణుగొపాలస్వామి) తమ ఉపాస్య దైవముగా ఎంచుకొనిరి .
ఈ కవిగారికి కడప జిల్లా, బుడుగుంట పల్లెలోని రాచూటివారి ఆడబిడ్డయగు సుబ్బమ్మను వివాహ మాడిరి అప్పటినుండి వారు మామగారి గ్రామమగు బుడుగుంట పెల్లెనే స్థిర నివాసముగా ఏర్పరుచుకొనికి ఆపల్లెలో వారి యింటిముందే శ్రీ యాదవేంద్రులస్వామి మందిరము నిర్మించిరి. ఆ స్వామికి కవిగారె రధోత్స వాదులను నడిపిరి .
ఈ కవిగారికి మైనంపాటి వంశీయులతో నంబంధ బాంధ్యవములు కలవు తన సోదరిని మైనంపాటి కేశవయ్యకిచ్చి పెండ్లి చేవెను. కేశవయ్య ఉద్యోగ విరమణానంతరం బడుగుంటపల్లె చేరడంతో యిరువురు యాదవేంద్రుల సేవించిరి. మైనంపాటి వంశీకులు సంగీత, సాహిత్య, నాట్యాభినయములలో అభినివేశము కలరు. దానితో ఇరువురి బాంధవ్యము స్వామి సేవకు మూడు పూవులు, ఆరుకాయలైనవి.
శ్రీ యాదవేంద్రునిపై సుబ్రహ్మణ్య కవిగారు అనేక కీర్తనలు రచించి గానము చేసిరి, కీర్తనలందు బుడుగుంట పల్లెకు వరయదపురమని పేరుపెట్టి వర, యదుపురమున వెలయు కృష్ణా” అని స్వామివి కీర్తించిరి వారి యాదవేంద్రుని కీర్తన లిట్లున్నవి.
కీర్తన నాదనామ క్రియ రాగం_ఆదితాళం
ప: అప్పా నాదు తప్ప లొప్పకొనుమా కృ
ష్ణప్పా! నీవా నన్నేలు కొనుమా II అ |
అ , ప: ఉపవాస వ్రతముల సలుపలేను, ఒక్క
దీపారాధనమైన జేయలేను
చ: స్నాన సంధ్యా నియతి జరుపలేను, వి
జ్ఞానుల గనుగొని మ్రోక్కలేను
దాసుల గనుగొని పేడగేను, శ్రీవి
వాసా నీ సన్నిధికి నే జేరలేను |అ |
జన్మము లెత్తి యెత్తి విపికినాను ఈ
జన్మముతో సరిచేయవలెను
వర, యుదుపురమున వెలయు కృష్ణా” నే
మరువ నెప్పడు సీ నామ భజన |అ |
వీరు కీర్తనలే కాకుండా కన్నడ బాషసుండి శ్రీ కనకదాసు చరిత్రమును తెనుగు లోనికి అనువదించిరి వీరు కార్వేటినగరము నందున్నప్పడే మద్వ మతస్థుడై న శ్రీ పోలూరు కృష్ణమాచార్యుల వారికడ కన్నడ భాషయందు పాండిత్యము సంపాదించి, వారి ప్రోత్సాహముతో శ్రీ కనకదాసు చరిత్రము ననువదించెను.
ఈ కనకదాన చరిత్రమునుండి మచ్చునకీ పద్యము చూడుడు .
ఉ : శ్రీకర సారస ప్రచురశీల నతార్చితజాల, సంవిదా
నేక భవాంధకార పరి నిర్మల సంచిత యోగలద్ది, ప్రా
భాకర దీప్తి, యోగి జన బాసుర హృత్పగసీరుహా సమా
లోకనమై దనర్చు, కమలోదరు పాదము లాశ్రయించెదన్
అంతఃపుర కాంతల వనవిహార వర్ణన నిట్లు గావించిరి.
కం: అంగజ శరహిత శుభకర
మంగళ, రంగత్ప్ర మాన మహితోజ్జ్వలమై
సంగీత మత్త, మధు కర
శృంగార వనాంతర ప్రాశస్త యుతంబై
అంతటి చక్కని రచన గల ఈ గ్రంధము అసంపూర్ణము గానే ఆగిపోయింది . తరువాత వీరు లక్షణా పరిణయము అను నాటకమును రచించిరి . జీవితాంతము యాదవేంద్రుని కీర్తనలతో గొలుచుచు తుదకు ఆ స్వామిని,
‘కమలనయన బ్రోవరా – కరిరాజవరద”
“వర యాదవ పురవాస! కృష్ణ నిను
కరమరుదుగా నా కన్నుల గాంచెద,
కోరి కొలుతు నాడు కోర్కెలు దీర్చగ
సారసాక్షి నీ సన్నిధి జేరితి |కమల |
అంటూ స్వామి సన్నిధి చేరుకొన్న పుణ్యపురుషులు ఉన్న పాండిత్యములో ఉడుతాభక్తిగా యాదవేంద్రునిపై కీర్తనలు వ్రాసి, జీవితమును ధన్యము చేసికొన్న మహనీయుడు శ్రీ వంకాయలపాటి సుబ్రహ్మ ణ్యకవి .
రాయలసీమ రచయితల నుండి..
———–