విద్వాన్ హెచ్. దేవదానము (Vidwan H Devadanam)

Share
పేరు (ఆంగ్లం)Vidwan H Devadanam
పేరు (తెలుగు)విద్వాన్ హెచ్. దేవదానము
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1902
మరణం11/11/1954
పుట్టిన ఊరుహనుమన గుత్తి , బట్వేలు తాలుకా , కడప జిల్లా
విద్యార్హతలు
వృత్తితెలుగు పండితులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుపరమ సుందరి , మృత్యుంజయ స్మృతి, ఆకటిచిచ్చు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవిద్వాన్ హెచ్ . దేవదానము
సంగ్రహ నమూనా రచనశ్రీ దేవదానముగారు క్రైస్తవ మతస్థులైనను హిందూ పురాణ, శాస్త్రములందు మక్కువ హెచ్చు. వీరు పేరు తమ కౌమార దశ నుండియు శ్రీ యేసునామ సద్గురు సేవా తత్పరులై క్రైస్తవ మతభక్తి ప్రతి పాదకములై న నాటకములను మరికొన్ని యితర గ్రంథములను రచించిరి. వీరి నాటకములు రాయలసీమ క్రైస్తవ ప్రజానీకానికి బాగుగా పరిచయమైనవి. వాటిని ప్రతియేడు వారు పండుగ సమయములందు ప్రదర్శించు చుండెడివారు. ఆ నాటకము లేవియును మద్రింపబడలేదు.

విద్వాన్ హెచ్ . దేవదానము

శ్రీ దేవదానముగారు క్రైస్తవ మతస్థులైనను హిందూ పురాణ, శాస్త్రములందు మక్కువ హెచ్చు. వీరు పేరు తమ కౌమార దశ నుండియు శ్రీ యేసునామ సద్గురు సేవా తత్పరులై క్రైస్తవ మతభక్తి ప్రతి పాదకములై న నాటకములను మరికొన్ని యితర గ్రంథములను రచించిరి. వీరి నాటకములు రాయలసీమ క్రైస్తవ ప్రజానీకానికి బాగుగా పరిచయమైనవి. వాటిని ప్రతియేడు వారు పండుగ సమయములందు ప్రదర్శించు చుండెడివారు. ఆ నాటకము లేవియును మద్రింపబడలేదు.
వీరు 1921 నుండి 1934 వఱకు బళ్ళారి సెంటు ఫిలామినసు హైస్కూలులో తెలుగు పండితులుగా పనిచేసిరి. అక్కడ పలువురు సాహితీవేత్తలతో వీరికి పొందేర్పడినది. ఆంతవరకు రాయలసీమలో లేని ఒక గ్రంథ ప్రచురణ ఉద్యమమును శ్రీ కల్లూరు అహోబలరావు శ్రీ ఘూళీ కృష్ణమూర్తి వర్యులచే కలసి వీరు కొనసాగించిరి. ఈ మువ్వరి కృషి ఫలితముగానే బళ్ళారి పట్టణమున “శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల’ 1931వ సం||లో యేర్పడినది. ఆ గ్రంథమాలకు విద్వాన్ .హెచ్. దేవదానముగారు కార్యదర్ములైరి. వారు గ్రంథమాలోద్యమమును కడప జిల్లాయందు బహుళ ప్రచారము గావించిరి. దేవదానము గారిచే వ్రాయబడిన “పరమ సుందరి ’ నవల రెండు భాగములుగా శ్రీ కృష్ణ దేవరాయ గ్రంథమాల ద్వారా ముద్రించపబడి. బహుళ వ్యాప్తి గాంచినది.
శ్రీ దేవదానముగారు రచించిన పొత్తములలో “మృత్యుంజయ స్మృతి” అను కావ్యము శ్రీ యేసునాథుని చరిత్రమును తెలుపుచున్నది. దాదాపు రెండు వందల పద్యము లిందుగలవు. ఏసునాథుని మృత్యుంజయునిగా స్మరించుటలో కవిగారి భావన దొడ్డది. ఆ మహాత్ముని దివ్యాత్మ మృత్యుంజయమై, దివ్యజ్యోతియైనదని కవి యాశయము. –ఈ సిద్ధాంత మన్ని మతము లందును కనిపించు చున్నది. ఈ కావ్యములోని ప్రధాన ఘట్టములందు కవి నిజముగా విలపించెను. ఆ పద్యములు పాఠకుని హృదయాంతరాళమును ఛేదించివేయక మానవు. క రుడు గట్టిన హృదయమును కరిగించివేయు పద్యములవి. మచ్చునకివి చూడుడు.

మ: తలపై ముండ్లకిరీట మొండునిచి, రక్తం బొల్క గాఁగ్రుచ్చి కా
ళుల యందున్మణి చేతులందునను బల్ లోతుం దిగంగొట్టి మే
కులు, కష్టంబుల నొంద జెసిరొకొ ! యాక్రూరుల్ యెహెూద్దీయులన్
1 ఖలులయ్యో! యెటులోర్చికొంటివిక, నాగాయంబులన్నా ప్రభో!

ఉ: బల్లిదుడైన యూదుఁడొక భల్లముతో నినుఁగ్రుచ్చ డొక్కలోఁ
జిల్లునఁ జిందిరక్తమటె చెంతను నిల్చిన వారిపైఁ బడన్
దల్లట మంచె భక్త, తతి తద్దయు నేడ్చరి బంధులెల్ల, నీ
నల్లను జూడలేక భువి నైల్యము నొందిన పోల్కి గన్పడెన్ .
ن
“కవితా వేశముగల వారందరికి తర్కము పనికి కాదు. వారి హృదయమందలి సామాన్య ధర్మము వేదన. ఆది యుద్రేకించి నపుడు వారు వాక్కులను బిగబట్టలేరు. ఆ పరవశత్వమే లోకుల నాకర్షించును.”- ఈ మాటలు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు దేవదానముగారి “దీనాలాపము’లనబడు కావ్యముపై నుడివిరి. వార న్నట్ల దేవదానము గారార్ధ్ర హృదయులు. వారు తమకుగల కవిలా ధారతో సంఘ మందలి లోపములను సవరింప నా వేశములో వ్రాసిన పద్యములు పెక్కులు. మన సంఘమున కొందఱు వ్యక్తులను భవించు మితిలేని కష్టములను, వారి దీనత్వమును కవిగారు “దీనా లాపములు” అను పేరనొక ఖండికగా దీర్చిరి, జాతర సమయము లందు జంతుబలి గావించుట మనదేశ వాసులకు పరిపాటి. ఆ జాతర లందనేక మూగజీవులు తమ ప్రాణములను గోల్పోవుచున్నవి. వాటి మొరను వినువారలేరు. అవిట్లు దీనముగా విలపించు చున్నవి.

సీ|| మూలేత కంఠాలు జాలివీడుచుఁ గోసి
రకంబు చిందింప ముక్తి యున్నె?
అతికోమలంబులౌ యంగాలఁ జీల్చి
మా ప్రేవుల జంజాలు వేయఫలమె?
మా మృదు మాంసాలు మాడ్చి భుజించిన
హృదయ కల్మషములు బెదరి చనునె?
మూ క్రొవ్వు గరగించి మానక ప్రమిదల
వెలిగింపఁ పాపాలు విరియఁ బడునె?
తేIIగీII ఎంత మూడులో మానవు లెఱుఁగ రాదు
నేరులేని జంతువులను గ్రూరముగను
చంపి మాంనంబు భుజియించి యింపు మీర
జంతు బలులనిడితిమని నంతసింత్రు.

ఒక అనాథ బాలిక తన వేదన నిట్లు చెప్పుకొను చున్నది.

ఉ : తల్లియు దండ్రిలేక తలదాచు కొసంగను గేము లేక, బల్
తల్లడ మందునట్టి నను దాపకుఁ దీయుచుసాక గోయ నా
చల్లని దాత నొక్కరిని నత్కృప దైవము చూపనేని, నే
వెళ్ళి నమస్కృతుల్పలిపి వేడెద దీనత నన్నుఁబెంపగన్

ఇందు రజకుడు, వృద్ధుడు, వితంతువు మున్నగు దీనుల విలాపము లన్నియు చేర్చబడినవి. కొత్త కోడలుగూడా ఈ దీనావస్థ తప్పించు కొనలేదు. ఆమె తన వేదన నిట్ల తెల్పు కొన్నది.

ఉ: ప్రక్కలఁ జూడరాదు, మరి పాటల నేవియుఁ బాడరాదు; నే
నొక్కెడఁ గూరుచుండి మనసొప్ప విరామము సెందరాదు; తాఁ
గక్కన మంది యత్తదన కన్కిన రత్యధికంబుగాఁగ,నా
ప్రక్కకు వచ్చితిట్టి వెన రచ్చకు నీడ్చుచునుండు నీర్ఘ్యమై,

భారత దేశమందలి దారిద్ర్యమును, కూటికరవును. కుల మత భేద పిశాచము మొదలగు ననర్ధములను మనసు నందుంచుకొని, కవిగారు ‘ఆకటిచిచ్చు” అను పద్యకావ్యమును రచించి గాంధీ మహాత్మున కంకితమిచ్చిరి, మహాత్ముని యున్నతాశయములను, హరిజనోద్ధరణమును ముఖ్యముగా దృష్టియందుంచుకొని. వీరు తమ హృదయ కుహరమునుండి యుప్పొంగిన భావ తరంగ ధ్వనుల చెప్పటి కప్పడు ఊహాగానముగ రచించిరి. కుడిచి కూర్చొని పద్యము లల్లెడి స్వభావము వీరికి లేదు. శబ్దాడంబరమునకు గాని, రసాలం కారాది కావ్య లక్షణములకుగాని పాకులాడిన వారు కానేకారు. తన మనోభావములను పాఠకులకు తేటతెల్లసి తెనుగునుడికారములతో సులభముగా బోధ పడునట్లు వ్రాయుటయే వీరి అభిమతము

ఒక అనాథ హరిజన స్త్రీ తన పిల్లల కన్నముబెట్ల లేని
దుస్థితిలో చిక్కుకొన్నది. ఆమె గింజలకొఱకెందరినో అర్ధించినది, అందరావిడకు మొండి సేతులే చూపిరి. ఆవిడ తన కసికొద్ది ఆపల్లెను పల్లె వాసులను దూరినది. తుదకొకరెడ్డి, పనివారికి కూలిధాన్యములు కొలిచి వేయుట నామెగాంచి, అతనిని యాచించినది. అతడు కోపించి కసరుకొన్నాడు. ఆమె ఇట్ల తనబాధను వెళ్లగ్రక్కినది..

కం: హరిజనులని, పేలుతురుమము
హరి జనులమె యైన లచ్చి యరయదె కరుణన్ ?
హరిజనులము కామధరణి,
హరునిజనులు మేము; బిచ్చ మడుగుట గలిగెన్ .

ఉ: ఆకటి చిచ్చు దారసిలి యగ్నులు గ్రక్కుచు రోత మాటలన్
మీకడ బల్క జేయఁగను మిక్కిలి ప్రేలుచు నున్నదాన; నా
యాకటి బాధదీర్చి యిపుడాదర మీయగ నెవ్వరుందురో
మీకొక దండమయ్య! యిక మీదయన్ బాపడు నేఁటి యాకటిన్

ఇట్టి సహజమైన దృశ్యముల నత్యంత రమణీయకముగ చిత్రించునేర్పు అందకి కలవడదు.

రాయలసీమ రచయితల నుండి..

———–

You may also like...