శీరిపి ఆంజనేయులు (Siripi Anjaneyulu)

Share
పేరు (ఆంగ్లం)Siripi Anjaneyulu
పేరు (తెలుగు)శీరిపి ఆంజనేయులు
కలం పేరు
తల్లిపేరునారమ్మ
తండ్రి పేరురామన్న
జీవిత భాగస్వామి పేరుసావిత్రమ్మ
పుట్టినతేదీ6/1/1891
మరణం11/27/1974
పుట్టిన ఊరుఅనంతపురం జిల్లా ధర్మవరం
విద్యార్హతలుకలకత్తాలోని అఖిల భారత విద్యాపీఠం నుండి ఉత్తమశ్రేణిలో పట్టపరీక్ష ఉత్తీర్ణుడయ్యారు.
వృత్తిఉపాధ్యాయుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువిద్యానగర చరిత్రము, విద్యానగర వీరులు, ధర్మవర చరిత్రము, అనంతపుర మండల ఆదివాసుల చరిత్ర, చిక్కప్ప యొడయరు లేక చిక్కన్న మంత్రి,
ముసలమ్మ ముక్త్రి, శారద (డిటెక్టివ్ నవల), కుముదవల్లి (నాటకము),
వీరవిలాసము (నాటకము), గౌతమ బుద్ధ చరిత్ర, సీతారామావధూత చరిత్ర
అన్యాపదేశము, కరుణగీత, జీర్ణవిజయనగర దర్శిని, హనుమప్ప నాయుడు
ప్రహ్లాదచరిత్ర, కవి పరిచయం, ప్రకృతివైద్యము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుసాహిత్యసరస్వతి
ఇతర వివరాలుశీరిపి ఆంజనేయులు కృతికర్తగా, కృతిభర్తగా, పత్రికా సంపాదకుడిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా, సంఘసంస్కర్తగా, పరిశోధకుడిగా అనంతపురం జిల్లాకు ఎంతో పేరుప్రఖ్యాతులు ఆర్జించిపెట్టారు. ఈయన సాహిత్య పోషణ మాత్రమే కాకుండా భూరిదానములు చేశారు. ఆంధ్రప్రదేశ్ సర్వోదయ భూదాన సమితికి 72 ఎకరాల నేలను దానం చేశారు. 1949లో ధర్మవరం రైల్వేజంక్షన్ పడమరవైపు 120 ఎకరాల సొంతనేలలో ఆంజనేయపురం అనే పేటను నెలకొల్పారు. ధర్మవరంలో కళాశాల భవన నిర్మాణానికి 24 ఎకరాల భూమిని దానం చేశారు. భారత రక్షణ నిధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ద్వారా 1116/- రూ.లు విరాళం ఇచ్చారు.ఈయనకి ప్రకృతి వైద్యం అంటే నమ్మకముండేది. ప్రకృతి వైద్యాన్ని ప్రచారం చేశారు. గాంధీకంటే ముందే హరిజనోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టినవారు శీరిపి ఆంజనేయులు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికశీరిపి ఆంజనేయులు
సంగ్రహ నమూనా రచనకవి గారు తమ విద్యాభ్యాసమును ధర్మవరము వీధిబడులలోను, మిషన్ వారి పాఠశాలలో ప్రాథమిక విద్యయు జరిపిరి. తండ్రిగారి యా దేశాను సారము చిన్ననాడు కొంతకాలము వృత్తి విద్యయగు వ్యవసాయమునకే ప్రాధాన్యమిచ్చినట్లు వారు వ్రాసు కొన్న పద్యముల ద్వారా మనకు విదితమగు చున్నది

శీరిపి ఆంజనేయులు

కవి గారు తమ విద్యాభ్యాసమును ధర్మవరము వీధిబడులలోను, మిషన్ వారి పాఠశాలలో ప్రాథమిక విద్యయు జరిపిరి. తండ్రిగారి యా దేశాను సారము చిన్ననాడు కొంతకాలము వృత్తి విద్యయగు వ్యవసాయమునకే ప్రాధాన్యమిచ్చినట్లు వారు వ్రాసు కొన్న పద్యముల ద్వారా మనకు విదితమగు చున్నది,.
నన్నుఁదనవలెఁ గృషిక సంపన్నుఁబేయ
నెంచి, మజ్జనకుఁడు నియోగించె “పాలము
పనుల యెడ నడ్డచూపుట పాడి’ యనుచు
నట్టి ముదలను దలచాల్చి యడరు గంటి.
బండి తోలుట, మేడిని బట్టుటయును ,
జేతఁ గొని పొర గనిమలు చెక్కుటయును,
మ్రాను గడుపుట, యిట్టి కర్ధములనెల్ల
నాకు నామాతులుడు, కొన్నినాళ్లు గరపె.
శ్రీ సీరిపి ఆంజనేయులుగారి వృత్తి ఒజ్జరికము. తాము చదివిన “మిషను” వారి బడిలో 1911 నుండి 1920 వరకు పదేండ్లను, మాండలిక మాధ్యమిక పాఠశాలలో ఐదేండ్లను. (1920 నుండి 1926 వఱకు) అనంతపురము నందలి స్త్రీల ట్రయినింగ్ స్కూలు నందు యిరువడి రెండేండ్లను(1925-18) పనిచేసి విశ్రాంతి బడసిరి. చిరకాలము ఆంధ్ర భాషా సేవకే పాటు బడిరి, విద్యా ర్డులచేత తెనుగు పరీక్షలకు కట్టించెడివారు. పూర్వజన్మ సుకృతాను సారము వీరి కాదర్శగురువుల సన్నిధి, కవిత్వమలవడినది.

కలకత్తా యందలి ‘నిఖిల భారత సాహిత్య విద్యా పీఠము”న కథానిక, నవలా రచనా విభాగమునకు జెందిన పత్యేక పట్ట పరీక్ష యందు 1921 వ యేట, నత్యుత్తమ గ్రాశ్రేణిని జయమంది, సాహిత్య సరస్వతి’ యను బిరుదము వడసిరి. ధర్మవరమున “విజ్ఞాన వల్లికా గ్రంథమాల”ను స్థాపించి తమ రచనలనే కాకుండా తదితర కవిపుం గవుల పుస్తకములను సహితము ముద్రించిరి.
విజ్ఞానవల్లి- ప్రకృతి మాత- విద్యార్థి మున్నగు పత్రికలకు వీరు సంపాదకత్వము వహించి వానిని సమర్ధతతో నడిపి, ప్రాజ్ఞుల ప్రశంసల నందుకొన్నారు.

సాహిత్య ప్రకియలోగల యన్ని ప్రధాన పోకడలను వీరు చేపట్టిరి. చారితాత్మికాంశములను పరిశోధించి గ్రంథస్థ మొనరించిరి. వీరు వ్రాసిన చరిత్ర గ్రంథములలో ముఖ్యమైనవి. 1) విద్యా నగర చరిత్రము 2) విద్యా నగర వీరులు 3) ధర్మవర చరిత్రము 4) అనంతపుర మండల ఆదిమ వాసుల చరిత్ర 5) చిక్కప్ప యొుడయరు లేక చిక్కన్నమంత్రి 8) ముసలమ్మముక్తి.

అప్పటిలో పాఠకులు నవలలు, నాటకము లందాసక్తిని గల్లి యున్నారని యెరింగిన సీరిపివారు తమ రచనా పోకడల నటు వైపుకు కూడా కొంత మరల్చిరి. “శారద” యనబడు వీరి అపరాధ పరిశోధక నవలకు మంచి పేరు లభించినది. తదుపరి వీరు వీరవిలాసము. కుముదవల్లియను నాటకములను రచించిరి. కుముదవల్లి నాటకమును శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల వారు తమ తొమ్మిదవ పుష్పముగా ముద్రించిరి.
పై గ్రంథములేకాక 1) గౌతమ బుద్ధ చరిత్ర 2) సీతా రామావధూత చరిత్ర 3) అన్యాపదేశము మున్నగు కృతులను వీరు రచించిరి. వీరు తమ విజ్ఞానవల్లికా గ్రంథ మండలీ ముఖమున శ్రీ నారునాగనార్యుడు, శ్రీ వేదం వేంకటకృష్ణశర్మ శ్రీ కుంటి మద్ది శేషశర్మ, శ్రీ కల్లోడు అశ్వత్థ రావు, శ్రీ విద్వాన్ విశ్వం మున్నగు ప్రముఖ రాయలసీమ కవి పుంగవుల పొత్తములను ముద్రించి కృతిభర్త లైరి. సాహిత్యపోషణే కాక భూరిదానము లిచ్చిన త్యాగమూర్తులు వీరు, ఆంధ్రప్రదేశ్ సర్వోదయ పక్ష భూదాన సమితికి 72 ఎకరముల నేలను 1957వ సం.న భూరి విరాళ మిచ్చిరి. భారత రక్షణ నిధికై రూ. 1116/-లను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి ద్వారా నొసంగిరి. 1949వ సం|| లో ధర్మవరమున రైల్వే జంక్షనునకు పడమర 120 ఎకరాల సొంత నేలను విశాలమగు వీథుల నొప్పెడి యొక పేటగా ‘ఆంజనేయపుర” మనుపేర నెలకొల్పి నారు. ధర్మవరమున కళాశాల భవన నిర్మాణమునకు 24 ఎకరముల భూమిని స్వచ్ఛందముగ దానమొసగిన త్యాగశీలురు వీరు.

ప్రకృతి వైద్యమును నమ్మి నిర్విరామ ప్రచారమును గావించిరి. ప్రకృతి మాతను సేవించిరి. వారు ఎనుబది మూడేండ్ల వయసులోను నవయవ్వనుల కంటే హెచ్చగు నారోగ్యమును బొంది యుండుటకు కారణము వారు ప్రకృతి చికిత్సను గాఢముగా విశ్వసించి యుండుటయే.

సీరిపి వారి”కరుణగీత” యొక విషాద పరిస్థితులందవ తరించినది. ధర్మవరమున 1919లో నూరజాతర పేర నూరారు నోరు లేని జంతువులు బలియైనవి. ఆ మహాఘాతుక కార్యము కవిగారి హృదయమును గదల్చినది. ఆదిట్లు గీతముగా సాగినది.

చీమనేనిఁ బుట్టింపఁగా జేత గాని
నరుఁడు, పరులను జంప నే కరణీఁ దగును?
ప్రాణి హింనన మెల్ల యీశ్వరుని హింన
ఈ శునకు క్షమార్జుఁడుగాఁడు హింసకుండు.
కాన నే ప్రాణికైన నేకడలనైన
నెప్పడైన నొక్కింతయు హింస లేక
ప్రజ్ఞమై ననేర్చుట పరమ హితము
ప్రేమ తన మొల్కఁ బ్రాణుల ఔనుచు చుంట
ఈర్వరా రాధ నమ్మది శాశ్వతమ్ము
ధర్మ మార్గమ్మ పరమ పదమ్ము గనుఁడు.

వీరి ‘అన్యాపదేశము” అనంతపురము రాయలకళా గోష్టి వారిచే ప్రకటింపబడినది. ఇందనేక విషయములు రమ్యముగా వ్రాయబడినవి. “బూటకము ” శీర్షిక లో కవిగారు దిప్ని బొమ్మ నిట్లు వర్ణించిరి .

కాయమా వట్టి కర్ర ; కన్గవయుcదొర్ర ;
మస్తకము మట్టి బుర్ర ; జన్మమ్మొపర్ర :
బూటకపు గాపవై పొలములను నిల్చి,
జంతు సంతానమం జడిపింతు వౌర !
గుట్టు సాగిన దాక నీకొలువు సాగు
వో బెదురూ బొమ్మ ! గుట్టు రాట్టొందే నేని
యొవుడు నిన్నొ క మనిసిగా నెన్నువాడు?
దెస మెన్నాళ్ల మూసి దాపెట్టఁ గలము?
అమాయకత్వమును గూర్చి కవిగారిట్లు వ్రాసిరి.
కొమ్ము గవఁబస్పు నూలిపోగులను జుట్టి.
పొసగ బండారు కుంకుమల్ నొసటఁ బెట్టి
గళమునన్ వేఁప మండ దండలను గట్టి,
పాలియిడ; నిన్ను గుడికిఁ గొంపోవు వేళ;
పెనురవమ్మ లెనంగఁ దప్పెటలు మ్రోయ
గొలుపగోలది నీగొంతు కోఁతకే యని
తెలియ నేరక, బయలి చూపుల వెలార్చి
వెడలు దువు గంతులిడుచు నో వెర్రి గొర్రే !

అనంతపుర మండలమున వీరి శిష్యులు పెక్కు మంది పెద్ద పెద్ద యుద్యోగములందుండి, వీరిని స్కరించుకొను చుందురు,

శ్రీ సీరిపి ఆంజనేయులు తమ 83వ ఏట జబ్బుపడి ప్రకృతి చికిత్సానుసారము రెండు దినము లుపవసించిరి. నీరు మాత్రమే తీసుకొన్నారని వారి భార్య సీరిపి సావితిమ్మగారు చెప్పిరి. నీరస స్థితిలో ఆస్పత్రి జేరిరి కాని లాభములేక పోయెను. తమ స్వగృహములో 27-11-1974వ తేది స్వర్గస్టులైరి. వీరి భార్యకూడ ఒక సంవత్సరములోనే తీరుకొన్నారు. వీరికి సంతానమేమియు లేదు.
వీరి గృహములోనే పుస్తక భాండాగారమున్నది. అమూల్య మైన పుస్తకములను వీరు సేకరించిరి. అనంతపురములో పెద్ద మహడీ ఇండ్లు మూడుగలపు. ఇప్పడు వీరి ఆస్తి అన్నకొమారులకు, మేనల్లునికి దక్కినది.
తమ జీవితమును సాహిత్యసేవ కుపయోగించిన పుణ్య ధనులు వీరు. ఇట్టి సాహిత్య పోషణను కవిగారి వంశీకులు చేపట్టి వారి కీర్తి నినుమడింప జేతురని తలంచుచున్నాము

రాయలసీమ రచయితల నుండి…

———–

You may also like...