షేక్ దావూద్ సాహెబ్ (Sheikh Dawood Saheb)

Share
పేరు (ఆంగ్లం)Sheikh Dawood Saheb
పేరు (తెలుగు)షేక్ దావూద్ సాహెబ్
కలం పేరు
తల్లిపేరుఖాదర్ బీ
తండ్రి పేరుసుల్తాన్ సాహెబ్
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ7/1/1916
మరణం1994
పుట్టిన ఊరుచిట్వేలు’ కడప జిల్లా
విద్యార్హతలుమద్రాసు విశ్వవిద్యాలయమువారి “విద్వాన్” పట్టముతో హిందీ తెనుగు పండితుడు
వృత్తిఉస్మానియా కళాశాలలో హిందీ పండితులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుక్రీడా షర్డీశ్వరము , సాయి శతకము, సాయిబాబా దండకము, శ్రీ సాయిబాబా ఆధ్యాత్మికశక్తిని చాటిచెప్పెడి కావ్యము ‘సంస్కార ప్రణయము’.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికషేక్ దావూద్ సాహెబ్
సంగ్రహ నమూనా రచన20 వ, శతాబ్దమునకు మున్ను. ఆంధ్ర భాషలో కృతులు వ్రాసిన మహమ్మదీయులున్నట్లు మనకు తెలియదు. మాలిక్ ఇబ్రహీమ్ – అమీన్ ఖాన్ మున్నగు వారందరూ కృతి భర్తలు గానే పేరొందిరి. వారు తెనుగు కవులనాదరించిరి. తెనుగు కావ్య ముల నంకితముగొనిరి. వారు ఆంధ్ర సారస్వతము గూడ తమదిగానే యభిమానించిరి. రాను రాను హిందూ దేశములోని మహమ్మదీయులు వారి “ఉర్దూ “తో బాటు సంస్కృతాంధ్రభాషలను నేర్చి తియ్య తియ్యని తెలుగుకై తలు సృష్టించిరి. అది తెలుగుభాషకొక గౌరవప్రదమైన విషయము.

 షేక్ దావూద్ సాహెబ్

20 వ, శతాబ్దమునకు మున్ను. ఆంధ్ర భాషలో కృతులు వ్రాసిన మహమ్మదీయులున్నట్లు మనకు తెలియదు. మాలిక్ ఇబ్రహీమ్ – అమీన్ ఖాన్ మున్నగు వారందరూ కృతి భర్తలు గానే పేరొందిరి. వారు తెనుగు కవులనాదరించిరి. తెనుగు కావ్య ముల నంకితముగొనిరి. వారు ఆంధ్ర సారస్వతము గూడ తమదిగానే యభిమానించిరి. రాను రాను హిందూ దేశములోని మహమ్మదీయులు వారి “ఉర్దూ “తో బాటు సంస్కృతాంధ్రభాషలను నేర్చి తియ్య తియ్యని తెలుగుకై తలు సృష్టించిరి. అది తెలుగుభాషకొక గౌరవప్రదమైన విషయము. భారతికి మతము, కులములతో బని లేదు. ఆవిడ సంస్కారవంతునితో చెలిమి చేయును. అతడిని తీర్చిదిద్దును. అట్టి భాగ్యశాలి- కవి,
పండితుడు, హిందూ. మహ మ్మదీయ మత సమన్వయము నెరిగిన వ్యక్తి శ్రీ షేక్ దావూద్ సాహెబ్, తనది ఇస్లాం మతము మాతృభాష ఉర్దూ . పుట్టినది భారత దేశము. చేబట్టినది హిందూ, మహమ్మదీయ సమన్వయము. నేర్చినది సంస్కృతాంద్ర , హిందీ భాషలు. కవిత చెప్పి “శహబాష్” అనిపించుకొన్నది ఆంధ్రమున- ఇవి దావూద్ గారి ప్రత్యేకతలు.

పేదకుటుంబమున పుట్టిన దావూద్ కు చిన్నతనములోనే తల్లిదండులు గతించుటచే స్వస్థలమువీడి నెల్లూరు పట్టణము చేరి సాహెబ్ గారు సులువుగా నేర్చుకొనిరి. వారి కిల్లీ కొట్టు కృష్ణ రాయల భువన విజయమట్లును మరిపించుచుండేడిది. పలువురు కవి పండితుల గోష్టులతో తానును పండితులైనారు. దానికి తోడు మద్రాసు విశ్వవిద్యాలయమువారి “విద్వాన్” పట్టముతో హిందీ తెనుగు పండితుడుగా ప్రకాశించి 1940 నుండి 45సం వరకు నంద్యాల హైస్కూలులో తెనుగు పండితుల పదవిని నిర్వహించిరి. తదనంతరము 1949లో కర్నూలు ఉస్మానియా కళాశాలలో హిందీ పండితులైరి.
శ్రీ దావూద్ సాహెబ్ గారు తమనుగూర్చి యిట్ల చెప్పుకొనిరి .

“కవి యెట్టివాడైనను దగ్గరికి తీసి ప్రోత్సహింతును. కావ్య ములు సవరింతును. వారికి బలు విధముగా చక్కిలిగింత పెట్టుదును. బాల కవులను నిరుత్సాహ పరచుట పాపమను తలంపు నాకు గలదు. నాకు జాతి కుల, పంక్తి, ధర్మ, ధర్మేతరమను సంకుచితము మాత్రములేదు. నేను మాత్ర ము పదునారణాలు ముస్లిము ధర్మావలంబిని. శ్రీ షర్డీ సాయిబాబా యందు మానసిక శ్రద్దగల వాడను . మహాత్ములను శ్రద్ధ మొండు “.
దావూద్ గారిని కొందరు “తురక పండితుడని” ఆక్షేపించిరి మరికొందఱు హేక్షనగా “దావూద్ శాస్త్రి” అని పలికిరి. కొన్నాళ్ల వారి మతస్థులు ఈసడించుకొన్నారు. వీరెవరిని లెక్కకుపెట్టినవారు కాదు. దావూద్ గారిది హిందూ ముస్లిం సామరస్యమునకు పాటు పడిన పవిత్ర వంశము. వీరి అగ్రజులు హిందూ, ముస్లిం సామరస్యమునకై బలియైన మహాత్యాగి. వీరు హిందూ ముస్లిం సంస్కృతులు సంగమించిన స్రవంతి. అందుకే వీరి హృదయ పీఠాధిష్టాన దేవత సాయిబాబా మైనాడు . శ్రీ షర్టిసాయిబాబా పై వీరీకృతులు వ్రాసినారు. 1) క్రీడా షర్డీశ్వరము 2) సాయి శతకము 3) సాయిబాబా దండకము 4) శ్రీ సాయిబాబా ఆధ్యాత్మికశక్తిని చాటిచెప్పెడి కావ్యము ‘సంస్కార ప్రణయము’. ఈ కావ్యమందు శ్రీసాయి తన్ను గూర్చి తన భక్తులతో నిట్లనుచున్నాడు.

“కలకాల మార్తసంఘము వెతల్ డుల్పఁగా
మదిలో నమృత కాంక్ష బదిలపరచి,
హృదయాన నను బిల్చు సద సద్వివేకుల
తలఁపల వలపించు తత్త్వమెరిగి
‘సాయీ’ యనుచుఁ గూర్మి స్వాగతమిడువారి
కష్టముల్ పోకార్చు దృష్టినొసంగి,
భావి జీవిత చింత భయమందువారికి
జిత్తశాంతిని గూర్చు బత్తి దెలిపి,
తత్త్వ సంబంధ నిత్యనంత ప్తమతికి
గీల కమ్మగు జపమును గీలుకొల్పి
జగము గాపాడు గురుదత్త శక్తిగల్గి
షర్ది నివసింతు నాత్మ శిక్షకుఁడనగుచు”

శ్రీ దావూద్ గారు కబీరు, రహీమ్, వృంద్ ఆను మువ్వరు హిందీలో వ్రాసిన కొన్ని ‘దోహాలు’లను తెనుగున ‘సూఫీసూక్తు ” లను పేర గీత పద్యములుగా అనువదించిరి. భగవన్మహిమ ఇట్టిదనీ వారు నుడివిరి.

నదులెవని నమ్మి జీవనానందమందు
బుతువు లెవనిచయస్ సఫలత భజించు
యతుల కెవ్వాడు శరణమో యతడొసంగు
మీకు శుభముల గురునాజ్ఞ మెలగునెడల,
తత్త్వమును గూర్చి యిట్లు చెప్పిరి .

మనను మధురగ, ద్వారకా మందిరమ్ము
హృదిగఁ, కాయమ్మ కాశిగా నెజీఁగి మరియు
ద్వార దశకమ్ముగా దేహతత్త్వ మరసి
తత్వ మరయంగఁదగును నిస్తంద్రభ క్తి.

వీరి కావ్యములలో ‘దాసీపన్నా తెలుగు సాహిత్యాకాశమున నొక ఉజ్జ్వల నక్షత్రముగా వెలిగినది. రాజస్థానమున దేశ స్వా తంత్ర్యమును గాపాడుటకు తన సర్వస్వమును ధారపోసిన ‘రాణా సంగ్రామ సింహు”ని వంశ చరిత్రమునకు ప్రాముఖ్యత గలదు. సంగ్రామసింహుని పత్రుడగు ఉదయసింహుని ప్రాణ రక్షణార్థము తన పుత్రుని ప్రాణముల బలినొసగిన వీరవనిత ధాతీపన్నాచరిత్ర మించు గైకొనబడినది. ఇందు ద్వాదశ పరిచ్చేదములు గలవు. ఒక్కొక్క పరిచ్చేదమునకు కావ్యానుగుణముగా ఒక్కొక్క పేరు రమ్యముగా నుంచిరి.
వనవీరుడు ఉదయుని జంపవచ్చినప్పడు పన్నా తన నిజ సుతులినే యతనికి జూపినది. ఆ పసికందు నిద్రలో నన్నియు మరచియున్నాడు. అతని నిట్లు కవిగారు వర్ణించినారు.
మాతృవాత్సల్య నిర్మల లోహ కవచ ర
క్షాధైర్యమున నిద్ర గనెడువాని,
మాత్సర్య మోహ దుర్మాయాదు లెరుగని
యొుక నూత్న జగము నందున్నవాని. . శత్రుమిత్రాది దుష్టప్రేత ఘాతుక
భేదంబెరుంగని పిన్నవాని,
ఉయ్యలయో, తల్లియొుడియో, గద్దెయటంచు
నెంచి కూర్చుండి హర్షించువాని,
సకల మనముల బ్రేమనన్యములఁబెంచు
జలదరూపుని, కళ్యాణముల కొటూరు
బాల చంద్రుని బోలు డింభకుని జంప
విచ్చుగత్తిని నవ్వనవీరు డెత్తి!

” కోకిల గూట దుమికెడు ఘూకమట్లు ” అతడు దూకి శిశువును చంపినాడు. పన్నా “సంగ్రామమున బుత్ర శతము కాలుని జేర వాబోవు నంధ దంపతులకన్న” మిన్నగ శోకించినది. అది ఆమె హృదయమున యారిపోని శోకాగ్ని. ఆమె కుమారుని సంతోష ముగా స్వర్గమున కిట్లు పలికి పంపినది. ఆమె యెంతటీ నిశ్చల హృదయురాలో జూడురు.

ఆరుగుము స్వర్గభూమి, కటనారయుమీ మన వీరభాగమా
యిరుగున గుల్మ వీధి మన యేలిక సాంగుడు గానవచ్చు; నీ
వరిమురి నిచ్చటన్ జరిగినట్టి విషాడ చరిత్ర దెల్పమా
పరమ పవిత్ర వీరుడు కృపామతినిన్ గవగింటఁ జేర్పగన్.
పన్నా దుఃఖమున నున్నదని తెలిసి, ఆమెకప్పతూరట కల్లించుటకు చంద్రుడు, చంద్రికాతతులు బయలుదేరినవట. ప్రకృతిగూడ ఆమె మనోవ్రకృతినెటీగి దుఃఖించిన తీరున కవి గారు రమ్యముగా వ్రాసిరి, పన్నాకు ఉదయుని కాపాడుట కష్టమై పోయినది. ఆమె ఆతనిని భిల్లల రక్షణలోనుంచి పెద్దజేసి సమయము కొఱకు వేచినది. కొన్నినాళ్లకు ఆ వనవీరు పరిపాలన అరాచకముగా సాగినది. ఆతడు భోగలాలసుడైనాడు. జారుడై నాడు. ప్రజలకు వాని పాలన పై వెగటే ర్పడినది. ఆ సమయమెరిగి పన్నా ప్రజలలో విప్లవభావము పురికొల్పినది. అప్పటికి ఉదయుడు పెరిగి పదునారేండ్లప్రాయపు వీరుడైనాడు. భిల్లలు, యితర రాజులు అతనికి తోర్పడిరి. ఆ ‘భోగాల మేడలో” నున్న వనవీరునిబట్టి ఉదయుడు చంపబూనినప్పడు పన్నా అతనిని వారించినది. దానినిట్లు కవిగారు పోల్చిరి.
భారత గాథలో హృదయభారము గూర్చిన ద్రోణపుత్రు దు
ద్వార యశోవిశాలయగు ద్రౌపది ముజాక్షమియించినట్లు, హృ
త్కారుణి కత్వముం దెలుపగా వనవీరు క్షమించి. నేటి మా
భాగత ధాత్రి నేలిన కృపామతి ధాత్రియె ధన్యయియ్యెడన్ “.
ఈ విధముగా ఈ కమ్మని కావ్యము మన పోతుగడ్డపై ఆవిర్భవించినది.

రాయలసీమ రచయితల నుండి….

———–

You may also like...