కగ్గల్లు సుబ్బరత్నం (Kaggallu Subbaratnam)

Share
పేరు (ఆంగ్లం)Kaggallu Subbaratnam
పేరు (తెలుగు)కగ్గల్లు సుబ్బరత్నం
కలం పేరు
తల్లిపేరుసంజీవమ్మ
తండ్రి పేరుగోపాల రావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ8/1/1920
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలువీరు స్వయంకృషితో, భారత భాగవత రామాయణాదు లను, భక్తి శ్రద్ధలతో పటించి, కవిత్వము నేర్చిరి.
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువసంత ఋతువును వర్ణించుచు, కొన్ని పద్యములను వ్రాసినారు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకగ్గల్లు సుబ్బరత్నం
సంగ్రహ నమూనా రచనసీ : శ్రీ ప్రబోధా నంద – జీవిత లక్ష్యంబు
నద్వైత మర్మంబు- నరయదెలిసి
గుణరూప వర్ణాది గణభేదములు లేని
బ్రహ్మంబునెగంగ – బలికినారు
జ్ఞాన సంపదరూప – సౌందర్య మబ్బిన
గురు సేవ యొక్కటే – గూర్చు ముక్తి
పరిపూర్ణ భావంబు – ప్రణవస్వరూపంబ
నిలుచు నెప్పడనుచు – బలికినారు
ఆ : బ్రహ్మమెరిగి , మదిని బ్రహ్మర్షి తానౌచు
సత్య ధర్మ నిష్ఠ సాధనముల
శాంతి వచనములను – సంతాపములదీర్చు
గురువరేణ్య మిమ్ము – గొలుతు సతము.

కగ్గల్లు సుబ్బరత్నం

సాధు సంయాసులన్న ప్రీతి ఎక్కువ . శ్రీ నరహరి సద్గురువుల వారి శిష్యుడై , ఆత్మ ప్రబోధమును పొండి యున్నారు . స్వాముల వారి నిట్లు కొండా

సీ : శ్రీ ప్రబోధా నంద – జీవిత లక్ష్యంబు
నద్వైత మర్మంబు- నరయదెలిసి
గుణరూప వర్ణాది గణభేదములు లేని
బ్రహ్మంబునెగంగ – బలికినారు
జ్ఞాన సంపదరూప – సౌందర్య మబ్బిన
గురు సేవ యొక్కటే – గూర్చు ముక్తి
పరిపూర్ణ భావంబు – ప్రణవస్వరూపంబ
నిలుచు నెప్పడనుచు – బలికినారు
ఆ : బ్రహ్మమెరిగి , మదిని బ్రహ్మర్షి తానౌచు
సత్య ధర్మ నిష్ఠ సాధనముల
శాంతి వచనములను – సంతాపములదీర్చు
గురువరేణ్య మిమ్ము – గొలుతు సతము.

సీ : నిష్కామ యోగంబు – నిర్మలాంతఃకర
ణంబు, ముకికి – కారణంబు దెలియ
శివకేశవుల గొల్వఁజిత్తంబు వికసింఛి
భేద భావంబులు – వెడలిపోవు
నంసార బంధంబు – సమయంగ, నేకేశ్వ
రోపాననంబె, విద్యుక్తమగును
ఆత్మయొక్కటె స్థిర – మస్థిరంబగు దేహ
మనెడు, శంకరుమార్గ -మరయ వలయ
గీ : బ్రహ్మ విద్యను సాధింప – పరముదక్కు
ఆరయ, నిశ్చల జ్ఞానోదయంబె వలయు
నంచు, నరహరి గురువర్య! యరసిదెల్సి
నావు; కైకొమ్ము; మా వందనములు ఆర్య!

వీరప్పడప్పగు వసంత ఋతువును వర్ణించుచు, కొన్ని పద్యములను వ్రాసినారు. చిగురుబోండ్లు వసంతకాలము నందుద్యాన వనములలో తిరుగు సందర్భమున,

సీ. అందమే సొమ్మని – హాయిగా నిదురించె
చెట్ల నీడల నొక్క చిగుఁబోడి”
పందెమే నాదని – పంతంబు లడెను
దాయలోడ్డుచు నొక్క – తమ్మికంటి
చందమియ్యదియని – సఖి యలతో గూడి
మధురాన్నములదినె – మగువ యొకతె
వందల ఖర్చుతో – వచ్చినదీచీర
సంగతేమనిపల్నె – నకియ యొకతె
గీ: గిలుకు మెట్టెలు రవళింప – కులుకులొలుక
పసపు పారాటి పాదాల మిసిమిగూర్ప
చంద్రవదన మొయ్యారంపు – సౌరుతోడ
వనవిహార మొనర్చిరి – జనులు పొగడ
సంక్రాంతి నిట్ల వర్ణించిరి.
గీ: రంగు ముగ్గులు – ముంగిళ్ల – రాజ్యమేలె
క్రొత్త యల్లుండ్ర రాక్షలు గూర్చెశోభ
అత్తవారిండ్ల – యానంద మతిశయించె
పచ్చ పచ్చగ సంక్రాంతి – వచ్చునపుడు

క్రమక్రమముగా ఈకవిగారు ఖండికలనేకాక కావ్యములను కూడ వ్రాయుదురుగాక;

రాయలసీమ రచయితల నుండి…

———–

You may also like...