పేరు (ఆంగ్లం) | Kidambi Srinivasa Raghavacharyulu |
పేరు (తెలుగు) | కిడాంబి శ్రీనివాస రాఘవాచారుర్యులు |
కలం పేరు | |
తల్లిపేరు | రాగాంబ |
తండ్రి పేరు | శ్రీమాన్ గోపాలాచార్యులు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1891 |
మరణం | 1/1/1974 |
పుట్టిన ఊరు | కడప జిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | సంస్కృత అధ్యాపకులు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శ్రీ లక్ష్మీనక్షత్రమాల, రంగదామీయము, శబర విప్రః, పరాభక్తి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కిడాంబి శ్రీనివాస రాఘవాచారుర్యులు |
సంగ్రహ నమూనా రచన | శ్రీ కిడాంబి శ్రీనివాసరాఘవాచార్యుల వారు తమ చిన్ననాటి విద్యా భ్యాసమును కడప పట్టణములో సాగించిరి. 1933 నుండి 1940 వరకు వీరు కడప హైస్కూల నందు సంస్కృత అధ్యాపకులుగా పనిచేసిరి. తరువాత అనంతపురం జిల్లా బుక్క-రాయసముద్ర గ్రామమున చేనేత కార్మి కులకు ప్రౌడ శిక్షణ నొసంగి, సుమారు 20- 25 మందిని 8వ తరగతిలో ఉత్తీర్ణులు గావించిరి. |
కిడాంబి శ్రీనివాస రాఘవాచారుర్యులు
శ్రీ కిడాంబి శ్రీనివాసరాఘవాచార్యుల వారు తమ చిన్ననాటి విద్యా భ్యాసమును కడప పట్టణములో సాగించిరి. 1933 నుండి 1940 వరకు వీరు కడప హైస్కూల నందు సంస్కృత అధ్యాపకులుగా పనిచేసిరి. తరువాత అనంతపురం జిల్లా బుక్క-రాయసముద్ర గ్రామమున చేనేత కార్మి కులకు ప్రౌడ శిక్షణ నొసంగి, సుమారు 20- 25 మందిని 8వ తరగతిలో ఉత్తీర్ణులు గావించిరి.
తదుపరి మహాత్మాగాంధీగారి ఆదర్శాలను పాటించిరి. బ్రాహ్మణ కులమున పట్టిన రాఘవాచార్యులవారు మాల, మాదిగలకు సేవచేయుటకు కంకణము గట్టిరి, హరిజన బాలబాలికలకు ఎట్టి రుసుమ తీసుకొనక వారికి భోజనాది సౌకర్యములు కూడ కలిగించి, విద్య స్థితిలో ఆచార్యులవారు సంఘమునకొక పెద్ద సవాలుగా నిలబడిరి. ఆనాడు ఆచార్యులవారిచ్చిన చేయూతతో ఒక మహమ్మదీయుడు బాగుగా చదువుకొని సుశిక్షితుడై గొప్ప అధికారియగుటయే గొప్ప ఉదాహరణ ము.
స్వతంత్ర సంరయోదులైన కీ.శే . పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు గారు , కీ. శే . పప్పూరి రామాచార్యుల వారు . అప్పటి రాష్ట్ర పతి నీలం సంజీవ రెడ్డి గారితో కలిసి స్వతంత్రమునకై పోరాడిరి . వీరి సంఘ సేవా కార్య క్రమములలో ఎన్నదగినది స్త్రీ విద్య , సంగాములో స్త్రీలు చదువుతో బాటు అన్ని రంగములందు ఆరి తెరవలే ననెడి ధృడ సంకల్పము కలిగినాడు . అతని బంధు మిత్రులు ఈ విషయముగా ప్రబల విరోధులైరి కాని ఆయన పట్టు వీడక తన కుటుంబము లోనే ఆ ప్రయత్నము చేసి సాధించిరి వారికృషి ఫలితంగానే వారి నలుగురు కుమారైలు విద్యలో రాణించిరి. వీరి ప్రధమ పుత్రిక జయలక్ష్మీ వైద్యవృత్తి, ఐ యం యస్ మేజర్, వీరి రెండవ పతిక శ్రీమతి జానకి, సంగీతాధ్యాపకురాలు వీరి మూడవ ప్రతిక శారద యం .ఎ డి. యల్ యస్ లెక్చరర్, ఘోరక్ పూరు విశ్వవిద్యాలయములో ఉన్నారు. నాల్గవ కుమార్తె శ్రీనివాస శాంత, యం ఏ. పి హెచ్ డి లెక్చరర్. బెనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి, వీరి కుమారుడు గోపాలాచార్యులు యం. ఏ లెక్చరర్, అనంతపం సత్యసాయి స్త్రీల కళాశాలలో పనిచేయుచున్నారు.
ఆచార్యులవారు సంఘ సేవాపరాయణులేకాక, ప్రబోధకవులు కూడ, తమకున్న కవితాశక్తితో మానవాళిని ప్రబోధించు కొన్ని “మిత్రగీతము లను తెనుగున వ్రాసిరి, శ్రీ లక్ష్మీనక్షత్రమాల, రంగదామీయము, శబర విప్రః, పరాభక్తి ఇయ్యవి వీరి సంస్కృత ఖండకావ్యములు.
ఈ కవిగారి విషయమై కీ.శే కవిరాజు కలుగోడు అశ్వత్తరావు గారు వ్రాసి పంపిన విషయము లిందు పొందుపరచు చున్నాను.
“……… తొలుత సంపదలతో దులదూగి, విపరీత విరివిలా సముచే విడివడి, జ్ఞాన జిజ్ఞాసులై , ఏకాంతముగ లోకమనకు మరుగుపడిన ఒక అజ్ఞాత కవిని పరిచయము చేయుచు, ఆతని హృదయపేటిక నుండి ఎప్పడో వెలిదీపిన ప్రాత కాగితముల పొట్ల ములో , మూతవడియు మిలమిల లాడుచుండిన మణులు నాకంట బడినవానిలో కొన్నింటి నిందువెంట బంపు కొంటిని, వాటిని రాయలసీమ రచయితల చరిత్రలో చేర్చుకొని, ఒరపెట్టి విలువగట్టి లోకముదృష్టికి బట్టింతురుగాక”
ఆ మిత్ర గీతములందలి ప్రబోధమిట్లున్నది.
గీ : నీవె శ్రీరాముడవు; సీత నీదు సతియె
ఒక్క-తలరావణుల్ బద్గురుందు రిపడు:
వినవే ‘ఆమిషవత్కాంత? యనగ బుధులు
కాలదోషంబు లేదె ? జాగ్రత్త సుమ్మ,
గీ : సర్వ విజయసిద్ధికి నాత్మశక్తి వలయ;
బ్రహ్మ చర్యమ్ము నందది వజరలు చుండు;
నాకు నందనిపుచు కొనంగఁ జాల
కొంగు బంగారమౌ సీకప, కొనగఁబూను,
గీ : అఖిల లోకాలు కాని నేత్రాబ్జములకు
కరతలామలకం బులై గావించు ,
అతని శ్రవణ విపంచిపే ననుదినమ్ము
మేళవించు భువనగీతి వేళకన్య,
గీ : రామ నీతివాక్యాల స్వార్దమ్ములేదె ?
ఇంద్ర సతతోడ ఆచెల్మి యితనికేల ?
వాలిఁ గూలిచి, కృపుడె కో- మడిసె;
పాపఫలము దప్పనె ? యెంత వారికై న ?
గీ : దివికీ నేగి సుఖింతువో ? దేబకా వె?
పలుమరిందేబ మనసెట్లు వచ్చునీకు ?
మీసమున్నచో నాస్వర్గ మందెగూర్చ .
భువికిఁదేడె మందాకిని పూర్వమొకడు ?
ఈ విధమైన ప్రబోధములను ఆచార్యులవారు తమ మిత్ర గీతములందు గావించిరి సామాజిక విషయములను ధార్మికరీతిలోమేళవించి , సునిశితమైన మందలింపుతో నర్మగర్భముగా వ్రాసిరి.
వీరు నిరాడంబరుణ, తానొక సామాన్య వ్యక్తిగా జీవించి, నలగురిని ఉన్నతస్థితికి దెచ్చిన మహనీయులు, ఇట్టివారు అరుదుగా కనిపింతురు వీరికి ప్రచారమక్కరలేదు . తామనుకొన్న కార్యమును సాధించవలెననె గట్టి తలంపతప్ప, పేరు ప్రతిష్టలకు ప్రాకులాడినవారు కారు, మానవసేవే మాధవసేవగా తలచిన మహనీయులు వీరు.
రాయలసీమ రచయితల నుండి….
———–