కొడవలూరి రామచంద్రరాజకవి (Kodavaluri Ramachandrarajakavi)

Share
పేరు (ఆంగ్లం)Kodavaluri Ramachandrarajakavi
పేరు (తెలుగు)కొడవలూరి రామచంద్రరాజకవి
కలం పేరు
తల్లిపేరుఅచ్చమాంబ
తండ్రి పేరుసంజీవరాజు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1877
మరణం1/1/1945
పుట్టిన ఊరుకడప జిల్లా ప్రొద్దుటూరుకు దగ్గరగాగల ముక్తి రామేశ్వరం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువసుచరిత్ర కర్త
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకొడవలూరి రామచంద్రరాజకవి
సంగ్రహ నమూనా రచనసీ : ప్రతివాది పండిత ప్రకర భయంకర
ప్రౌఢ వాక్యులు భట్టరాజువారు
క్ష్మాతలాధిప దత్త సామర్థ్య చిహ్న వి
భ్రాజితాంగులు భట్టరాజువారు
విద్వాన్ వరిష్ట సద్విజ్ఞాన పూరీత
ప్రకట కీర్తులు భట్టరాజువారు
సంస్కృతాంధ్ర సుశబ్ద సంశోభిత కవితా
ప్రాభవాత్ములా భట్టరాజువారు

కొడవలూరి రామచంద్రరాజకవి

సీ : ప్రతివాది పండిత ప్రకర భయంకర
ప్రౌఢ వాక్యులు భట్టరాజువారు
క్ష్మాతలాధిప దత్త సామర్థ్య చిహ్న వి
భ్రాజితాంగులు భట్టరాజువారు
విద్వాన్ వరిష్ట సద్విజ్ఞాన పూరీత
ప్రకట కీర్తులు భట్టరాజువారు
సంస్కృతాంధ్ర సుశబ్ద సంశోభిత కవితా
ప్రాభవాత్ములా భట్టరాజువారు
తే: నిస్సమాన ఘృణాధర్మ నీతి వినయ
ప్రతిభ సాలంకృతులు భట్టరాజువారు
నుత్తమ క్షత్రవంశ పయోంబురా
ప్రభవ జై వాతృకులు భట్టరాజువారు.
భట్ట రాజుకులజులు తమకుగల ఆత్మ విశ్వానము నీట్ల ప్రకటించుకొనిరి . వారెందులో తక్కువ వసుచరిత్ర కర్త భట్టుమూర్తి రత్నాకరం గోపాలరత్నాకుం అప్పప్పకవి యింకా ఎందరెందరో కవిపుంగవులు ఈ కులమున పట్టి విఖ్యాత నార్జించిరి వారు రాక్షస్థానములందు మన్ననల నందు కొనిరి . సంసృతాంధ్ర ములు వారి జీహ్వాగ్రములందు నాట్య మాడినవి వారు వందిమాగధులే కొరు; శతాధిక కావ్యములకు కర్తలు. వారు పేరు ప్రతిష్టలకు ప్రాకులారనివారు అధ్యయన, ఆధ్యాపనలు నిత్య కృత్యములుగా కలవారు ఇట్టి సత్కల వంశ సంజాతుడు శ్రీ ఆంజనేయ స్వామిభక్తుడు ‘మహా సేనోదయ కావ్య కర్త, కావ్యనాటక శతకాది వివిధ రచనా ప్రక్రియలందు లబ్ద ప్రతిష్టుడు , సువర్ణ హస్త కంకణధారుడు, రాజా స్థానములందు సన్మానములను బొందిన మహనీయుడు మన శ్రీ కొడవలూరి రామచంద్రరాజు కవిగారు
శ్రీ రామచంద్రరాజు వంటి ప్రౌడకవి, చిత్రబంధ, గర్భబంధ కవిత్వములను చెప్ప గల ధీశాలిని ఆధునికులలో లేరని యే చెప్పవచ్చును. ఆయన వసుచరిత్ర కర్త, రచనా వైఖరిని ఆపోసన పట్టినవాడు తిక్కన కవిత్వమును తనదిగా చేసుకొన్నవాడు. పోతన భక్తిభావము ననుసరించిన వాడు కనుకనే ఆయనిట్లు చెప్పికొన్నాడు.
మ: సుతదారాది కుటుంబ రక్షణకునై క్షోణీస్థలిన్ మానవ
స్తుతులం గావ్య ములొప్ప జెప్పి , ధనరాసుల్గొంచు మోదించుచున్
వితతా హంకృతి నొంది చచ్చి , నరకావిద్దాంగు లై యున్కి , హీ
నత యౌటన్, భగవత్ప మర్పణము జెందంగన్ రచింపం దగున్

ఇహపర సాధనలకై , తమ కావ్యములను శ్రీరామచందున కంకిత మిచ్చిన భక్త వరేన్యులు వీరు . వీరి కింతటి కవితా ప్రౌడిమ శ్రీ ఆంజనేయ స్వామి వల్లనే కల్గినది . ఆవిషయముగా వారిట్లు వ్రాసిరి .

తే: పంక్తి, రధ నందనాగ్రణి పాదకమల
సేవనానందు నంజనీదేవి నుతువి
కరుణచే రామచంద్ర సత్కవి సమాఖ్య
గలిగే గాకున్న సీ పేరు గలదినాకు

శ్రీ మారుతిని దలచి నప్పుడెల్లను కవి తన్మయుడై ఆనందబాష్పములు రాల్చెడివారు.

“నా పుణ్యము చేత షణ్ముఖుని పుట్టక గాధలు గద్యపర్యముల్ పన్ని రచింపరైరి, యొక పట్టున, దానిని నే రచించెదన్” అంటూ కవిగారు కుమారస్వామి గాధను అత్యంత సారవంతముగా రచించి,దానికి మహా సేనోదయ’ మని పేరిడిరి ఇయ్యది స్కాంద
ఆశ్వానముల పురాణ ప్రబంధ కావ్యము దీనికి మూలము స్కాంధ పురాణ మందలి, శంకర సంహిత” యందలి మహా సేనోదయ కధావస్తువు ఇందలి సూర్యోదయ వర్ణన చూతము.

ఉ : కైరవముల్ దపించె,విహగంబులు గూండ్లు త్యజించె బద్మమిల్
గోరికలన్ వహించె, నుడుకోటి నశించె, రథాంగ దంపతుల్
సారెకు సంతసించె, బొది జక్కెర విల్దార తూపలంచె ది
గ్వారము కాంతి బెంచె, బనిపాటలు గేస్తులడాసె నంతటన్

ఇందు కొంత నాటకీయత గూడ కవిగారు జొప్పించిరి. వల్లీ దేవిని ప్రేమించ బోయిన కుమార స్వామి బోయ వేషమున వల్లి కడకు వచ్చి, సంబాషణ సాగించెను అంతలో ఆమె తండ్రి పుళిందుడురాగా స్వామి నటవృక్షముగా మారెను. తదుపరి ముసలి బాహ్మణ వేషము ధరియించి త్రాగుటకు నీరు కోరెను, వల్లి అతని సమీపమునగల సరసునకు పొమ్మనెను . అప్పుడు కుమార స్వామి

ఉ : త్రోవ యెరుంగ నచ్చటికి దోయరుహాననః నాకుదోడుగా
నీవుయ్ నురాక తక్కితివ ఏవి నిజంబుగ బోవజాల ; నె
నేవిదిదోషి నైతి , నన నింతి కృపన్ గాపబాగ్ర జన్ముతో
బోవుడు జేర్వు జేరి దగబో , జలమాతడు గ్రోలి వేడుకన్

మంచి భావములు కలిగినప్పడు వానిని చెప్ప నేర్చుటకు మంచి
భాష కావలెను. భావము భాష ఈ రెండుసు కవికి రెండు చేతుల వంటివి ఏ
ఒక్కటి కుంటుపడినను తొందరే. మంచి భాషా పాండిత్యమున్న వారికి భావపరంపర తక్కువగా నుండవచ్చును . భావా వేశము కలవారికి భాష తక్కువ కావచ్చును. లట్టి సందర్భము లందు రస వంతమైన కవిత్వము పుట్టుటకు వీలుండదు. అట్లు కాక ఈ రెండును తన హస్త గతము గావించుకొన్న కవిపుంగవుడు తన కవితా పటిమతో స్వర్గమునే ఇలకు తెచ్చును . అతని ఊహల కింతుండదు. ఆ కవి రవినే మించును .
అతడు బొమ్మను తిమ్మి చేయును. తిమ్మిని బొమ్మ చేయును. అందుకే కవి దృష్టి వేరు, మన దృష్టి పేరు. చంద్రునిలోని మచ్చకు కారణము రామచంద్రరాజుగారి భావనలో వేరుగానున్నది. అది యే భావనో జూడుడు .

మ: ముదమొయిప్పన్ జను దెంచుచున్న శశి భృన్యూర్తిన్ త్రియామా
నూధూ టి.ధృడాలింగన మాచరింప, దనకాఠిన్యంపు జందోయి పై
బదిలంబౌ , మృగ నాభి కర్దమము, లోభాగంబు నందంటియు
న్నది పోలెన్ , గననయ్యెనంక మరవింద ద్వేషి బింబింబన్,

రసజ్ఞు లిందరి సారమును గ్రహించియే వుందురు . తన కడకు సంతోషముగ వచ్చుచున్న చంద్రుని రాత్రియనెడి ‘ మిక్కిని గాఢముగా కౌగిలించుకొనెను ఆమె బిగువైన చన్నులకు పూసిన కస్తూరి, చంద్రుని యురోభాగము నందంటు కొనినది. ఆ దృడాలింగవ ముద్రలే చంద్రుని లోని కళంకమునకు కారణములు ఇది కవిగారి సహేతుకమైన భావకల్పన, ఇట్టి భావోద్వేగముతో కూడిన పద్యములు కోకొల్లలు. సాహితీ ప్రియులు ఎదువలసినదే తప్ప ఇందుదహరింప సాధ్యపడదు ఈ కవికి రామరాజ భూషణుని కావ్యరచనా శైలిపై మిక్కిలి మక్కువని తోచును అటనట ఆ పోకడలే కనిపించును కవిత్వమందు శ్లేష నుంచుట, కొందరుకవుల కొక కేశి. సాహితీ పిపాసుల కీ కేళి కొంత భాషాభివృద్ధిని ఆలోచనా శక్తిని ఇనుమ డింపజేయును మనప్రాచీన కావ్యములందీ కేళి అపారము ఆధునిక కావ్య ప్రబంధములందు కూడ కొందరీ పద్దతిని తమ కావ్యములందు చొప్పించిరి రామచంద్రరాజు గారి మహాసేనోదయకావ్యమందలి శ్లేషను కొంత చూతము.
సీ: వర సుమనశ్చక్ర వాళక భరితంబు
మహనీయతర సుధర్మాన్వితంబు
అసమానఘన వైజయంతప్రకాశంబు
విద్యాధరోరోత్కర విలసితంబు
వసులాధ సంప్రాప వర్ణిత విభవంబు
నతులిత వజప్రభావృతంబ
సంతత గురువాక్య జాలాభి రామంబు
గంధర్వ సందోహ బంధురంబు
గీ|| ప్ర బల పణ్యజనౌఘ ప్రాప్యస్తలంబ
వితత దోషాత్మకా ళిదవీయ తలము
బ్రాంచి తాఖండ సౌఖ్య రత్నా కరంబు
క్ష్మాత్రి విష్టప మన నొప్పు స్కంద పురము .

ఇందు స్కంధ పురమును వర్ణించుచు . అది సుర పురము కంటే లన్నింటి యందును మించి యున్నదని కవి గారు శ్లేషలో వర్ణించిరి .
వీరు గర్భ బంధ కవిత్వమున దిట్టలు . ఇట్టి రచనా ప్రక్రియలో గారడీ వాణి వలె కవి గాలిలో చేతులూ పినట్లు కనిపించినను , తుద కతడు మనకు తాను సాధించిన పలితమును చూసి నానందింప జేయుచున్నాడు .

రాయలసీమ రచయితల నుండి….

———–

You may also like...