పేరు (ఆంగ్లం) | Tekumalla Kameswararao |
పేరు (తెలుగు) | టేకుమళ్ల కామేశ్వరరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | విశాలాక్షి |
తండ్రి పేరు | టేకుమళ్ల అచ్యుతరావు |
జీవిత భాగస్వామి పేరు | హనుమాయమ్మ(రెండవ భార్య ) |
పుట్టినతేదీ | 3/22/1907 |
మరణం | – |
పుట్టిన ఊరు | విజయనగరం |
విద్యార్హతలు | – |
వృత్తి | 1933లో ఉపాధ్యాయుడుగా ఉద్యోగం ప్రారంభించి స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా రాయలసీమ,ఉత్తర సర్కారు జిల్లాలలో పనిచేశాడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | రోజా (కథా సంపుటము), జానకి ప్రేమ (కథా సంపుటము), వెలుగు పాలపిట్ట, మిణుగురు పురుగు (గేయాలు), కోపదారి మొగుడు (నాటకం), సాహిత్య చిత్రములు(కథల సంపుటి) , పాత పాటలు, సాంప్రదాయ విజ్ఞానం,నా వాజ్మయ మిత్రులు, Further life of the Soul, కలువలు (ఖండకావ్యము), వాడుక భాషారచన – కొన్ని నియమములు, పూర్వాంధ్రకవులు, తెలంగాణా రాజుల చరిత్ర, ప్రకాశవిమర్శీయము (నాటకం) జానపదగేయ వాజ్మయ చరిత్ర |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | కవి, విమర్శకుడు.జానపద వాజ్మయం లోనూ, బాల వాజ్మయం లోనూ ఎక్కువగా కృషి చేశాడు. పాత పాటలు జోల పాటలు సేకరించి ప్రచురించాడు. వ్యవహారిక భాషకు కూడా కొన్ని నియమాలు అవసరమనే అభిప్రాయమున్న వ్యవహారిక భాషవాది. ఈయన రాసిన రోజా కథ చదివిన గిడుగు రామ్మూర్తి పంతులు గారు దేశ భాషలో ఎంతో కృషి చేసాను ఎందుకు? ఇటువంటి కథ ఒక్కటి రాసివుంటే ఎంత బాగుండేది అని మెచ్చుకున్నారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | టేకుమళ్ళ కామేశ్వరరావు కుదింపులు |
సంగ్రహ నమూనా రచన | కుదింపులు రెండు రకాలు . ఒకటి – ఒక మాటలో అక్షరం గాని , అక్షరాలూ గాని విడిచి , లేక అక్షరం మీద అక్షరం ఎక్కించి , హ్రస్వం చెయ్యడం . రెండు – రెండూ లేక కొన్ని మాటలకి అనవసరమైన సంధి కల్పించి హ్రస్వం చెయ్యడం . ఈ కుదింపులు సాధన ఉన్న వారి రచనల్లో ఎక్కడో గాని కనపడవు . ప్రారంభకుల రచనల్లోనో , విశేషంగా ఉంటాయి . సాధారణంగా రచయిత ప్రారంభ దశలో ఇవి విశేషంగా ఉంది సాధన చేస్తూన్న కొద్దీ తగ్గిపోతాయి . ఈ కుదింపులు గ్రంధ కర్త మొట్టమొదటి రచనల్లో విస్తారంగా ఉండడానికి కారణమేమిటంటే అతను ప్రారంభదశలో సంభాషణననుకరిస్తూ రాయడమే . మన సంభాషణల్లో ఉండే కుదింపులకి లెక్క లేదు . గ్రంధ కర్త ప్రారంభదశలో సంభాషణననుకరిస్తూ రాస్తాడు . |
టేకుమళ్ళ కామేశ్వరరావు
కుదింపులు
కుదింపులు రెండు రకాలు . ఒకటి – ఒక మాటలో అక్షరం గాని , అక్షరాలూ గాని విడిచి , లేక అక్షరం మీద అక్షరం ఎక్కించి , హ్రస్వం చెయ్యడం . రెండు – రెండూ లేక కొన్ని మాటలకి అనవసరమైన సంధి కల్పించి హ్రస్వం చెయ్యడం . ఈ కుదింపులు సాధన ఉన్న వారి రచనల్లో ఎక్కడో గాని కనపడవు . ప్రారంభకుల రచనల్లోనో , విశేషంగా ఉంటాయి . సాధారణంగా రచయిత ప్రారంభ దశలో ఇవి విశేషంగా ఉంది సాధన చేస్తూన్న కొద్దీ తగ్గిపోతాయి . ఈ కుదింపులు గ్రంధ కర్త మొట్టమొదటి రచనల్లో విస్తారంగా ఉండడానికి కారణమేమిటంటే అతను ప్రారంభదశలో సంభాషణననుకరిస్తూ రాయడమే . మన సంభాషణల్లో ఉండే కుదింపులకి లెక్క లేదు . గ్రంధ కర్త ప్రారంభదశలో సంభాషణననుకరిస్తూ రాస్తాడు . కాబట్టి ఇవి అతని రచనలో చేరతాయి . కాని ఈ కుదింపుల వల్ల శైలిలో స్పష్టత ఉండదని తెలుసుకొని క్రమేపీ రచనలో వాడడం తగ్గించుకొంటాడు . చదవడానికి విసుగ్గా ఉంటుంది . కనక రచయితలు కుదింపులు చేరకుండా చూసుకోవాలి .
కుదింపులు పాత్ర పోషణ కోసం వాడవచ్చు . అంటే , ఒక పాత్ర తాలూకు ఒకానోకగుణం తెలియ చెయ్యడం కోసం స్త్రీల సంభాషణల్లో కుదింపులు విశేషంగా ఉంటాయి . కాబట్టి స్త్రీ పాత్రల సంభాషణలో వీటిని కొంత వరకూ వాడవచ్చు . ఏదైనా వీటిని మితంగా వాడడమే ఉత్తమం . అలా కాకపోతే ఇది ఫలానా శబ్దమని చదువరికి చటుక్కున తెలియక , శ్రావ్యత ఉండక , చదవడానికి విసుగు కలిగిస్తుంది . అంచేత వీటిని ఎంత మితంగా వాడితే అంత మంచిది .
ఇక్కడ కొన్ని కుదింపులు ఉదాహరిస్తాను . వాటిలో ఏమేనా అచ్చు తప్పులున్నాయో ఏమో నాకు తెలియదు . అవి ఉన్న ప్రకారమే రాసి , వాటి పక్కనే అవి ఏమోస్తరుగా ఉండాలో తెలియ చేస్తాను .
అండమే – అనడమే :
తిండమే –తినడమే
అడు గావే వేసి – అడుగు అవేపు వేసి
ఆయన్తో – ఆయనతో
ఆయం దెక్కడో – ఆయన దెక్కడో
ఇంకో డి దగ్గరి కెళ్లి -ఇంకొకడి దగ్గరికి వెళ్లి
ఇంటి కెళ్లాప్పుడు – ఇంటికి వెళ్లేటప్పుడు
ఇదంతేమీ – ఇదంతా యేమీ
ఊర్కుని – ఊరుకుని
ఏ మన్ను – ఏ మనను
కర్ణం – కరణం
కర్రోటి – కర్ర ఒకటి
కల్త – కలత
కళ్లెంబడి – కళ్ల వెంబడి
కాల్వ – కాలవ
కురూ పెందుక్కావాలి – కురూపి ఎందుకు కావాలి
గట్టొచ్చు – కట్టవచ్చు
గల్ను – గలను
గాల్లు – గాలులు
గో లెట్టితే -గోల పెడితే
చావాలసిందే – చూడటానికి
చూపాల్సొచ్చింది – చూపవల సోచ్చింది : మాట్లాడాల్సోస్తే – మాట్లాడ వలసోస్తే
చూళ్లేడు – చూడలేడు
చె యూపి – చెయ్యి ఊపి
చేయేసి – చెయ్యి వేసి
డాక్టర్తో – డాక్టరుతో
తం దైనట్లుగా – తన దైనట్లుగా
తలూపి – తల ఊపి
తాప్తా – తాపితా
తిడ్తూ వుంటే – తిడుతూ ఉంటె , లేక ,తిడుతూంటే
తిర్లి – తిరిగి
తూల్తూ – తూలుతూ
తేలి వొచ్చీ సరికి – తెలివి వచ్చే సరికి
తేల్తూ =తేలుతూ
దాని క్కారణం – దానికి కారణం
దృక్కులతో – దృక్కులతో
దెబ్బలాడ్టం – దెబ్బ లాడటం
నమ్మిట్లు – నమ్మేటట్లు
నల్లబడ్డం కూడాను – నల్లబడడం కూడాను
నిద్దరట్టడం – నిద్దర పట్టడం
నుంచున్న – నిలుచున్న
నే న్న వ్వాను – నేను నవ్వాను
పట్రమ్మనే – పట్టుకు రమ్మనే
పట్టం – పట్టణం
పడ్తూంది – పడుతూంది
పెట్టూ – పెడుతూ
బడ్తూంది – బడుతూంది
బీత్తనం – బీదతనం
రూపాల్తో – రూపాలతో
రాల్తే – రాలితే
వలేసి – వల వేసి
వింత గున్న దేదీ లేం దేటచే – వింతగా ఉన్నదేదీ లేక పోవడం చేత
విభా తెట్టుకుని – విభూతి పెట్టుకొని
వెడ్తారా – వెడతారా
వెడ్దాం – వెళదాం
సాహేబుల్కి – సాహేబులికి
స్నేహితుల్తోటి – స్నేహితుల తోటి
కొన్ని కొన్ని శబ్దాలకి కుదింపులు ఉండి తీరాలి , విడబరచి రాయకూడదు . ఉదా :- సణుగుకుంటున్నాడు , అతుకుకుంటుంది మొదలైన ప్రయోగాలు కనబడుతున్నాయి . ఇవి శ్రావ్యంగా లేవని వేరే చెప్పక్కర్లేదు . కాని ఇటువంటివి ఎక్కడెక్కడో గాని కనబడడం లేదు . ఆ మాటలు ‘సణుక్కుంటున్నాడు , అతుక్కుంటుంది అని ఉండాలి .
ఈ కింద చూపించినలాంటి కుదింపులు తరచు ప్రయోగించకూడదు , ‘వదిలేసిన , మొదలెట్టింది , యాంత్రాగారాల్లో,పనుల్లో ‘ మొదలయినవి . ఇవి విడబరిచి రాస్తే సోంపు చెడి పోతుందని తోచే చోట్ల మాత్రమే అలాగా కుదించి రాయాలి .
(ఈ పుస్తకానికి కలా ప్రపూర్ణ , మహోపాధ్యాయ , వ్యాకరణాచార్య గిడుగు వెంకట రామమూర్తి పీఠిక రాసారు .)
సేకరణ : వాడుక భాష :
రచనకి కొన్ని నియమాలు – పుస్తకం లోని మొదటి వ్యాసం .
నవ్య సాహిత్య పరిషత్తు గుంటూరు ముద్రణ
———–