ధర్మవరం గోపాలాచార్యులు (Dharmavaram Gopalacharyulu)

Share
పేరు (ఆంగ్లం)Dharmavaram Gopalacharyulu
పేరు (తెలుగు)ధర్మవరం గోపాలాచార్యులు
కలం పేరు
తల్లిపేరులక్ష్మి దేవమ్మ
తండ్రి పేరుకొమాండూరుకృష్ణమా చార్యులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1858
మరణం
పుట్టిన ఊరుధర్మవరం ఆనంతపురం జిల్లా
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలుకన్నడ
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురామదాసు నాటకము, రామకబీరు నాటకము, చంద్రమత పరిణయము, ప్రేమచంద్రయోగి లేక అస్పృశ్య విజయము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికధర్మవరం గోపాలాచార్యులు
సంగ్రహ నమూనా రచనశ్రీ గోపాలాచార్యులవారు మన నాటక పితామహులైన శ్రీ రామ కృష్ణమాచార్యుల సోదరులు. వీరు బళ్ళారిలో సెకండరీ గ్రేడు ప్లీడరుగా పనిచేసిరి. అన్నగారివలెనె వీరుకూడా కొన్ని నాటకములను రచించిరి. వాటిలో 1. రామదాసు నాటకము, 2. రామకబీరు నాటకము, 3. చంద్రమత పరిణయము, 4 .ప్రేమచంద్రయోగి లేక అస్పృశ్య విజయము ముఖ్యములు.

 ధర్మవరం గోపాలాచార్యులు

శ్రీ గోపాలాచార్యులవారు మన నాటక పితామహులైన శ్రీ రామ కృష్ణమాచార్యుల సోదరులు. వీరు బళ్ళారిలో సెకండరీ గ్రేడు ప్లీడరుగా పనిచేసిరి. అన్నగారివలెనె వీరుకూడా కొన్ని నాటకములను రచించిరి. వాటిలో 1. రామదాసు నాటకము, 2. రామకబీరు నాటకము, 3. చంద్రమత పరిణయము, 4 .ప్రేమచంద్రయోగి లేక అస్పృశ్య విజయము ముఖ్యములు.
వీరి పేమచంద్రయోగి నాటకము 1988లో ముద్రింపబడినది. ఇది ప్రబోధాత్మకమైన సాంఘిక నాటకము. మహాత్మాగాంధీగారొనరించుచున్న అస్పృశ్య నివారణాద్యమమునకు వీరి నాటకము చేయూతనిచ్చినది.
ఈ నాటకము నందేక్కువగా అస్పృశ్యతను గూర్చి వివరించు ఉపన్యాసములే మెండు. ప్రతి పాత్ర , ప్రతి సంఘటన ఆవిషయము నందే పూర్తిగా నిమగ్నమైనదని చెప్పవచ్చును. ఆకారణముగా కొంత కధాగమనము కుంటుబడినది. దానితో కొన్ని దృశ్యములు ప్రదర్శనా మోగ్యము కాలేదు.
అస్తగిరి. వేదగిరి, ముత్తుస్వామి-మునిస్వామి, సుమిత్రుడు. సుదాముడు
భోగిగిచంద్రుడు – మదనచంద్రుడు మొదలగు ఒకే శభ్దోచ్చారణ గల పేర్ల చదువరిని మభ్యపెట్టించును కొన్ని పాత్రలు తమ న్వగతములో నాటక కథను వల్లించుటకూడ జరిగినది ఈ పద్ధతి ప్రథమాంకమున ప్రధాన కథా నాయకునితోనే పారంభమైనది.

కవి బళ్ళారి ప్రాంతమునందుండుటచే ఆటనట కన్నడ పదజాలము కూడ యాదృచ్ఛికముగా దొర్లినవి ఇందు పద్యములు అధికముగా లేవు ఉన్నవాటియందీ పద్యమును ఎన్నుకొనడమైనది. చూడుడు,
సీ: ఆర్యులు శ్రద్దతో, నధ్వనంబులు సేయ.
నెనసిన జ్ఞానంబు- మనకు గలదె ,
పూజ్యులు తమ దేహపుష్టి నార్జించిన
ఘనతర శీలంబు-మనకు గలదె
యోగుల విజ్ఞాన భోగమొందిన మార్గ
మును గాంచు పదిలంబు మనకు గలదె
తపసు లన్నముమాని విపినంబు లందుండి
తనరీన తనుశక్తి మనకు గలదె
గీ : వాత బెట్టి నంతనె నక్క- వ్యాఘ్ర మగనె
నూత మునుగంగ దు ష్క్రియల్ పూతమగునె
వెకలి జందెమును ధరింప-విప్రడగునె ?
సత్యనిష్ట యెల్లరికిని సాధ్యమగునె;

1889వ సం లో వీరు వ్రాసిన కన్నడ “ఉత్తర రామచరిత నాటకము, బళ్ళారి సరస వినోదిని’ నాటకశాలలో ప్రదర్శింప బడెను . ఆచార్యుల వారు హౌసపేట దగ్గరనున్న “నారాయణదేవర కెరె” అను గ్రామమున న్యాయవాదిగా నున్నపుడు అక్కడి రంగాచారి నాటక కంపెనీవారు ప్రదర్ళించిన నాటకములను జూచి ప్రభావితులై రామును తెలుగు నాటకము వ్రాసి ఆ యూరిలో ప్రదర్శించిరి.

వీరి రామదాసు కబీరుదాసు నాటకములకు వచ్చినంత కీర్తి, సాంఘిక నాటకములకు రాలేదు సాంఘిక నాటకపు కథావస్తువే వేరు దానిని తీర్చు నేర్పరితనమే వేరు. నాటకములు ప్రదర్శనా యోగ్యములైనప్పడే కవి ప్రయత్నము ఫలించినట్లు కదా!

అన్నగారివలె తాను ఒక ప్రసిద్ద నాటకకర్త కావలేననెడి కాంక్ష కవి గారికి మిక్కాటముగా నుండెను అన్నగారి యెడగల భక్తి ప్రపత్తులకు మేర లేదు, వారినిట్లు ప్రేమతో భజించిరి

‘శ్రీరామ సౌమ్యంబ- శ్రీకృష్ణ మధురంబు
నడతలో గవితలో బడసియుండి
రామభూషణ కవిరాజు బోలిన భంగి
సంగీత సాహితి సంతరించి
సరస వినోదినీ సంఘంబు నెలకొల్పి
పొలుపారు నాటకంబులు రచించి
సుకవియై ‘యాంధ్ర నాటక పితామహుడన్న
బిరుదొంది బధులచే వినుతి బొంది
గీ: సత్య సంధిత కార్యముల్ సలుపచుండి
పుణ్యపరుషుండు ఘనుడంచు గణ్యుడనుచు
దివికి చనుదేరి భువిపైన దేజమిడిన
రామకృష్ణార్య భజియింతు బ్రేమతోడ

ఆచార్యులవారి తదితర వివరములు తెలిపి రాలేదు నేను బళ్లారిలో పనిచేయు చున్నపుడు తమ శుభాకాంక్షలతో చేవ్రాలుచేసి నాకు “ప్రేమచంద్ర యోగి’ నాటకమును 22.10.1933 వ తేదీని ఆచార్యులవారు ఇచ్చిరి. నాకు యెరుక వున్నంతవరకు ఆచార్యుల గూర్చి వ్రాసితిని. వారి కృషి ప్రశంసింపదగినది వీరి కీర్తి ఆంధ్ర నాటక చరితలో శాశ్వతముగా నిలువగలదు.

రాయలసీమ రచయితల నుండి..

———–

You may also like...