యస్. రాజన్నకవి (S.Rajanna Kavi)

Share
పేరు (ఆంగ్లం)S.Rajanna Kavi
పేరు (తెలుగు)యస్. రాజన్నకవి
కలం పేరు
తల్లిపేరుసాలాంబ
తండ్రి పేరుచిన్న జమాలప్ప
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుప్రొద్దుటూరు కడప జిల్లా
విద్యార్హతలు
వృత్తిరెవెన్యూడిపార్ట్‌మెంటులో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా ఉద్యోగం చేశారు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకవిరాజ నీరాజనము, అవతారమూర్తులు, వ్యాససౌరభము, ఖండకావ్య సంపుటి,
త్యాగరాజీయము, తిమ్మన కమ్మని రచన, దేవయాని, లవంగి, వసుచరిత్ర వైచిత్రి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకవిసుధాకర, గానకళాధర
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికయస్. రాజన్నకవి
సంగ్రహ నమూనా రచనసరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులవారి శిష్య పరంపరలో శ్రీ రాజన్న ప్రముఖుడు. చిన్నతనమున పెద్దతండ్రి కడ సంగీతము నభ్యసించి, తదుపరి శ్రీ పుట్టపుర్తి వారికడ సాహి త్యమును, సంగీతము నేర్చిరి. చక్కని కంఠముకల్గి దానికితోడు తెనుగు సాహిత్యము నందభినివేశము పొందుట సువర్ణమునకు పరిమళమబ్చి నట్లయినది. వారికి గల మృదుమధుర కంఠమునకు, ఉపన్యాస చతురతకు తెనుగుదేశము నీరాజనము పట్టినది.

యస్. రాజన్నకవి

సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులవారి శిష్య పరంపరలో శ్రీ రాజన్న ప్రముఖుడు. చిన్నతనమున పెద్దతండ్రి కడ సంగీతము నభ్యసించి, తదుపరి శ్రీ పుట్టపుర్తి వారికడ సాహి త్యమును, సంగీతము నేర్చిరి. చక్కని కంఠముకల్గి దానికితోడు తెనుగు సాహిత్యము నందభినివేశము పొందుట సువర్ణమునకు పరిమళమబ్చి నట్లయినది. వారికి గల మృదుమధుర కంఠమునకు, ఉపన్యాస చతురతకు తెనుగుదేశము నీరాజనము పట్టినది. ప్రస్తుతము సా హిత్య క్షేత్రమున ఎక్కువగా పారాడు రాయలసీమ యువకవి మన రాజన్న, “కాంత పదావళి, కమనీయ శైలి, రాజన్న కవితలోని రమ్యగుణాలు. కవిగా, గాయకుడుగా, రంగస్థల నటుడుగా, రాయలసీమలో పేరు మోసిన అభినవ కవితా నీరా జనం -ఈ కవిరాజ నీరాజనం” అన్నారు. శ్రీ సి.నారాయణరెడ్డిగారు రాజన్నగారు రంగస్థలము పై శ్రీకృష్ణ, నక్షత్రక, చంద్ర, గయ, భవాని మొదలగు పాత్రలను ధరించినారట శేఖరులు. ఆకాశవాణిలో తమ మధురగానమును విన్పించు మధుర గాయకులు. హరికథలు చెప్పటయందుకూడ ప్రవేశము గలవారు. వీరి ‘కవిరాజ నీరా జనము”ను గూర్చి శ్రీ దివాకర్ల వేంకటావధానిగారిట్ల నుడివిరి.

“ఈ గ్రంథమున కవిచంద్రులను గూర్చి రచింపబడిన పద్య ములు లలితసుందర పదప్రయోగ శోభితములు. గంభీర భావ గర్భితములునై చదివిన కొలది చదువవలెసిను నుత్కంఠనావ హించుచున్నది “

శ్రీ రాజన్నగారికి భగవదనుగ్రహము వలనను, గురు శుశ్రూషాప్రభావము వలనను, సరస హృదయమైన కవితాధార యలవడినది. వీరింకను రసబంధురములైన కృతులు రచించి యాంద్ర భాషాయోష కభినవాలంకృతులు సమకూర్తురుగాక !”

కవి రాజ నీరాజనమునందు కాళిదాసు, పోతన్నల కిట్ల రాజన్నగారు నీరాజన సమర్పించిరి.
మ: అతడే ! మంజుల సాహితీ సురభిలోద్యానంబులో శారదా
సతి కంఠమ్మున నవ్యనాటక పరిష్కారంబులన్ దీర్చి – పం
డితులెల్లన్ బులకించిపోవ తన పాండిత్యమ్ము పండించి, న
త్కృతులన్ జేసిన కాళిదాసకవి సత్కీర్తిస్ ప్రశంసించెదన్.

సీ: శారద యామినీ జై వాతృక స్పిగ్ధ
శిశిర చంద్రికలు వర్షించినట్లు,
మధుమాస పరిపూర్ణ మాకంద మంజరీ
హారి గంధము ముమ్మరన్నయట్లు,
తరుణి జపారుణాధర నవ్యపీయూష
ములను కోకొల్లగాఁజిలికినట్లు
తుంగభద్రా సరిత్తోయ మృదంగ భం
గిమలెల్ల తరచుఁబల్కించినట్లు
పదములా ! భావమా ! పద్యబంధమా! మ
హాకవీ ! రసరాజ్యమూర్ణాభిషిక్త !
ఏ తెరుంగున నిన్ను వర్ణింతునయ్య!
మాధవాధీన ! పోతనామాత్య ! సుకవి ||

రాజన్నకవిగారు రామరాజభూషణుని వసుచరిత్రను ప్రత్యేకాభి నివేశముతో అధ్యయనం చేసినారు. రామరాజ భూషణు డందు సంగీత సాహిత్యములను సమముగా మేళవించినాడు, ప్రబంధయుగములో ఈ కృషి గావించినవారు మరొకరు లేరు. అట్లే వసుచరిత్రలోని ఆ సాహిత్య సౌరభమును, సంగీత మాధురిని, అందలి మనోహర శ్లేషవై చిత్రిని మనకు పన్యాసముల ద్వారా అందించిన ఘటికుడు రాయలసీమలో రాజన్న ఒక్కడేయని చెప్ప వచ్చును. వీరు వసుచరిత్ర”కవితావిపంచి’ని మ్రోయించిన వైణికులు.
వీరు ‘అవతార మూర్తులు , అను కావ్యమునండు గౌతమ బుద్ధునినిట్లు వర్ణించిరి .

మ: ఆరిషడ్వర్గమడంచి, యెహిక సుఖ వ్యామోహముంద్రుంచి, నీ
కరుణాదృక్కుల సర్వ భూవలయ శోకమ్మున్ నిభాళించి, యీ
ధర సర్వస్వము రోసిపోయితివి సత్యజ్యోతివై – బౌద్ధమే
పరమార్ధంబని చాటి చెప్పితివి దేవా! బౌద్ధ ధర్మాకృతీ!

ఉ: నిద్దురపోవు ముగ్ధ తరుణి వదనమ్మున కాంతివల్లి, నీ
ముద్దుల బిడ్డ రాహులుని పున్నమి నవ్వల పాలవెల్లి, నీ
యద్దమువంటి డెందమున హత్తుకొనన్ గదలంగలేక నీ
వద్దమరేయి యేగతి ప్రయాణము చేసితివోయి గౌతమా !

భారతదేశమునకు చైనాతో యుద్దము వాటిల్లిన తరుణాన మన యువక కవి రక్తము ఉక్రోషముతో పొంగినది. దేశభక్తి ప్రబోధితుడై భారతీయులను తన శంఖారావముతో నిట్ల మేల్కొ లిపినాడు .

గీ: న్యాయహీన చైనా రాజకీయ విదులు
సామ సన్మార్ణములతోడ చక్కబడరు;
దండనమ్మొక్కటే యిక దగిన తెరువు;
వీర చందనమునుదాల్చి వెడలుడనికి,

సీ: నాఁడెన్నడో కాదు నేడిదే కనుడంచు
బాలచంద్రులు నేడు ప్రబల వలయు,
నాడెన్నడోకాదు నేడు కన్లోను డంచు
తాండ్రపాపయ్యలు తరలవలయు,
నాడెన్నడో కాదు నేడిదే కనుడంచు ,
మహారాష్ట్ర వీరులు మసలవలయు
వాడెన్నడోకాదు నేడు కనెను డంచు
రాణా ప్రాతాపులు రగుల వలయు
నాటి యెందరో వీరులు మేటి మగలు
భారతావని బ్రదికియున్నారు నేడు
నాడు నేడును నేడెయై వాడిసూప
భరత మాతను నేడు కాపాడవలయు !



1) కవి రాజనీరాజనము 2) వ్యాస సౌరభము 3) ఖండ
కావ్య సంపుటి 4) అవతార మూర్తులు 5) త్యాగరాజీయము 6) తిమ్మన కమ్మని రచన. ఇవి రాజన్నగారి ముద్రిత కృతులు.
ప్రస్తుతము వీరు రివిన్యూ డిపార్టుమెంటులో రివిన్వూ ఇన్ స్పెక్టరుగా పనిచేయుచున్నను, సారస్వత సేవను ధ్యేయముగా నుంచుకొని తీరిక వేళలలో పలు తావులకు వెళ్లి సారస్వత సభ లలో ఉపన్యసించుచు, తమకుగల కవిత్వ ప్రతిభను , గానకౌళల మును యినుమడింప జేసుకొనుచుండుట ముదావహమైన విష యము. ఈ ఇరువదవ శతాబ్దపు నవయువకులకు సాహిత్యాభిరుచి ఏర్పడుట ఒక వినూత్న విషయము. అందులో ప్రభుత్వోద్యో గము చేయుచున్న వారికిట్టి విశేషాంశములపై శ్రద్దజూపుటకు ఓర్చుండదు. చేయుచున్న ఉద్యోగమునకు, తన అభిరుచికి పొందిక ఉండదు. అవి హ స్తిమ శకాంతరములు. ఇట్టియెడ రాజన్న గారి ఓర్పు, సాహిత్యాభిమానములు అభినందనీయములు.

కడప జిల్లా ప్రొద్దుటూరు అగ్ర శ్రేణి కవిపుంగవులకు నిలయము. అదొక సాహితీ కొలువుకూటము. అందు పచ్చని తోరణమై భాసించు చుండుట రాజన్నలోగల విశేషము. వీరి కృషి మూడు పూవులారు కాయలుగా వర్ధిల్లు గాక

రాయలసీమ రచయితల నుండి….

———–

You may also like...