రాచర్ల తిప్పయ్య గుప్త (Racharla Tiyyappa Gupta)

Share
పేరు (ఆంగ్లం)Racharla Tiyyappa Gupta
పేరు (తెలుగు)రాచర్ల తిప్పయ్య గుప్త
కలం పేరు
తల్లిపేరుతిప్పమాంబ
తండ్రి పేరుదొణ తిమ్మప్ప
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుబెళుగుప్ప – కల్యాణదుర్గం తాII అనంతపురం జిల్లా
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువిద్యారణ్యచరిత్ర , విద్యారణ్యవిజయము , కంపిల విజృంభణము, కాకతీయ జీవనసంధ్య
అమృత స్రవంతి , బదులుకు బదులు వీరు వ్రాసిన నవలలు
వీరు వ్రాసిన నాటకములు మోహినీరుక్మాంగద , ఛత్రపతి శివాజీ
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుసాహిత్య సరస్వతి
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికరాచర్ల తిప్పయ్య గుప్త
సంగ్రహ నమూనా రచనశ్రీ రాచర్ల తిప్పయ్యగుప్త గారిది పండిత వంశము. వీరి తాత రామప్పగారు ఆంద్ర గీర్వాణ భాషలందు ప్రజ్ఞానిధులు. వారు శ్రవణ పేయముగ పురాణపఠనము గావించు నేర్పరులు. తండ్రి దొణ తిమ్మప్ప వేదాంతమందు చక్కని అనుభూతి గల వ్యక్తి, అతడు సారస్వతప్రియుడు, దైవ భక్తి పరాయణుడు, సాధు స్వరూపుడు.

రాచర్ల తిప్పయ్య గుప్త

శ్రీ రాచర్ల తిప్పయ్యగుప్త గారిది పండిత వంశము. వీరి తాత రామప్పగారు ఆంద్ర గీర్వాణ భాషలందు ప్రజ్ఞానిధులు. వారు శ్రవణ పేయముగ పురాణపఠనము గావించు నేర్పరులు. తండ్రి దొణ తిమ్మప్ప వేదాంతమందు చక్కని అనుభూతి గల వ్యక్తి, అతడు సారస్వతప్రియుడు, దైవ భక్తి  పరాయణుడు, సాధు స్వరూపుడు.

              శ్రీ గుప్త గారు బళ్లారియందలి శ్రీ యాదాటి నరహరి శాస్త్రుల వారి కడ సంస్కృత, వేదాంత విద్యల నభ్యసించిరి. మహా  కవులుగ మండల విద్యాశాఖాధికారులుగ అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి పొందిన శ్రీ కల్లారు వేంకటనారాయణరావుగారి కడ వీరు లక్ష్యలక్షణగ్రంథముల బెక్కింటి నభ్యసించిరి. వారు తిప్పయ్య గుప్త గారికి సాహిత్య గురువులైరి. వారిని నాటికిని, నేటికిని మఱవక , భక్తిభావములతో నిత్యము స్మరించుచుండుట శ్రీ తిప్పయ్యగుప్త గారి సద్గుణవిశేషము.

               ఈ కవిగారు తమ 15 సం|| వయస్సునందే కవితా కన్యను చేబట్టిరి. బళ్లారి వార్డా హైస్కూల్ నందున్నతవిద్య చదువు  తరుణముననే వీరి రచనలు భారతి మాసపత్రికలో అలంకరింపబడినవి. వీరి తొలి రచన 1925 భార తి మాసపత్రికలో వెలువడినది. ఆ యుక్తవయస్సున వీరి కవితా రచన సాగినతీరును గమనింతము.

సి : అల భవిష్యద్వనంతాగమంబు వచించు

                   పరభృతగాన ప్రవాహమందు ;

       అలరు కెందామరలందు జుం  జుమ్మని

                   రొద సేయు యెలదేటి కదుపులందు ;

    నరవిరి మొగ్గల విరియించి సౌరభం

                  బుల గ్రోలు శీతలానిలములందు ;

       నెలమావి పూపపిందెల మెక్కి, మనసార

                      యలరు చిల్కలముద్దు పలుకులందు;

  గీ|| భవ్య కమనీయ వన, సుసౌభాగ్యమందు

    జెలఁగి యుదయించుచున్న లేజిగురులందు

     బెక్కు చందంబులన్  దాండవించుచున్న

     ప్రణయదేవతకిదె యభివందనంబు.

             తదనంతరము వీరు సాగించిన సాహిత్యకృషి మెచ్చ దగి నది. పద్యరచనయందేకాక నాటక, నవల, చరిత్రగ్రంథ రచన లందారితేరిరి. వీరి చరిత్ర  గ్రంథములలో 1) విద్యారణ్యచరిత్ర 2) విద్యారణ్యవిజయము ప్రశస్తి నందినవి. 3. విద్యారణ్య పీఠాధిపతులచే నవి ప్రశంసింపబడినవి. ఆ గ్రంథములందలి కొన్ని భాగములు త్రిలిజ  సమదర్శిని పత్రికలలో ప్రకటింపబడినవి.

            21-5-1934వ సంవత్సరమున ఈ రెండు  గ్రంథములను పరిశీలించి డాక్టర్ శ్రీ చిలకూరు నారాయణరావుగారు తమ యభిప్రాయమిట్ల తెలియజేసిరి. ” రాచర్ల తిప్పయ్యగారు రచించిన విద్యానగర నిర్మాణము, విద్యారణ్యచరిత్రము నీ రెండు గ్రంథ ములను ఆమూలాగ్రముగ చదివినాను. ఈ రెండును గొప్ప పరిశ్రమ జేసి వ్రాసినవి కాని సాధారణ గ్రంథములుకావు .

             మృదుమధురములగు పదములతో వ్రాయబడి చదువుటకింపగ నున్నవి. చరిత్ర గ్రంథములలో యీ గ్రంథములు ఉత్తమ స్థానము పొందగలవని ఆశిస్తున్నాను.”

         ఈ రెండు చారిత్రక గ్రంథములేకాక 1) కంపిల విజృంభణము 2) కాకతీయ జీవనసంధ్య వీరి కలమునుండి వెలువడినవి.

              1) అమృత స్రవంతి 2) బదులుకు బదులు వీరు వ్రాసిన నవలలు .

            వీరు వ్రాసిన నాటకములు 1) మోహినీరుక్మాంగద 2) ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శివాజీయందొక పద్యము జూడుడు.

సీ. ఎవ్వాఁడు హైందవ లెలమి సుఖింపగ

             జేసె తదాచార శిష్టరక ?

   యెవ్వాఁడు మ్లేచ్చులనెదిరి దహించెను

              కాననోగ్ర శిఖశిఖావిధంబు ?

   యెవ్వాఁడు పూర్వ రాజేంద్ర పద్ధతి నిల్పె

            నా శాంత దివ్య గజాంసపీఠి ?

    యెవ్వాఁడు శిరసావహించి దేశీకు నాజ్ఞ

            వర్తించి జన్మపావనత గాంచె ?

 అట్టిమహిమాడ్యు డున్నతుఁడౌ శివాజి

మహిత మహరాష్ట్ర లక్ష్మినిన్ మనుచుచుండె

అలరుగాత శివాజి రాజ్యంబు రామ

రాజ్య విఖ్యాతి నశ్రాంత పూజ్యమగుచు.

 

               మోహినీరుక్మాంగద నాటకమునందు రుక్మాంగదుడు మోహినీ రూపలావణ్యముల నాత్మగతమునందిట్లు భావించుచున్నాడు.

సీ. అలివేణి జిలిబిలి పలుకుల బలు ప్రేమ

            నాలకించెడు యోహనాంగు డెవడొ ?

     కలవాణి సాగసు చెక్కులనంటి ముద్దాడి

               సంతసంబును గాంచు సరసు డెవడొ?

      రమణతో నానందరాజ్యాభిషేక సం

                   ప్రాప్తికై బుట్టిన మదను డెవడొ?

     జలజాక్షి  యడుగులజాడలో వర్తింప

                    నవతరించిన సుందరాంగు డెవడొ?

గీ:  యెవని పున్నెము బూచునో యిూమెవలన

  ఆత్మ సుఖమెవనిది చరితార్థమగునొ

బ్రహ్మనంకల్పమందు నెవ్వాడుగలడొ

   యింత పుణ్యావకాశమే నెటులగాంతం.

 

                  తెనుగుసాహిత్యముతో తనకు చెలిమిగావించిన శ్రీమాన్ కల్లూరు వేంకట నారాయణరావు గురుదేవులను నిత్యము వారిట్లు స్మరింతురు.

 

కల్లూర్వంశపయi పయోధి విలనద్రాకానుధాంశుం శుభం

ఆంద్రక్మాతల పండితాఖిలజన ప్రస్తూయమానోజ్జ్వలం

బోధార్షి ప్ర తినామసిద్ధపరుషం జ్యోతిర్విదామగ్రణిం

శ్రీ మద్వేంకటపూర్వకం గురువరం నారాయణం భావయే.

              ఈ గురుకృపాకటాక్షము  వల్లనే శ్రీ గుప్తగారు “సాహిత్య సరస్వతి’ అని పిలువబడిరి. పెద్దలయెడ భక్తి . గురువుల యెడ నమ్రత, సాహిత్యపోషణ యెడ ఉదారత, సాహితీప్రియులయెడ ప్రేమ వీరికి వెన్నతో పెట్టిన గుణములు. వీరికి తండ్రి పై భక్తి ఎక్క_వ. వారి సంస్మరణార్థము 116  రూ. గ్రంథమాలకిచ్చినారు. తండ్రి కొమారుల చిత్రములు ప్రకటింపబడినవి.

రాయలసీమ రచయితల నుండి…

 

———–

You may also like...