పేరు (ఆంగ్లం) | Ronanki Appalaswamy |
పేరు (తెలుగు) | రోణంకి అప్పలస్వామి |
కలం పేరు | – |
తల్లిపేరు | రోణంకి చిట్టెమ్మ |
తండ్రి పేరు | రోణంకి నారాయణ్ |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 9/15/1909 |
మరణం | 3/4/1987 |
పుట్టిన ఊరు | శ్రీకాకుళంజిల్లా టెక్కలి సమీపంలోని ఇజ్జవరం అనే గ్రామం |
విద్యార్హతలు | ఎం.ఏ. (ఇంగ్లీషు) |
వృత్తి | ఇంగ్లీషు శాఖాధిపతి |
తెలిసిన ఇతర భాషలు | ఇంగ్లీషు, ఫ్రెంచ్, స్పానిష్, గ్రీక్, హిబ్రూ, ఇటాలియన్ |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | http://www.visalaandhra.com/literature/article-21709 (రోణంకి అప్పలస్వామి చివరి సన్మాన జ్ఞాపకాలు) |
స్వీయ రచనలు | అభ్యుదయ, అవగాహన, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రప్రదేశ్, కళాకేళి, ప్రజారధం, సృజన మొదలగు పత్రికలలోనూ అనేక ప్రత్యేక సంచికల్లోనూ వ్యాసాలు ప్రచురించారు. అల్లసానిపెద్దన, భట్టుమూర్తి, క్షేత్రయ్య మొదలు శ్రీశ్రీ, నారాయణబాబు, చావలి బంగారమ్మ, చాసో మొదలైనవారి కవితల్ని ఆంగ్లీకరించి దేశ, విదేశీ భాషా పత్రికల్లో ప్రచురించారు. ఇంగ్లీషు కవితలు లోగడ – సాంగ్స్ అండ్ లిరిక్స(1935), ది నావ్ అండ్ అదర్ పోయమ్స్ (1985) పేర పుస్తక రూపంలో వచ్చాయి. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | కేంద్ర సాహిత్య అకాడమి కోసం మాకియ వెల్లీ ప్రిన్స్‌ను – నేరుగా ఇటాలియన్ భాషనుండి తెలుగు చేశారు. మానేపల్లి, చిత్రభాను, మోహనప్రసాద్, చాగంటి తులసి – మొ||వారి పుస్తకాలకు ముందుమాటలు రాశారు. ఆరుద్ర తన తొలి కావ్యం -‘త్వమేవాహం’నూ మానేపల్లి తన తొలి కవితా సంపుటి ‘వెలిగించే దీపాలు’ను గురువుగారికి అంకితం ఇచ్చారు. 1980ల్లో ఆధునిక కవితా పితామహుడు గురజాడ అనీ, శ్రీశ్రీ తానే పితామహుడిననడం తగదని – జరిగిన వాదోపవాదాలకు గట్టి సమాధానం చెప్పారు. విశాఖపట్నం ఆకాశవాణి నుండి తెలుగు, ఇంగ్లీషులలో పలు ప్రసంగాలు చేశారు. రావూరి భరద్వాజగారు – ప్రత్యేకంగా ఆయన చేత హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రాలనుండి ప్రసంగాలు చేయించారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | రోణంకి అప్పలస్వామి |
సంగ్రహ నమూనా రచన | 1909 సెప్టెంబర్ 15న టెక్కలికి నౌపడా రైల్వేస్టేషన్‌కీ మధ్యలో వున్న ఇజ్జవరంలో రోణంకి అప్పలస్వామి జన్మించారు. చిన్న వయసులోనే ఇంగ్లీషు భాషపై మక్కువ పెంచుకున్నారు. టాగోరు, సరోజినీనాయుడు భారతీయులయి వుండీ, ఇంగ్లీషులో కవిత్వం రాస్తూండటం గమ నించి తానూ ఇంగ్లీషు కవిత్వం మొదలుపెట్టారు. 1935లో ”సాంగ్స్ అండ్ లిరిక్స్” పేర తన కవిత్వాన్ని, తానే రాసుకున్న ముందుమాటతో, స్వార్జితధనంతో అచ్చువేసుకున్నారు. అమ్మ లేదు. 1935 నుంచీ 1987లో మరణించే వరకూ తన మిత్రులకు, పంచిపెట్టారు. విశాఖపట్నం రచయితల సంఘం వారు 1985లో మేస్టారి ఇంగ్లీషు కవిత్వాన్ని ”నాక్ అండ్ అదర్ పోయమ్స్” పేర అచ్చు వేశారు. |
రోణంకి అప్పలస్వామి
1909 సెప్టెంబర్ 15న టెక్కలికి నౌపడా రైల్వేస్టేషన్‌కీ మధ్యలో వున్న ఇజ్జవరంలో రోణంకి అప్పలస్వామి జన్మించారు. చిన్న వయసులోనే ఇంగ్లీషు భాషపై మక్కువ పెంచుకున్నారు. టాగోరు, సరోజినీనాయుడు భారతీయులయి వుండీ, ఇంగ్లీషులో కవిత్వం రాస్తూండటం గమ నించి తానూ ఇంగ్లీషు కవిత్వం మొదలుపెట్టారు. 1935లో ”సాంగ్స్ అండ్ లిరిక్స్” పేర తన కవిత్వాన్ని, తానే రాసుకున్న ముందుమాటతో, స్వార్జితధనంతో అచ్చువేసుకున్నారు. అమ్మ లేదు. 1935 నుంచీ 1987లో మరణించే వరకూ తన మిత్రులకు, పంచిపెట్టారు. విశాఖపట్నం రచయితల సంఘం వారు 1985లో మేస్టారి ఇంగ్లీషు కవిత్వాన్ని ”నాక్ అండ్ అదర్ పోయమ్స్” పేర అచ్చు వేశారు.
2009 సెప్టెంబర్ 15న ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎకడమిక్ స్టాఫ్ కాలేజీలోనూ, సాయంత్రం టెక్కలిలోనూ-మేస్టారి తెలుగు వ్యాసాల సంపుటి (సంపాదకుడు) డా|| మానేపల్లి, ప్రచురణ టెక్కలిలోని అచార్యరోణంకి అప్పలస్వామి శతజయంతి ఫౌండేషన్ ఆధ్వర్యం లో విడుదల యింది. అదిప్పుడు అన్ని ప్రసిద్ధ పుస్తక కేంద్రాల్లోనూ దొరుకుతుంది. అందులో మేస్టారు 1954 భారతి మాసపత్రికలో శ్రీ రంగం నారాయణబాబు కవిత్వానికి రాసిన ముందుమాట చేరలేదు. తెలుగు రచనలు, ఉత్తరాలూ, ఇంటర్వ్యూలూ వగైరా మరో సంపుటి రావలసి వున్నది. ఈలోగా ”ఇండియా లవ్ పోయమ్స్” అనే ఇంగ్లీషు కవితా సంపుటిని అప్పలస్వామిగారి సోదరుడి కుమారుడి దగ్గరున్నదని తెలుసుకుని విశ్వ ప్రయత్నం చేస్తే ఆయన పెద్ద కుమారుడు జిరాక్స్ కాపీ పంపారు.
ఆ పుస్తకం వివరాలు
-తీ జూaఅజూవతీ జూతీవరర మూడో పేజీలో విశేషాలు క్లుప్తంగా ఇలా వున్నాయి.
కొన్ని అనువాదాలు తంబిముత్తుగారే చేశారు. కొన్ని ముల్క్‌రాజ్ ఆనందకృష్ణ కుతీసింగ్(నెహ్రూ బంధువు) రాసిన పుస్తకం, ఆనంద కుమార్ స్వామి, మన్మధనాథ్ గుప్త (భగత్‌సింగ్ మిత్రుడు) చేసిన ‘అగ్నిపురాణ’ ఇంగ్లీషనువాదం, రమేష్ చందర్ దత్తా ‘రామాయణ’ ఇంగ్లీషు ప్రతి, ఆనందకుమార్‌స్వామి గారు రాసిన ”డాన్స్ ఆఫ్ శివ” మొదలైన పుస్తకాలకు, కొందరు పాశ్చాత్యులకు కృతజ్ఞతలు.
ఇందులో సంస్కృతం, హిందీ, తెలుగు, బెంగాలీ భాషల కవిత్వాలు ఇంగ్లీషులో వున్నాయి. ఆర్.అప్పలస్వామిగారు తెలుగుసాహిత్యం నుంచి చేసిన అనువాదాలు పదిహేనున్నాయి
తంబిముత్తుగారు తమిళుడని ఆయనపేరు చెబుతున్నది. ఆయన న్యూయార్క్‌లో స్థిరపడి, మధ్య మధ్య ఇండియా (వారాల తరబడి ఓడలో ప్రయాణం చేసి) ఇండియా వస్తూ, అనేకమంది నుంచి-ఇంగ్లీషు అనువాదాలు సేకరించి పట్టుకువెళ్ళి, న్యూయార్క్‌లో అచ్చువేయించారు.
అనువాదాల వివరాలు :
1. విశ్వనాధ సత్యనారాయణగారి ఛందోబద్ధ కవితకు ఇంగ్లీషు, ఇది రెండు పూర్తి పేజీల్లో వుంది. తెలుగుకవితపేరు లేదు. ఇంగ్లీషు అను వాదం శీర్షిక. ‘ది వాయిస్ ఆఫ్‌్ సైలెన్స్
2. రామరాజు భూషణుని (భట్టుమూర్తి) వసుచరిత్రలోని, గిరిక చెవులపై రాసిన పద్యానికిి ఇంగ్లీషు
3. వసుచరిత్ర నుంచే, గిరిక కాలిగోళ్ళవర్ణనకు ఇంగ్లీషు
4. మళ్ళీ వసుచరిత్ర నుంచే-అత్యంత ప్రేమాస్పదంగా , సౌందర్యశిఖరంగా భట్టుమూర్తి వర్ణించిన పద్యానికి -”లవ్లీ గిరిక” పేరుతో ఇంగ్లీషు.
ఇక్కడికి ఒక్క వసుచరిత్ర నుంచే మూడు పద్యాల ఇంగ్లీషు అనువాదాలయ్యాయి. వసు చరిత్రను-నాటకంగా మలిచినవారూ, తమిళంలో అనువదించిన వారూ ఉన్నారు. కాని అప్పల స్వామి గారి కంటే ముందే వసుచరిత్రలోని పద్యా లకు కావలి వెంకట రామస్వామి అనే ఏలూరుకు చెందిన పండిత కుటుంబీకుడు, ఇంగ్లీషులోకి అనువదించాడు.(1829 ప్రాంతం) ఏలూరుకు చెందిన ముగ్గురు కావలి సోదరుల్లో ఒకరు వీరు. కల్నల్ మెకంజీ దొరకు చరిత్రకు సంబంధించిన నాణాలు, తాళపత్ర ప్రతుల శిలాశాసనాలు సేకరించడంలో తోడ్పడ్డారు. అంటే తెలుగులోని మంచి సాహిత్యాన్ని ఇంగ్లీషులో అనువదించే పని -1800 ప్రాంతాల్లోనే జరిగింది. సి.పి.బ్రౌన్‌వేమన పద్యాలను అనువదించారు.
5. మనుచరిత్రలో వరూధునీ ప్రవరులకు సంబంధించిన పద్యానికి/పద్యాలకు ఇంగ్లీషు అల్లసాని పెద్దనని ఇంతకు ఎవరైనా ఇంగ్లీషులో పరిచయం చేశారో. లేదో తెలీదు. కాని మేస్టారు, వసుచరిత్ర ద్వితీయా శ్వాసంలో మం|| అతడావాతపరంపరాపరిమళ వ్యాపారవీలన్
”రతనాభిన్ నవలా నొకానొక మరున్నాది శిరోరత్నమున్”
………… …………. ……………
అనే పద్యంతో ప్రారంభించి మరికొన్ని పద్యాల్ని కూడా కలిపి ఇంగ్లీషులో అచ్చులో దాదాపు రెండున్నర పేజీలు -వచ్చేలా అనువదించారు.
6. మనుచరిత్ర-అల్లసాని పెద్దననూ వదిలి- కాలమానంలో కిందికి దిగి నాయక రాజులకాలం నాటి, ముద్దు పళిని( క్రీ.శ 1765 ప్రాంతాలు) ‘రాధికా సాంత్వనం’లోని పద్యాలు (బహుశా రెండింటిని) ఇంగ్లీషు చేశారు.
7. ఇది రామరాజుభూషణుని వసుచరిత్రలోని గిరిక/శరదృతువర్ణనకు ఇంగ్లీషు ఒకే ఒక పద్యానికి అనువాదం.
8. తరువాత పద్యం-20వ శతాబ్ది ప్రారంభార్థం (1900 -1950)నాటి కవుల దగ్గరికి వచ్చి- దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పద్యమెత్తు కున్నారు. ఇంగ్లీషు అనువాదం పేరు : ‘బ్రెండ్స్ వాలంక్విన్” (పెళ్ళి పల్లకి-అవొచ్చు) ఈ అనువాదం బహుశా నాలుగైదు పద్యాలకి చేసినదయి వుండొచ్చు.
9. మళ్ళీ ముద్దుపళిని ‘రాధికాసాంత్వనం’లోనిది. ఇంగ్లీషు శీర్షిక ”పెయిర్డ్ స్వాన్ హెర్ ఫీట్” (రజూaఱతీవస రషaఅ ష్ట్రవతీ టవa్) ఇది బహుశా ముద్దుపళని కావ్యంలోని-రెండు పద్యాలనువాదం కావచ్చు. ”రాధికా సాంత్వనం”- బెంగుళూరు నాగరత్నంగారు- చాలా శ్రమించి కోర్టులో కేసు గెలిచి-1910లో ఒక ముద్రణ చేశారు. దీనిని 1960లో వావిళవారు పునర్ముద్రించారు.
10. ఇది కూడా నాయక్ రాజులకాలం నాటి సాహిత్యంలోనిది. సముఖము వెంకట కృష్ణప్ప నాయకుని ‘అహల్యా సంక్రందనం’లో ఆహల్య సౌందర్యవర్ణన సందర్భంలోని పద్యాలకు ఇంగ్లీషు అనువాదం. ఎమెస్కో ప్రతి సంప్రదాయ సాహితీ- 17, డిసెంబర్, 1971 ప్రకారం- ద్వితీయా శ్వాసంలోని 27, 28, 29 పద్యాలకు ఇంగ్లీషు అనువాదం.
11. మళ్ళీ-దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి తరువాత కొడాలి ఆంజనేయులుగారి కవిత్వానికి ఇంగ్లీషు అనువాదం. ఇంగ్లీషు శీర్షిక- ది బ్రైడ్ పెళ్ళి కూతురు. ఇది దాదాపు ఎనిమిది తెలుగుపద్యా లకు అనువాదం.
12. జగత్వ సిద్ది పొందిన గురజాడవారి పూర్ణమ్మ-గేయకృతికి తెలుగు అవసరాల సూర్యా రావుగారి గురజాడ రచనలు-7 సంపుటాల్ని విశాలాంధ్రవారు 1950-60ల మధ్య ప్రకటిం చారు. అప్పలస్వామిగారి ఇంగ్లీషు అనువాదానికి -విజయనగరంలోని రామానుజాచార్య విద్యా సమితివారి ప్రచురణలోని పద్యాలే మూలం. అందులో రెండు పాఠాలు లేవు. గ్రాంధిక భాషకు దగ్గిరగా వుండే శిష్ట వ్యావహారికమే కనిపిస్తుంది. అవసరాల సూర్యారావుగారి ”ముత్యాల సరాలు” సంపుటలో ”పూర్ణమ్మ” అని ఒక పాఠం. ”పూర్నమ్మ” అని మరొకపాఠం. రెండవపాఠం గురజాడ స్వహస్తం దిద్ది తీర్చింది. దీనినే ప్రమాణంగా తీసుకోవడం-ఈనాటి అవసరం. ఐతే-పద్యాల సంఖ్యలోగాని, భావంలోగాని మార్పు లేదు. పదాల మార్పువల్ల కొంత మార్పు కనిపించేది కూడా నిజం. ఈ అనువాదాన్ని బెంగుళూరులో1950ల చివర్లో జరిగిన -ఇంగ్లీషు ఉపన్యాసకుల అంతర్జాతీయ సదస్సులో తగిన ఉచ్ఛారణ రీతుల్లో చదవడం పూర్తిచేసేసరికి- శ్రోతలు-దేశ/విదేశీ-యావన్మందీ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నారని-ఆయనే ఒక వ్యాసంలో రాశారు.
చివరగా -మేస్టారి ఇంగ్లీషు పద్యాలన్నీ సేకరిస్తే తప్ప, ఏవేవి ఎక్కడ పునర్ముద్రితాల్లో, సంకలనాల్లో వచ్చాయో చెప్పడం కష్టం.
విశాలాంధ్ర సహకారంతో
———–