పేరు (ఆంగ్లం) | Sonti Srinivasamurthy |
పేరు (తెలుగు) | శొంఠి శ్రీనివాసమూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | వెంకమాంబ |
తండ్రి పేరు | గుండప్ప |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 8/8/1914 |
మరణం | – |
పుట్టిన ఊరు | లేపాక్షి , హిందూపురం తాలుకా |
విద్యార్హతలు | సెకండరీ గ్రేడు ఉపాధ్యాయ శిక్షణ పొందిరి. |
వృత్తి | ఉన్నత పాఠశాలలలో పనిచేసిరి. |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శ్రీశైల మల్లేశ్వరా అను మకుటముతో ఒక శతకమును వ్రాసిరి. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | శొంఠి శ్రీనివాసమూర్తి |
సంగ్రహ నమూనా రచన | సెకండరీ గ్రేడు ఉపాధ్యాయ శిక్షణ ముగించి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలలో పనిచేసిరి. 1964వ సంవత్సరములో వీరు పదవీ విరమణ పొందిరి . ఈ కవిగారు తలవని తలంపుగా శ్రీశైలము వెళ్ళుట తటస్థించినది అచ్చట ముఖ్యమైన క్షేత్రములను, తీర్థములనుజూచి శ్రీభూమరాంబ, మల్లి కార్జునులను దర్శించిరి అప్పుడే ‘శ్రీశైల మల్లేశ్వరా అను మకుటముతో ఒక శతకమును వ్రాయ సంకల్పము కలుగగా కొన్నిదినములలోనే శతక మును ముగించి, భక్తల ద్రవ్యసాయముచే అచ్చొత్తించిరి. అందులో కొన్ని మాత్రము. |
శొంఠి శ్రీనివాసమూర్తి
బాల్యమునుండి వీరికి భారత, భాగవత రామాయణ పద్యకావ్యము లను చదుపుటలో శ్రద్ధ యేర్పడెను. విద్యార్థి దిశలోనే వీరు పద్యములను వ్రాయుట కారంభించిరి
.
సెకండరీ గ్రేడు ఉపాధ్యాయ శిక్షణ ముగించి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలలో పనిచేసిరి. 1964వ సంవత్సరములో వీరు పదవీ విరమణ పొందిరి . ఈ కవిగారు తలవని తలంపుగా శ్రీశైలము వెళ్ళుట తటస్థించినది అచ్చట ముఖ్యమైన క్షేత్రములను, తీర్థములనుజూచి శ్రీభూమరాంబ, మల్లి కార్జునులను దర్శించిరి అప్పుడే ‘శ్రీశైల మల్లేశ్వరా అను మకుటముతో ఒక శతకమును వ్రాయ సంకల్పము కలుగగా కొన్నిదినములలోనే శతక మును ముగించి, భక్తల ద్రవ్యసాయముచే అచ్చొత్తించిరి. అందులో
కొన్ని మాత్రము.
శా: శ్రీ కారంబునుజుట్టి నే దొడగితిన్ జెప్పంగ నీ పైన సు
శ్లోకంబౌ శతకంబు పద్యచయ సంశోభాయ మానంబుగా
నాకున్ భావపరంపరర్ కలగగా నాయందు నీవుండ నో
శ్రీకంరా! భ్రమరాంబికార్చితపదా శ్రీశైల మల్లేశ్వరా.
ܘ
శా : శ్రీశైలంబు సనాతనంబు, ముని సంసేవ్యంబు,నీ దివ్య సం
వేశంబై తనరారు నిందు జనులెవ్వేళన్ నినున్ గొల్వగా
కాశీ క్షేత్రముతోడ సాటి యగు విఖ్యాతిన్ విరాజిల్లె గౌ
రీశా : నిన్నిట గాంత్రు భక్తులు సదా శ్రీ శైల మల్లేశ్వరా
ఈ కవిగారి కుమారులు శ్రీ శొంఠి వెంకటాచలంగారు హిందూపురం పట్టణమందలి నేతాజీ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయ లుగా పనిచేయుచున్నారు.
రాయలసీమ రచయితల నుండి….
———–