కుందుర్తి ఆంజనేయులు (Kundurti Anjaneyulu)

Share
పేరు (ఆంగ్లం)Kundurti Anjaneyulu
పేరు (తెలుగు)కుందుర్తి ఆంజనేయులు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరుసుందరమ్మ
పుట్టినతేదీ12/16/1922
మరణం1/1/1982
పుట్టిన ఊరుకోటవారి పాలెం, గుంటూరు జిల్లా మరణం
విద్యార్హతలు1936 నుండి 1941 వరకు విజయవాడ పురపాలకసంఘ ఉన్నత పాఠశాలలో చదివాడు. గుంటూరు ఆంధ్రా కైస్తవ కళాశాల నుండి బి.ఏ పట్టా పుచ్చుకున్నాడు
వృత్తిదేవేంద్రపాడు గ్రామములోని రెసిడెన్షియల్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా, ప్రిన్సిపాలుగా పనిచేశాడు. ఆ తరువాత కొన్నాళ్ళు గుంటూరు పొగాకు మార్కెట్టులో పనిచేశాడు. 1956లో కర్నూలులో సమాచార ప్రసారశాఖలో అనువాదకునిగా చేరాడు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసౌప్తికం, రసధుని, అమవాస్య, నా ప్రేయసి, నయాగర, తెలంగాణ, దండియాత్ర, ఆషా, నగరంలో వాన, నాలోని వాదాలు, హంస ఎగిరిపోయింది, తీరా నేనుకాస్త ఎగిరిపోయాక, మేఘమాల, ఇది నా జెండ, కుందుర్తి పీఠికలు, కుందుర్తి వ్యాసాలు, బతుకు మాట మొదలైనవి ముఖ్యమైనవి.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత,వచన కవితా పితామహుడు ,రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు 1969లో అందుకున్న సోవియట్ లాండ్ నెహ్రూ పురస్కారము ప్రతిష్టాత్మకమైనవి
ఇతర వివరాలు1958లో ఫ్రీవర్స్ ఫ్రంట్ స్థాపించాడు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకుందుర్తి ఆంజనేయులు
నగరంలో వాన
సంగ్రహ నమూనా రచనకవిత్వం నా ఊహాంచలాల్లో కదిలాడు తున్నట్లు
జల్లులు జల్లులై కురుస్తుంది
ఆశు కవిత నగర ప్రజలకు
ఆశీస్సులు పలుకుతున్నట్లు
అనంత ధారా సమేతంగా అంబరం మెరుస్తుంది
నగరంలో వాన
అంబరానికి అంత సంబరం ఎందుకంటే –

కుందుర్తి ఆంజనేయులు
నగరంలో వాన

కవిత్వం నా ఊహాంచలాల్లో కదిలాడు తున్నట్లు
జల్లులు జల్లులై కురుస్తుంది
ఆశు కవిత నగర ప్రజలకు
ఆశీస్సులు పలుకుతున్నట్లు
అనంత ధారా సమేతంగా అంబరం మెరుస్తుంది
నగరంలో వాన
అంబరానికి అంత సంబరం ఎందుకంటే –

నున్నగా తెల్లగా తళ తళలాడే
సిమెంటు రోడ్ల అద్దాల లోకి
మింటి నుంచి మెడలు వంచి చూసి
తమ అందం చినుకుల కుప్పలుగా పోసి
అంతులేని ఆకాశమంత ఆనందంతో
మెలికలు తిరుగుతూ మిలమిలా మెరుస్తాయి మేఘాలు

పక్షాలు పోయినా పాదాలు వచ్చి
పర్వతాలు పోరాడుచున్నట్లు
పరుగెత్తే రెండంతస్తుల బస్సుల్ని చూసి
గిరి శిఖర భ్రాంతి క్రిందికి దిగి వచ్చిన మేఘాలు
పైకి తిరిగి వెళ్లటానికి బద్ధకంఏసీ కాబోలు
బహుకాల నగర దర్శన భాగ్య ప్రాప్తిచే కాబోలు
ఆ రాత్రికి సినిమా చూసి ఉదయమే వెళ్లోచ్చని కాబోలు !
గిరి శిఖర భ్రాంతితో క్రిందికి దిగి వచ్చిన మేఘాలు
అక్కడే నిలబడిపోతాయి హర్షం వర్షంగా కురిస్తూ
నది బజారులో పడిపోయిన మూర్చవాడు
బిందెలతో దాహం త్రాగినట్లు
పగుళ్ళు వారి నోరు తెరుచుక్కూ చున్న భూదేవికి
పల్లెల్లో పది దుక్కులైనా లెక్కుండదు
పల్లెసీమలో వానల మేనాల మీద
దివి నుండి సస్య సమృద్ధి దించే వర్షాకాంత
అవసరం లేనప్పుడడిగితే అప్పులు సులువుగా లభించినట్లు
అక్కరలేని నగరంలో కూడా పుష్కలంగా కురుస్తుంది
విసుక్కునే నగర ప్రజల వీపులు చిల్లులు పొడిచే
జల్లులతో వెక్కిరిస్తుంది సగం వచ్చి సగం రాక
స్వాగతం చెప్పని పర్ణ వాసాల సాగిన ఉదయపు జల్లు
రాత్రి వచ్చిన చుట్టంలా తిష్ట వేస్తుంది తీరిగ్గా

*** **** ***

నగరంలో కురిసే వానకు తెలుసు
గొడుగు , జీతపు రూకల్లో మిగిల్చి
కొనగలగడం వట్టి మాటని
గోనె సంచీ కప్పుకోవడం నాగరికులకు మోటని
తడిసి మోపెడై వణుకుతూ వచ్చి
వంటింట్లో కుంపటి ముందు కూచోని
మర్నాడు మంచమెక్కితే
తను చేసిన ఘనకార్యం కనులార చూసుకుంటున్నట్లు
కిటికీ లోంచి తొంగి చూస్తుంది చిటపలా చిలిపి జల్లుల్తో
నగరంలో కురిసే వానకు తెలుసు
ఆఫీసులు సరిగ్గా సాయంత్రం
ఐదు గంటలకు వడుల్తారని
ఉన్నవాడు ఉదయం తెరపు చూసి
ఉన్నిసూటు వేసుకున్నాడని
లేనివాడికి లేనేలేదని మర్నాటికి మరో జత
అంతదాక నిర్మేఘమైన ఆకాశం
ఆ క్షణాన చిల్లి పడుతుంది

నగరంలో కురిసే వానకు తెలుసు
పలకా పుస్తకాలు నెత్తిన పెట్టుకుని
పరుగెత్తే బడి పిల్లవాడు
కాలుజారి బురదలో పడినా కారు చక్రాలు మురికి చిమ్మినా
వాళ్లమ్మ వాణ్ణే అరుస్తుందని
తల్లీ కొడుకుల చర్చ తన మీదికి మొగ్గకుండా
తీరా ఆ సమయానికి తెలీనట్లు వెలిసిపోతుంది

నగరంలో కురిసే వానకు తెలుసు
నాగేశ్వరరావు ఉదయమే లేచి
తీసుకు పోవలసినవన్నీ తీరిగ్గా గుర్తు తెచ్చుకుని
కొత్తగా కొనుకున్న గొడుగు వెంటబెట్టుకు వెళ్ళాడని
ఆ రోజు చినుకు చినకదు
రాత్రికి యింటికి చేరి వృధా శ్రమకు విచారిస్తుంటే
ఉరుములు ఫెళ ఫెళర్భాటులతో విరగబడి వికటాట్టహాసం చేస్తూ
నగరం నాలుగు మూలల కుంభ వర్షం కురుస్తుంది

ఇలా నగరంలో కురిసే వాన కేవం గడుసరే కాదు
డానికి కాస్తో కూస్తో ధర్మం , దయా వున్నాయి
మూడు నాళ్ళ పసిపాపను
ముద్దుగా ఒడిలో గుండెల కడ్డుకుంటూ
వెచ్చగా ఆస్పత్రి నుండి పచ్చగా ఇంటికి వెళ్లే
పచ్చి బాలెంత రాలి మీద
పూలజల్లు పడుతుంది గాని
భోరున వర్షం కురవదు

ఆగష్టు పదిహేనో తేదీన జెండా వందన సమయంలో
పండు పెడతారనో చిరు దిండి పంచుతారానో
రెండు మూడు గంటల సేపు
బారులు తీరి నుంచున్న పసిబాల బాలికల మీద
జాలిగా సన్నని తుప్పర పడుతుంది గాని
జలజలా వర్షం కురవదు .
**** **** ****
నగరాల నాగరికత సులువుగా మరిగిన సూర్య దేవుడు
తెల్ల వారి రేడియో లో తెలుగు వార్తల చివర
వాతావరణం వింటేగాని ఒక పళాన నిద్ర లేవడు
భూమ్మీద పస్తులున్న మనుషుల్ని చూసి
ఆకాశం కంట తడి పెట్టినట్లు
వాన ముమ్మరంగా కురుస్తుంటే
ఉదయం నుండి సూర్య భగవానుడికి ఊపిరి సలపడం లేదు
రిక్షాలో కూచున్న ఘోషా సుందరిలా
ముఖానికి అడ్డం కట్టిన మెయిలు ముసుగులు తొలగించి …

సేకరణ : నగరంలో వాన

———–

You may also like...