కొత్తపల్లి వీరభద్రరావు (Kottapalli Veerabhadrarao)

Share
పేరు (ఆంగ్లం)Kottapalli Veerabhadrarao
పేరు (తెలుగు)కొత్తపల్లి వీరభద్రరావు
కలం పేరు
తల్లిపేరురామమ్మ
తండ్రి పేరువెంకటరత్న శర్మ
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలుఎం.ఎ.; పి.హెచ్.డి
వృత్తిపలు విశ్వవిద్యాలయాలలో పనిచేసిన తెలుగు ఆచార్యులు.
తెలిసిన ఇతర భాషలుసంస్కృతం, ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, పంజాబీ, రష్యన్ మరియు ఫ్రెంచి
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమహతి (స్వాతంత్ర్య యుగోదయంలో తెలుగు తీరుతెన్నులు), తెలుగు సాహిత్యముపై ఇంగ్లీషు ప్రభావము, అవతార తత్త్వవివేచన, సర్ ఆర్థర్ కాటన్
విశ్వసాహితి (విజ్ఞానసర్వస్వం – సంపాదకుడు), నవ్యాంధ్ర సాహిత్య వికాసము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు1999 – రాజాలక్ష్మీ ఫౌండేషన్ వారి సాహిత్య పురస్కారం,
2002 – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషాసంఘం వారి సత్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకొత్తపల్లి వీరభద్ర రావు
తెలుగులో పరిశోధన కొత్తపుంతలు : భవిష్యద్దర్శనం
సంగ్రహ నమూనా రచనభవిష్యాన్ని గురించి మనం ఏ మాటలు చెప్పలనుకొన్నా అవి భూత వర్తమానాల మీద – చాల వరకు ఆధారపడి ఉంటాయనే విషయం విస్మరించకూడదు . వర్తమానం ­– ఓ వైపు భూత మైపోతూ , ఇంకో వైపు భవిష్యాన్ని వర్తమానం చేసుకొంటూ సాగిపోతుంది . భూతం లేని వర్తమానం లేదు . వర్తమానం లేని భవిష్యం లేదు . అదో భవిష్యానికి క్రమంగా భూతమై పోతూ ఉంటుంది . ఇందు వల్లనే కాలం అనాది , అనంతం అనే నమ్మకం ఏర్పడింది .

కొత్తపల్లి వీరభద్ర రావు
తెలుగులో పరిశోధన కొత్తపుంతలు : భవిష్యద్దర్శనం

భవిష్యాన్ని గురించి మనం ఏ మాటలు చెప్పలనుకొన్నా అవి భూత వర్తమానాల మీద – చాల వరకు ఆధారపడి ఉంటాయనే విషయం విస్మరించకూడదు . వర్తమానం ­– ఓ వైపు భూత మైపోతూ , ఇంకో వైపు భవిష్యాన్ని వర్తమానం చేసుకొంటూ సాగిపోతుంది . భూతం లేని వర్తమానం లేదు . వర్తమానం లేని భవిష్యం లేదు . అదో భవిష్యానికి క్రమంగా భూతమై పోతూ ఉంటుంది . ఇందు వల్లనే కాలం అనాది , అనంతం అనే నమ్మకం ఏర్పడింది . ప్రవాహంగా సాగుతున్న కాలాన్ని మన వీలు కోసం , అనుభవాన్ని బట్టి త్రికాలాలుగా విభజించుకొన్నాము. అయినా , ఒక విధంగా చూస్తే !రేపు జన్మించలేదు . ప్రవహిస్తూ ఉన్న నదిలో ఎప్పుడూ కొత్త నీళ్ళే ! అయితే , మిగిలిన కాలాల మాటేమిటి ? మన స్మృతులు భూత కాలానివి , కృషి వర్తమాన కాలానిది . ఫలితాలు భవిష్య త్కాలానివి . ఇందు వల్ల , సత్ఫలితాల కోసం వర్తమానంలో గట్టి కృషి చెయ్యాలి . భూత కాలానుభవంతో వర్తమానాన్ని సరిదిద్దుకొంటూ భవిష్యాన్ని శాసించాలి . వ్యక్తి గత జీవితంలో , జాతి మనుగడలో సర్వే సర్వత్ర ఇది సత్యం . మానవుల కృషి మీద ఆధారపడి ఉన్న అన్ని విషయాలలోను ఇది గమనించ వలసిందే .
మానవుల్ని ఇతర జీవుల నుండి వేరు చేసిందీ విశిష్టత సమకూర్చిందీ భాషే గదా ! ఆ భాషలోనే సాహిత్య సృష్టి : సాహిత్యంలో మంచి చెడ్డల పరిశీలన . ఈ పరిశీలనకు మాన దండం – సామాజిక ప్రయోజనం ఒక వైపు ; ఆనందం ఒక వైపు . విశ్వ శ్రేయస్సు , ఆనందం – రెండూ సాధించిన ఉత్తమ సాహిత్య మనే నిర్ణయం . ఈ పరిశీలన విమర్శకు దారి తీసింది . ఈ విధంగా , విమర్శలో –గృహీత రచనకు విశ్లేషణాత్మకంగా , వివరణాత్మకంగా పరిశీలించి వస్తు స్వరూపాన్ని సహృదయ చదువరులకు ప్రదర్శించడం ఉంటుంది . దీనివల్ల చదువరుల చైతన్యం నిశితమై వారి విజ్ఞాన వికాసాదుల అభివృద్ధి పొందుతాయి . విద్వాంసుడైన సహృదయ విమర్శకుని విమర్శ వల్ల గృహీత రచనలోని వైశిష్ట్యం సామాన్య చదువరులకు కూడా అవగతమై వారందరూ ఆ రచనను ఇతోధికంగా ఆనందించడానికి వీలు కలుగుతుంది . పండిత చదువరులకు ఆ రచనకు సంపూర్ణంగా ఆమోదించడానికి మార్గం ఏర్పడుతుంది . అంటే , విమర్శ – విమర్శి త రచనను వివిధ దృక్పధాలలో పరిశీలించి చదువరులకు వారు పామరులైనా , పండితులైనా ఆ రచనను అవగాహన చేసుకోవడంలో విచక్షణను అధికంగా చేస్తుంది అన్న మాట ! అయితే , విమర్శకుడు గ్రహించిన ప్రమాణాలననుసరించి విమర్శ – ప్రాచ్య ప్రమాణానుసారం సాగినా , ప్రాశ్చాత్య లక్షణానుసారం కొనసాగినా , ఉభయ ప్రమాణాల సమ్మేళనానుసారం సాగినా ఫలితాలలో తేడాలు వచ్చినా – వ్యక్తిగాతాలైన ద్వేషాభిమానాలకు చోటు లేకపోతే దాని మనం ఉత్తమ విమర్శ అనవచ్చును . కాని ,రచన బయలుదేరిన దేశ కాల పాత్రాను సారంగా ప్రమాణాలను గ్రహించక , ఇతర ప్రమాణాలలో ఆ రచనను విమర్శించడం ఎంత వరకు ఔచిత్య శోభితం అనే ప్రశ్న ఉదయించకపోదు ! దేశ కాల ప్రాత్రాదుల వైవిధ్యం ఉన్నా రచనలలోని వస్తువులో విశ్వజనీనత ఉన్నట్లయితే అది ఏ విధంగా సర్వులను ఉపాదేయమో , అదే విధంగా విమర్శ ప్రమాణాలలో తారతమ్యాలున్నా వైషమ్యాలు లేని సార్వ కాలిక ప్రమాణాల నంగీకరించి విమర్శ కొనసాగిస్తే అదీ అంగీకృత మవుతుంది .
ఒక రచనకు సంబంధించిన వివిధ విషయాలను ఆకళింపునకు తెచ్చుకొని ఆ రచనను పరిశీలించి విమర్శించడమనేది ఆచరణలోనికి రావడంతో పరిశోధనకు ప్రాముఖ్యం వచ్చింది . ఆ రచన బయలుదేరిన దేశ కాలాదులను , రచయిత సంస్కారాదులను , అర్దికాది పరిస్థితులను – విమర్శ పద్ధతులలో మార్పులను తీసుకుని రావడానికి ఆధారాలు గ్రహించినప్పుడు , పరిశోధన ద్వారా పైన వివరించిన “రచన వాతావరణం “ పరిశీలించకుండా విమర్శ చేయడం పొసగదు . ఇది నవీన పద్ధతి . మన ఆలంకారికులు రచనలను పరిశీలించేటప్పుడు కావ్య శాస్త్ర దృష్ట్యా రసాదుల విషయాన్ని విమర్శించి వ్రాసేరే గాని , కవి కాలాదులను విమర్శను ప్రభావితం చేసే అంశాలుగా గ్రహించినట్లు కనబడదు . ఈ గ్రహింపు లేనప్పుడు , ఆధునిక కాలంలో మన మనుకొంటూ ఉన్న పద్ధతిలో విమర్శ వ్రాయడం ఉండదు గనక ఇలాంటి విమర్శ రచనలు ఆనాడు లేవు . కాలిదాసాది మహా కవులను గురించి ప్రస్తావన వచ్చినప్పుడు “ పురా కవి నాం గణనా ప్రసంగే “ మొదలైన పద్ధతిలో తమ గౌరవాన్ని సూక్ష్మంగా మనోహరంగా తెలుపుకోవడమో , కవుల రచనలోని గుణాదులను వ్యక్తం చేయడమో జరుగుతూ ఉండేది . ఆధునిక కాలంలో వచ్చిన సుదీర్ఘ రచనలను పోలిన రచనలు లేవు . కవి కాలదులకు , సామాజిక పరిస్థితులకు కవుల రచనల గుణ దోష విచారణలో స్థానం లేకపోవడం వల్ల ఈనాడు మనం పరిశోధన అనుకొంటూ సాగిస్తూ ఉన్న అన్వేషణ ఆనాడు లేదంటే సత్య దూరం కాదు . ఈ విధంగా . పరిశోధన , విమర్శ అనేవి పరస్పర పోశాకాలుగా ఆధునిక కాలంలో అభివృద్ధికి వచ్చి ఆధునిక కాలమంటే ,పాశ్చాత్య సాహిత్య సంస్కృతులతో మనకు సంపర్కం వచ్చినప్పటి నుండి అని స్థూలంగా చెప్పుకోవచ్చును కాల క్రమంగా కొత్త పుంతలను తొక్కడం ప్రారంభించాయి .

భవిష్యాన్ని గురించి వ్రాసేటప్పుడు – నేను ప్రారంభం లోనే చెప్పినట్లు – ఆ వ్రాతలో “ కొత్త పాతలు “ కలిసి తీరతాయి . “ ఊహ “ కు తావున్న రచన అవుతుంది . గనక , దానిలో కొంత “తత్త్వ చింతన “ ఉండకుండా ఉండదు . కేవలం విషయాల చారిత్రక వివరణ గాని , జరిగిన పనిని సర్వే క్షించడం గాని కాకపోవడం వల్ల చెప్పిన దాన్ని నలుగురూ ఆమోదించి ఆచరణలో పెట్టినప్పుడు గాని దాని మంచి చెడ్డలు , సాధ్యా సాధ్యాలు నిర్ణయం కావు . కాని , భవిష్యం కోసం మనం చేసే సూచనలు , ప్రణాళికలు – భూత కాలంలో జరిగిన విషయాలను , వర్తమానంలో జరుగుతున్న అంశాలను ఆధారంగా చేసుకొని లోటులను పూర్తి చేసుకోవాలనీ లోపాలను సవరించుకోవాలనీ చెప్పేవే గనక పూర్వా పర సంబంధం ఉంటుంది . ఆవశ్యకం కూడా . పరిశోధన రంగంలో జరిగిన కృషి , జరుగుతున్న కృషి మనకు తెలిసే ఉంది . భవిష్యంలో జరగవలిసిన కృషి వీటి మీద ఆధారపడి ఉంటుంది . వీటి నధిగమింఛీ ఉంటుంది . కొత్త పుంతలలో నడవడమూ ఉంటుంది . పాత వాటిని విస్తృత పరిచి పయనించడమూ ఉంటుంది . భాషా సాహిత్యాలను సంబంధించిన పరిశోధనలలో కొత్త పాతాల కలయిక తప్పదు . చాలా విషయాలలో , వస్తువు పాతదైనా , దృక్పధంలో కొత్తదనం తీసుకొని రావడం , కొత్త పుంతలను తోక్కడమే అవుతుంది . వస్తువూ దృక్పదమూ రెండు కొత్తవి కావడమూ ఉంటుంది. మేధా శక్తి , హృదయ స్పందన – మనుష్యుని ముఖ్య లక్షణాలయితే , భాషా సాహిత్యాలు అతని వైశిష్ట్యాన్ని చాటేవి . మానవ పురోగతి భాషా సాహిత్య రధం మీద పయనిస్తుంది అనుకొంటే ఈ రధానికి పరిశోధన విమర్శలు రెండు చక్రాలు . ఒక్కొక్కప్పుడు , ఈ రెండు చక్రాలు సూర్యుని ఏక చక్రాలుగా పని చేయడమూ ఉంది ! భాషా సాహిత్యాలు వేరువేరు రధాలు అనుకొన్నా ఈ రెండూ చక్రాలుగా ఉండగలవు ! ఇంకో దృష్టి కోణం నుండి చూస్తూ ఈ రెండింటిని పరిశోధన , విమర్శలను వర్ణించదలచి నట్లైతే వీటిని ఒకే నాణేనికి ఉన్న రెండు పక్కలుగా ఉపమించవచ్చు . ఇవి పరస్పర ప్రవేశా ర్హతలు లేని , పరస్పర ప్రవేశాలు లేని పృధగ్విషయాలు కావు . ఇందు వల్లనే ప్రప్రధమ విమర్శకులలో పరిశోధన దృష్టీ పరిశోధకులలో విమర్శ దృష్టీ మనకు కనబడతాయి . ఆనాటి విమర్శకులు , విమర్శించే విషయాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకోవడానికి పరిశోధన చేయవలసి వచ్చేది . లభ్యమైన విషయం ఎంత వరకు సత్య సమ్మతమో ఉపాదేయమో నిర్ణయించు కోవడానికి విమర్శ ఆవశ్యక మయ్యేది ఆనాటి పరిశోధకులకు . ఈ రెండూ ఈనాటికీ కావలసినవేగాని ఆనాడు కావలసినంత ఈనాడు కాదు . విమర్శ పరిశోధనలు తమంత తాము నిలుస్తున్నాయి . నిలువ గలవు . అయినా ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది . పరిశోధన వల్ల భాషా సాహిత్యాలలో లభించిన నవ్యాంశాలు గ్రహించి విమర్శలు విస్తృతం కావడానికి అవకాశాలున్నాయి . విమర్శల తీవ్రతలను తట్టుకోవడానికి పరిశోధనలు ఇతోధికంగా కొనసాగి నూతన విషయాలను ఆవిష్కరించడానికి వీలున్నది . కొత్త పుంతలలో పరిశోధనలను ఎలా నడిపించవచ్చునో భావించుకొనే ముందు , పరిశోధనలు నడిచిన తీరు తెన్నులను పరామర్శించుకొందాము . సమగ్రంగా ఈ విషయాలన్నీ ఈ గ్రంధంలోనే ఇంతకుముందు సమీక్షితాలయ్యాయి . విషయాలన్నీ చర్విత చర్వణాలు కానక్కర లేదు గాని , వాటిని స్థూలంగా స్మరించుకోవడం పరిశోధన భవిష్యత్ దర్శనానికి సముచిత నేపథ్యం అవుతుంది .
భాషా సాహిత్యాల సిద్ధాంత ప్రమాణాలను గురించి పరిశోధనలను వికాస దశకు తెచ్చిన మనీషుల కృషికి పూర్వం రంగంగా జరిగిన కృషి యొక్క పుట్టు పూర్వోత్తరాలు , పరిశోధన నిర్వహణ విషయంలో వివిధ సంస్థల పాత్రను గురించి , ప్రక్రియా పరంగా జరిగిన పరిశోధనలను గురించి తెలుసుకోవడం జరిగింది . ప్రక్రియలో – కావ్య పురాణాదులకు సంబంధించిన పరిశోధన , శతకోదాహరణాల పరిశోధన , పద , జానపద సాహిత్య పరిశోధన , దేశి రూపక ప్రక్రియలకు సంబంధించిన పరిశోధన , నవల , చిన్న కథల పరిశోధన మొదలైన ఈ గ్రంధంలో వివరించబడ్డాయి . పరిశోధన క్రమ పరిణామ వికాసాలు కూడా చర్చించడం జరిగింది .
మన సంప్రదాయంలో గ్రంధాలకు బయలు దేరిన వ్యాఖ్యానాలు మొదలైనవి పరిశోధన విమర్శల కూడలి . ఇందే , వ్యాఖ్యాతలు పూర్వ వ్యాఖ్యాతలను విమర్శించడం సొపపత్తికంగా తమ అభిప్రాయాలను ప్రకటించడం జరుగుతూ ఉండేది . పందొమ్మిదో శతాబ్దిలో ఇంచుమించుగ అరవై సంవత్సరాలు తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధి కోసం శ్రమించిన సి. పి .బ్రౌన్ ఆనాటి పండితుల వ్యాఖ్యానాలను గురించి ఇలా అన్నాడు .
“Hitherto every path was over grown with gay weeds of pedantry which I have cleared away……….we ask for grain: they give it us on the condition that we will , with it, submit to eat the straw… They were written more to glorify the acumen of the critic and less to aid the learner….”
ఇందువల్లనే , తన కోరిక ననుసరించి మొట్ట మొదట ములపాక బుచ్చయ్య శాస్త్రి “ వాసు చరిత్ర “ కు వ్యాఖ్యానం వ్రాసినా , దానిలో పాండిత్య ప్రకర్ష ఉన్నంతగా విషయ సృష్టీకరణలేదని భావించి బ్రౌను దొర తిరిగి డానికి వ్యాఖ్యానం జూలూరు అప్పయ్య పంతులు చేత వ్రాయించి 1844 లో అచ్చు వేయించాడు . ఈ గ్రంధానికి తానే వ్రాసిన “నోటీస్ “ లో ఈ నవ్య వ్యాఖ్యానం ఉద్దేశించిన విషయాన్ని ఇలా వివరించాడు . బ్రౌను దోర మొదలైన ప్రాశ్చత్యులు తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధి చేసిన కృషి మౌలిక మైనదీ మన విమర్శ , పరిశోధనలను నవ్య మార్గాలలో నడిపించినదీ కావడం వల్ల ఈ విషయాన్ని గురించి కొంత విస్తృతంగా వ్రాయడం జరిగింది . తెలుగు భాషా సాహిత్యాల విమర్శ పరిశోధనల చరిత్రను స్థూలంగా ఈ కారణాల వల్లనే అయిదు యుగాలుగా విభజించ వచ్చును . 19 వ శతాబ్ది ప్రారంభం వరకు పరిశోధన విమర్శకులకు ప్రాచీన యుగం అనవచ్చు . ఈ యుగం చివరి దశాబ్దాలలో తెలుగు కావ్యాలకు బయలుదేరిన వ్యాఖ్యానాలు , ఛందో వ్యాకరణ గ్రంధాలలో కనబడే విమర్శత్మకమైన వివరణలు , ఈనాటి మన పరిశోధన దృష్ట్యా దీన్ని వ్యాఖ్యాన యుగం అనవచ్చు .

సేకరణ :తెలుగు పరిశోధన రజతోత్సవ సంచిక నుంచి …………….

———–

You may also like...