మద్దిపట్ల సూరి (Maddipatla Suri)

Share
పేరు (ఆంగ్లం)Maddipatla Suri
పేరు (తెలుగు)మద్దిపట్ల సూరి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ7/7/1916
మరణం11/19/1995
పుట్టిన ఊరుతెనాలి సమీపం లోని అమృతలూరు
విద్యార్హతలుశ్రౌతస్మార్తములు మరియు అలంకారశాస్త్రము
వృత్తిరచయిత మరియు అనువాద రచయిత
తెలిసిన ఇతర భాషలుబెంగాలీ చలిత్ భాష, సంస్క్దృతము
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుపాపికొండలు (1935), జీవనలీల (1959) అనువాదాలు: అనురూపాదేవి రాసిన “మంత్రశక్తి” నాటకానికి అనువాదం 1959, నిరుపమాదేవి రాసిన శ్యామలికి అనువాదం. 1959, తారాశంకర్ బెనర్జీ రాసిన జల్ సాగర్ నవలకి అనువాదం, 1960. దేశీ కవితామండలి ప్రచురణ.
తారాశంకర్ బెనర్జీ నవల ఉత్తరాయణ్ కి అనువాదం. ఇది రెండవ ప్రపంచయుద్ధం యొక్క దారుణఫలితాలను చిత్రీకరించిన విషాదాంత నవల. (1962) ,
నీహార్ రంజన్ గుప్త నవల మాయామృగం, (1962)
ఆప్తమిత్రులు అనువాదం, (1966),
బిమల్ కర్ రాసిన అసమయ్ నవలను సమయం కాని సమయం అన్నశీర్షికతో అనువదించేరు, 1968
శరత్ చంద్ర ఛటర్జీ రాసిన స్వయంసిద్ధ తెలుగులో అత్యుత్తమ అనువాద నవలగా ప్రసిద్ధి చెందింది.
వనఫూల్ నవలకి అనువాదం రాత్రి. (1958)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ అనువాద పురస్కారం (1993), కలకతార్ కాఛే అనువాదానికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం మరియు అనువాదకోవిదాగ్రణి గా పేరొందారు
ఇతర వివరాలుఅనేక సుప్రసిద్ధ నవలలు బెంగాలీ, హిందీ భాషలనుండి తెలుగులోకి స్వతంత్ర నవలలు అనిపించేంత సహజంగా అనువాదాలు చేసి అనువాద కోవిదాగ్రణి అని పేరు పొందారు. దేశీ కవితామండలి ఆధ్వర్యంలో ప్రచురించిన శరత్ చంద్ర ఛటర్జీ నవలలు, “”సమరేశ్ బసు”” మహాభారత కథాకల్పన శాంబుడు, “”విభూతిభూషణ్ బందోపాధ్యాయ”” చరిత్రాత్మక రచన పథేర్ పాంచాలి నవలలకు ఆయన చేసిన అనువాదాలు పునర్ముద్రిస్తున్నారు. “”విశ్వవాణి””కోసం నిమ్నవర్గాల సముద్ధరణకు కులరాహిత్యాన్ని ప్రబోధించే జీవనలీల గ్రంథాన్ని 1959 లో రాసారు. రవీంద్రనాథ్ టాగోర్ 21 ప్రసిద్ధకథలకు సూరి అనువాదాలు రవీంద్ర కథావళ అన్నపేరుతో 1968 లో ప్రచురించారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమద్దిపట్ల సూరి
సంగ్రహ నమూనా రచనసూరిగారి అనువాదాలలో అధికభాగం సాహిత్య ఎకాడమీ పురస్కారాలు అందుకున్నవారి రచనలే. వారి శైలి సంస్కృతం వన్నెమీరిన వ్యావహారికం. రవీంద్రనాథ్ టాగోర్ 21 ప్రసిద్ధకథలకు సూరి అనువాదాలు రవీంద్ర కథావళి అన్నపేరుతో 1968 లో ప్రచురించారు.

మద్దిపట్ల సూరి

సూరిగారి అనువాదాలలో అధికభాగం సాహిత్య ఎకాడమీ పురస్కారాలు అందుకున్నవారి రచనలే. వారి శైలి సంస్కృతం వన్నెమీరిన వ్యావహారికం. రవీంద్రనాథ్ టాగోర్ 21 ప్రసిద్ధకథలకు సూరి అనువాదాలు రవీంద్ర కథావళి అన్నపేరుతో 1968 లో ప్రచురించారు. ఈ సంకలనానికి సోమనాథ మిత్ర అవిస్మరణీయమైన పీఠిక, ఈ అనువాదాలు సుప్రసిద్ధమయినవి. బి.యస్.ఆర్ ఈ పుస్తకానికి సమీక్ష రాస్తూ, “పోస్ట్ మాస్టర్, కాబూలీవాలా అనువాదాలను చదివి చెమ్మగిల్లని వారుండరు,” అని వ్యాఖ్యానించారు. సూరిగారి హాస్యప్రియత్వం గురించి ఏల్చూరి మురళీధరరావు ఇలా వ్యాఖ్యానించారు, “సూరిగారు సరస హాస్యప్రియులు. గంగూలీ & గంగూలీ అన్న కథలో వ్యాపారనష్టాలను పూడ్చుకోవటానికి కాళీమంత్రం అష్టోత్తరం రాయమని ఎవరో సలహా ఇస్తారు. మోసాలు అలవాటయిన గంగూలీ పన్నెండు నామావృత్తులతో ఒక రబ్బరుస్టాంపు చేయించి, దాన్ని తొమ్మిదిసార్లు కొట్టి దేవతకే టోపీవేద్దామనుకొంటాడు. మరొక కథలో రైలుప్రయాణంలో సంప్రదాయ కుటుంబపెద్ద తమతో ఒక నవయువకుడి పలకరింపు చొరవను సహింపలేకపోతాడు. రైల్లో వంటచేస్తుండగా కూతురి చీరకు నిప్పంటుకొంటే ఆ యువకుడు చూసి రక్షిస్తాడు. కుటుంబం వారంతా అతన్ని ఆదరిస్తారు. యువతీయువకులకు ప్రేమభావం అంకురిస్తుంది. రాత్రివేళ మాటలు కలుస్తాయి. అంతలో అతని స్టేషను వస్తుంది. హడావుడిగా దిగిపోతూ ఆమె వివరాలడుగుతాడు. ఆమె సమాధానం వినబడకుండానే రైలు కదిలిపోతుంటుంది. ఇంకో కథలో ఒక సంపన్న బ్రాహ్మణయువకుడు పెద్దలు కుదిర్చిన ఆధునికభావాల యువతి మల్లికను చేసుకొంటాడు. ఆమె అతని వేషభాషలను మార్చి, మాంసాహారం కూడా అలవాటుచేస్తుంది. ఎంత ప్రేమ చూపినా ఆమెను సంతృప్తిపరుపలేక అతను విహ్వలుడు కావటాన్ని ఎంతో రమ్యంగా చిత్రీకరిస్తారు.” అనువాదాలు • అనురూపాదేవి రాసిన “మంత్రశక్తి” నాటకానికి అనువాదం 1959 • నిరుపమాదేవి రాసిన శ్యామలికి అనువాదం. 1959 • తారాశంకర్ బెనర్జీ రాసిన జల్ సాగర్ నవలకి అనువాదం, 1960. దేశీ కవితామండలి ప్రచురణ. • తారాశంకర్ బెనర్జీ నవల ఉత్తరాయణ్ కి అనువాదం. ఇది రెండవ ప్రపంచయుద్ధం యొక్క దారుణఫలితాలను చిత్రీకరించిన విషాదాంత నవల. (1962) • నీహార్ రంజన్ గుప్త నవల మాయామృగం, (1962) • ఆప్తమిత్రులు అనువాదం, (1966) • బిమల్ కర్ రాసిన అసమయ్ నవలను సమయం కాని సమయం అన్నశీర్షికతో అనువదించేరు, 1968 • శరత్ చంద్ర ఛటర్జీ రాసిన స్వయంసిద్ధ తెలుగులో అత్యుత్తమ అనువాద నవలగా ప్రసిద్ధి చెందింది. • వనఫూల్ నవలకి అనువాదం రాత్రి. (1958) సినిమారంగంలో కృషి[మార్చు] • కార్తవరాయని కథ. రోమియో జూలియట్, రాజస్థానచరిత్రల ఆధారంగా రూపొందించినది, (1958). • రమాసుందరికి సంభాషణలు. • భలే తమ్ముడు • విచిత్ర దాంపత్యం (1971) • పండంటి కాపురం, (1972). ఈ చిత్రం రజతోత్సవం చేసుకుంది. • గృహప్రవేశం (1982) • కార్తీకదీపం • పచ్చని సంసారం • ధర్మాత్ముడు • గాంధీ పుట్టిన దేశం • రాధా మై డార్లింగ్

స్వయంసిద్ధ, మణిలాల్ బెనర్జీ (బందోపాధ్యాయ బెనర్జీ)రచించిన స్వయంసిద్ధ నవలకి మద్దిపట్ల సూరిగారి అనువాదం.ప్రధానంగా ఆ నవలలో భాష మనం దినదినం చదివే పుస్తకాల్లో చూస్తున్నభాషే.
స్థూలంగా కథ – సామాన్య గృహస్తు, ఆయుర్వేదవైద్యుడు అయిన కరాలీ ఛటర్జీ కూతురు చండీ. ఆ అమ్మాయికి ఐదేళ్ళ వయసప్పుడు మాతామహుడు చూసి ముచ్చటపడి, తనతో పంజాబ్ తీసుకెళ్తాడు తండ్రిఅనుమతితో. ఆయన వ్యాయామశిక్షకుడు, బహుభాషాకోవిదుడు, సకల శాస్త్రాలు చదివినవాడు. ఆయన తనవిశ్వాసాలప్రకారం చండికి ఆరోగ్యశిక్షణ, విద్యాశిక్షణతోపాటు ఆత్మగౌరవాన్ని కాపాడుకోడం కూడా నేర్పి పరిపూర్ణురాలిని చేస్తాడు. ఆమె యౌవనదశ ప్రవేశించేవేళకి ఆరోగ్యం, అందంతోపాటు అనేక విద్యలలో అనవద్యమైన మేధ కూడా సంపాదించుకుని, తాతగారు దివంగతులయేక తిరిగి తండ్రిఇంటికి వస్తుంది. అప్పటికి ఆమెవయసు పన్నెండు.
చండి అపూర్వగుణగణాలు విని చండప్రచండుడైన బాశులి జమీందారు హరినారాయణబాబు, శ్యామాపురానికి తానే స్వయంగా వచ్చి ఆమెని కోడలిగా చేసుకోడానికి నిశ్చయించుకోడం కథలో ప్రధానఘట్టం. కథలో ఆయువుపట్టు అయినఘట్టం – చండి శోభనంరాత్రి పెళ్లికొడుకు గోవిందుడు జడుడని గ్రహించి, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో అతనిని విద్యావంతుడిగా చేయడానికి పూనుకోడం. అక్కడినుండి కథలో ఉత్కంఠ పుంజుకుని కథనానికి మంచి ఊపునిస్తుంది. తనధ్యేయం సాధించేలోపున అత్తవారింట చండి సవితిఅత్తగారి ఉదాసీనత, సవితిమరిది ధూర్తత్వం తట్టుకు నిలబడి, తన అస్తిత్వాన్ని ఋజువు చేసుకున్నతీరు ప్రశంసనీయం. అవసరమైనప్పుడు మామగారిని సైతం ప్రశ్నించడానికి వెనుదీయదు. మరిది చేసిన ఫిర్యాదులు నిరాధారమైనవని కమిషనరు, కలెక్టరులఎదుట నిరూపించకోవలసివచ్చినప్పుడు కూడా అద్భుతమైన సంయమనం చూపుతుంది. కమిషనరు గోవిందునిమానసికస్థితిని గురించి ప్రశ్నించినప్పుడు, గోవిందునిలో “ఒక ప్రత్యేక లక్షణమున్నట్టు గ్రహించి నేను శాయశక్తులా ప్రయత్నించి వారిని ఒక ఆదర్శపురుషునిగా చేయవచ్చుననే ఉద్దేశంతో వివాహం చేసుకున్నాను,” అన్న జవాబు రచయిత కథనచాతుర్యానికి మచ్చుతునక అని నాకనిపించింది. నవల ప్రారంభంలో గోవిందుని బుద్ధి వికసించలేదని గ్రహించినప్పుడు చండి ఈమాట వాచ్యం చేయలేదు. నవల పొడుగునా ఎక్కడా ఆమె “నేనిలా చేస్తాను, ఈ సమస్య ఇలా పరిష్కరించుకుంటాను,” అని చెప్పదు. అది ఆమె ప్రవృత్తిలో లేదు. అవి పాఠకుడు ఆమెచర్యలద్వారా తెలుసుకోవలసిందే. మరొకలా చెప్పాలంటే, అనవద్యమైన చిత్తస్థైర్యంతో, స్వకీయమైన సామర్థ్యంమీద మాత్రమే ఆధారపడి కార్యం సాధించుకోడం కార్యశీలురపద్ధతి. చండి అది ఎంత సమర్థవంతంగా నిర్వహించిందంటే, ఆమెనే ఆశ్చర్యపరుస్తాడు గోవిందుడు వికసించిన మేధతో. అది ఎప్పుడు జరిగిందంటే,
నవల చివరిఘట్టంలో హరినారాయణుడు అనారోగ్యంతో మంచంలో ఉండి, కోడలిని రమ్మని కబురు పంపినప్పుడు. చండి గోవిందుని కూడా రమ్మంటుంది. అతని విద్యాభివృద్ధి మామగారు తెలుసుకుని సంతోషించగలరన్న ఊహతో. గోవిందుడు “అస్వస్థతగా ఉన్నప్పుడు దుఃఖవార్తలలాగే సంతోషకరమైన వార్తవల్ల కూడా చెఱుపు జరగవచ్చునని” తానెక్కడో చదివేననీ, అంచేత ఆసమయంలో ఆవిషయం తండ్రికి తెలియజేయడం మంచిది కాదనీ అంటాడు. జడుడుగా ఉన్న పూర్వపరిస్థితినుండి అర్థవంతమైన ఆలోచనలు చేయగల పరిపూర్ణవ్యక్తిగా అతను ఎదిగినట్టు చూపడం జరిగిందక్కడ.
చండి తరవాత పరిపూర్ణంగా చిత్రింపబడిన పాత్ర జమీందారు హరినారాయణబాబు. ఈ పాత్ర కూడా అడుగడునా పాఠకుని సందేహాలలో ముంచెత్తుతుంది. ఉదాహరణకి ప్రధానం సమయంలో, “నేను మీఅమ్మాయిని ఎలా పరీక్షించి తెలుసుకున్నానో, అలాగే మీరు కూడా మీజమీందారు బిడ్డని చూచుకోవటం మంచిదనుకుంటాను,” అంటూ కరాలి ఛటర్జీకి గోవిందునిగురించి తెలుసుకోడానికి అవకాశం ఇస్తాడు. కరాలీ ఛటర్జీ అవసరంలేదనగానే ఊరుకుంటాడు కానీ గోవిందుని నిజపరిస్థితి చెప్పడు. పాఠకులకి ఆవిషయంలో హరినారాయణబాబు పూర్వకథ చదివినప్పుడు కొంత వివరణ కనిపిస్తుంది. అలాగే స్వేచ్ఛావిహారీ, అభిమానవతి అయిన చండి గోవిందునిగురించి మొదట్లోనే తెలిసి ఉంటే ఈ వివాహానికి అంగీకరించి ఉండేదా? ఈప్రశ్నకి సమాధానం కూడా పాఠకులఊహకే వదిలివేయబడింది. చండి చివరలో తనమీద నేరారోపణలు విచారణ చేయడానికి వచ్చినప్పుడు ఈప్రస్తావన లేదు. ఆయన గోవిందునితల్లికి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేదని మాత్రమే ఆయనని ప్రశ్నిస్తుంది.
మరొక మనోజ్ఞమైన మలుపు ప్రధానంసమయంలో చండికి కాబోయే మామగారు బంగారు కొరడా ఇచ్చి, వారింట్లో “ఒక అలివిమాలిన గాడిద ఉన్నాడు. వాడిని నువ్వు అదుపులోకి తీసుకురావాలి,” అని చెప్పినతరవాత, చండి దానిని వినియోగించుకున్న విధానం. మామగారికోరికమేరకు కొరడాఅవుసరం లేకుండానే గోవిందుని ఆదర్శపురుషుడిని చేస్తుంది. ఆ కొరడా ఉపయోగించలేదు కానీ ఎవరివిషయంలో ఉచితమో, “గాడిద” అన్నపదం ఎవరికి అన్వయించడం ఉచితమో అన్న విషయాలలో చండి చాతుర్యం బహునైపుణ్యంతో చిత్రించడం జరిగింది. ఇవి చాలనుకుంటాను మద్దిపట్ల సూరిగారు ఈనవలని అనువాదానికి ఎందుకు ఎన్నుకున్నారో చెప్పడానికి.
అనువాదం విషయం తీసుకుంటే, సూరిగారు చక్కని తెలుగు నుడికారాన్ని వాడుకున్నారని చెప్పకతప్పదు. “గోవిందుడు ఒఠ్ఠిదద్దమ్మలా, వెర్రిబాగులవాడి”లా ఉంటాడు. “బెడదలొచ్చి పడ్డాయి”, “తైతక్కలాడలేదు,” లాటి వాక్యనిర్మాణం కనిపిస్తుంది.
శ్రీ ఏల్చూరి మురళీధరరావుగారు మద్దిపట్ల సూరిగారి శైలిగురించి, “ఏ కోశాన చూసినా నిర్దిష్టమైన భాష, రచనమంతా వెల్లివిరిసేసరసమైన ఆత్మీయత, బెంగాలీ భాషనుంచి తెలుగు చేసేటప్పుడు బెంగాలీ సంస్కృతంపోకడలో గాక తెలుగుతనం చెక్కుచెదరని శైలి, సరళభాషలో వ్రాస్తున్నామహాపండితుని రచన ఇది తెలిసివచ్చే రచన సూరిగారి ప్రచురణలకు DNA ముద్రలు” అని వ్యాఖ్యానించేరు. ఈవ్యాఖ్యానం చాలు స్వయంసిద్ధ తెలుగులో ఎందుకు అంత ప్రాచుర్యం పొందిందో చెప్పడానికి.
ఈనవలలో ఆనాటి బెంగాలీనవలలకి వచ్చిన అనువాదాలలో సర్వసాధారణమైన కొన్ని పదాలు లేకపోలేదు. అవగుంఠనం, పాదధూళి స్వీకరించడం, అశ్రురుద్ధ నేత్రాలు, పాపిట సింధూరంవంటివి. ఇవి బెంగాలీనవలలకి తెలుగు అనువాదాల్లో మాత్రమే కనిపిస్తున్నాయంటే అవి సంస్కృతిపరమైన విశేషంగానే భావించాలి. అలాగే, నాకు ప్రత్యేకంగా కనిపించిన మరొక అంశం కుటుంబంలో ఒకరిమీద మరొకరు ఫిర్యాదు చేసినప్పుడు, జమీందారు హరినారాయణబాబు ఆ ఫిర్యాదుని న్యాయస్థానంలో విచారించినట్టు విచారించడం. అక్కడ వాడిన భాష కూడా న్యాయస్థానంలో ప్రయోగించేభాష కావడం – బెంగాలీకుటుంబాల్లో కుటుంబసమస్యలు పరిష్కరించుకున్నప్పుడు అలా చేస్తారేమో. లేదా అది జమీందారీకుటుంబాల్లో ఆనవాయితీ కూడా కావచ్చు.
మద్దిపట్ల సూరిగారు చేసిన ఈ అనువాదం స్వీయరచన అంత శక్తిమంతంగానూ ఉంటుంది. ఎందుకంటే, మూలగ్రంథంలో కథకి కావలసిన కొన్ని హంగులు అమర్చి ఉంటాయి. అనువాదకుడి పని ఆమూలకథని తీసుకుని అనువదించినభాషలో అంత సౌష్టవంగానూ ఉండేలా చూసుకోడం. అది మద్దిపట్ల సూరిగారు నిర్ద్వంద్వంగా సాధించి, మనకొక మంచి నవల అందించేరు. అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

———–

You may also like...