మల్లవరపు విశ్వేశ్వ రరావు (Mallavarapu Visweswara Rao)

Share
పేరు (ఆంగ్లం)Mallavarapu Visweswara Rao)
పేరు (తెలుగు)మల్లవరపు విశ్వేశ్వ రరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరువిజయలక్ష్మి
పుట్టినతేదీ1/1/1906
మరణం1/1/1986
పుట్టిన ఊరు
విద్యార్హతలురవీంద్రనాథ్ టాగూరు నడిపిన విశ్వభారతి విశ్వవిద్యాలయం చదువు సాగింది .
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుచిత్రాంగద (రవీంద్రనాథ్ టాగూర్ రచనకు అనువాదం) – ఏకాంక నాటిక
మధుకీల,
కల్యాణ కింకిణి,
విశ్వకవి,
శ్రీ అరవిందుల కర్మధార,
రవీంద్ర వ్యాసావళి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమల్లవరపు విశ్వేశ్వరరావు
కవితలు
సంగ్రహ నమూనా రచనఒక పువ్వు
ణీ సిగకు
నగయై సు
మించినది —–

ఒక పులక
నా యెదకు
వగయై భ్ర
మించినది “

మల్లవరపు విశ్వేశ్వరరావు
కవితలు

సింగారము

ఒక పువ్వు
ణీ సిగకు
నగయై సు
మించినది —–

ఒక పులక
నా యెదకు
వగయై భ్ర
మించినది “

ఒక తళుకు
ణీ చెక్కు
లకు శోభ
కూర్చినది —-

ఒక ములుకు
నా గుండె
లకు సోకి
ఏర్చినది :

ఒక పలుకు
ణీ పెదవు
లకు వెనక
దాగినది —-

ఒక ఆస
నా బ్రదుకు
సుక మాహ
రించినది :

గాయనీ ప్రియ

నా ప్రధమ దృష్టి నీ సువర్ణంగా జలజ
మరవిరిసి తేలె నీ గానమందు బాల ;
ఆ మధురమూర్తి సంస్కృతులందె కోర్కి
పూచి వాసించి నేడును వేచి యుంటి:

నీ మధుర గాన మానాడు నేమ్మివోలె
పురి నెగయబోసి మిలమిల మెరసి పోవ
విపుల నేత్రాల నీ ముగ్ధ వీక్షణమ్ము
లటు నిటుల సిగ్గుతో నడయాడి నాయి :

నీ యొడిని ముద్దు వీణియ నిలిపి మీట
నంగుళీ చంచల కిసలయమ్ము లరుణ
రాగముల వీణ గళమ్ము జేగురించే
కోకిలల పాటలే దాన రేకు లెత్తె :

చిన్ని చిని సిగ్గు చివురులు పన్ని నేడు
తన యోడిని దాచు కొనియె యౌవనము నిన్ను
ముసి ముసి యమాయకత్వ మ్ము మూగ వోయి
పలుక జాలదో పెదవులు వెలికి బారి :

ఏ నాడు

ఏనాడు నీమోవి
లేనవ్వు పోల్చునో
ఏరేయి చీకట్ల
నీ చేయి తుడుచునో
ఏ ప్రొద్దు పొడుపులో
నీ ప్రేమ మొలుచునో
ఆనాడు ఆ రేయి
ఆ ప్రొద్దు రేకెత్తు
నా వాడినట్టి గుం
డెలలోని పూగుత్తి :

మరిగి కష్టపుటలల్
విరిగి , తుంపురలౌను
వేగి నిశ్వాసముల్
వీగు , తుత్తునియలై
మొయిలు చాటున దాగు ,
మయిలకన్నీ రపుడు

అప్పుడో చిరునవ్వు ;
అప్పుడో చిగురాక ;
రెప్పపాటున ముద్దు
లప్పగింతును నీకు ;
గాలిలో రెపరెపల్
తేలివచ్చును దెపుడు
ఏ తమస్సుల కోసల ?
ఏ యుషస్సుల దెసల ?
నింగిలో చుక్కలో
తొంగి చూచు సువార్త
చెంగు చెంగున వచ్చి
మ్రింగు నాదు నిరాశ

నెప్పుడో చిరు కన్నె
చెప్పవా చిరుకన్నె ?
చెప్పవా చెప్పవా
చెప్పవా చిరుకన్నె ?

చైత్రము

వచ్చె చైత్రమాసము
వాసంత విలాసము

చల్లగాలి వీచె వీచె
మెల్ల మెల్ల జల్లు లేచె
పిల్ల లతల పూత విచ్చె

వచ్చె చైత్రమాసము ;
వాసంత విలాసము ;

గున్న మావి క్రొన్ననతో
సంజాజి మన్ననతో
ఎన్నరాని చిన్నెలతో

వచ్చే చైత్రమాసము
వాసంత విలాసము

సేకరణ : వైతాళికులు కవితా సంకలనం నుంచి ……….

———–

You may also like...