మైనంపాటి వేంకట సుబ్రహ్మణ్యం (Mainampati Venkata Subrahmanyam)

Share
పేరు (ఆంగ్లం)Mainampati Venkata Subrahmanyam
పేరు (తెలుగు)మైనంపాటి వేంకట సుబ్రహ్మణ్యం
కలం పేరు
తల్లిపేరుఅన్నపూర్ణమ్మ
తండ్రి పేరువేంకటసుబ్రహ్మణ్యము (సుబ్బయ్య)
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ8/25/1926
మరణం
పుట్టిన ఊరుబుడుగుంటపల్లె,రాజంపేట తాI| (కడప జిల్లా.)
విద్యార్హతలు
వృత్తిఆంధ్రభాషాధ్యాపకులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుత్రిలింగ భారతి, శ్రీ కృష్ణ తాండవము, గోపికాలాస్యము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమైనంపాటి వేంకట సుబ్రహ్మణ్యము
సంగ్రహ నమూనా రచనమైనం పాటివారి వంశస్థలు సంగీత సాహిత్య నాట్యాభినయము లందభి నివేశము కలిగి, వాటిని దైవదత్తము లొనర్చిన మహనీయులు. వీరు జ్యోతిషము, గణితములందును, వ్యవహార దక్షతలోను ప్రసిద్దులు. రామభక్తి, కృష్ణభక్తి మిక్కుట ముగా గల్గినవారు. ప్రకాశం జిల్లా మైనంపాడునందలి శ్రీ వేణు గోపాలస్వామి, మైనంపాటి వంశీకులకు కులదైవము. ఆ దేవుడు మైనంపాటి వంశీకులచేత అక్కడ వెలసినాడు. వివాహపూర్వము శ్రీ వేణుగోపాలస్వామి సన్నిధిలో మైనంపాటివారు అభినయము
చేయు సంప్రదాయ మండినట్లుగా ఈక్రింది పద్యమువలన తెలియు చున్నది.

మైనంపాటి వేంకట సుబ్రహ్మణ్యము

మైనం పాటివారి వంశస్థలు సంగీత సాహిత్య నాట్యాభినయము లందభి నివేశము కలిగి, వాటిని దైవదత్తము లొనర్చిన మహనీయులు. వీరు జ్యోతిషము, గణితములందును, వ్యవహార దక్షతలోను ప్రసిద్దులు. రామభక్తి, కృష్ణభక్తి మిక్కుట ముగా గల్గినవారు. ప్రకాశం జిల్లా మైనంపాడునందలి శ్రీ వేణు గోపాలస్వామి, మైనంపాటి వంశీకులకు కులదైవము. ఆ దేవుడు మైనంపాటి వంశీకులచేత అక్కడ వెలసినాడు. వివాహపూర్వము శ్రీ వేణుగోపాలస్వామి సన్నిధిలో మైనంపాటివారు అభినయము
చేయు సంప్రదాయ మండినట్లుగా ఈక్రింది పద్యమువలన తెలియు చున్నది.

“పెండ్లి పేరంటముల మున్ను విధిగ కాళ్ళ
గజ్జ గట్టి సంకీర్తనన్ గాన భావ
బంధురమ్ముగ వేణుగోపాలు నాట
పాటలన్ గొల్లు మైనముపాటివారు-“

ఈ ఆచారము మైనంపాటి వారెల్లరూ విడువక ఆవలంబించియున్నచో కూచిపూడి వారివలె నాట్యమునకు గొప్ప కీర్తి ప్రతిష్ఠలు దక్కెడివి. వీరిది సంప్రదాయ సిదమైన నాట్యము.
సాహిత్యాభినివేశము గల్లిన మహనీయులు మైనంపాటి వారి వంశములో పెక్కుమందియున్నారు. వారందరూ సంగీత సాహిత్యసేవయే పరమార్థముగా నెటీగి, పెక్కు హరికథలను, సంకీర్తనలను, భక్తి గేయములను, శతకములను వ్రాసిరి. వారందరూ వాగ్గేయకారులే. అట్టి పుణ్యవంశమున పట్టినవారే శ్రీ మైనం పాటి వేంకట సుబ్రహ్మణ్యముగారు.

స్వగ్రామమున ప్రాథమిక విద్య చదివి, కోడూరు హయ్యర్ ఎలిమెంటరీ పాఠశాలలో 8వ తరగతిని కవి గా రు ముగించిరి. తరువాత గ్రామాధికారుల పరీక్షలు ముగించి 1949 పలుకు ఆ ఉద్యోగములను నిర్వహించిరి. శ్రీ లోకన రాఘవయ్య గారికడ సంస్కృతాంధ్రభాష లభ్యసించి మద్రాసు విశ్వవిద్యాల యము వారి “విద్వాన్” పట్టమునొంది, పండిత శిక్షణ ముగించిరి. కొన్నాళ్లు చిత్ర లేఖనమునందలి Free hand out line &- Model drawing,పెయింటింగు హైయరు పరీక్షలందును, డిజైన్ పరీక్షలోను ఉత్తీర్ణత పొంది శిక్షణ ముగించిరి. 1950లో కోడూరు (R. S.) ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనోపాధ్యాయుడుగా పని చేసిరి. తరువాత 1958లో ఆంధ్రభాషాధ్యాపకులైరి.

శ్రీ మైనం పాటి వారి తొలి ముద్రిత కృతి ‘త్రిలింగ భారతి ‘ ఈ కావ్య మునందలి ప్రతి పద్యము ఆంద్ర దేశపు చరిత్రాంశ మును దెల్పును. దీనిని .ఆంధ్రుల పురాణము .గా శ్రీ వేదం వెంకట కృష్ణ శర్మ గారు పేర్కొనిరి . ఆంధ్రుల శిల్ప కళను గూర్చి కవి యిట్ల నుచున్నాడు .
అల్లదె కొండ కొనల మహాద్భుత శిల్ప కళా నివేశముల్
కొల్లగ నిల్చి యున్నవట , కోరికనుంగొను ‘మెల్గొరా” గుహా
లెల్లను బౌద్ధచైత్యము లనేకములున్న వఖండ చిత్రముల్
చల్లనితల్లి పొమ్మటుల జాలముగాదు త్రిలింగభారతీ !

ఉర్విని దేవళంబులె మహూన్నతికెక్కెను శిల్పశాలలై
పూర్వము తెల్గుభూదవల పోషణలోన విశేషభ క్తియే
సర్వము చిత్రశిల్పముల నంపదకెల్లను హేతుభూతమౌ
గర్వము తెల్లజాతికది కారణమౌను త్రిలింగభారతీ!

‘ త్రిలింగ భారతి” తరువాత వీరి ముద్రిత గేయకృతి “శ్రీ కృష్ణ తాండవము. గోపికాలాస్యము. కవిగారు భాగవతమును మథించి కృష్ణతత్త్వము నవగతముచేసుకొని ఆనందోత్సాహముతో ఈ గేయ కృతి ని వ్రాసినారు. ఆధునిక ఆంద్రభాషలో గేయ కృతులు కొలదిగానున్నవి. అందులో పుట్టపర్తివారి ‘శివతాండ వము’ ఉజ్జ్వలముగా వెలిగినది. కవిగారు శివతాండవ పఠనాభిలాష లగుటచే వీరి శ్రీకృష్ణతాండవము ఆ పోకడలోనే సాగినది. కాని వారెన్నో కొత్త మార్గములు తొక్కినారు. కవిగారికి సంగీత సాహిత్య నాట్యాలంకారాది శాస్త్రపాండిత్యము వంశక్రమముగా సంక్రమించుటచేతనే వారీ కృతిని వ్రాయగల్గిరి. లేకున్నచో యిట్టి కావ్యరచన యెల్లరు చేయజాలరు. వారికుల దైవము శ్రీవేణుగోపాలుడే, వారి మనోవేదిక పై తాండవనృత్యమాడినాడు. కవిగారు కావ్యారంభమున తమ నమస్సుమములనిట్లు పాఠకుల కర్పించినారు.

భాగవతారముల్ మధుర భావములందు దరంగ తాండవో
ద్వేగము గూర్మగా మహిత విష్ణు కథాశయలీల జొక్కు శ్రీ
భాగవతోత్రముండు కవి బమ్మెరపోతన కావ్యగానమి
ట్లీగతి సత్కృతిన్ వెలసె నియ్యది తాండవకృష్ణరూపమై !
ఆ త్రిపురాంతకోద్ధత మహానటనాకృతిలో ‘సరస్వతీ
పుత్ర విచిత్ర రీతుల నపూర్వముగా గృతి దీర్చుటనన్నే
మాత్రమో పూర్వ పుణ్య ఫల మాధురిగాక; మహోండుగల్గునే ?
మిత్రులమ్రోలనుంచితి; క్షమించుచు గావ్యరనమ్ముగ్రోలుడి .

ఈ గేయకృతిలో తొలుత శ్రీ కృష్ణతాండవము, తరువాత గోపికాలాస్యము వర్ణింపబడినది. నాట్యకళలో లాస్యము, తాండవము అను రెండు భేదములున్నవి. తాండవము ఉధృత మైనది. దానిని పురుషులకు ద్దేశింపబడినది. లాస్యమ సుకుమార మైనది. అది స్త్రీలకుద్దేశింపబడినది. వీటికి ఆధిదేవతలు శివ పార్వతులు. శ్రీకృష్ణుడు బాల్యమున కాశీయుని పడగలపై భరత శాస్త్ర పద్ధతిలో తాండవమాడినాడు. గోపికలు కృష్ణునితో రాస క్రీడ సల్చినారు. ఈ సన్నివేశముల నాలంబనముగా చేసికొని “శ్రీకృష్ణతాండవము, గోపికాలాస్యము”ను సృష్టించినారు కవి గారు, అందలి తీరును కొంత గమనింతము.
అందము – ఆనందము
బృందావనమున – ఏమందము !
ఏమానందము !
ఆ యమునా జలముల ఆ యహిరాట్భాణముల
తాండవమట !- కృష్ణుని తాండవమట !
లాస్యమ్మట! – గోపిక లాస్యమ్మట !
కొండెపు సిగముడి – నిండగు పింఛము
ముత్తెపు సరములు – గుత్తపుదాయెతు
లంగగు మరుగులు – బంగరు టందెలు
ముక్కున ముత్తెము – చక్కనిపోఁగులు
మెళ్ళదండలు – మొల్లోగజ్జలు
సొగసులుగుల్కగ – నగవులు నల్లెడు
గోపకిశోరుని – రూపము ముద్దుగఁ
దీర్చినచెవ్వరు ? – కూర్చిన దెవ్వరు ?
శంభుడే ! మణి – స్వయంభువడో నట !
ఔనట! – ఔనట! ఔనట ! ఔనట!

కవిగారి రచనలోని విశేషమునకొకదానిని పరిశీలింతము.
ఆకారమైత్రిగుణ సాకార మైకన. ని
రాకారమైనిలిచి శ్రీకారమై వినని
హుంకారమై కడలి భాంకారమై వెలయ
టంకారమై వెడలి డంకారమై తెలియ
హంకారమై కలభ మీంకారమై యళుల
ఝంకానపై కేకి క్రేంకారమై సిరుల
ప్రాకారమై కలికి ప్రాకారమై చెలగు
ణాకారమై లలిత క్షీకారమై వెలుగు
ఆంకారమై రసాలంకారమై పలికి
శంకారమై నిత్యమోంకారమై కులికి
ఆడెనమ్మా! కృష్ణుడు
పాడెనమ్మా ! విష్ణువు.
ప్రతి పుటలోని విశేషాంశముల కన్నింటికినీ పుట దిగువన లఘుటిస్ప ణిలో వివరములగు అర్ధములిచ్చు టచే కవిగారు ప్రయోగించిన పెక్కు శబ్ద, క్రీడ. భరతనాట్య, సంగీత, శృంగార, అభి నయ ఆంగిక విషయములు చదువరులకు తెలియుచున్నది. లేకున్నచో పఠితలు. నర్తకులు. సంగీత ప్రియులుకూడ చాల యాతనల ననుభవించెడివారు. కావ్యరచనకంటె టిప్పణి రచనకే ఎక్కువకాలము కవి గా రికి పట్టినదనుటలో సందేహము లేదు. వేదాంతం సత్యనారాయణశర్మగారన్నట్ల ‘కావ్యటిప్పణ ములు రెండును ‘మణినా వలయం, వలయేన మణి “అన్నట్లు పరస్పర భూషణ భూష్య భావము నొందుచున్నవి. అర్థాలంకారములు, శబ్దాలంకారములు సమముగా నుపయోగింపబడినవి. తేట తెనుగు పదములు కొన్నిచోట్ల – సమాసభూయిష్ట సంస్కృత పదములు కొన్నిచోట్ల రసానుకూలముగా భావాను గుణముగా వాడబడినవి.

రాయలసీమ రచయితల నుండి…

———–

You may also like...