వెంకట వరదాచార్యులు (Venkata Varadacharyulu)

Share
పేరు (ఆంగ్లం)Venkata Varadacharyulu
పేరు (తెలుగు)వెంకట వరదాచార్యులు
కలం పేరు
తల్లిపేరువెంకటమ్మ
తండ్రి పేరువెంకటపాపాచార్యులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుబొందలదిన్నె, తాడిపత్రి తాలూకా, అనంతపురము జిల్లా
విద్యార్హతలు
వృత్తివైద్యము
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసప్రమాణ జ్యోతిస్సారము,
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవెంకట వరదాచార్యులు
సంగ్రహ నమూనా రచనశ్రీ వెంకట వరదాచార్యులవారు బాల్యమునుండియే సంగీత, సాహిత్య, జ్యోతిష శాస్త్రములందు అభిరుచి మెండుగా గలిగి వుండిరి. 29వ ఏటనే నాటకములందు నటించుచుండిరి. 26వ ఏట వైద్యము చేబట్టిరి. జ్యోతిష గ్రంథములను పరికించి, పరిశోధించి కృత్రిమశాస్త్రమును విడచి ‘‘సప్రమాణ జ్యోతిస్సారము’’ అను గ్రంథమును 1973లో వ్రాసి ప్రచురించిరి.

వెంకట వరదాచార్యులు

శ్రీ వెంకట వరదాచార్యులవారు బాల్యమునుండియే సంగీత, సాహిత్య, జ్యోతిష శాస్త్రములందు అభిరుచి మెండుగా గలిగి వుండిరి. 29వ ఏటనే నాటకములందు నటించుచుండిరి. 26వ ఏట వైద్యము చేబట్టిరి. జ్యోతిష గ్రంథములను పరికించి, పరిశోధించి కృత్రిమశాస్త్రమును విడచి ‘‘సప్రమాణ జ్యోతిస్సారము’’ అను గ్రంథమును 1973లో వ్రాసి ప్రచురించిరి.
1964లో వీరు వ్రాసిన ‘‘మాతృజ్యోతి’’ నవల డెమ్మి సైజులో 630 పేజీలు గలదు. దీనిని కవిగారు నవలగా వ్యవహరించిరేగాని యిందు ఉత్కంఠత కల్గించు కథావస్తువు లోపించి భారతీయ ఆచార వ్యవహారాదులు, సాంప్రదాయములు. నీతి నియమములు, ధర్మనిరతి మున్నగు అనేక విషయములకే ప్రాధాన్యత యివ్వబడినది. వాడుకభాషనే వాడినప్పటికి ముఖ్యముగా కథాగమనము కుంటుపడుటచే పాఠకుడు చదువుటకు ఆసక్తిపడడు. రచయిత తనకు తెలిసిన పెక్కు విషయముల నన్నింటిని గ్రంథస్థము చేయవలెననెడి తీవ్రతయే అధికముగా ఉన్నట్లు కనిపించును.
ఇక ఈ కవిగారికి జ్యోతిశ్శాస్త్రమునందపారమైన వైదుష్యము గలదనుటకు ‘‘జ్ఞానజ్యోతి’’ – శ్రీ గణేశ నారదసల్లాపములు శ్రీ శారదా గణేశ వరప్రసాద వధూవరులు – అను ద్విపాత్ర ఏకాంత నాటిక సాక్ష్యములు.
తాడిపత్రిలో శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయమును స్థాపించి వంశ పరంపరానుభవ వైద్యమును, జ్యోతిశ్శాస్త్రమును ప్రజలకు అందించుచున్నారు. వీరికి శ్రీ రాఘవేంద్రయతీంద్రుల వారు ఆయురారోగ్య భాగ్యములనిచ్చి కాపాడుగాక.

రాయలసీమ రచయితల నుండి..

———–

You may also like...