పేరు (ఆంగ్లం) | Alukuru Gollapinni Vasudevasastry) |
పేరు (తెలుగు) | అలుకూరు గొల్లాపిన్ని వాసుదేవశాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | సుబ్బమ్మ |
తండ్రి పేరు | గొల్లాపిన్ని సీతారామశాస్త్రి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 2/19/1917 |
మరణం | – |
పుట్టిన ఊరు | చిన్నముష్టూరు, అనంతపురం జిల్లా. |
విద్యార్హతలు | వైద్యవిద్వాన్, 1939లో మద్రాసు యూనివర్శిటీ నుండి ‘విద్వాన్’ పట్టము పొందిరి |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | జ్యోతిషార్ణవము, ఆయుర్వేద సర్వస్వము ఆంధ్రీకృత ఔచిత్య విచారచర్చ అష్టావధాన, శతావధాన చాటుపద్యములు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అలుకూరు గొల్లాపిన్ని వాసుదేవశాస్త్రి సర్వతంత్ర స్వతంత్రవిద్యానిధి విద్వాన్ – వైద్యవిద్వా |
సంగ్రహ నమూనా రచన | శ్రీ గొల్లాపిన్ని వాసుదేవశాస్త్రిగారు సంస్కృతాంధ్ర కవులేకాక జ్యోతిష ఆయుర్వేద శాస్త్రములందు ఉద్ధండపండితులు. వీరు చాలకాలము అనంతపురము జిల్లా ఉన్నత పాఠశాలలందు తెలుగు పండితులుగా పనిచేసి పేరుగాంచిరి. శ్రీ గొల్లాపిన్ని వారిది పండితవంశము. ఈ వంశము వారెల్లరు పండితులు, కవులు, వైద్యశిఖామణులే. శ్రీ వాసుదేవశాస్త్రిగారు చిన్నతనముననే పితృపాదులవద్ద ఆరేండ్లు నాటకాంత సాహిత్యము జ్యోతిషశాస్త్రము నేర్చిరి. |
అలుకూరు గొల్లాపిన్ని వాసుదేవశాస్త్రి
సర్వతంత్ర స్వతంత్రవిద్యానిధి విద్వాన్ – వైద్యవిద్వా
శ్రీ గొల్లాపిన్ని వాసుదేవశాస్త్రిగారు సంస్కృతాంధ్ర కవులేకాక జ్యోతిష ఆయుర్వేద శాస్త్రములందు ఉద్ధండపండితులు. వీరు చాలకాలము అనంతపురము జిల్లా ఉన్నత పాఠశాలలందు తెలుగు పండితులుగా పనిచేసి పేరుగాంచిరి. శ్రీ గొల్లాపిన్ని వారిది పండితవంశము. ఈ వంశము వారెల్లరు పండితులు, కవులు, వైద్యశిఖామణులే. శ్రీ వాసుదేవశాస్త్రిగారు చిన్నతనముననే పితృపాదులవద్ద ఆరేండ్లు నాటకాంత సాహిత్యము జ్యోతిషశాస్త్రము నేర్చిరి. తదుపరి తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంస్కృతకళాశాల యందు తర్క, వ్యాకరణములు, అలంకారశాస్త్ర పారములు నేర్చిరి. వారణాశిలో పండితవర్య శ్రీ గణేశ విద్యావాగీశుల యొద్ద పూర్వోత్తర మీమాంస శాస్త్రాభ్యాసము, మరియు సాంఖ్యయోగాది తదితరదర్శనము లభ్యసించిరి.
ఆయుర్వేదము వీరికి అభిమానవిద్య, ఆ విద్యను వీరు విజయ వాడలో అభ్యసించి ‘వైద్యవిద్వాన్’ పరీక్షలో ఉత్తీర్ణులైరి. 1939లో మద్రాసు యూనివర్శిటీ నుండి ‘విద్వాన్’ పట్టము పొందిరి. ఆయుర్వేదము నందలి రసశాస్త్రముపై వీరు పరిశోధనకూడ గావించిరి. తంత్రశాస్త్రము నందుకూడ వీరికి పరిచయము కలదు.
శ్రీ గొల్లాపిన్నివారికి పదునారవ ఏటనే కవిత్వమబ్బినది. వారుచిన్న తనమున గోదేవిపై వ్రాసిన ఒకపద్యము చూడుడు.
గీ. పూరి కడుపార లేకున్న – పొదుగులోన
పాలు కొంతకు కొంతయై పలుచబడిన
నీ వినుంగుకు, యింతలో నింతయిచ్చి
ముద్దుసేయుదు వమ్మరో – మోమువంచి
వీరు తొలుతనుండియు ‘భారతి’ మాసపత్రికకు అనేకవిషయములపై వ్యాసములు వ్రాయుచుండిరి అట్లే ఆయుర్వేదముపై ‘ఇండియన్ మెడిసన్’ అను మాసపత్రికలో ‘కాన్పరు’ పరిశోధన వ్యాసములు ప్రచురించిరి. ఇవియేగాక ‘భూగర్భజలజ్ఞానశాస్త్రము’నకు వీరు టీకను వ్రాసిరి. అమరుకము నాంధ్రీకరించిరి. జ్యోతిషార్ణవము, ఆయుర్వేద సర్వస్వము ఆంధ్రీకృత ఔచిత్య విచారచర్చ అష్టావధాన, శతావధాన చాటుపద్యములు వీరి యితర రచనలు. వీరు వ్రాసిన అముద్రిత రచనలలో ‘మదన సుందరీ పరిణయమను 3 అశ్వాసములు గల పద్యకావ్యమొకటి. ఇందు వీరి రచనా విధాన మిట్లున్నది.
చం. ముగుదరొ సర్వకాలమును ముగ్ధత పోకడ పెట్టెదేల? పెం
పగు గరువంబు గన్పరువు భావమునన్ ధృతిబూను మార్జవం
బిగురగ జేయు, నుంచు సఖిప్రేముడి బోధనజేయ. ముగ్ధ మె
త్తగ ననె భీతిహృద్గతుడు దానినునో విబుడంచు నెంతయున్
వీరనేక నిద్వద్గోష్ఠులలో పాల్గొని చర్చలుగావంచి విద్వాంసుల నున్న నలనుపొంది ‘సర్వతంత్ర స్వతంత్ర’ ‘విద్యానిధి’ బిరుదములను పొందిరి, అనంతపురం ఆర్టు కళాశాలలో శ్రీ చిలుకూరు నారాయణరావుగారు వీరిని సత్కరించి విద్వాంసుల సమక్షమున ‘కవిసింహ’ బిరుదము నొసంగిరి. వీరు ఆంధ్రసభ (బళ్లారి) సాహిత్యశాఖకు జాయింట్ సెక్రెటరీగా పనిచేసిరి. హిందూపురం శ్రీ కృష్ణదేవరాయ గ్రంథమాలకు ప్రస్తుతము అధ్యక్షులుగా ఉన్నారు. నేటికి అరువది నాలుగేండ్లు వయసునిండిన శ్రీ గొల్లాపిన్నివారు కడు ఉత్సాహముతో సాహిత్యగోష్ఠులందు, సభలందు పాల్గొని చర్చలు గావించి, సందేహములను దీర్చుచున్నారు. వీరు ఆయురేవద, జ్యోతిశ్శాస్త్రములను తమ అభిమాన వృత్తులుగా పెట్టుకొని కాలముబుచ్చుచున్నారు. వీరికి భగవంతుడు ఆయురారోగ్య భాగ్యములిచ్చి కాపాడుగాత.
రాయలసీమ రచయితల నుండి..
———–